Publish Date:Dec 20, 2025
ప్రముఖ సినీ నటి ఆమని భారతీయ జనతా పార్టీలో చేరారు. నాంపల్లి సెంట్రల్ ఆఫీసులో రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్ రావు ఆమెకు కాషాయ కండువా కప్పి సాదరంగా ఆహ్వానించారు. అనంతరం పార్టీ సభ్యత్వాన్ని అందజేశారు. ఈ సందర్బంగా ఆమని మాట్లాడుతు ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలో దేశం సాధిస్తున్న ప్రగతిని చూసి గర్వపడుతున్నాని తెలిపారు. ప్రధాని చేస్తున్న అభివృద్ధి పనులకు ఆకర్షితురాలినై ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆమె పేర్కొన్నారు.
ఆయన సనాతన ధర్మం కోసం మోదీ ఎంతో పాటుపడుతున్నారు" అని ఆమె పేర్కొన్నారు. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ప్రజా పోరాటాలపై నెమ్మదిగా స్పందిస్తున్న బీజేపీ, ఇప్పుడు అనూహ్యంగా సినీ తారలను చేర్చుకోవడంపై దృష్టి పెట్టడం రాజకీయ వర్గాల్లో ఆసక్తి రేపుతోంది. గత అసెంబ్లీ ఎన్నికలకు ముందు కూడా విజయశాంతి, జయసుధ, జీవితా రాజశేఖర్ వంటి వారిని పార్టీలోకి ఆహ్వానించింది. కొందరు అగ్ర హీరోలతో బీజేపీ జాతీయ నేతలు భేటీ కావడం, దర్శకుడు రాజమౌళి తండ్రి విజయేంద్ర ప్రసాద్‌కు రాజ్యసభ సభ్యత్వం ఇవ్వడం వంటి పరిణామాలు చోటుచేసుకున్నాయి
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/amani-25-211318.html
హైదరాబాద్ నగరంలో మరో దారుణ ఘటన వెలుగు చూసింది.
గాంధీ జయంతి సందర్భంగా హైదరాబాద్‌లోని చారిత్రాత్మక బాపూఘాట్ వద్ద జాతిపిత మహాత్మా గాంధీకి రాష్ట్ర ప్రభుత్వం ఘనంగా నివాళులు అర్పించింది.
కనీస ధర రూ.30కి పెంపునకు సిఫార్సు.!
వెబ్‌సిరీస్ ల్లో ఎక్కువగా బ్యాంకులు, బంగారు దుకాణాల్లో దోపిడీలకు సంబంధించిన వీడియోలే చూసేవాడు.. ఆ తర్వాత తనకున్న ఆర్మీ అనుభవాన్ని ఉపయోగించుకోని సికింద్రాబాద్ మద్రాస్ రెజిమెంట్‌ను ఎంచుకున్నాడు.
ప్రధాన ఎన్నికల కమిషనర్ (సీఈసీ) వ్యవహారశైలిని నిరసిస్తూ ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద తలపెట్టిన ఆందోళన తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది.
హైదరాబాద్ నగరవాసుల ప్రయాణ కష్టాలకు చెక్ పెట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మక నిర్ణయం తీసుకుంది.
కొత్త కారు కొనుక్కోవాలని ఎన్నో రోజులుగా కలలు కంటారు.. ఆ కల నెరవేరిన రోజు ఆ ఆనందమే వేరు! ఎంతో ఇష్టపడి కొత్త బీఎండబ్ల్యూ కారు కొనుగోలు చేసిన ఓ వ్యక్తి..
తమిళనాడు రాజకీయాల్లో సరికొత్త వాతావరణం నెలకొంది.
మహారాష్ట్రలోని ప్రఖ్యాత హిందూ హృదయసమ్రాట్ బాలాసాహెబ్ థాకరే మహారాష్ట్ర సమృద్ధి మహామార్గ్‌పై జరిగిన ఒక ఘోర రోడ్డు ప్రమాదం తీవ్ర విషాదాన్ని నింపింది.
దుబాయ్ నుంచి టెల్ అవీవ్‌కు బయలుదేరిన ఫ్లైదుబాయ్ విమానంలో భారత సంతతి కెప్టెన్‌పై జరిగిన కత్తిదాడి అంతర్జాతీయంగా తీవ్ర కలకలం రేపుతోంది.
మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది.
జాతిపిత మహాత్మా గాంధీ 157వ జయంతి వేడుకలను దేశవ్యాప్తంగా అత్యంత భక్తిశ్రద్ధలతో, ఘనంగా నిర్వహిస్తున్నారు.
ఆంధ్రప్రదేశ్‌లో డీఎస్సీ 2.0 నోటిఫికేషన్ విడుదలకు కసరత్తు వేగవంతమైంది.