ఏపీ శాశ్వత, ఏకైక రాజధాని అమరావతి.. అసెంబ్లీలో చంద్రబాబు తీర్మానం

Publish Date:Mar 28, 2026

Advertisement

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చరిత్రలో నేడు ఒక కీలక ఘట్టం ఆవిష్కృతమైంది. రాష్ట్ర రాజధానిగా అమరావతిని సుస్థిరం చేస్తూ, దానికి తిరుగులేని చట్టబద్ధత కల్పించే దిశగా కూటమి ప్రభుత్వం కీలక ముందడుగు వేసింది.    శనివారం (మార్చి 28) ఉదయం ఆంధ్రప్రదేశ్ శాసనసభ ప్రత్యేకంగా సమావేశమైంది. సభ ప్రారంభం కాగానే ముఖ్యమంత్రి చంద్రబాబు అమరావతిని ఏకైక రాజధానిగా గుర్తిస్తూ, దానికి చట్టబద్ధత కల్పించాలని కోరుతూ కీలక తీర్మానాన్ని ప్రవేశపెట్టారు.

 గత కొన్నేళ్లుగా రాజధాని విషయంలో నెలకొన్న గందరగోళానికి శాశ్వతంగా స్వస్తి పలకడమే ధ్యేయంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన చెప్పారు.   ఆంధ్రప్రదేశ్ ఏకైక,  శాశ్వత రాజధానిగా గుర్తిస్తూ, భవిష్యత్తులో ఏ శక్తులు కూడా దీనిని మార్చలేని విధంగా రాజ్యాంగబద్ధమైన రక్షణ కల్పించాలన్న ఉద్దేశంతో ప్రవేశపెట్టిన ఈ తీర్మానానికి మద్దతు ఇవ్వాలని ఆయన ఈ సందర్భంగా సభ్యులను కోరారు.

రాష్ట్ర సమగ్ర అభివృద్ధికి ఒకే రాజధాని విధానం అత్యంత అవసరమన్నారు.   ఈ తీర్మానం  ప్రధాన ఉద్దేశ్యం కేవలం ఒక నగరాన్ని నిర్మించడం మాత్రమే కాదు, దానికి చట్టపరమైన భరోసా కల్పించడమని చెప్పారు.  గతంలో జరిగిన పరిణామాలను దృష్టిలో ఉంచుకుని, ప్రభుత్వాలు మారినా,  రాజధాని మార్పు వంటి అంశాలు పునరావృతం కాకూడదనీ అందుకే ఈ తీర్మానాన్ని ఆమోదించాలనీ కోరారు. అసెంబ్లీలో ఈ తీర్మానం ఆమోందం పొందిన తరువాత  దీనిని తదుపరి చర్యల కోసం కేంద్ర ప్రభుత్వానికి పంపనున్నట్లు తెలిపారు.

ఈ సందర్భంగా  స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు ప్రసంగిస్తూ.. రాజధాని అనేది ఐదు కోట్ల ప్రజల ఆత్మగౌరవంతో ముడిపడి ఉన్న అంశమన్నారు.  రాజధాని నిర్మాణం అనేది ఒక నిరంతర ప్రక్రియ అని, రాజకీయ ప్రయోజనాల కోసం దానిని అడ్డుకోవడం రాష్ట్ర ప్రయోజనాలకు విఘాతమన్నారు. ముఖ్యమంత్రి తీసుకున్న ఈ నిర్ణయం రాష్ట్ర భవిష్యత్తుకు బలమైన పునాది వేస్తుందని ఆయన ప్రస్తుతించారు.

గత ఐదేళ్లలో అమరావతి ఎదుర్కొన్న ఆటంకాలు, న్యాయపరమైన చిక్కులు,  రైతుల పోరాటాలను దృష్టిలో ఉంచుకుని  ఈ కొత్త తీర్మానం ద్వారా అందరిలోనూ భరోసా నింపడమే ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది.  కాగా రాజధానిగా అమరావతికి చట్టబద్ధత వల్ల  ఈ ప్రాంతంలో భూముల విలువ పెరగడంతో పాటు  పెట్టుబడిదారుల్లో విశ్వాసం పెరుగుతుందని ఆర్థిక నిపుణులు విశ్లేషిస్తున్నారు.    

By
en-us Political News

  
ఈ ప్రక్రియను వేగవంతం చేసి ప్రస్తుత బడ్జెట్ సమావేశాల్లోనే ఇందుకు ఆమోదముద్ర వేసే యోచనలో కేంద్రం ఉన్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఏపీ రాజధాని అమరావతికి చట్టబద్ధత కల్పించే బిల్లు వచ్చే నెల 1న లోక్ సభలో ప్రవేశపెట్టే అవకాశం ఉందని మంత్రి నారా లోకేష్ అసెంబ్లీ వేదికగా చెప్పారు. కాగా ఈ అంశంలో కేంద్ర మాజీ మంత్రి, మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు కూడా తన వంతు సహకారం అందిస్తున్నట్లు తెలుస్తోంది.
30 స్థానాలున్న పుదుచ్చేరి అసెంబ్లీకి వచ్చే నెల 9న జరగనున్న ఎన్నికలలో ఎన్డీయే 14 నుంచి17 స్థానాలు గెలుచుకునే అవకాశం ఉందని పీపుల్స్ పల్స్ సర్వే తేల్చింది. ఇక విపక్ష ఎస్పీయే 9 నుంచి11, నటుడు విజయ్ నూతనంగా స్థాపించిన టీవీకే పార్టీ 2 నుంచి4 స్థానాలలో విజయం సాధించే అవకాశాలున్నాయని పేర్కొంది.
సభ్యులు ప్లకార్డులతో నిరసన తెలపడాన్ని మార్షల్స్ అడ్డుకోవడంతో తోపులాట జరిగింది. ప్రతిపక్షాల గొంతు నొక్కేందుకు ప్రభుత్వం మార్షల్స్‌ను అడ్డం పెట్టుకుంటోందని సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేశారు.
వంద మంది ప్రముఖులతో ప్రకటించిన ఈ జాబితాలో తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు నారా చంద్రబాబునాయుడు, రేవంత్ రెడ్డిలు చోటు దక్కించుకున్నారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబుకు ఈ జాబితాలో 13వ స్థానం దక్కగా, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి 25వ స్థానంలో నిలిచారు.
హైదరాబాద్ సహా రాష్ట్ర వ్యాప్తంగా పలు జిల్లాలలో భారీ వర్షాలు కురుస్తాయనీ, ఈ సందర్భంగా బలమైన ఈదురుగాలులతో పాటు వడగళ్లు కూడా పడే అవకాశం ఉందని హెచ్చరించింది.
మహిళా ఓటర్లను ఆకట్టుకునేందుకు మేనిఫెస్టోలో పలు పథకాలు ప్రకటించారు. ఆదాయపు పన్ను పరిధిలోకి రాని కుటుంబాల్లోని మహిళలకు ఇల్లతరసి పథకం కింద గృహోపకరణాలు కొనుగోలుకు 8వేల రూపాయల విలువైన వన్ టైమ్ కూపన్ ప్రకటించారు. ప్రస్తుతం మహిళా కుటుంబ పెద్దలకు నెలనెలా ఇస్తున్న వెయ్యిరూపాయల ఈర్థిక సయాన్ని రెండు వేల రూపాయలకు పెంచుతామని హామీ ఇచ్చారు.
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో తాను ప్రవేశపెట్టిన విద్యుత్ సంస్కరణలు ఇప్పటికీ దేశంలోని అనేక రాష్ట్రాలకు రోల్ మోడల్‌గా నిలిచాయన్నారు. ఒకప్పుడు హైదరాబాద్‌ను అభివృద్ధి చేసిన అనుభవంతో, భవిష్యత్తులో అమరావతిని హైదరాబాద్‌ను మించిన ప్రపంచస్థాయి నగరంగా తీర్చిదిద్దుతామని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు రాష్ట్ర వాసులకు హామీ ఇచ్చారు.
ముఖ్యంగా తెలుగుదేశం పార్టీకి చెందిన కేంద్ర మంత్రులకు మరింత ప్రాధాన్యత ఉన్న శాఖలను అప్పగించాలని మోడీ భావిస్తున్నట్లు చెబుతున్నారు.
తెలుగు సమాజం మీద తెలుగేశం వ్యవస్థాపకుడు ఎన్టీఆర్ ముద్ర ఎన్నటికి చెరిగిపోనిది. నటుడిగా అయన కృషి అజరామరం. రాజకీయ నాయకుడిగా అయన 14 ఏళ్ల ప్రస్థానంలో అయన ప్రభావం మహత్తరం. తెలుగువారి ఆత్మగౌరవాన్ని ఇనుమడింపజేయడంతో పాటు, తెలుగు సమాజంలో ఫ్యూడల్ వ్యవస్థలను నిర్మూలించి, అట్టడుగు వర్గాల సామాజిక, రాజకీయ ఉన్నతికి తోడ్పడం లో ఎన్టీఆర్ చూపించిన చొరవ నభూతో నభవిష్యతి.
ఈ తీర్మానంలో ప్రధానంగా ప్ర‌స్తావించిన సెక్ష‌న్ 5 స‌వ‌ర‌ణ అత్యంత కీల‌కం. 2014 ఏపీ పున‌ర్వ్య‌వ‌స్థీక‌ర‌ణ చ‌ట్టంలోని సెక్ష‌న్ ఐదు ప్ర‌కారం.. హైద‌రాబాద్ ప‌దేళ్ల పాటు ఉమ్మ‌డి రాజ‌ధానిగా ఉంది. ఆ త‌ర్వాత ఏపీకి కొత్త రాజ‌ధాని ఉండాల‌ని ఉంది. కానీ, దాని పేరు అమ‌రావ‌తి అని ఎక్క‌డా స్ప‌ష్టంగా లేదు. ఈ చ‌ట్టానికి స‌వ‌ర‌ణ చేసి.. ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాజ‌ధాని అనే ద‌గ్గ‌ర అమ‌రావ‌తి అనే ప‌దాన్ని చేర్చాల‌ని.. కేంద్రాన్ని కోరుతూ.. అసెంబ్లీ శనివారం తీర్మానం చేసింది.
తాజాగా కాకినాడ జిల్లాలో లోన్ యాప్ నిర్వాహకుల వేధింపుల కారణంగా ఓ యువకుడు బలవన్మరణానికి పాల్పడ్డాడు. వివకాలిలా ఉన్నాయి. అనకాపల్లి జిల్లా వడ్డాదిమాడుగుల గ్రామానికి చెందిన 22 ఏళ్ల మహమ్మద్ బషీర్ కాకినాడ జిల్లా గండేపల్లి మండలం సూరంపాలెంలోని ఒక ప్రైవేట్ కళాశాలలో ఎంబీఏ మొదటి సంవత్సరం చదువుతున్నాడు.
క‌ల్వ‌కుంట్ల కుటుంబానికి సెంటిమెంట్లు బాగా ఎక్కువ‌. ఎందుకంటే ఆ కుటుంబం ఎదిగిందే ఇలాంటి సెంటిమెంట్ల ద్వారా.
తండ్రి కేసీఆర్ స్థాపించిన పార్గీ నుంచి బయటకు వచ్చిన కల్వకుంట్ల కవిత కొత్తపార్టీ స్థాపనకు రంగం సిద్దం చేసుకున్నారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.