చలికాలంలో రోజుకు ఒక్క తమలపాకు తింటే ఏం జరుగుతుందంటే..!

Publish Date:Nov 1, 2025

Advertisement


తమలపాకుకు మన సంప్రదాయంలో, సంస్కృతిలో,  ఆహారంలో ఒక విశిష్టమైన స్థానం ఉంది. సాధారణంగా పూజలలో తమలపాకు అగ్రస్థానంలో ఉంటుంది. ఆ తరువాత పాన్, తాంబూలంలో వాడతారు. కానీ తమలపాకు  ఔషధంగా కూడా ఉపయోగపడుతుంది. ముఖ్యంగా చలికాలంలో సరైన పద్ధతిలో తీసుకుంటే ఇది అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు ఇస్తుంది. చలికాలంలో తమలపాకు తినడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏంటో తెలుసుకుంటే.. 

తమలపాకు చలికాలంలో తినవచ్చా?


చలికాలంలో తమలపాకు తినడం ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుంది, ఎందుకంటే ఇది శరీరాన్ని వెచ్చగా ఉంచే స్వభావం కలిగి ఉంటుంది. .

చలితో వచ్చే కఫం, దగ్గు, జలుబు వంటి సమస్యలను తగ్గిస్తుంది.

జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది.

కానీ ఒక ముఖ్యమైన విషయం ఏమిటంటే.. ఎక్కువగా తినకూడదు. రోజుకు ఒక ఆకుకన్నా ఎక్కువ తీసుకుంటే దాని వేడి శక్తి వల్ల కడుపు మండడం, నోరు ఎండిపోవడం లాంటి సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది. 

ఏ సమయంలో తినాలి?


తమలపాకు తీసుకునే సమయం కూడా చాలా ముఖ్యం. ఉదయం భోజనం తరువాత లేదా సాయంత్రం భోజనం తరువాత..  ఈ రెండు సమయాల్లో ఏదైనా ఒకసారి తినడం ఉత్తమం. ఎందుకంటే భోజనం తర్వాత జీర్ణక్రియను సులభం చేస్తుంది. తిన్న వెంటనే కాదు  భోజనం తర్వాత 10–15 నిమిషాలు గ్యాప్ ఇవ్వాలి.


ఎలా తింటే ఎలాంటి ప్రయోజనాలు ఉంటాయంటే..

తమలపాకును తినే పద్ధతిని బట్టి దాని ప్రయోజనాలు ఉంటాయి.

సాధారణ పద్ధతి..

ఒక తాజా తమలపాకు తీసుకుని, దానిపై చిన్నమొత్తం ఎలకులు పొడి లేదా సొంపు వేసి మెల్లగా నమిలాలి. ఇది జీర్ణక్రియకు సహాయం చేస్తుంది,  నోరు తాజా వాసన ఇస్తుంది.

దగ్గు లేదా చలి ఉన్నప్పుడు:
ఒక తమలపాకును తేలికగా మంట మీద వేడి చేసి దానిపై కొంచెం తేనె రాసి తినండి. ఇది కఫం తగ్గిస్తుంది, గొంతు నొప్పి తగ్గిస్తుంది.

జీర్ణక్రియ కోసం:
తమలపాకు మీద కొంచెం చింతపండు, ఉప్పు వేసి నమిలితే, జీర్ణక్రియ మెరుగుపడుతుంది.

తమలపాకు ఆరోగ్య ప్రయోజనాలు
భోజనం తర్వాత తీసుకుంటే గ్యాస్, బరువుగా ఉండటం తగ్గుతుంది. జీర్ణక్రియ మెరుగుపడుతుంది.

తేనెతో కలిపి తింటే గొంతు సమస్యలు తగ్గుతాయి.కఫం, దగ్గు నియంత్రణ అవుతుంది. 

నోటి దుర్వాసన తగ్గిస్తుంది ఇది సహజమైన మౌత్ ఫ్రెషనర్ గా పని చేస్తుంది.

చలికాలంలో వేడి శక్తి ఇస్తుంది.  శరీరానికి తాపాన్ని అందిస్తుంది.

తమలపాకులో యాంటీఆక్సిడెంట్లు ఎక్కువగా ఉంటాయి. ఇమ్యునిటీ పెంచుతుంది. 

చిన్న రక్తనాళాలను శుభ్రం చేస్తుంది. తద్వారా రక్త ప్రసరణ మెరుగుపడుతుంది  

తినటంతో పాటు తమలపాకు నూనెతో మసాజ్ చేస్తే   ఉపశమనం లభిస్తుంది. 

జాగ్రత్తలు..
ఎక్కువగా తింటే కడుపు మండడం లేదా నోరు ఎండిపోవడం జరుగుతుంది. 

చలికాలంలో రోజుకు ఒక ఆకుకంటే ఎక్కువ కాదు.

సున్నం  లేదా సుపారితో తినడం మాత్రం వద్దు.. అవి ఆరోగ్యానికి హానికరం.

గర్భిణీ స్త్రీలు లేదా గుండె, రక్తపోటు సమస్యలున్నవారు తీసుకునే ముందు వైద్యుని సలహా తీసుకోవాలి.

                    *రూపశ్రీ.

By
en-us Political News

  
కాలం మారినా మనిషి జీవన పోరాటం మాత్రం మారదు.  కొందరు కాలంతో పోటీ పడి ఎండ, వాన, చలి వంటి వాటిని లెక్క చేయకుండా సాగుతూ ఉండాలి. లేకపోతే వారితో పాటు వారిని నమ్ముకున్న కుటుంబాలు కూడా ఇబ్బందులు పడాల్సి వస్తుంది.....
వేసవి అంటే మండే ఎండలు, వేడి గాలులు,  చెమటలు పట్టించే వాతావరణం.. ఇవన్నీ ఉంటాయి.  ఇలాంటి రోజుల్లో  రోడ్డు పక్కన అమ్మే చెరకు రసం తాగితే ఎంతో హాయిగా ఉంటుంది. నిమ్మరసం, నల్ల ఉప్పు, పుదీనా కలపడం వల్ల చెరకు రసం  రుచి మరింత ఇనుమడిస్తుంది...
సాధారణంగా తాంబూలం వేసుకోవడం అనేది మన సంప్రదాయంలో ఒక భాగం. కానీ, ఆ తాంబూలానికి కొన్ని ప్రత్యేకమైన ఆయుర్వేద మూలికలను జత చేస్తే, అది గుండెను రక్షించే ఒక అద్భుతమైన ఔషధంగా మారుతుందని..
వేసవి వాతావరణం శరీరాన్ని అలసటకు గురి చేయడమే కాకుండా, జీర్ణక్రియ , శక్తి పై కూడా ప్రభావం చూపుతుంది. ఆయుర్వేదం ప్రకారం, ఆరోగ్యకరమైన శరీరం , మనస్సును కాపాడుకోవడానికి వేసవి కాలంలో ఆహారంపై..
నేటి కాలంలో మారుతున్న ఆహారపు అలవాట్లు, పని ఒత్తిడి మరియు జీవనశైలి కారణంగా చాలా మందిని వేధిస్తున్న ప్రధాన సమస్య మలబద్ధకం..
నేటి ఉరుకుల పరుగుల జీవితంలో మనల్ని నిరంతరం వేధించే ప్రధాన శత్రువులు ఒత్తిడి మరియు ఆందోళన. వీటితో పాటు థైరాయిడ్..
బ్రేక్ ఫాస్ట్ లేదా అల్పాహారం నేటికాలపు జీవనశైలికి చాలా ముఖ్యంగా మారింది.  ఉదయాన్నే అల్పాహారం తప్పకుండా తినాలని వైద్యుల నుండి ఆహార నిపుణుల వరకు ప్రతి ఒక్కరూ చెబుతారు.  అయితే చాలామంది అల్పాహారంలో..
కాలంతో పాటు అన్ని అలవాట్లు అప్డేట్ అవుతూ ఉన్నాయి.  మొదట వేప పుల్లలతో పళ్లు తోమేవారు,  తర్వాత పేస్ట్ లు వచ్చాయి.  ఆ తరువాత పేస్ట్ లలో ఉప్పు, బొగ్గు, లవంగం వంటివి చేరాయి.  అవి కూడా అయ్యాక మౌత్ వాష్ లు వచ్చాయి....
ఆరోగ్యకరమైన శరీరానికి జింక్ చాలా అవసరం. జింక్ కణజాలాలను బాగుచేస్తుందని చెబుతారు. జింక్ ఒక యాంటీఆక్సిడెంట్‌గా పనిచేస్తూ, కణాలను దెబ్బతినకుండా కాపాడటానికి సహాయపడుతుంది. చర్మం..
ఇనుప పాత్రలో వంట చేయడం ఆరోగ్యానికి మేలు చేస్తుందని చెబుతారు. ఎందుకంటే ఇనుప పాత్రలో వంట చేయడం వల్ల ఆ ఆహారాన్ని ఐరన్ ఖనిజం చేరుతుంది.  దీని వల్ల శరీరానికి ఐరన్ ఎలాంటి సప్లిమెంట్ ..
ఈ రోజుల్లో పిల్లల నుండి పెద్దల వరకు ప్రతి ఒక్కరు   ఎక్కువ సమయాన్ని మొబైల్, ల్యాప్‌టాప్ లేదా టాబ్లెట్ స్క్రీన్‌ల ముందు గడుపుతున్నారు. దీని ఫలితంగా, కంటి అలసట , చికాకు సర్వసాధారణమైపోయాయి...
నేటి ఉరుకుల పరుగుల జీవితంలో సరైన నిద్ర లేకపోవడం వల్ల ఎన్నో అనారోగ్య సమస్యలు తలెత్తుతున్నాయి...
AI..ప్రపంచం అంతా వాడుతున్న కృత్రిమ మేధస్సు ఇది. ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా ఈ కృత్రిమ మేధస్సు వాడకం చాలా పెరిగింది.  ఏ చిన్న సందేహం వచ్చినా ఏఐ ని వాడటం, దాన్ని సలహాలు, సూచలు అడగడం..
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.