Publish Date:Jun 23, 2025
డబుల్ ఇంజిన్ సర్కార్ అధికారంలో ఉంటే రాష్ట్రం ఎలా అభివృద్ధి చెందుతుందో సంవత్సర కాలంలోనే చేసి చూపించామని ఏపీ సీఎం చంద్రబాబు అన్నారు. అమరావతిలో కూటమి ప్రభుత్వం ‘సుపరిపాలనలో తొలి అడుగు’ పేరిట నిర్వహించిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. స్వర్ణాంధ్ర-2047 లక్ష్య సాధనే ధ్యేయంగా పనిచేస్తున్నామని ముఖ్యమంత్రి వెల్లడించారు. ప్రస్తుతం రాష్ట్ర తలసరి ఆదాయం రూ.2.6 లక్షలుగా ఉందని, 2047 నాటికి దీనిని రూ.55 లక్షలకు పెంచడమే లక్ష్యమని నిర్దేశించారు. రాష్ట్ర జీఎస్‌డీపీ పెరిగితే నిరంతరాయంగా రెవెన్యూ వృద్ధి చెందుతుందని, 2029 నాటికి తలసరి ఆదాయం, జీఎస్‌డీపీ గణనీయంగా పెరగాలని ఆకాంక్షించారు. ప్రజాప్రతినిధులు, అధికారులు సమన్వయంతో పనిచేసి, ఈ లక్ష్య సాధనకు కృషి చేయాలని పిలుపునిచ్చారు.
పీ-4 (పబ్లిక్, ప్రైవేట్, పీపుల్స్ పార్టనర్‌షిప్) కార్యక్రమాన్ని ఉద్యమ స్ఫూర్తితో ముందుకు తీసుకెళ్లాలని కోరారు. తెలివితేటలను ఆచరణలో పెట్టినప్పుడే అద్భుతాలు ఆవిష్కృతమవుతాయని స్పష్టం చేశారు.గత వైసీపీ ప్రభుత్వ విధానాలపై తీవ్ర స్థాయిలో చంద్రబాబు మండిపడ్డారు. వారి అసమర్థ పాలన వల్ల రాష్ట్ర అభివృద్ధి పూర్తిగా కుంటుపడిందని, పెట్టుబడిదారుల్లో విశ్వాసం దెబ్బతిన్నదని ఆరోపించారు. మూడు రాజధానుల ప్రతిపాదనతో రాష్ట్ర ప్రగతి ఆగిపోయిందని, ఈ 'మూడు ముక్కలాట'తో రాష్ట్రానికి రాజధాని లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. నీతి ఆయోగ్ నివేదిక ప్రకారం రాష్ట్రం అప్పుల్లో కూరుకుపోయిందని, వైసీపీ హయాంలో నిధులు పక్కదారి పట్టి దుర్వినియోగం అయ్యాయని విమర్శించారు.
రాష్ట్రంలో కుటమి సర్కార్ అధికారంలోకి రాగానే సంక్షేమానికి పెద్దపీట వేశమని తెలిపారు. అధికారంలోకి వచ్చిన వెంటనే మెగా డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల, అన్న క్యాంటీన్ల పునరుద్ధరణ వంటి కీలక దస్త్రాలపై సంతకాలు చేశామని చంద్రబాబు తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా 213 అన్న క్యాంటీన్ల ద్వారా కేవలం 5 రూపాయలకే భోజనం అందిస్తున్నామని చెప్పారు. పంద్రాగస్ట్ నుంచి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం కల్పిస్తామని, అదే రోజున ఆటో డ్రైవర్లకు కూడా ఆర్థిక సహాయం అందిస్తామని హామీ ఇచ్చారు. ‘తల్లికి వందనం’ పథకం హామీని నిలబెట్టుకున్నామని, అడ్మిషన్లు పూర్తయిన తర్వాత ఒకటో తరగతి నుంచి ఇంటర్ విద్యార్థులకు కూడా ఈ పథకాన్ని వర్తింపజేస్తామని ప్రకటించారు. రైతులకు 90 శాతం రాయితీతో డ్రిప్ పరికరాలు అందజేస్తున్నామని చంద్రబాబు తెలిపారు.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/amaravati-39-200534.html
నిన్నగాక మొన్న ఇదే మోడీ నాయకత్వంలోని ఎన్డీయే సర్కార్ కు వ్యతిరేకంగా పోరాడటానికి సిద్ధంగా ఉన్నానని ప్రకటించిన జగన్, ఇప్పుడు ఆదే మోడీ నాయకత్వాన్ని ప్రస్తుతిస్తూ ప్రశంసలు కురిపించడం ద్వంద్వ వైఖరి కాక మరేమిటని పరిశీలకులు ప్రశ్నిస్తున్నారు.
. ఇక షర్మిల విజయ్ ను కలిసి తన కుమార్తె వివాహానికి హాజరు కావాల్సిందిగా కోరుతూ పెళ్లి శుభలేక అందించడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఎందు కంటే కేంద్ర స్థాయిలో కాంగ్రెస్ తో పొత్తు విషయంలో విజయ్ నేతృత్వంలోని టీవీకే పార్టీ కూడా కీలకంగా ఉంది. అలాగే తమిళనాడులో విజయ్ నేతృత్వంలోని ప్రభుత్వంలో కాంగ్రెస్ భాగస్వామి.
లౌకిక స్వభావం కలిగిన ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లోకి మతపరమైన అంశాలను జొపపించడానికి విజయసాయి ప్రయత్నిస్తున్నారని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ఇక తమ ప్రసంగాల్లో, మీడియా సమావేశాలలో విజయసాయిరెడ్డి ప్రస్తావిస్తున్న అంశాలు ఆ విశ్లేషణలకుబలం చేకూరుస్తున్నాయి.
ఇప్పటికే తనపై 45 ఎఫ్ఐఆర్ లు ఉన్నాయన్న ఆయన తన టార్గెట్ వంద ఎఫ్ఐఆర్ లు అని చెప్పారు. అంతే కాదు.. వాటిని తాను ప్రజల పక్షాన నిలబడినందుకు దక్కిన మెడల్స్ గా భావిస్తానన్నారు. రాహుల్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు దేశ వ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారాయి.
విపక్షాల నిరసనల నేపథ్యంలో పోలీసులు ఢిల్లీలో విస్తృత బందోబస్తు ఏర్పాట్లు చేశారు. పలు ప్రాంతాల్లో బారికేడ్లు ఏర్పాటు చేయడంతో పాటు వేలాది మంది భద్రతా సిబ్బందిని మోహరించారు. ట్రాఫిక్ మళ్లింపులు కూడా చేపట్టారు. జంతర్ మంతర్, పార్లమెంట్ పరిసరాలు, ఎన్నికల సంఘం కార్యాలయం వైపు వెళ్లే మార్గాల్లో ప్రత్యేక నిఘా కొనసాగుతోంది.
ధనుష్ తన కొత్త రాజకీయ పార్టీ కోసం తమిళగ ఎళుచ్చి కళగం అనే పేరును ఖరారు చేసినట్లు ప్రచారం జరుగుతోంది. అలాగే.. ఈ పేరుతో ఇప్పటికే కేంద్ర ఎన్నికల సంఘం వద్ద పార్టీ రిజిస్ట్రేషన్ ప్రక్రియ కూడా పూర్తయ్యిందని అంటున్నారు.
ఒక దశలో తన రిటైర్మెంట్ తరువాత టీడీపీలో చేరేందుకు కూడా తాను సిద్ధపడ్డాననీ, అవసరమైతే ఎన్నికల బరిలో దిగడానికి కూడా రెడీ అయ్యాయనీ చెప్పిన ఏబీ వెంకటేశ్వరరావు, అ
బీసీ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు ప్రకాశ్ పాల్, ప్రముఖ దళిత నేత, మాజీ ఎంపీ విద్యాసాగర్ సోన్‌కర్, అలాగే అలహాబాద్ హైకోర్టు బార్ అసోసియేషన్ అధ్యక్షుడిగా రెండుసార్లు బాధ్యతలు నిర్వర్తించిన రాధాకాంత్ ఓఝా వంటి వారికి చోటు లభించింది.
జిల్లాలో పార్టీ పరిస్థితి వేగంగా దిగజారిపోతోంది. మజ్జి పార్టీని వీడటంతో జాగ్రత్త పడాల్సిన పార్టీ హైకమాండ్, అలాగే బొత్స సత్యనారాయణ చేతులెత్తేసినట్లు కనిపిస్తోంది. అంతే కాకుండా కూర్చున్న కొమ్మనే నరుక్కున్న చందంగా అసంతృప్తులను బుజ్జగించాల్సింది పోయి వారిపై సస్పెన్షన్ వేటు వేయడంతో జిల్లాలో పార్టీని జీరో నుంచి బిల్డ్ చేద్దామనుకుంటున్నారా? లేక జిల్లా పార్టీని వదిలేశారా అన్న అనుమానాలు పార్టీ శ్రేణుల నుంచే వస్తున్నాయి.
ఆంధ్రప్రదేశ్ రాజకీయ రంగంలో ప్రతి క్షణం ఒక కొత్త మలుపు తిరుగుతోంది.
పొలిటికల్ సర్కిల్స్ లో గట్టిగా వ్యక్తం అవుతున్న అభిప్రాయం ఏమిటంటే.. మీడియా సమావేశాలలో జగన్ మాట్లాడే విధానం కంటే విజయసాయి రెడ్డి మాట్లాడే విధానం చాలా చాలా బెటర్ అని.
అయితే ఆయన తాజాగా నిర్వహించిన కార్యకర్తల సమావేశం మాత్రం భిన్నంగా జరిగింది. ఆ సమావేశంలో ఆయన మాట్లాడిన మాటలు, వ్యక్తం చేసిన అసహనం వైసీపీవర్గాలలో కలకలం రేపింది.
జనసేన, బీజేపీ నాయకులు ప్రభుత్వ కార్యక్రమాల్లో పెద్దగా భాగస్వాములు కావడం లేదు. ప్రతి నెలా పెన్షన్ల పంపిణీలో టీడీపీ నేతలు, కార్యకర్తలు చురుకుగా పాల్గొంటుంటే.. జనసేన, బీజేపీ నాయకుల భాగస్వామ్యం నామమాత్రంగా ఉంటోందనీ, ఇది కూటమి పార్టీల మధ్య సమన్వయ లోపం ఉందా అన్న అనుమానాలను కలిగిస్తోందనీ సర్వేలో వెల్లడైన జనాభిప్రాయం.