అంబటి రాయుడికి లక్కీ ఛాన్స్..!
Publish Date:Dec 11, 2012
Advertisement
ఆంధ్ర క్రికెటర్ అంబటి రాయుడు ఎదురు చూపులు ఫలించాయి. తొలిసారి ఇండియా టీంలో ఎంపికయ్యాడు. గాయాలతో బాధపడుతున్న మనోజ్ తివారీ స్థానంలో రాయుడికి చోటు దక్కింది. మొదట తివారీని టీమ్‌లోకి ఎంపిక చేసినా గాయం కారణంగా అతను తప్పుకున్నాడు. ప్రస్తుతం బరోడాకు ఆడుతున్న అంబటి రాయుడికి అవకాశం దక్కింది. ఈ రంజీ సీజన్‌లో ఇప్పటికే ఆరు మ్యాచ్‌లు ఆడిన రాయుడు ఓ సెంచరీతో పాటు నాలుగు అర్థ సెంచరీలు చేశాడు. 27 ఏళ్ల రాయుడు జాతీయ జట్టుకు ఎంపికవడం ఇదే తొలిసారి. మంచి ఫాంలో ఉన్న రాయుడు ఐపీఎల్ 5లో 15 ఇన్నింగ్స్‌లో 333 పరుగులు చేసిన సంగతి తెలిసిందే. ఇంగ్లాండ్‌తో జరిగే టీ 20 మ్యాచ్‌లో రాయుడు ఆడనున్నాడు.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/ambati-rayudu-36-19681.html
http://www.teluguone.com/news/content/ambati-rayudu-36-19681.html
Publish Date:Sep 2, 2026
Publish Date:Sep 1, 2026
Publish Date:Sep 1, 2026
Publish Date:Sep 1, 2026
Publish Date:Sep 1, 2026
Publish Date:Aug 29, 2026
Publish Date:Aug 29, 2026
Publish Date:Aug 28, 2026
Publish Date:Aug 28, 2026
Publish Date:Aug 28, 2026
Publish Date:Aug 27, 2026
Publish Date:Aug 27, 2026
Publish Date:Aug 27, 2026





