Publish Date:Jun 18, 2025
నవ్యాంధ్రప్రదేశ్ రాజథాని అమరావతి ఇప్పుడు మోస్ట్ హ్యాపెనింగ్ సిటీ. అభివృద్ధిలో ఆకాశమే హద్దు అన్నట్లుగా దూసుకుపోతోంది. జగన్ హయాంలో ఉద్దేశపూర్వకంగా అమరావతి పురోగతిని ఆపేశారు. శ్మశానమంటూ ఎద్దేవా చేశారు. రాజధాని కోసం భూములిచ్చిన రైతులను నానా ఇబ్బందులకూ గురి చేశారు. అటువంటి అమరావతిలో ఇప్పుడు పండుగ వాతావరణం కనిపిస్తోంది. పెద్ద ఎత్తున నిర్మాణాలు జోరందుకున్నాయి. అటు కేంద్రం ప్రభుత్వ సంస్థల నిర్మాణానికి కూడా రంగం సిద్ధమైంది. రాజధాని నగరంలోని రెండు కీలక నిర్మాణాలను స్వయంగా చేపట్టడానికి కేంద్రం ముందుకు వచ్చింది. ఇందుకు సంబంధించి ఉత్తర్వులు కూడా జారీ అయ్యాయి. సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ కోసం క్వార్టర్లను, కామన్ సెంట్రల్ సెక్రటేరియట్ భవనాలను కూడా కేంద్రమే నిర్మించేందుకు ముందుకు వచ్చింది కేంద్రంలో మోడీ నేతృత్వంలోని ఎన్డీఏ సర్కార్ లో తెలుగుదేశం కూడా కీలక భాగస్వామి. దీంతో అమరావతి పురోగతికి అడ్డు అన్నదే లేకుండా పోయింది. ఇందుకు అదనంగా అమరావతిలో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల క్వార్టర్లు, కామన్ సెంట్రల్ సెక్రటేరియట్ నిర్మాణాలను కేంద్రమే స్వయంగా తన నిధులుతో నిర్మించేందుకు ముందుకు వచ్చింది.
కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఉత్వర్లులు జారీ చేశారు. ఆ వెంటనే ఆ నిర్మాణాలకు అవసరమయ్యే నిధులను కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ విడుద చేసేసింది. ఈ నిధుల విడుదల విషయాన్ని కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ స్వయంగా వెల్లడించారు. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల క్వార్టర్ల నిర్మాణానికి 1,329 కోట్ల రూపాయలు, కామన్ సెంట్రల్ సెక్రటేరియట్ నిర్మాణానికి .1,459 కోట్ల రూపాయలను కేంద్రం విడుదల చేసింది. కేంద్రం ఈ నిర్ణయంతో అమరావతి నిర్మాణం నిర్దుష్టకాలంలో పూర్తి కావడమే కాకుండా, ఇక ఏ శక్తీ దీనిని నిలువరించలేదని కూడా స్పష్టమైంది.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/amarawathi-progress-in-full-swing-25-200197.html
ఏపీ బ్రాండ్‌ను దెబ్బతీసేందుకై మాజీ సీఎం జగన్, మాజీ ఆర్థిక శాఖ మంత్రి కుట్రలు చేస్తూ రాష్ట్రంలో ఏదో జరిగిపోతున్నదంటూ గగ్గోలు పెడుతున్నారని ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ అన్నారు.
టీటీడీలో పనిచేసే అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ఏ.రాజశేఖర్ బాబును అధికారులు సస్పెండ్ చేశారు
నెల్లూరు జిల్లా కొవ్వూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి , వైసిపి మాజీ ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు అత్యంత బాధాకరమని మహిళా కమిషన్ చైర్పర్సన్ డాక్టర్ రాయపాటి శైలజ పేర్కొన్నారు.
అన్నమయ్య జిల్లా మదనపల్లె సబ్ కలెక్టరేట్ ఫైళ్ల దగ్ధం కేసులో మాజీ ఆర్డిఓ మురళిని మంగళవారం తిరుపతి లో సిఐడి అధికారులు అరెస్టు చేశారు.
తిరుమల ఎంప్లాయిస్ గదుల కౌంటర్ వద్ద ఘర్షణ చోటుచేసుకుంది. గదులు కోసం గంటల గంటలు నిరీక్షించిన భక్తులు సమయమనం కోల్పోయి నేరుగా గదులు పొందుతున్న ఉద్యోగులపై రాళ్లదాడి చేశారు.
ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఢిల్లీ పర్యటన రెండో రోజు కొనసాగుతుంది. తాజాగా ఇవాళ సీఎం కేంద్ర ఎరువులు, రసాయనాల శాఖ మంత్రి జేపీ నడ్డాతో భేటీ అయ్యారు. తెలంగాణ రాష్ట్ర అవసరాలకు కేటాయించిన యూరియాను సకాలంలో సరఫరా చేయాలని కోరారు.
ఆయనొక మంత్రి. ఈయనా మంత్రే. ఒకరు దేవాదాయం, మరొకరు మున్సిపల్. VRC నెల్లూరు జిల్లాకే అతి పెద్ద చరిత్ర గలిగిన విద్యా సంస్థలుగా పేరుంది. పెద్ద పెద్ద వాళ్లు ఇక్కడ చదువుకున్న వారే అన్న హిస్టరీ సైతం కలిగి ఉందీ ప్రాంగణం.
దలా ఉంటే సముద్రంలో వృధాగా కలిసే జలాలు వినియోగంలోకి తేవడానికి ప్రాజెక్ట్ కట్టుకుంటామంటే అభ్యంతరాలు వ్యక్తం అవుతుండటం విమర్శల పాలవుతోంది.
ఇక.. ప్రతిపక్ష బీఆర్ఎస్ సైతం చంద్రబాబు కేంద్రంగా విమర్శలు గుప్పిస్తోంది.
మాజీ మంత్రి నల్లపరెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డిని వైసీపీ నుంచి సస్పెండ్ చేయాలని ఏపీ హోం మంత్రి అనిత డిమాండ్ చేశారు. కోవూరు ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డి పై అనుచిత వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో హోం మంత్రి స్పందించారు.
ఏపీ సీఎం చంద్రబాబు శ్రీశైలం జలాశయం నుంచి గేట్లు ఎత్తి దిగువకు నీరు వదిలారు.. దాంతో కృష్ణమ్మ పరవళ్లు తొక్కుతూ నాగార్జునసాగర్ వైపుకు పరుగులు తీస్తున్నది. ఆనకట్టపై రైతులు, మంత్రులు, ఎమ్మెల్యేలతో కలిసి 4 గేట్లను ఎత్తి కృష్ణమ్మ ప్రత్యేక పూజలు చేశారు.
ఐదేళ్లు వైసీపీ పాలనలో జిల్లాలో ప్రతిపక్ష పార్టీలు వాటి నాయకులు పర్యటన చేసే పరిస్థితి లేకుండా చేశారు. ఉమ్మడి చిత్తూరు జిల్లాలో ఏ నాయకుడు రావాలన్నా తీవ్ర అడ్డంకులు సృష్టించారు.
సంగారెడ్డి జిల్లా పాశమైలారం సిగాచీ పార్మా ప్యాక్టరీలో డిజాస్టర్ మేనేజ్‌మెంట్ అథారిటీ బృందం పరిశీలించింది. పేలుడు గల కారణాలపై బృందం అధ్యయనం చేసింది. దీనిపై నివేదికను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు అందజేయనుంది
వన్ నేషన్.. వన్ ఎలక్షన్ నినాదంలో కేంద్రంలోని మోడీ ప్రభుత్వం దేశంలో జమిలి ఎన్నికలకు సిద్ధమౌతున్నది. ఇందు కోసం మాజీ రాష్ట్రపతి రామనాథ్ కోవింద్ నేతృత్వంలో అత్యున్నత స్థాయి కమిటీని వేసి నివేదిక తీసుకుంది.