అల్లు అర్జున్‌కు నాంపల్లి కోర్టు సమన్లు

Publish Date:Jun 19, 2026

Advertisement

 

పుష్ప-2 ప్రీమియర్ షో సందర్భంగా హైదరాబాద్‌లోని సంధ్య థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాట ఘటన కేసులో సినీ నటుడు అల్లు అర్జున్‌కు నాంపల్లి కోర్టు సమన్లు జారీ చేసింది. ఈ కేసులో వ్యక్తిగతంగా కోర్టు ముందు హాజరుకావాలని ఆదేశిస్తూ సోమవారం విచారణకు హాజరుకావాలని సమన్లలో పేర్కొంది.

ఈ కేసులో అల్లు అర్జున్‌ను A-11 నిందితుడిగా చేర్చిన చిక్కడపల్లి పోలీసులు ఇప్పటికే కోర్టులో ఛార్జ్‌షీట్ దాఖలు చేశారు. A1 నుంచి A10 వరకు సంధ్య థియేటర్ యాజమాన్యాన్ని నిందితులుగా పేర్కొన్న పోలీసులు, మొత్తం 23 మందిపై అభియోగాలు నమోదు చేశారు. వీరిలో 19 మంది నిందితులకు నాంపల్లి కోర్టు సమన్లు జారీ చేసింది. నిందితులందరూ వ్యక్తిగతంగా కోర్టు ముందు హాజరైన అనంతరం కేసు ట్రయల్ ప్రక్రియ ప్రారంభమయ్యే అవకాశం ఉంది.

గత ఏడాది డిసెంబర్ 4న 'పుష్ప-2' బెనిఫిట్ షో సందర్భంగా సంధ్య థియేటర్ వద్ద భారీ సంఖ్యలో అభిమానులు చేరుకున్నారు. ఈ క్రమంలో జరిగిన తొక్కిసలాటలో రేవతి అనే మహిళ మృతి చెందగా, ఆమె కుమారుడు శ్రీతేజ్ తీవ్రంగా గాయపడ్డాడు. ప్రస్తుతం కూడా శ్రీతేజ్ పూర్తిగా కోలుకోలేదని సమాచారం.

ఈ ఘటనపై నమోదైన కేసులో దర్యాప్తు పూర్తి చేసిన చిక్కడపల్లి పోలీసులు ఇటీవల కోర్టులో ఛార్జ్‌షీట్ దాఖలు చేశారు. ఛార్జ్‌షీట్‌ను పరిశీలించిన నాంపల్లి కోర్టు నిందితులకు సమన్లు జారీ చేసింది. నిందితుల వ్యక్తిగత హాజరు అనంతరం అభియోగాల నమోదు ప్రక్రియ పూర్తి చేసి కేసు ట్రయల్‌ను ప్రారంభించే అవకాశం ఉందని న్యాయ వర్గాలు చెబుతున్నాయి.

పుష్ప-2 వివాదం: ఊహాజనిత వార్తలు, డిబేట్లపై కోర్టు మధ్యంతర ఆదేశాలు

సంధ్య థియేటర్ ఘటనకు సంబంధించిన కేసులో హైదరాబాద్ నగర సివిల్ కోర్టు కీలక మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. కేసు విచారణ కొనసాగుతున్న సమయంలో వాస్తవ నిర్ధారణకు ముందే ప్రజలను తప్పుదోవ పట్టించేలా ఊహాజనిత వార్తలు, అసత్య ప్రచారాలు, ఆధారరహిత ఆరోపణలు, వాస్తవాలకు విరుద్ధమైన చర్చలు, డిబేట్లు, వార్తా కథనాలు లేదా సోషల్ మీడియా పోస్టులు ప్రచురించరాదని కోర్టు స్పష్టం చేసింది.

సంధ్య థియేటర్‌కు సంబంధించిన O.S. No.216 of 2026లో I.A. No.369 of 2026 పిటిషన్‌పై విచారణ జరిపిన హైదరాబాద్ నగర సివిల్ కోర్టు గౌరవ వేకేషన్ సివిల్ జడ్జి-కమ్-XXV అదనపు చీఫ్ జడ్జి జూన్ 4, 2026న Ad-Interim Ex Parte Injunction ఉత్తర్వులు జారీ చేశారు.

కోర్టు ఆదేశాల ప్రకారం కేసుకు సంబంధించిన అంశాలపై తుది విచారణ పూర్తయ్యే వరకు నిర్ధారణ కాని ఆరోపణలు, ఊహాగానాలు లేదా ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రచారం చేయరాదని స్పష్టం చేసింది. అలాగే మీడియా సంస్థలు, డిజిటల్ ప్లాట్‌ఫారమ్‌లు, సోషల్ మీడియా వేదికలు బాధ్యతాయుతంగా వ్యవహరిస్తూ కోర్టు ఆదేశాలను గౌరవించాలని సూచించింది. ఈ ఉత్తర్వులు కేసులో తుది తీర్పు వెలువడే వరకు అమల్లో ఉంటాయని, కోర్టు ఆదేశాలను ప్రతి ఒక్కరూ పాటించాలని న్యాయస్థానం పేర్కొంది.

By
en-us Political News

  
సోషల్ మీడియాలో ఓ మహిళా ప్రజాప్రతినిధిని ఉద్దేశించి అభ్యంతరకర వ్యాఖ్యలు చేసిన ఆర్మ్డ్ రిజర్వ్ పోలీస్ కానిస్టేబుల్‌పై సైబరాబాద్ సీపీ డా. ఎం. రమేష్ సస్పెన్షన్ వేటు వేశారు.
కృష్ణాష్టమి 2026 సందర్భంగా భారతదేశంలో తప్పక సందర్శించాల్సిన మథుర, బృందావనం, ద్వారక, గురువాయూర్ మరియు పూరీ జగన్నాథ ఆలయాల విశేషాలు మరియు ఆధ్యాత్మిక ప్రాముఖ్యతను ఇక్కడ తెలుసుకోండి.
తిరుమల శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు 2026 అక్టోబర్ 12 నుండి 21 వరకు జరగనున్నాయి. గరుడ సేవ, రథోత్సవం, చక్రస్నానం మరియు వాహన సేవల సంపూర్ణ షెడ్యూల్ ఇక్కడ తెలుసుకోండి.
అయోధ్య శ్రీ రామ్ జన్మభూమి మందిర్ సీఈఓ ఎంపిక కోసం ప్రతిపాదించిన ముగ్గురి పేర్ల జాబితాను కమిటీ ఈరోజు ట్రస్ట్‌కు సమర్పించనుంది. తిరుమల తరహాలో ఆలయ నిర్వహణ కోసం తీసుకున్న ఈ కీలక నిర్ణయ వివరాలు ఇక్కడ చదవండి.
పాకిస్థాన్‌లోని నారోవాల్‌లో 125 ఏళ్ల నాటి చారిత్రక హిందూ దేవాలయాన్ని రాత్రికి రాత్రే కూల్చివేశారు. ఈ ఘోరంపై స్థానిక హిందూ సంఘాల ఆగ్రహం, ఆందోళనల వివరాలు ఇక్కడ చదవండి.
టీటీడీ వేదపారాయణదారుల ఎంపిక ప్రక్రియ తీవ్ర వివాదాస్పదంగా మారింది. తెలంగాణ అభ్యర్థులకు స్థానికత అడ్డంకిగా మారడం, అర్హత మార్కులను 85 నుండి 40కి తగ్గించడంపై వేదపండితులు ఆరోపణలు గుప్పిస్తున్నారు. ఈ నియామకాల వెనుక ఉన్న పూర్తి వివరాలు, వివాద కారణాలు ఇక్కడ చూడండి.
2026 ఆగస్టు 29 రాశి ఫలాలు, టారో కార్డుల విశ్లేషణ మరియు వాస్తు చిట్కాలు ఇక్కడ తెలుసుకోండి. మేషం నుండి మీనం వరకు ద్వాదశ రాశుల ఉద్యోగం, ఆరోగ్యం, ఆర్థిక పరిస్థితి మరియు సరైన వాస్తు నివారణల సమగ్ర వివరాలు!
పశ్చిమ బెంగాల్ దుర్గాపూజ పండళ్ల లోపల మాంసాహారం నిషేధించాలని విశ్వహిందూ పరిషత్ డిమాండ్ చేసింది. 5 రోజుల ఉత్సవాల్లో సనాతన సంప్రదాయాలు పాటించాలని 600 పూజా కమిటీలకు వీహెచ్‌పీ చేసిన ప్రతిపాదనల వివరాలు.
రక్షాబంధన్ రోజున రాఖీ దారం తెగిపోవడం అశుభమా కాదా అనే సందేహాలకు వేద పండితుల సమాధానం తెలుసుకోండి. తెగిపోయిన రాఖీ వల్ల కలిగే ప్రయోజనాలు, పాటించాల్సిన నియమాలు మరియు 2026 రాఖీ శుభ ముహూర్తాల వివరాలు.
తిరుమలలో పౌర్ణమి మరియు గరుడ సేవ సందర్భంగా భక్తులు పోటెత్తారు. శ్రీవారి సర్వదర్శనానికి 24 గంటల సమయం పడుతుండగా, ఒక్కరోజే 66,437 మంది దర్శించుకోగా రూ. 4.45 కోట్ల హుండీ ఆదాయం లభించింది.
తిరుపతి ఫారెస్ట్ డివిజన్ అధికారులు అత్యంత అరుదైన 3 రోజ్-రింగ్డ్ ప్యారాకీట్స్ (రామచిలుకలను) సమర్థవంతంగా రక్షించారు. ప్రాథమిక చికిత్స అనంతరం వాటిని తిరిగి అడవిలోకి విడుదల చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. పూర్తి వివరాలు చదవండి.
శ్రావణ పౌర్ణమి నాడు జరుపుకునే హయగ్రీవ జయంతి విశిష్టత, శ్రీమహావిష్ణువు హయగ్రీవ అవతారం ఎత్తడానికి గల ఆధ్యాత్మిక కథ మరియు విద్యార్థులకు జ్ఞానాన్ని ప్రసాదించే హయగ్రీవ పూజా విధానం గురించి వివరంగా తెలుసుకోండి.
చంద్ర గ్రహణ సమయంలో ఆధ్యాత్మిక రక్షణ మరియు మానసిక ప్రశాంతత పొందేందుకు పాటించాల్సిన సూతక కాల నియమాలు, మంత్ర జపం, గర్భవతుల జాగ్రత్తలు మరియు గ్రహణానంతర శుద్ధి, దానాల విశిష్టతలను వివరంగా తెలుసుకోండి.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.