బూతు పురాణంలో హద్దులు దాటేసిన అంబటి!

Publish Date:Jan 31, 2026

Advertisement

వైసీపీ ఎకో సిస్టమ్ లోనే మర్యాదా, మన్నన వంటి వాటికి అవకాశం లేదు. ఆ పార్టీ అధికారంలో ఉన్న సమయంలో కొడాలి నానితో మొదలు పెడితే పలువురు నేతలు నిత్యం తమ బూతుల కారణంగానే వార్తలలో ఉండేవారంటే అతిశయోక్తి కాదు. సరే వైసీపీ 2024 ఎన్నికలలో ఘోర పరాజయం పాలవ్వడం, బూతు పురాణంతో డిఫేమ్ అయిన నేతలు ఒక్కరంటే ఒక్కరూ కూడా గెలవకపోవడం తెలిసిందే. ఏపీలో తెలుగుదేశం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత వైసీపీయులు దాదాపుగా నోరు కట్టేసుకున్నారు.

కేసుల భయమైతేనేం.. జనం నోరు జారితే ఇక ఊరుకోరన్న బెరుకు అయితేనేం.. నోరు తెరిస్తే దూషణలు వినా మరోకటి మాట్లాడటం చేతగాని కొడాలి నాని, అనిల్ కుమార్ యాదవ్ వంటి వారంతా సైలెంట్ అయిపోయారు. వైసీపీ కార్యక్రమాలలో కూడా పెద్దగా కనిపించకుండా దాదాపు రహస్య జీవితం గడుపుతున్నారా  అన్న అనుమానం కలిగేలా వ్యవహరిస్తున్నారు. అయితే ఇప్పుడు అంబటి రాంబాబు మాత్రం ఆ బూతు పురాణం విషయంలో అన్ని హద్దులూ దాటేశారు. సభ్య సమాజం సహించని భాషతో చంద్రబాబుపై రెచ్చిపోయారు. వివరాలలోకి వెడితే..

తిరుపతి లడ్డూ ప్రసాదం తయారీలో కల్తీ నెయ్యి కేసు దర్యాప్తు చేపట్టిన సిట్.. తాజాగా సుప్రీం కోర్టులో చార్జ్ షీట్ దాఖలు చేసింది.  ఆ చార్జిషీట్ నుంచి రాజకీయ లబ్ధి పొందాలని వైసీపీ నేతలు విశ్వ ప్రయత్నం చేస్తున్నారు. సుప్రీం కోర్టులో సిట్ దాఖలు చేసిన చార్జి షీట్ లో లడ్డూ ప్రసాదం తయారీలో వినియోగించిన నెయ్యిలో జంతువుల కొవ్వు లేదని సిట్ స్పష్టం చేసిందంటూ నానా హడావుడీ చేస్తోంది. కల్తీ జరిగిందని సిట్ పేర్కొన్న విషయాన్ని కన్వీనియెంట్ గా విస్మరిస్తూ జంతువుల కొవ్వు లేదని సిట్ పేర్కొందంటూ, తెలుగుదేశం అధినేత చంద్రబాబు, జనసేనాని పవన్ కల్యాణ్ లు అవాస్తవ ప్రచారం, ఆరోపణలు చేశారంటూ విమర్శలు గుప్పిస్తున్నారు.

ఆ క్రమంలోనే  తిరుమల లడ్డూ ప్రసాదం పవిత్రతకు భంగం కలిగేలా  తెలుగుదేశం వ్యవహరిం చిందంటూ ప్రక్షాళన పేరుతో ఆలయాల్లో పూజల కార్యక్రమాన్ని చేపట్టింది. అందులో భాగంగానే శనివారం (జనవరి 31) గుంటూరు గురజాలలో జరిగిన కార్యక్రమంలో మాజీ మంత్రి, వైసీపీ సీనియర్ నాయకుడు అంబటి రాంబాబు పాల్గొన్నారు. ఆ సందర్బంగా అయన చేసిన వ్యాఖ్యలు తీవ్ర వివాదాస్పదంగా మారాయి సభ్య సమాజం సహించని రీతిలో ఆయన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిని దూషించారు.  అంబటి వ్యాఖ్యలపై తీవ్ర స్థాయిలో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.  

By
en-us Political News

  
ఈ చర్చల్లో భాగంగానే.. రేవంత్ కేబినెట్ లో ఇప్పుడు ఉపముఖ్యమంత్రిగా ఉన్న భట్టి విక్రమార్క కు తోడుగా మరో ఉపముఖ్యమంత్రిని కూడా నియమించే అవకాశాలున్నాయన్న చర్చ జోరందుకుంది. 
రాష్ట్రంలో తెలుగుదేశం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత   ప్రతి జిల్లాలోనూ పెట్టుబడులు, పరిశ్రమలు వస్తున్నాయని ఆయన సవివరంగా పేర్కొన్నారు. ఈ విషయంలో ఎక్కడైనా, ఎప్పుడైనా చర్చకు సిద్ధమని సవాల్ చేశారు.
పంచాయతీ ఎన్నికలకు పొత్త ధర్మం వర్తించదని ఆ ప్రకటన పేర్కొంది.   గ్రామాభివృద్ధి, స్వేచ్ఛాయుత పాలన, మహాత్మాగాంధీ ఆశయాల సాకారం గ్రామీణ స్థాయి నుంచే సాధ్యమవుతాయని పేర్కొంది.   
తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు కలిసికట్టుగా పనిచేయడం వల్లే గత అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ అధికారంలోకి రాగలిగిందని బి.ఎం. సందీప్ కుమార్ పేర్కొన్నారు.
సాధారణంగా   నాయకులు, తాము ప్రజలకు చేయగల పనుల విషయంలో వాస్తవికత వదిలేసి అతిశయోక్తులతో, అతి అంచనాలతో గొప్పలు చెప్పుకుంటుంటారు.
మొత్తం 28 జడ్పీ అధ్యక్ష, ఉపాధ్యక్ష స్థానాలకు జరిగిన ఎన్నికల్లో తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి 27 చోట్ల విజయం సాధించి తిరుగులేని ఆధిపత్యాన్ని ప్రదర్శించింది.  
అదానీతో సంబంధాలపై   రేవంత్ రెడ్డి స్పష్టత ఇచ్చారు. తెలంగాణలో అదానీ పెట్టుబడుల ద్వారా స్థానిక ప్రజలకు ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నామని, ప్రజాధనాన్ని దోచి అదానీకి కట్టబెట్టే విధానం తమది కాదని స్పష్టం చేశారు. తెలంగాణలో బీజేపీకి బలమైన ఉనికి లేదని, ఇటీవలి జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో బీజేపీ డిపాజిట్ కూడా కోల్పోవడమే ఇందుకు నిదర్శనమన్నారు.
పోలీసుల హెచ్చరికలు, ఆంక్షలను బేఖాతరు చేస్తూ ఆయన భారీ కాన్వాయ్‌తో అక్కడికి రావడంపై స్థానిక ప్రజలు, తెలుగుదేశం వర్గీయులు  ఆగ్రహం వ్యక్తం చేశారు.  ఎంపీ కాన్వాయ్ ను అడ్డుకునే ప్రయత్నం చేశారు. ఈ సందర్భంగా  అంకాలమ్మ గూడూరులో ఘర్షణ వాతావరణం నెలకొంది. 
ఇదే వేదికపై నుంచి   544.11 కోట్ల రూపాయల విలువైన అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేసిన రేవంత్ రెడ్డి,  ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకాన్ని కూడా   ప్రారంభించారు.
కొలంబియా యూనివర్సిటీ వేదికగా రాహుల్ గాంధీ మాట్లాడుతూ, ప్రస్తుతం  దేశ ఆర్థిక వ్యవస్థ   పతనావస్థలో ఉందని రాహుల్ సంచలన వ్యాఖ్యలు చేశారు. దేశంలో నిరుద్యోగ సమస్య విపరీతంగా పెరిగిపోయిందని, యువతకు ఉపాధి అవకాశాలు కరవయ్యాయని ఆయన ఆరోపించారు.
తమ కుటుంబ వివాహ వేడుకకు తండ్రిసమానులైన ఒక సీనియర్ రాజకీయ నాయకుడిని ఆహ్వానించడంలో తప్పేముందని ప్రశ్నించిన షర్మిల.. దీనికి అనవసరమైన, అభ్యంతరకరమైన అర్థాలు ఆపాదించి ప్రచారం చేయడం జగన్ దిగజారుడుతనానికి నీచ మసస్థత్వానికి నిదర్శనమన్నారు.
తెలంగాణ కాంగ్రెస్ రాజకీయ వర్గాల్లో గత కొంతకాలంగా నెలకొన్న ఉత్కంఠకు అఖిల భారత కాంగ్రెస్ కమిటీ (ఏఐసీసీ) అధికారికంగా తెరదించింది.
ఈ నేపథ్యంలో వైయస్ జగన్మోహన్ రెడ్డికి అత్యంత సన్నిహితుడైన చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి వైసీపీ తరపున తొలిసారిగా విజయసాయి పార్టీపై స్పందించారు. అయితే, ఆయన తన స్పందనను చాలా సాధారణంగా, క్లుప్తంగా ముగించడమే కాకుండా విజయసాయి రెడ్డిని   తేలికగా తీసుకున్నట్లు కనిపించింది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.