అంబ‌టి చెప్పిన‌ లోకేష్ అన్న ప్రాశ‌న క‌థ‌లు!

Publish Date:May 18, 2026

Advertisement

 

అంబటి రాంబాబు  ప్రెస్ మీట్ పెట్టారంటే చాలు... ఇలాంటి వెటకారాలు, పాత కథలు, ప్రాసలతో కూడిన సెటైర్లు ఖచ్చితంగా పేలుతాయి. అన్నప్రాసన రోజు లోకేష్ బంగారం, పుస్తకం కాకుండా డబ్బులు పట్టుకున్నారంటూ మేనమామ హరికృష్ణ  చెప్పినట్టుగా ఒక పాత ముచ్చటను కూడా లాగి, దాన్ని ప్రస్తుత రాజకీయాలకు లింక్ చేయడం అంబటి  మార్కు పొలిటికల్ కామెడీ.

ఇక వైసీపీ ప్ర‌ధాన ఆరోప‌ణ ఏంటంటే..  ఆర్టీసీ, ప్రభుత్వ మెడికల్ కాలేజీలు/ఆసుపత్రుల వంటి ప్రభుత్వ రంగ సంస్థలను కూటమి ప్రభుత్వం ప్రైవేట్ పరం చేయడానికి చూస్తోందని అంటారు వీరు. ఇలా చేయడం వల్ల కార్పొరేట్ సంస్థలకు, ప్రభుత్వ పెద్దలకు లాభం చేకూరుతుందని, అందుకే లోకేష్ పేరుకు లవ్ క్యాష్ అనే ట్యాగ్ లైన్ పక్కాగా సరిపోతుందని సెటైర్ వేస్తున్నారు అంబటి రాంబాబు.

ప్రభుత్వం ఎక్కడా ఆర్టీసీని, మెడికల్ కాలేజీల‌ను ప్రైవేట్ పరం చేయడం లేదని, కేవలం పబ్లిక్-ప్రైవేట్ పార్టనర్‌షిప్ మోడల్ ద్వారా మేనేజ్‌మెంట్ మెరుగుపరిచి, ప్రజలకు మెరుగైన సౌకర్యాలు అందించడమే లక్ష్యమని  చెబుతున్నారు కూటమి నేతలు.

ఒకప్పుడు లోకేష్‌ను ఇలాగే ట్రోల్ చేశారని, కానీ ఇప్పుడాయన మంత్రిగా రాయల్ ఎన్‌ఫీల్డ్, కియా విస్తరణ, ఐటీ కంపెనీలను ఏపీకి తీసుకురావడంలో బిజీగా ఉన్నారని... ఇలాంటి పాత జోకులతో ప్రతిపక్షం కాలక్షేపం చేస్తోందని రివర్స్ కౌంటర్ ఇస్తున్నాయి టీడీపీ శ్రేణులు.

ఏదేమైనా, ఒకప్పుడు అసెంబ్లీలో.. సంక్రాంతి డ్యాన్సులు, పాటల విష‌యంలో అంబటి రాంబాబును టీడీపీ టార్గెట్ చేస్తే... ఇప్పుడు అంబటి లోకేష్  అన్నప్రాసన కథల తో రిటర్న్ గిఫ్ట్ ఇస్తున్నారు. ఏపీ రాజకీయాల్లో ఈ  క్యాష్ వర్సెస్ లోకేష్  డైలాగ్ వార్ ప్రస్తుతానికి బాగానే వైరల్ అవుతోంది.

By
en-us Political News

  
కేంద్ర పెట్రోలియం, సహజ వాయువు మంత్రిత్వ శాఖ వెల్లడించిన వివరాలమేరకు.. ఈ ధరల రాయితీ లేదా కుషన్ కేవలం సామాన్య రిటైల్ వినియోగదారుల కోసమే ఉద్దేశించబడింది. నిత్యం ప్రయాణించే ద్విచక్ర వాహనదారులు, సామాన్య మధ్యతరగతి కుటుంబాలు, వ్యవసాయం చేసుకునే రైతుల ప్రయోజనాలను కాపాడటమే ప్రభుత్వ ప్రాధాన్యత.
రాజస్థాన్ రాయల్స్ బ్యాటర్లు ముఖ్యంగా యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు. హైదరాబాద్ బౌలింగ్‌ను తుత్తునియాలు చేస్తూ కేవలం 29 బంతుల్లోనే 5 ఫోర్లు, ఏకంగా 12 సిక్సర్లతో 97 పరుగులు సాధించి విధ్వంసం సృష్టించాడు. ఐపీఎల్ చరిత్రలోనే అత్యంత వేగవంతమైన సెంచరీ రికార్డును కేవలం మూడు పరుగుల తేడాతో తృటిలో చేజార్చుకున్నప్పటికీ, అతని ఇన్నింగ్స్ మ్యాచ్ స్వరూపాన్నే మార్చేసింది.
ప్రతి ఏటా మే 28న వచ్చే ఈ పవిత్రమైన రోజున నందమూరి కుటుంబ సభ్యులతో పాటు కోట్లాది మంది అభిమానులు తమ ఆరాధ్య దైవాన్ని స్మరించుకుంటారు. ఈ క్రమంలోనే ఎన్టీఆర్ 103వ జయంతిని పురస్కరించుకుని హైదరాబాద్ లోని హుస్సేన్ సాగర్ ఒడ్డున ఉన్న ఎన్టీఆర్ ఘాట్ ను రంగురంగుల పువ్వులతో, పచ్చటి ఆకులతో సుందరంగా అలంకరించారు.
ప్రపంచవ్యాప్తంగా ఐటీ రంగంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌ ప్రభావంతో ఉద్యోగాల కోతలు పెరుగుతున్న వేళ
ఐపీఎల్ టోర్నమెంట్‌లో భాగంగా జరుగుతున్న అత్యంత ఉత్కంఠభరితమైన ఎలిమినేటర్ పోరులో రాజస్థాన్ రాయల్స్ (RR) బ్యాటర్లు చెలరేగిపోయారు.
చెన్నై సూపర్ కింగ్స్‌ను ఐదు సార్లు ఐపీఎల్ ఛాంపియన్‌గా నిలిపిన లెజెండరీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ వచ్చే సీజన్ నాటికి సీఎస్కే‌ మేనేజ్‌మెంట్‌లో కీలకంగా మారనున్నాడా
తుమ్మిడిహెట్టి బ్యారేజ్‌ ఎత్తు, నిర్మాణంపై మహారాష్ట్రతో చర్చించేందుకు తెలంగాణ ప్రభుత్వం అడుగు ముందుకేసింది.
రైతు గోస - బీజేపీ భరోసా యాత్ర మూడవ రోజుకు చేరుకుంది
ఆంధ్రప్రదేశ్‌లో వెలుగులోకి వచ్చిన భారీ మైనింగ్‌ అక్రమాల కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) దూకుడు పెంచింది.
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) క్రికెట్ ప్రపంచంలో సరికొత్త చరిత్ర లిఖించబడింది.
పశ్చిమాసియాలో గత కొన్ని నెలలుగా కొనసాగుతున్న తీవ్ర ఉద్రిక్తతలకు ఎట్టకేలకు తెరపడనుంది.
ప్రతిష్టాత్మకంగా నిర్వహించే మహానాడులో సరికొత్త ఉత్సాహం, జోష్ కనిపిస్తోంది.
ఐపీఎల్ 2026 సీజన్ అత్యంత ఉత్కంఠభరితమైన ముగింపు దశకు చేరుకుంది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.