కంటి శుక్లం రాకుండా ఉండాలంటే ఉసిరికాయలు ఇలా తినాలి..!

Publish Date:Nov 12, 2024

Advertisement


 
ఉసిరి కాయలు భారతీయులకు వరం కంటే తక్కువ కాదు. ఆయుర్వేదంలో ఉసిరికి చాలా ప్రాధాన్యత ఇచ్చారు. సంస్కృతంలో ఉసిరిని అమలకి అని అంటారు. రోజూ ఉసిరికాయలు తింటూ ఉంటే ఆరోగ్యానికి చాలా మేలు చేస్తాయని,  బరువు తగ్గించడంలోనూ, రోగనిరోధక శక్తిని బలంగా మార్చడంలోనూ సహాయపడతాయని అంటారు. అయితే ఉసిరికాయలను తినడం వల్ల కంటి శుక్లానికి కూడా చెక్ పెట్టవచ్చని అంటున్నారు. దీని గురించి తెలుసుకుంటే..

కంటి శుక్లం..

చాలామంది చూపు  కోల్పోవడానికి కంటి శుక్లం కారణం అవుతుంది..  ముఖ్యంగా కంటి చూపు అస్పష్టంగా మారుతుంది.  కాలక్రమేణా పూర్తీగా చూపు పోవడానికి దారితీస్తుంది.  వయసు పెరిగేకొద్ది కంటి శుక్లం సమస్యలు వస్తాయి.  చాలా వరకు వృద్దులలో కంటి శుక్లం సమస్యలు కనిపించేవి. కానీ నేటి కాలంలో చాలా తక్కువ వయసులోనే ఈ సమస్యలు బయటపడుతున్నాయి. కంటి శుక్లం రాకూడదన్నా,  కంటి ఆరోగ్యం మెరుగ్గా ఉండాలన్నా ఉసిరికాయలు తినాలని అంటున్నారు. ఎలాగో ఇది కార్తీక మాసం.. ఈ మాసం మొదలు దాదాపు రెండు, మూడు నెలల వరకు ఉసిరికాయలు విరివిగా లభిస్తాయి.  ఉసిరికాయలు దొరికినన్ని రోజులు వీటిని తినడం.. మిగిలిన రోజులలో తినడానికి వీటిని ఎండబెట్టి పొడి చేసుకుని నిల్వ చేసుకుంటే ఏడాది మొత్తం క్వాలిటీతో కూడిన ఉసిరికాయ పొడి సిద్దమవుతుంది. ఉసిరికాయలు కంటి శుక్లానికి  ఎలా చెక్ పెడతాయి తెలుసుకుంటే..


కంటి శుక్లం వయసుతో సంబంధం లేకుండా రావడానికి కొన్ని కారణాలు ఉన్నాయి. ఏదైనా ఆరోగ్య సమస్యల వల్ల మందులను ఎక్కువ కాలం వాడటం వల్ల కంటి శుక్లం వచ్చి కంటి చూపు దెబ్బతినే ప్రమాదం ఉంటుంది.  ఇది మాత్రమే కాకుండా కంటికి గాయం, మధుమేహం  వంటి సమస్యల వల్ల కూడా కంటి శుక్లం వస్తుంది.

సాధారణంగా కంటి శుక్లాన్ని ఆపరేషన్ చేసి తొలగిస్తారు. అయితే శస్ర్తచికిత్సతో సంబంధం లేకుండా జీవనశైలి, ఆహారంలో మార్పులు చేసుకోవడం వల్ల  కంటి శుక్లానికి చెక్ పెట్టవచ్చు. దీనికి ఉసిరికాయ బాగా సహాయపడుతుంది.


ఉసిరిలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు,  విటమిన్-సి, ఫ్లేవనాయిడ్లు కంటి శుక్లాన్ని నయం చేయడంలో, రాకుండా చేయడంలో సహాయపడతాయి. ఇతర కంటికి సంబంధించిన సమస్యలు రాకుండా చేయడంలో కూడా సహాయపడతాయి. శరీరాన్ని ఫ్రీ రాడికల్స్ నుండి రక్షించడంలో ఉసిరి సహాయపడుతుంది.


ముఖ్యంగా ఉసిరికాయలో ఉండే విటమిన్-సి దృష్టి సమస్యలు నయం చేయడంలో సహాయపడుతుంది.  వృద్దాప్య ప్రభావాల నుండి కళ్లను రక్షిస్తుంది.


ఉసిరికాయ తినడం వల్ల కంటి లెన్స్ లోని టెన్షన్ తగ్గుతుందని అంటున్నారు. ఇది కంటి శుక్లం సమస్యలను తగ్గించడంలో సహాయపడుతుందని పరిశోధనలు కూడా వెల్లడిస్తున్నాయి.

రోజూ ఒకటి లేదా రెండు ఉసిరికాయలను తినవచ్చు.  దీన్ని పగలకొట్టి కొద్దిగా ఉప్పు వేసి నోట్లో వేసుకుని సుమారు గంట సేపటి వరకు దాని సారాన్ని మెల్లిగా జుర్రుకుంటూ ఉసిరిని తినవచ్చు.  లేదంటే ఉసిరికాయను ముక్కలు చేసి దాన్ని గ్రైండ్ చేసి అందులో తగినంత నీరు జోడించి జ్యూస్ లాగా కూడా తీసుకోవచ్చు.


ఉసిరికాయ సీజన్ దాటితే అవి దొరకవు. అందుకే ఉసిరికాయల సీజన్ లోనే ఉసిరికాయలను ఎండబెట్టి పొడి చేసుకుని వాటిని నిల్వ చేసుకోవాలి. ఈ పొడిని వేడి నీటిలో కలిపి ఒక 10 నిమిషాల తరువాత గోరువెచ్చగా తాగాలి.  


                                   *రూపశ్రీ.

By
en-us Political News

  
మనలో చాలా మందికి అద్దంలో చూసుకున్నప్పుడు కొన్ని శరీర భాగాలు నచ్చవు. ముఖ్యంగా ఎంత వ్యాయామం చేసినా, ఎంత కఠినమైన డైట్ పాటించినా తగ్గని మొండి కొవ్వు మన ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీస్తుంది...
ప్రస్తుత రోజుల్లో వయసుతో సంబంధం లేకుండా చాలా మంది మహిళలను వేధిస్తున్న అతిపెద్ద సమస్య పి.సి.ఓ.డి (PCOD). అసలు ఈ సమస్య ఎందుకు వస్తుంది..
ఈనాటి వేగవంతమైన జీవనశైలిలో మనకు తెలియకుండానే మనం అనేక ఆరోగ్య సమస్యలను కొనితెచ్చుకుంటున్నాము. ముఖ్యంగా, నేటి యువతలో సెక్స్ పట్ల ఆసక్తి తగ్గడం అనేది ఒక ప్రధాన సమస్యగా మారుతోంది. ..
మధుమేహం (Diabetes) ఉన్నవారు చేసే మొదటి పని అన్నం మానేసి చపాతీలు తినడం. మరి నిజంగా చపాతీ తింటే షుగర్ తగ్గుతుందా? అన్నం తింటే పెరిగిపోతుందా? ఈ విషయంలో చాలా మందిలో..
నేటి వేగవంతమైన ఒత్తిడితో కూడిన జీవితంలో ఆందోళన ఒక సాధారణ సమస్యగా మారింది. కొన్నిసార్లు చిన్న చిన్న విషయాలు కూడా మనసును అశాంతపరిచి, నిద్ర, ఆహరం, రోజువారీ జీవనశైలిపై  ప్రభావం చూపుతాయి...
కాలం మారినా మనిషి జీవన పోరాటం మాత్రం మారదు.  కొందరు కాలంతో పోటీ పడి ఎండ, వాన, చలి వంటి వాటిని లెక్క చేయకుండా సాగుతూ ఉండాలి. లేకపోతే వారితో పాటు వారిని నమ్ముకున్న కుటుంబాలు కూడా ఇబ్బందులు పడాల్సి వస్తుంది.....
వేసవి అంటే మండే ఎండలు, వేడి గాలులు,  చెమటలు పట్టించే వాతావరణం.. ఇవన్నీ ఉంటాయి.  ఇలాంటి రోజుల్లో  రోడ్డు పక్కన అమ్మే చెరకు రసం తాగితే ఎంతో హాయిగా ఉంటుంది. నిమ్మరసం, నల్ల ఉప్పు, పుదీనా కలపడం వల్ల చెరకు రసం  రుచి మరింత ఇనుమడిస్తుంది...
సాధారణంగా తాంబూలం వేసుకోవడం అనేది మన సంప్రదాయంలో ఒక భాగం. కానీ, ఆ తాంబూలానికి కొన్ని ప్రత్యేకమైన ఆయుర్వేద మూలికలను జత చేస్తే, అది గుండెను రక్షించే ఒక అద్భుతమైన ఔషధంగా మారుతుందని..
వేసవి వాతావరణం శరీరాన్ని అలసటకు గురి చేయడమే కాకుండా, జీర్ణక్రియ , శక్తి పై కూడా ప్రభావం చూపుతుంది. ఆయుర్వేదం ప్రకారం, ఆరోగ్యకరమైన శరీరం , మనస్సును కాపాడుకోవడానికి వేసవి కాలంలో ఆహారంపై..
నేటి కాలంలో మారుతున్న ఆహారపు అలవాట్లు, పని ఒత్తిడి మరియు జీవనశైలి కారణంగా చాలా మందిని వేధిస్తున్న ప్రధాన సమస్య మలబద్ధకం..
నేటి ఉరుకుల పరుగుల జీవితంలో మనల్ని నిరంతరం వేధించే ప్రధాన శత్రువులు ఒత్తిడి మరియు ఆందోళన. వీటితో పాటు థైరాయిడ్..
బ్రేక్ ఫాస్ట్ లేదా అల్పాహారం నేటికాలపు జీవనశైలికి చాలా ముఖ్యంగా మారింది.  ఉదయాన్నే అల్పాహారం తప్పకుండా తినాలని వైద్యుల నుండి ఆహార నిపుణుల వరకు ప్రతి ఒక్కరూ చెబుతారు.  అయితే చాలామంది అల్పాహారంలో..
కాలంతో పాటు అన్ని అలవాట్లు అప్డేట్ అవుతూ ఉన్నాయి.  మొదట వేప పుల్లలతో పళ్లు తోమేవారు,  తర్వాత పేస్ట్ లు వచ్చాయి.  ఆ తరువాత పేస్ట్ లలో ఉప్పు, బొగ్గు, లవంగం వంటివి చేరాయి.  అవి కూడా అయ్యాక మౌత్ వాష్ లు వచ్చాయి....
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.