Publish Date:Dec 25, 2024
అల్లు అర్జున్ తన సినీమాలు వరుస విజయాలు అందుకుంటుండటంతో ఆయన యాటిట్యూడ్ మారిందన్న విమర్శలు గత కొంత కాలంగా వినిపిస్తూనే ఉన్నాయి. అయితే.. ఆంధ్రప్రదేశ్ లో అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఆయన నంద్యాలలో వైసీపీ అభ్యర్థికి మద్దతుగా ప్రచారం చేయడం మాత్రం పెను వివాదానికి దారి తీసింది. అప్పటి వరకూ కలిసిమెలిసి ఉన్న అల్లు, మెగా కుటుంబాల మధ్య వివాదాలకు, విభేదాలకు అది కారణమైందన్న వాదనా ఉంది. మొత్తం మీద అల్లు అర్జున్ నంద్యాల ప్రచారం తరువాత నుంచి అల్లు, మెగా అభిమానుల మధ్య వైరం ప్రస్ఫుటంగా తెరమీదకు వచ్చింది. మెగా అభిమానులు అల్లు అర్జున్ కు దూరం అయ్యారు. ఆ ప్రచారం పుష్ప2పై తీవ్ర ప్రభావం చూపుతుందన్న అనుమానాలు కూడా అప్పట్లో వ్యక్తం అయ్యాయి. సినిమాపై ప్రభావం సంగతి పక్కన పెడితే ఆయన అసెంబ్లీ ఎన్నికల సమయంలో వైసీపీ అభ్యర్థికి మద్దతుగా నంద్యాలలో ప్రచారం చేసిన నాటి నుంచి అల్లు అర్జున్ కు బ్యాడ్ టైమ్ స్టార్ట్ అయ్యిందని చెప్పొచ్చు.
ఇక అప్పుడు పుష్ప2 బెనిఫిట్ షో లేదా ప్రీమియర్ షో సందర్భంగా సంధ్యా థియేటర్ వద్ద తొక్కిసలాట సంఘటనను వైసీపీ తనకు అంది వచ్చిన అవకాశంగా భావించి అల్లు అర్జున్ కు బాసటగా నిలిచింది. అల్లు అర్జున్ అరెస్టును ఖండిస్తూ వైసీపీ అధినేత జగన్ కూడా స్పందించారు. అల్లు అర్జున్ కు సంఘీభావం తెలుపుతూ ఎక్స్ వేదికగా పోస్టు చేశారు. దీనిని ఆంధ్రప్రదేశ్ లో మెగా ఫ్యామిలీ పరపతిని తగ్గించేందుకు, అలాగే కాపు ఓటు బ్యాంకులో చీలిక తెచ్చి తనకు అనుకూలంగా మలచుకునేందుకు వైసీపీ నానా ప్రయత్నాలూ చేసింది. వైసీపీ సోషల్ మీడియా, ఆ పార్టీ అనుకూల, సొంత మీడియా కూడా అల్లు అర్జున్ కు మద్దతుగా కథనాలు వండి వార్చింది. అల్లు అర్జున్ అరెస్టు వెనుక మెగా రాజకీయం ఉందన్న భావాన్ని ప్రజలలో నటేందుకు ప్రయత్నాలు చేసింది.
మరో వైపు తెలంగాణలో అధికారానికి దూరమై అసహనంతో ఉన్న బీఆర్ఎస్ కూడా అల్లు అర్జున్ అరెస్టు అంశాన్ని తనకు రాజకీయంగా ప్రయోజనం చేకూర్చే అంశంగానే భావించి రాష్ట్రంలోని కాంగ్రెస్ సర్కార్ కు వ్యతిరేకంగా పెద్ద పెద్ద ఆరోపణలనే గుప్పించింది. బీఆర్ఎస్ ట్రాప్ లో అల్లు అర్జున్ పడ్డారా అన్న అనుమానం కలిగే విధంగా అల్లు అర్జున్ కూడా ప్రెస్ మీట్ లో సంధ్యా ధియోటర్ తొక్కిసలాటకు కారణం జనాలను నియంత్రించడంలో పోలీసుల వైఫల్యమే కారణం అన్నట్లుగా మాట్లాడారు. అయితే పోలీసులు అల్లు అర్జున్ రోడ్ షో వీడియోలను విడుదల చేయడంతో ఆయన నేల మీదకు రాక తప్పని పరిస్థితి ఏర్పడింది. పోలీసుల విచారణలో ఆయన తన తప్పు ఒప్పుకున్నారనీ, సారీ చెప్పారనీ వార్తలు వినవస్తున్నాయి. అదంతా పక్కన పెడితే.. ఈ మొత్తం ఎపిసోడ్ లో వైసీపీ అత్యుత్సాహం ఆ పార్టీని ప్రజలలో మరింత పలుచన చేసింది.
ఎందుకంటే అల్లు అర్జున్ అరెస్టై విడుదలైన తరువాత మీడియాతో మాట్లాడిన ఏ సందర్భంలోనూ ఆయన జగన్ ప్రస్తావన కానీ, వైసీపీ ప్రస్తావన కానీ తీసుకురాలేదు. అంతే కాకుండా అల్లు అర్జున్ స్వయంగా చిరంజీవి నివాసానికి, నాగబాబు ఇంటికి వెళ్లి మరీ తనకు మద్దతుగా నిలిచినందుకు కృతజ్ణతలు తెలిపి వచ్చారు. దీనిని బట్టే తన నంద్యాల ప్రచారం తొందరపాటేనని అల్లు అర్జున్ పరోక్షంగా అంగీకరించినట్లైంది. అల్లు అర్జున్, మెగా ఫ్యామిలీతో మరింత కలివిడిగా ఉండేందుకే ప్రయత్నిస్తున్నారన్న విషయాన్ని తేటతెల్లం చేసింది. దీంతో జగన్ పార్టీ అత్యుత్సాహం మీద అల్లు అర్జున్ నీళ్లు చల్లినట్లైంది.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/allu-arjun-learned-lesson-39-190305.html
టీవీకే అధినేత విజయ్‌కు కాంగ్రెస్ మద్దతు తెలపడంపై ఆగ్రహంగా ఉన్న డీఎంకే.. కాంగ్రెస్‌కు కటీఫ్ చెప్పేసింది. మారిన రాజకీయ పరిస్థితుల దృష్ట్యా, లోక్‌సభలో తమ పార్టీ సభ్యులకు కాంగ్రెస్ ఎంపీలతో కాకుండా విడిగా సీటింగ్ కేటాయించాలని డీఎంకే ఎంపీ కనిమొళి స్పీకర్ ఓం బిర్లాకు లేఖ రాశారు.
తాజా సమాచారం ప్రకారం.. విజయ్ తన పార్టీకి ఉన్న బలానికి తోడుగా మరో మూడు పార్టీల మద్దతును కూడగట్టుకున్నారు. ఆ పార్టీల మద్దతుతో అధికారం చేపట్టడానికి అవసరమైన మ్యాజిక్ ఫిగర్ 118ని ఆయన సాధించారు.
తమిళనాడులో ఇటీవల జరిగిన ఎన్నికల తర్వాత, విజయ్ నేతృత్వంలోని టీవీకే పార్టీ ప్రభుత్వ ఏర్పాటుకు సిద్ధమవ్వగా.. మెజారిటీ నిరూపణ విషయంలో రాజేంద్ర విశ్వనాథ్ అర్లేకర్ కచ్చితమైన నిబంధనలు పాటించాలని పట్టుబడుతున్నారు. విజయ్ కు తన పార్టీ ఎమ్మెల్యేలు 107 మందికి అదనంగా కాంగ్రెస్ నుంచి గెలిచిన ఐదుగురు ఎమ్మెల్యేల మద్దతు కూడా ఉంది.
పదవి నుంచి తొలగించిన అనంతరం ఎస్వీఎస్ఎన్ వర్మ తీవ్ర భావోద్వేగానికి లోనయ్యారు. పార్టీ తీసుకున్న ఈ నిర్ణయం తనకు ముందే తెలుసని, నాయకత్వం నుంచి సమాచారం అందిందని చెప్పారు. అయితే పార్టీ కోసం ఎన్నో ఏళ్లుగా కష్టపడి.. క్షేత్రస్థాయిలో కేడర్‌ను కాపాడుకుంటూ వచ్చిన తనకు ఈ పరిణామం మనస్తాపానికి గురిచేసిందన్న ఆవేదన కూడా వ్యక్తం చేశారు.
బాబు కూటమిని ఎందుకంత విలువైనదిగా భావిస్తున్నారంటే.. కారణం వైసీపీ. ఆ పార్టీ కూటమి ఎప్పుడెప్పుడు చీలిపోతుందాని కాచుకుని కూర్చుని ఉంది. ఏ అవకాశం వచ్చినా వారు వదిలిపెట్టినట్టే కనిపించదు. మొన్న కోట వినుత ఘటన, నిన్న అరవ శ్రీధర్ వ్యవహారం, ఇవాళ వర్మ ఇష్యూ.. ఇలా సమయం దొరికినపుడల్లా ఆయా అంశాలను బాగా హైలెట్ చేసి.. కూటమిలో ఏదో ఒక చిచ్చు రాజేయాలని చూస్తోంది వైసీపీ అధినాయకత్వం.
అతి కొద్ది మంది నేతలు జగన్ ప్రకటనను సమర్దిస్తూ.. అనుకూల ప్రకటనలు చేస్తుండగా.. మెజారిటీ లీడర్, క్యాడర్ మాత్రం జగన్ నిర్ణయంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.
తెలుగువన్ వాస్తవ వేదికలో ప్రస్తుత జాతీయ, ప్రాంతీయ రాజకీయ పరిస్థితులపై విస్తృత చర్చ జరిగింది.
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఆ రాష్ట్ర రాజకీయాల్లో పెను సంచలనాన్ని సృష్టించాయి.
టీవీకే అధినేత విజయ్‌తో భేటీ అనంతరం రాజ్ భవన్ ఒక అధికారిక ప్రెస్ నోట్ విడుదల చేసింది. అసెంబ్లీలో ప్రభుత్వం ఏర్పాటు చేయాలంటే ఉండాల్సిన సంఖ్యాబలంపై గవర్నర్.. విజయ్‌కు మార్గనిర్దేశం చేశారు. కేవలం అతిపెద్ద పార్టీగా ఉండటమే కాకుండా, సభలో తగినంత మంది ఎమ్మెల్యేల మద్దతు ఉన్నట్లు ఆధారాలు చూపాలని సూచించారు.
పిఠాపురంలో ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలో చంద్రబాబు ఫొటోలేదని ఆరోపిస్తూ.. మాజీ ఎమ్మెల్యే వర్మ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ క్రమంలో జనసేన నేత, మాజీ ఎమ్మెల్యే దొరబాబు జోక్యం చేసుకోవడంతో వాగ్వాదం చోటు చేసుకుంది. వర్మ దురుసు వ్యాఖ్యలపై పార్టీలో అంతర్గతంగా చర్చించిన అధిష్టానం.. వర్మ వ్యవహారాన్ని తప్పుబట్టింది. ఇంతలోనే వర్మను ఇంచార్జ్ పదవి నుంచి తొలగించడం చర్చనీయాంశంగా మారింది.
రాష్ట్రంలో కొత్త ప్రభుత్వ ఏర్పాటుకు డీఎంకే ఏ విధంగానూ అడ్డుపడబోదన్నారు. రాష్ట్రంలో మరోసారి ఎన్నికలు రావాలని గానీ, రాజ్యాంగ సంక్షోభం తలెత్తాలనీ కానీ తాము కోరుకోవడం లేదన్నఆయన.. ప్రజాతీర్పునకు అనుగుణంగానే డీఎంకే నడుచుకుంటున్నదన్నారు.
గతంలో విజయ్‌కు ఉన్న ప్రాణహాని హెచ్చరికలు.. ఆయన పాపులారిటీని దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం సాయుధ పోలీసులతో కూడిన భద్రతను ఏర్పాటు చేసింది. అయితే.. తాజాగా నిర్వహించిన భద్రతా సమీక్షలో భాగంగా ఆయనకు ఇకపై అదనపు సెక్యూరిటీ అవసరం లేదని అధికారులు భావించినట్లు తెలుస్తోంది.
తాజా ఎన్నికల ఫలితాల్లో నటుడు విజయ్ నేతృత్వంలోని తమిళగ వెట్రి కళగం (టీవీకే) 108 స్థానాలతో సింగిల్ లార్జెస్ట్ పార్టీగా అవతరించిన సంగతి తెలిసిందే. అయితే.. ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన 118 మంది ఎమ్మెల్యేల మద్దతు ఆ పార్టీకి ఇంకా లభించలేదు. కాంగ్రెస్‌తో కలిపి విజయ్ బలం ప్రస్తుతం 112కు చేరినప్పటికీ.. మేజిక్ ఫిగర్‌కు ఇంకా ఆరు అడుగుల దూరంలో ఉంది.