ప్రజా ప్రయోజనాల కోసం ఉద్దేశించబడన సేవల దుర్వినియోగం ఏ విధంగా చూసినా నేరమే. అపరాధమే. అందులోనూ అత్యవసర పరిస్థితుల్లో రోగుల ప్రాణాలు కాపాడేందుకు రోడ్లపై సైరెన్ తో పరుగులు పెట్టాల్సిన అంబులెన్స్ ను తమ స్వార్థం కోసం ఇష్టారీతిగా ఉపయోగించుకుంటున్న సంఘటనలను ఎవరైనా సరే ఖండించాల్సిందే.
అంబులెన్స్ టోయ్ టోయ్ టోయ్ అంటూ రోడ్ల మీద పరుగులు తీస్తుంటే.. వాహనదారులు తన వాహనాలను పక్కకు తీసి మరీ దారి ఇస్తుంటారు. సిగ్నల్స్ దగ్గర కూడా అంబులెన్స్ కోసం వాహనాలు గ్రీన్ సిగ్నల్ పడినా కదలకుండా ఆగిపోతాయి. అలాంటి అంబులెన్స్ లను తమ జల్సాల కోసం, సరదాల కోసం దుర్వినియోగం చేస్తున్న ఘటనలు కోకొల్లలు. ఖాళీ అంబులెన్స్ ను సైరెన్తో స్పీడ్ గా నడిపి సిగ్నల్ క్రాస్ చేసి తాపీగా చాయ్ తాగే అంబులెన్స్ డ్రైవర్లను చూశాం. సర్వీస్ ఆటోలా రోడ్డు పక్కన ఆపి.. ప్యాసింజర్లను ఎక్కించుకుని సైరెన్ వేసుకుని సర్వీస్ చేసి డబ్బులు దండుకున్న సంఘటనలూ తెలుసు. ఓ వ్యక్తి తన కుక్కకు కుటుంబ నియంత్రణ ఆపరేషన్ చేయించడానికి ఏకంగా అంబులెన్స్ ను బుక్ చేసుకుని సైరెన్ తో రోడ్ల మీద జనాలకు అదరట్టిన సంఘటన హైదరాబాద్ లో జరిగింది.
అంబులెన్స్ సేవలను దుర్వినియోగం చేయడమే కాకుండా ట్రాఫిక్ పోలీసులను అయోమయానికి గురి చేస్తున్న సంఘటనలు ఇటీవలి కాలంలో పెచ్చరిల్లడంతో పోలీసులు ఇటువంటి దుర్వినియోగానికి అడ్డుకట్ట వేసేందుకు స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తున్నారు. ఆ డ్రైవ్ లో భాగంగా మంగళవారం నాడు పంజాగుట్ట ట్రాఫిక్ పోలీసు స్టేషన్ సమీపంలో సైరన్ తో వేగంగా వెడుతున్న అంబులెన్స్ ను ఆపి చెక్ చేశారు. ఆ తనిఖీలో దిగ్భ్రాంతి గొలిపేలా అంబులెన్స్ లో ఓ కుక్కను తరలిస్తుండటం బయటపడింది. ఆ కుక్కను ఎక్కడికి తీసుకెడుతున్నారన్నది ఆరా తీస్తే.. ఆ కుక్కకు కుటుంబనియంత్రణ ఆపరేషన్ చేయించేందుకు మదీనగూడలోని ఐవీ హాస్పిటల్ కు తీసుకువెడుతున్నట్లు తేలింది. దీంతో పోలీసులు ఆ అంబెలెన్స్ ను సీజ్ చేసి, అంబులెన్స్ ఓనర్ పై కేసు నమోదు చేశారు. అత్యవసర పరిస్థితిలో ఉన్న రోగిని మాత్రమే అంబులెన్స్‌లో సైరన్ వేసుకుని తరలించాల్సి ఉంటుందని, ఖాళీగా వెళ్లే సమయంలో కూడా కొంతమంది సైరన్లు వేసుకుని వెళ్తుండడం చట్ట విరుద్దమని పోలీసు అధికారులు స్పష్టం చేశారు. అలాగే పెంపుడు జంతువులను తరలించేందుకు అంబులెన్స్ లు వాడటం కూడా చట్టరీత్యానేరమని చెప్పారు. మొత్తం మీద పెంపుడు కుక్కను అంబులెన్స్ లో ఆస్పత్రికి తరలిస్తున్న సంఘటన సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/ambulance-for-pet-dog-39-193848.html
ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఒవైసీ మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు.
చిన్న శ్రీనుకు విజయనగరం జిల్లా తెలుగుదేశం అధ్యక్ష బాధ్యతలను అప్పగించనున్నారన్న ప్రచారం జోరుగా సాగుతోంది. అయితే ఈ విషయంలో అధికారికంగా తెలుగుదేశం హై కమాండ్ నుంచి ఎటువంటి ప్రకటన కానీ, సంకేతం కానీ రాలేదు.
బీజేపీ, తెలుగుదేశం పొత్తు విచ్చిన్నం చేయడంలో అప్పట్లో తాను సక్సెస్ అయ్యానని విజయసాయి రెడ్డి విస్పష్టంగా చెప్పడంతో.. అసలు నాడు ఈ రెండు పార్టీల పొత్త విచ్ఛిన్నం కావడానికి దారి తీసిన పరిస్థితులపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది.
నిన్నగాక మొన్న ఇదే మోడీ నాయకత్వంలోని ఎన్డీయే సర్కార్ కు వ్యతిరేకంగా పోరాడటానికి సిద్ధంగా ఉన్నానని ప్రకటించిన జగన్, ఇప్పుడు ఆదే మోడీ నాయకత్వాన్ని ప్రస్తుతిస్తూ ప్రశంసలు కురిపించడం ద్వంద్వ వైఖరి కాక మరేమిటని పరిశీలకులు ప్రశ్నిస్తున్నారు.
. ఇక షర్మిల విజయ్ ను కలిసి తన కుమార్తె వివాహానికి హాజరు కావాల్సిందిగా కోరుతూ పెళ్లి శుభలేక అందించడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఎందు కంటే కేంద్ర స్థాయిలో కాంగ్రెస్ తో పొత్తు విషయంలో విజయ్ నేతృత్వంలోని టీవీకే పార్టీ కూడా కీలకంగా ఉంది. అలాగే తమిళనాడులో విజయ్ నేతృత్వంలోని ప్రభుత్వంలో కాంగ్రెస్ భాగస్వామి.
లౌకిక స్వభావం కలిగిన ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లోకి మతపరమైన అంశాలను జొపపించడానికి విజయసాయి ప్రయత్నిస్తున్నారని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ఇక తమ ప్రసంగాల్లో, మీడియా సమావేశాలలో విజయసాయిరెడ్డి ప్రస్తావిస్తున్న అంశాలు ఆ విశ్లేషణలకుబలం చేకూరుస్తున్నాయి.
ఇప్పటికే తనపై 45 ఎఫ్ఐఆర్ లు ఉన్నాయన్న ఆయన తన టార్గెట్ వంద ఎఫ్ఐఆర్ లు అని చెప్పారు. అంతే కాదు.. వాటిని తాను ప్రజల పక్షాన నిలబడినందుకు దక్కిన మెడల్స్ గా భావిస్తానన్నారు. రాహుల్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు దేశ వ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారాయి.
విపక్షాల నిరసనల నేపథ్యంలో పోలీసులు ఢిల్లీలో విస్తృత బందోబస్తు ఏర్పాట్లు చేశారు. పలు ప్రాంతాల్లో బారికేడ్లు ఏర్పాటు చేయడంతో పాటు వేలాది మంది భద్రతా సిబ్బందిని మోహరించారు. ట్రాఫిక్ మళ్లింపులు కూడా చేపట్టారు. జంతర్ మంతర్, పార్లమెంట్ పరిసరాలు, ఎన్నికల సంఘం కార్యాలయం వైపు వెళ్లే మార్గాల్లో ప్రత్యేక నిఘా కొనసాగుతోంది.
ధనుష్ తన కొత్త రాజకీయ పార్టీ కోసం తమిళగ ఎళుచ్చి కళగం అనే పేరును ఖరారు చేసినట్లు ప్రచారం జరుగుతోంది. అలాగే.. ఈ పేరుతో ఇప్పటికే కేంద్ర ఎన్నికల సంఘం వద్ద పార్టీ రిజిస్ట్రేషన్ ప్రక్రియ కూడా పూర్తయ్యిందని అంటున్నారు.
ఒక దశలో తన రిటైర్మెంట్ తరువాత టీడీపీలో చేరేందుకు కూడా తాను సిద్ధపడ్డాననీ, అవసరమైతే ఎన్నికల బరిలో దిగడానికి కూడా రెడీ అయ్యాయనీ చెప్పిన ఏబీ వెంకటేశ్వరరావు, అ
బీసీ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు ప్రకాశ్ పాల్, ప్రముఖ దళిత నేత, మాజీ ఎంపీ విద్యాసాగర్ సోన్‌కర్, అలాగే అలహాబాద్ హైకోర్టు బార్ అసోసియేషన్ అధ్యక్షుడిగా రెండుసార్లు బాధ్యతలు నిర్వర్తించిన రాధాకాంత్ ఓఝా వంటి వారికి చోటు లభించింది.
జిల్లాలో పార్టీ పరిస్థితి వేగంగా దిగజారిపోతోంది. మజ్జి పార్టీని వీడటంతో జాగ్రత్త పడాల్సిన పార్టీ హైకమాండ్, అలాగే బొత్స సత్యనారాయణ చేతులెత్తేసినట్లు కనిపిస్తోంది. అంతే కాకుండా కూర్చున్న కొమ్మనే నరుక్కున్న చందంగా అసంతృప్తులను బుజ్జగించాల్సింది పోయి వారిపై సస్పెన్షన్ వేటు వేయడంతో జిల్లాలో పార్టీని జీరో నుంచి బిల్డ్ చేద్దామనుకుంటున్నారా? లేక జిల్లా పార్టీని వదిలేశారా అన్న అనుమానాలు పార్టీ శ్రేణుల నుంచే వస్తున్నాయి.