వర్షాకాలం మొదలవుతున్న సమయంలో ఏ పండ్లు ఆరోగ్యానికి మంచివి?
Publish Date:Jun 25, 2025
Advertisement
వర్షాకాలం (Monsoon season)లో మన శరీర రోగ నిరోధక శక్తి కొంత తగ్గుతుంది. అలాగని పండ్లు తినడం మానేయడం కాదు. సరిగ్గా ఎంచుకుని తినడం చాలా ముఖ్యం. ఈ కాలంలో కొన్ని పండ్లు ప్రత్యేకంగా ఆరోగ్యానికి చాలా మేలు చేస్తాయి, అలాగే కొన్ని జాగ్రత్తలతో తినాలి. ఇప్పుడు వాటిని వివరంగా చూద్దాం. వర్షాకాలానికి అనుకూలమైన పండ్లు: యాపిల్ (Apple) లాభాలు: శరీరానికి ఫైబర్, విటమిన్ C, యాంటీ ఆక్సిడెంట్లు అందిస్తాయి. రోగ నిరోధక శక్తిని పెంచుతుంది. జీర్ణక్రియ బాగా జరుగుతుంది. అయితే యాపిల్స్ ను శుభ్రంగా కడిగి తినాలి. పియర్.. (Pear) శరీరాన్ని హైడ్రేట్ చేయడంతో పాటు, శరీరంలోని వేడిని తగ్గిస్తుంది. పియర్ పండులో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. ఇది జీర్ణవ్యవస్థకు చాలా మేలు చేస్తుంది. అరటిపండు (Banana) అరటిపండ్లు అందరికీ చాలా సులవుగా తక్కువ ధరలో దొరుకుతాయి. పైగా అన్ని వయసుల వారు తినదగిన పండు ఇది. అరటిపండు జీర్ణ సమస్యలు నివారించడంలో సహాయపడుతుంది. అరటిపండు శరీరానికి తక్షణ శక్తిని ఇస్తుంది. అయితే ఇతర పళ్లతో కలిపి కాకుండా తినడం మంచిది. ఆరంజ్ (Orange) ఆరెంజ్ లేదా నారింజ పండులో విటమిన్ C అధికంగా ఉంటుంది. ఇది రోగ నిరోధక శక్తిని పెంచుతుంది. శరీరంలోని విషపదార్థాలను తొలగించడంలో సహాయపడుతుంది. సీజన్ మారుతున్న కాలంలో నారింజ తినడం మంచిదే కానీ.. వర్షాకాలంలో వీటిని పూర్తిగా శుభ్రంగా కడిగి తినాలి. ద్రాక్ష (Grapes) ద్రాక్ష పండ్లు ఆరోగ్యానికి చాలా మంచివి. వీటిలో యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్లు సమృద్దిగా ఉంటాయి. ద్రాక్ష పండ్లు తింటే శరీరం లోపల శుద్ది అవుతుంది. అయితే ద్రాక్షలో ధూళి, ఫంగస్ ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ముఖ్యంగా వర్షాకాలంలో వీటిని మంచి నీటితో బాగా కడిగి తినాలి. అనాసపండు (Pineapple) అనాస పండు రుచిలోనూ, వాసనలోనూ అందరినీ కట్టిపడేస్తుంది. ఈ సీజన్ మార్పులో అనాసపండు తీసుకుంటే శరీరానికి మంచి ఎనర్జీ లభిస్తుంది. ఇది జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. వర్షాకాలంలో చల్లని వాతావరణం వల్ల ఎదురయ్యే కఫం, మలబద్ధకం వంటి సమస్యల నివారణకు మంచిది. తక్కువగా మగ్గిన మామిడిపండ్లు (Semi-ripe Mangoes) వర్షాకాలం ప్రారంభమయ్యి సీజన్ మారుతున్న కాలంలో అక్కడక్కడా ఇంకా మామిడి పండ్లు దొరుకుతూ ఉంటాయి. అయితే జాగ్రత్త, వర్షాల కారణంగా మామిడిపండ్లలో పురుగులు ఉంటాయి. అందుకే తక్కువగా మగ్గిన మామిడి పండ్లు తీసుకోవాలి. వీటిలో విటమిన్ A & C సమృద్ధిగా ఉండి రోగనిరోధక శక్తిని పెంచుతుంది. అయితే తక్కువగా మగ్గినవి అయినా ఎక్కువగా తింటే మంట, అజీర్ణం కలగవచ్చు. అందుకే మితంగా తినాలి. వర్షాకాలంలో ఏ పండ్లను జాగ్రత్తగా తినాలి? జామకాయ (Guava).. జామకాయలను బాగా కడిగి తినాలి. ఎందుకంటే వీటిలో ఫంగస్ ఉండే ప్రమాదం ఎక్కువ. పండ్లను తినేటప్పుడు పాటించాల్సిన ముఖ్యమైన సూచనలు.. శుభ్రత: పండ్లను మంచి నీటితో బాగా కడగాలి. కొనుగోలు చేసిన వెంటనే నేరుగా తినకూడదు. తాజాగా తినాలి: బయట నిల్వపెట్టిన పండ్లు ఫంగస్ పట్టే ప్రమాదం ఎక్కువ. అందులోనూ ఈ వర్షాకాలంలో మరీ ఎక్కువ అవకాశాలు ఉంటాయి. మితంగా తినాలి: ఎక్కువగా తినడం వల్ల అజీర్ణం, మలబద్ధకం వంటి సమస్యలు రావచ్చు. అందుకే పండ్లు ఆరోగ్యానికి మంచివే అయినా మితంగా తనాలి. రాత్రి పూట జాగ్రత్త: పండ్లు ఎక్కువగా జీర్ణం కావాలంటే ఉదయం లేదా మద్యాహ్నం తినడం ఉత్తమం. రాత్రిపూట తింటే ఇవి జీర్ణం కావడంలో ఇబ్బందులు తలెత్తుతాయి. ఇది కడుపులో అజీర్తి, గ్యాస్ సమస్యలు ఏర్పడటానికి అవకాశం ఉంటుంది. వర్షాకాలం అంటే జలుబు, జ్వరం వంటి వైరల్ ఇన్ఫెక్షన్లు ఎక్కువగా ఉండే కాలం. అందుకే విటమిన్ C, యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉన్న పండ్లు తీసుకోవడం ద్వారా రోగ నిరోధకత పెరిగి ఆరోగ్యంగా ఉండవచ్చు. *రూపశ్రీ. గమనిక:
నల్ల ద్రాక్ష (Black grapes).. నల్ల ద్రాక్ష చాలా వరకు అందరికీ అందుబాటులో ఉండేదే.. అయితే వీటి శుభ్రతపై ఫోకస్ చేయాలి. శుభ్రంగా లేకుంటే అస్సలు తినకండి.
నేరేడు (Jamun).. నేరేడు పండ్లు ఈ కాలంలో విరివిగా దొరుకుతాయి. అయితే ఇవి కొంతమందికి అలర్జీ కలిగించొచ్చు. అందుకే జాగ్రత్త తీసుకోవాలి
ఇది సోషల్ సమాచారం మాత్రమే. కొన్ని అధ్యయనాలు, సంబంధిత నిపుణుల ప్రకారం ఈ వివరాలు అందించాం. వ్యక్తుల ఆరోగ్యాన్ని బట్టి ఫలితాలుంటాయి. వీటిని పాటించేముందు.. సంబంధిత నిపుణుడిని సంప్రదించడం శ్రేయస్కరం. అలాగే, హెల్తీ లైఫ్ స్టైల్, సరైన ఆహారం కూడా తీసుకోవడం మీ ఆరోగ్యానికి ఎంతో మేలు...
http://www.teluguone.com/news/content/amazing-super-fruits-to-eat-in-rainy-34-200618.html





