అల్లు అర్జున్ నంద్యాల పర్యటన రచ్చకు బాలయ్య ఫుల్ స్టాప్!?

Publish Date:Oct 29, 2024

Advertisement

నందమూరి బాల కృష్ణ తాను హోస్ట్ చేస్తున్న అన్ స్టాపబుల్ షో ద్వారా అల్లు అర్జున్ నంద్యాల పర్యటన రేపిన రచ్చకు ఫుల్ స్టాప్ పేట్టేశారా? అంటే పరిశీలకులు ఔననే అంటున్నారు. అన్ స్టాపబుల్ విత్ బాలయ్య షో ద్వారా బాలకృష్ణ ఇప్పటికే మూడు సీజన్ లు సక్సెస్ ఫుల్ గా పూర్తి చేశారు. ఇప్పుడు నాలుగో సీజన్ గత సీజన్లకు మించి అన్నట్లుగా సాగుతోంది. ప్రతి శుక్రవారం ఆహా లో ప్రసారమౌతున్న ఈ అన్ స్టాపబుల్ షో సీజన్ ఫోర్ తొలి ఎపిసోడ్ కు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గెస్ట్ గా వచ్చిన సంగతి తెలిసిందే. ఆ షో అంచనాలకు మించి విజయవంతమైంది.

ఇప్పుడు నాలుగో సీజన్ తరువాతి ఎపిసోడ్లకు గెస్ట్ లుగా ఎవరు వస్తారు అన్న ఆసక్తి సర్వత్రా వ్యక్తం అవుతోంది. తాజాగా ఈ షోలో పుష్ప 2 మూవీ ప్రమోషన్లలో భాగంగా అల్లు అర్జున్  పాల్గొననున్నారు. డిసెంబర్ 5న పుష్ప 2 రిలీజ్ అవుతుంది. అంతకు ముంది అన్ స్టాపబుల్ విత్ బాలయ్య షోలో అల్లు అర్జున్ సందడి చేయనున్నారు. ఇటీవలే అన్ స్టాపబుల్ ఫోలో అల్లు అర్జున్ తో ఎపిసోడ్ కు సంబంధించిన షూట్ కూడా జరిగింది.  

దీంతో  ఈ ఎపిసోడ్ లో బాలకృష్ణ కచ్చితంగా అల్లు అర్జున్ నంద్యాల పర్యటనపై ముప్పిరిగొన్న వివాదంపై ప్రశ్నలు సంధించడం ఖాయమని అంతా భావిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ ఎన్నికల సమయంలో అల్లు అర్జున్ నంద్యాల వెళ్లి ఆ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి వైసీపీ అభ్యర్థిగా పోటీలో ఉన్న శిల్పా రవిచంద్రకిషోర్ కు ఓటు వేయాలని పిలుపు నిచ్చిన సంగతి తెలిసిందే. అప్పట్లో అల్లు అర్జున్ వైసీపీ అభ్యర్థికి మద్దతు పలకడం మెగా అభిమానులకు తీవ్ర ఆగ్రహం తెప్పించిన సంగతి తెలిసిందే. ఒక వైపు పవన్ కల్యాణ్ వైసీపీకి వ్యతిరేకంగా కూటమి తరఫున బరిలో ఉన్నారు. అటువంటి సమయంలో వైసీపీ అభ్యర్థిగా మద్దతుగా అల్లు అర్జున్ మాట్లాడటంతో మెగా, అల్లు ఫ్యామిలీల మధ్య రిలేషన్స్ బాగా లేవా అన్న ప్రచారం కూడా జరిగింది. అది ఇప్పటికీ అలాగే ఉంది. బాలయ్య తన అన్ స్టాపబుల్ షో ద్వారా  ఆ వివాదానికి ఫుల్ స్టాప్ పెట్టే అవకాశాలున్నాయని అంటున్నారు. ఇటు అల్లు అర్జున్ కూడా  తాను నంద్యాల ఎందుకు వెళ్లాల్సి వచ్చిందో, తన ఉద్దేశమేంటో అల్లు అర్జున్ క్లారిటీ  చెప్పే అవకాశం ఉంది. ఈ ఎపిసోడ్ ప్రసారం తరువాత అల్లు అర్జున్ నంద్యాల పర్యటన వివాదానికి ఫుల్ స్టాప్ పడే అవకాశాలు మెండుగా ఉన్నాయని అటు బన్నీ అభిమానులు, ఇటు మెగా అభిమానులూ కూడా భావిస్తున్నారు. 

By
en-us Political News

  
ర్నాబ్ తుపానుతో అతలాకుతలమైన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తుపాను ప్రభావిత ప్రాంతాలలో విద్యుత్ సరఫరాను సత్వరమే పునరుద్ధరించడానికి తమిళనాడు సహాయాన్ని కోరింది. ఈ మేరకు మంత్రి గొట్టిపాటి రవికుమార్ తమిళనాడు ప్రభుత్వాన్ని  రాష్ట్రంలో తుపాను ప్రభావిత ప్రాంతాలలో విద్యుత్ పునరుద్ధరణ  వేగవంతం చేయడానికి  అదనపు విద్యుత్ శాఖ సిబ్బందిని, పరికరాలను కోరారు.
సాధారణంగా వైసీపీ ఎకో సిస్టమ్ ఎలా ఉంటుందంటే.. ఎవరైనా సరే  ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడిని , ఆయన పాలనా విధానాలను పొగిడితే వెంటనే ఆ పొగిడిన వారిపై విమర్శలు గుప్పించేస్తుంది. ఇందుకు గతంలో చాలా చాలా ఉదాహరణలు ఉన్నాయి.
పులివెందుల మునిసిపోల్ రణరంగంగా మారే అవకాశం ఉందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. గత అనుభవాలను దృష్టిలో ఉంచుకుని పోలీసులూ అప్రమత్తమయ్యారు. ఎలాంటి హింసాత్మక ఘటనలకూ తావులేకుండా భారీ బందోబస్తు ఏర్పాట్లు చేశారు. అవసరమైతే  ఇటు తెలుగుదేశం కూటమి, అటు వైసీపీకి చెందిన ముఖ్య నేతలను హౌస్ అరెస్టు చేసేందుకైనా వెనుకాడబోమని పోలీసులు విస్పష్ట హెచ్చరికలు జారీ చేశారు.
గతంలో రాష్ట్ర రాజకీయాలలో  కొండా సురేఖ కేటీఆర్ పై చేసిన వ్యక్తిగత విమర్శలు  దుమారం రేపిన సంగతి తెలిసిందే. ఇప్పుడు ఆ వ్యాఖ్యలకు బేషరతుగా క్షమాపణ చెప్పిన కొండా సురేఖ వాటిని ఉపసంహరించుకున్నారు.   గతంలో కేటీఆర్ పై తాను చేసిన అనుచిత వ్యాఖ్యలను  పూర్తిగా వెనక్కి తీసుకుంటున్నట్లు సోషల్ మీడియా వేదికగా  పేర్కొన్నారు. 
తెలంగాణ రాజకీయాలలో ఏ పార్టీతోనూ పొత్తు లేదు లేదంటూనే జనసేనతో పొత్తుకు తహతహలాడుతోంది. తెలంగాణలో స్వంతంగానే బరిలోకి దిగుతామని కుండబద్దలు కొట్టిన బీజేపీ ఇప్పుడు జనసేనతో అంతర్గత పొత్తు కుదుర్చుకుందన్న ప్రచారం జోరుగా సాగుతోంది. 
నియోజకవర్గంలో రాబోయే మున్సిపల్ చైర్మన్ ఎన్నికలను తెలుగుదేశం కూటమి గెలుచుకుంటుందన్న ధీమా వ్యక్తం చేశారు. వైసీపీకి పులివెందుల ఇంకెంత మాత్రం కంచుకోట కాదని విస్పష్టంగా పేర్కొన్నారు.  దశాబ్దాలుగా తిరుగులేని ఆధిపత్యం చెలాయిస్తున్న పులివెందులలో కూటమి నేతలు నేరుగా సవాళ్లు విసురుతుండటం పులివెందులలో మసకబారిన వైసీపీ ప్రతిష్ఠకు, పలుకుబడికి నిదర్శనంగా పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. 
అయితే, ప్రస్తుతం సిద్ధమవుతున్న చార్జ్‌షీట్‌ను మరింత పటిష్టంగా రూపొందించేందుకు ఉన్నతాధికారులు ఢిల్లీలోని ప్రముఖ సుప్రీంకోర్టు న్యాయవాదులతో సంప్రదింపులు జరిపినట్లు తెలుస్తోంది. సాంకేతిక సాక్ష్యాలు, బాధితుల వాంగ్మూలాల ఆధారంగా ఈ అదనపు చార్జిషీట్ ను సిద్ధం చేస్తున్నట్లు సమాచారం.
విపత్కర సమయంలో తెలుగు రాష్ట్రాల ఐక్యత.. ఏపీకి సాయం.!
హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్ నివాసంలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిని శ్రీ కృష్ణ సదర్ సమ్మేళనం ఉత్సవ కమిటీ ప్రతినిధులు మర్యాదపూర్వకంగా కలిశారు.
ఒక్కోసారి చిన్న ప్రయత్నం కూడా ఊహించని విధంగా జీవితాన్ని మార్చేస్తుందనడానికి నిదర్శనంగా నిలిచింది ఒక ఉదంతం.
ఆంధ్రప్రదేశ్‌ను వణికించిన అర్నబ్ తుఫాను ప్రభావంతో పంటలు, ఇళ్లు, రహదారులు, విద్యుత్ వ్యవస్థలకు నష్టం వాటిల్లింది.
ప్రకృతి వైపరీత్యాలు సంభవించిన క్లిష్ట పరిస్థితుల్లోనూ ఏ మాత్రం వెనకడుగు వేయకుండా, ప్రాణాలను సైతం లెక్కచేయకుండా విద్యుత్ శాఖ సిబ్బంది సేవలందిస్తున్న తీరు ఎంతో స్ఫూర్తిదాయకమని
స్థానిక  సన్నాహాలపై తెలుగుదేశం కూటమికి చెందిన దాదాపు 45 వేల మంది ముఖ్య నేతలు, ప్రజాప్రతినిధులు,  కార్యకర్తలతో  సీఎం చంద్రబాబు ఈ టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన వైసీపీపై చంద్ర నిప్పులు చెరిగారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.