అమరరాజా బ్యాటరీస్ కంపెనీ ఫోర్బ్స్ జాబితాలో చోటు దక్కించుకుంది. ఫోర్బ్స్ తాజాగా విడుదల చేసిన బెస్ట్ ఎంప్లాయిర్స్ జాబితాలో ఫోర్బ్స్ కంపెనీకి చోటు లభించింది. అమరరాజా బ్యాటరీస్ గుంటూరు ఎంపీ, తెలుగుదేశం నాయకుడు గల్లా జయదేవ్ కుటుంబానికి చెందిన కంపెనీ అన్న సంగతి విదితమే. ఫోర్బ్స్ విడుదల చేసిన టాప్ 500 బెస్ట్ ఎంప్లాయిర్స్ జాబితాలో తమ సంస్థ నిలిచిన విషయాన్ని అమరరాజా గ్రూప్ వెల్లడించింది.
ఈ మేరకు మంగళవారం చేసిన ట్వీట్ లో తమ సంస్థకు ప్రతిష్టాత్మక ఫోర్బ్స్ బెస్ట్ ఎంప్లాయర్ జాబితాలో స్థానం లభించడం పట్ల ఆనందం వ్యక్తం చేసింది. ప్రజల విశ్వాసం, నమ్మకం చూరగొన్నందు వల్లే తమ సంస్థకీ గుర్తింపు వచ్చిందని పేర్కొంది.
ఫోర్బ్స్ సంస్థ జాబితాలో స్థానం పొందడం తమ సంస్థకు దక్కిన గౌరవంగా అభివర్ణించిన అమరరాజా గ్రూప్ ఈ స్ఫూర్తితో మరింత ఉత్తమంగా ముందుకు సాగుతామని ట్వీట్ లో పేర్కొంది. త్వరలో లడఖ్ లో దేశంలోనే తొలి గ్రీన్ హైడ్రోజన్ ఫ్యూయలింగ్ స్టేషన్ ను నెలకొల్పబోతున్నట్లు అమరరాజా గ్రూప్ ఎగ్జిక్యూటివ్ డైరక్టర్ ఆ ట్వీట్లో తెలపారు.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/amaraja-in-the-list-of-forbs-as-best-employer-25-139181.html
నిన్నటి వరకూ జగన్ కు పెట్టని కోటలా నిలిచిన పులివెందులలో ఇప్పుడు తెలుగుదేశం జెండా ఘనంగా ఎగురుతోంది. సుదీర్ఘకాలంగా వైసీపీకి తిరుగులేని కంచుకోటగా ఉన్ పులివెందుల పరిధిలో తెలుగుదేశం పార్టీ తన ఉనికిని బలంగా చాటుకుంటోంది.
రాజకీయ నాయకులపై ప్రజలకు ఉండే అభిమానం ఒక్కోసారి అసాధారణ రీతిలో వ్యక్తమవుతుంది.
టాలీవుడ్ సినీ పరిశ్రమలో వరుస వెడ్డింగ్ బెల్స్ మోగుతున్నాయి. ఇప్పటికే పలువురు యంగ్ హీరోలు వైవాహిక జీవితంలోకి అడుగుపెడుతుండగా
దీపావళి పండగ అనగానే ప్రతి ఇంటా సంబరాలు, బాణసంచా చప్పుళ్లు సర్వసాధారణం.
వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి తీరుపై ఆ పార్టీ నుంచి బయటకు వచ్చిన మాజీ ఎంపీ విజయసాయి రెడ్డి తీవ్రస్థాయిలో మండిపడ్డారు.
చెన్నై వేదికగా ఇటీవల వైఎస్ అనిల్ కుమార్ రెడ్డి కుమార్తె వివాహం ఎంతో వైభవంగా జరిగింది.
అప్పుడప్పుడే లోకాన్ని చూడటం మొదలుపెట్టింది. అమ్మా నాన్నల ఒడిలో గోరుముద్దలు తింటూ.. బుడిబుడి అడుగులు వేస్తూ ఆడుకోవాల్సిన వయసు.
తుఫాను కారణంగా చీరాల మన్సిపాల్టీలో ఓట్ల లెక్కింపు శుక్రవారం (నవంబర్ 5) జరుగుతోంది. ఇప్పటి వరకు ఎక్కడా కనీసం డిపాజిట్ కూడా దక్కని కాంగ్రెస్ ఖాతాలో తొలి విజయం నమోదైంది. కాంగ్రెస్ పార్టీ చీరాల మునిసిపోల్స్ లో గట్టి పోటీ ఇచ్చింది. 25వ వార్డులో విజయం సాధించింది. 25వ వార్డు నుంచి బరిలోకి దిగిన కాంగ్రెస్ అభ్యర్థి వెంకట్రావు విజయం సాధించారు.
పోలింగ్ సరళి, వెలువడిన ఫలితాలు వైసీపీ శిబిరంలో ఆందోళన కలిగిస్తుంటే వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్ మాత్రం మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తూ, అధికార తెలుగుదేశం కూటమి అరాచకాలు, అధికార దుర్వినియోగం తమ ఓటమికి కారణాలుగా చూపడానికి ప్రయత్నిస్తున్నారు. ఎన్నికల ఫలితాల వెల్లడి తర్వాత వైఎస్ జగన్ నిర్వహించిన ఈ మీడియా సమావేశంలో జగన్ చెప్పిందే చెప్పారు.
ప్రతిరోజూ ఉదయం మనం ఎంతో ఆరోగ్యకరమని భావించి తాగే పాలు అసలు సిసలైనవేనా? లేక ప్రాణాల మీదకు తెచ్చే విషపూరిత కల్తీ పాలా? అనే ప్రశ్న ఇప్పుడు హైదరాబాద్ ప్రజలను తీవ్ర ఆందోళనకు గురిచేస్తోంది
హైదరాబాద్ నగరంలో నిత్యం రాకపోకలు సాగించే లక్షలాది మంది ప్రయాణికులకు రాష్ట్ర ప్రభుత్వం తీపి కబురు అందించింది
కాంగ్రెస్, కమ్మూనిస్టుల మద్దతుతో ఎన్నికల బరిలోకి దిగిన ఏబీవీకి ఘోర పరాజయం ఎదురైన సంగతి తెలిసిందే. కమ్యూనిస్టులకు అంతో ఇంతో పట్టున్న ప్రాంతాలలో కూడా ఆయనకు ఓట్లు రాలలేదు. ఇక కాంగ్రెస్ మద్దతు ఆయనకు ఎందుకూ కొరగాకుండా పోయింది.