బీఆర్ఎస్ తో పొత్తుకు సై.. బట్ కండీషన్స్ అప్లై!

Publish Date:Apr 28, 2023

Advertisement

దేశంలో ఒకప్పుడు ప్రధాన ప్రతిపక్ష పార్టీగా ఉన్న, అవిభక్త భారత కమ్యూనిస్ట్ పార్టీ (సిపిఐ) ఆ తర్వాత ఎన్ని చీలికలు పేలికలుగా విడిపోయినా 2004 వరకు సిపిఐ, సిపిఎం పార్టీలు, అలాగే ఫార్వార్డ్ బ్లాక్ వంటిమరో ఒకటి రెండు లెఫ్ట్ పార్టీలు చట్టసభల్లో తమ గళాన్ని గట్టిగానే వినిపించాయి. 2004లోక్ సభ ఎన్నికల్లో వామపక్ష కూటమి 62 సీట్లు గెలుచుకుంది. అయితే, హిందూ మతోన్మాద బీజేపీని అడ్డుకునేందుకు కాంగ్రెస్ సారథ్యంలోని యూపీఏ ప్రభుత్వానికి బయటి నుంచి మద్దతు ఇచ్చి, ఆ తర్వాత అమెరికాతో యూపీఏ ప్రభుత్వం అణు ఒప్పందం కుదుర్చుకోవడాన్ని వ్యతిరేకిస్తూ  మన్మోహన్ సింగ్  ప్రభుత్వానికి మద్దతు ఉప సంహరించుకుంది. ఇక అక్కడి నుంచి భారత కమ్యూనిస్ట్ పార్టీల కథ కంచి యాత్ర, అంటే ముగింపు ప్రస్థానం  మొదలైంది. ప్రస్తుత లోక్ సభలో ఉభయ కమ్యూనిస్ట్ పార్టీలకు కలిపి కేవలం ఐదుగురు సభ్యులు మాత్రమే ఉన్నారు.

పార్లమెంట్ లోనే కాదు రాష్ట్రాలలోనూ ఎర్ర జెండా వెలుగు తగ్గింది. చివరకు 30 ఏళ్లకు పైగా వామపక్ష కూటమి పాలించిన  పశ్చిమ బెంగాల్లో ఇంచేమించుగా అంతే కాలం అధికారంలో ఉన్న త్రిపురలోనూ కమ్యూనిస్ట్ పార్టీలు వరస ఓటములతో ఉనికిని కోల్పోయాయి. మూడు దశాబ్దాలకు  పైగా తిరుగులేని శక్తిగా నిలిచిన పశ్చిమ బెంగాల్ లో అయితే ఎర్రజెండాకు అసెంబ్లీలో ఎంట్రీయే లేకుండా పోయింది. కనీసం సింగిల్.  కేరళలో అధికారంలో ఉన్నా, లోక్ సభ  ఎన్నికల్లో కేరళ నుంచి ఒకరిద్దరు మాత్రమే గెలిచారు. 

నిజానికి పశ్చిమ బెంగాల్, త్రిపుర, కేరళ రాష్ట్రాల తర్వాత కమ్యూనిస్ట్ పార్టీలకు మంచి పట్టున్న రాష్త్రం అవిభక్త ఆంధ్ర ప్రదేశ్.అందులోనూ తెలంగాణలో కమ్యూనిస్ట్ పార్టీలు ప్రధాన రాజకీయ పార్టీలలో ఒకటిగా చెలామణి అవుతూ వచ్చాయి.  రాష్ట్ర విభజన తర్వాత కూడా ఇప్పటికీ  తెలంగాణలో కమ్యూనిస్ట్ పార్టీలకు కొంత ఓటు బ్యాంకు ఇంకా మిగిలేవుంది. ముఖ్యంగా ఖమ్మం, నల్గొండ ఉమ్మడి జిల్లాలో సిపిఐ,సిపిఎం పార్టీలకు కొంత పట్టుంది. అయితే ఎంత పట్టున్నా సొంతంగా పోటీ చేసి, కనీసం ఒకటి రెండు సీట్లు అయినా గెలుచుకునే పరిస్థితి మాత్రం లేదు. 2018 ఎన్నికల్లో కాంగ్రెస్, టీడీపీ సారథ్యంలో ఏర్పడిన  మహాకూటమిలో సిపిఐ భాగస్వామ్య పార్టీగా ఉన్నా ఒక్క సీటు కూడా గెలుచుకోలేక పోయింది. అలాగే  ప్రజాసంఘాల ఐక్య వేదికను ఏర్పాటు చేసి సుదీర్ఘ పోరాటం చేసిన సిపిఎంకు చివరకు పోరాటమే మిగిలింది  ఫలితం మాత్రం దక్కలేదు. 

ఈ నేపధ్యంలోనే  ఉభయ కమ్యూనిస్ట్ పార్టీలూ మునుగోడు ఉప ఎన్నిక సమయంలో ముఖ్యమంత్రి కేసిఆర్ పిలుపునందుకుని బీఆర్ఎస్ తో చేతులు కలిపాయి.  గులాబీ పార్టీ అభ్యర్ధికి మద్దతు నిచ్చాయి. బీఆర్ఎస్ అభ్యర్ధి కూసుకుంట్ల ప్రభాకర రెడ్డి కేవలం పది వేల ఓట్ల మెజారిటీతో గెలిచారు. ఇక అక్కడి నుంచి ఉభయ కమ్యూనిస్ట్ పార్టీలు ఎర్ర కాలర్ ఎగరేయడం మొదలు పెట్టాయి. మునుగోడు ఉప ఎన్నికలో గెలిచించి బీఆర్ఎస్ అయినా  కూసుకుంట్లను గెలిపించింది తామేనని ఉభయ కమ్యూనిస్ట్ పార్టీలు ప్రచారం చేసుకుంటున్నాయి. అంతే కాదు, బీఆర్ఎస్ పార్టీకి ముఖ్యమంత్రి కేసేఆర్ కు మాతో  పొత్తు కావాలంటే.. అంటూ షరతులు విధిస్తున్నాయి. రౌతు మెత్తనైతే గుర్రం మూడు కాళ్ళ మీద పరిగెత్తుతుందనే సామెతను గుర్తు చేస్తూ  బీఆర్ఎస్ బలహీనతను ఆసరాగా చేసుకుని ఉభయ కమ్యూనిస్ట్ పార్టీలు రానున్న ఎన్నికల్లో సీపీఎం, సీపీఐ కలిసి పోటీ చేస్తాయి. బీఆర్ఎస్ తో కలిసి పనిచేసే యోచనలో ఉన్నాం. మా బలానికి తగినట్లు సీట్లు ఇవ్వాలని అడుగుతాం. ఇవ్వకపోతే విడిగా పోటీ చేస్తాంఅని ముఖ్యమంత్రి కేసీఆర్  కు సిపిఎం నేత తమ్మినేని అల్టిమేటం జారీ చేశారు. అలాగే కేంద్రంలో బీజేపీని ఓడించే శక్తి కాంగ్రెస్ కు  ఉందని భావిస్తే, ఆ పార్టీతో కూడా సీట్ల సర్దుబాటు చేసుకుంటామని ఆయన చెప్పారు.

అయితే, బీఆర్ఎస్ నాయకులు మాత్రం ఉభయ కమ్యూనిస్ట్ పార్టీలు లేని బలాన్ని ఉహించుకుని ఎగిరెగిరి పడుతున్నాయని, అంటున్నారు. కుక్క తోక ను ఊపితే ఓకే, కానీ, తోక కుక్కను ఉపాలనుకుంటే అస్సలు బావోదు.. అనే అర్థం వచ్చేలా బీఆర్ఎస్ నాయకులు కమ్యూనిస్ట్ నాయకుల సమక్షంలోనే సరదాగా చురకలేస్తున్నారు. అదలా ఉంటే కమ్యూనిస్టులతో పొత్తు విషయంలో ముఖ్యమంత్రి సైలెంట్ గా ఉన్నారు. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్, కమ్యూనిస్ట్ పార్టీల మధ్య  పొత్తు ఉంటుందా ? ఉంటే ఎన్ని సీట్లకు పరిమితం చేస్తారు?  కామ్రేడ్ల ఆలోచనేంటి?  కామ్రేడ్ల ముందు కేసీఆర్ సరికొత్త ప్రతిపాదన పెట్టనున్నారా? వంటి పలు అంశాలు మళ్లీ తెరపైకి వస్తున్నాయి.

By
en-us Political News

  
మహిళా సాధికారతకు పెద్దపీట వేస్తూ ప్రవేశపెట్టిన పథకాలు దేశంలో విప్లవాత్మక మార్పులు తెచ్చాయన్న చంద్రబాబు , భారతదేశాన్ని గ్లోబల్ లీడర్‌గా నిలపడంలో ప్రధాని మోదీ దార్శనికత  కీలకమని చంద్రబాబు అన్నారు.
తాజాగా తృణమూల్ లోని మమతా వర్గం, రితబ్రత వర్గాలకు చెందిన కీలక నాయకులు  ఢిల్లీలో  భారత ఎన్నికల సంఘం (ఈసీఐ) ఫుల్ బెంచ్ ఎదుట హాజరై తమ వాదనలను బలంగా వినిపించారు. ఇరువర్గాలు కూడా ఈసీఐ విచారణ ముగిసిన తర్వాత తమ వాదనలకే అనుకూలంగా తుది తీర్పు వస్తుందని ధీమా వ్యక్తం చేయడం రాజకీయ వర్గాల్లో ఈ వ్యవహారంపై మరింత  ఆసక్తిని రేకెత్తించింది. 
ఒకనాడు ప్రత్యర్థుల విమర్శల దాడులను చిటికెలో   చిత్తు చేసే నేర్పు ఉన్న నేతగా నిలిచిన హరీష్ రావు.. ఇప్పుడు ఆత్మరక్షణలో పడినట్లు కనిపిస్తున్నదని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  
ఉపాధ్యాయ పోస్టుల భర్తీ ప్రక్రియలో అవకతవకలు జరిగాయంటూ వైసీపీ ఆరోపణలు గుప్పిస్తోంది. అధికారంలో ఉన్న తెలుగుదేశం కూటమి ప్రభుత్వం అనుసరిస్తున్న పద్ధతులను ప్రశ్నిస్తూ, సోషల్ మీడియా,  మీడియా సమావేశాల ద్వారా విమర్శలు గుప్పిస్తోంది. డీఎస్సీ నియామకాల్లో పారదర్శకత లోపించిందని, అభ్యర్థుల మార్కులు  పరిశీలనా ప్రక్రియలో గందరగోళం నెలకొందని ఆరోపిస్తున్నది.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇటీవల అసెంబ్లీ వేదికగా మాజీ సీఎం కేసీఆర్ కుటుంబ సభ్యుల భూ ఆక్రమణలంటూ చేసిన సంచలన వ్యాఖ్యలు పవర్ పాయింట్ ప్రెజెంటేషన్‌పై గులాబీ పార్టీ  మండిపడింది. ప్రభుత్వ వైఫ్యాలను కప్పిపుచ్చుకునేందుకే కాంగ్రెస్ పెద్దలు ఇలాంటి నిరాధార ఆరోపణలు చేస్తున్నారని  ఎదురుదాడికి దిగింది.
మైగ్రేన్ తలనొప్పితో ఆసుపత్రికి వెళ్లిన బెక్కీ జోన్స్‌కు బ్రెయిన్ క్యాన్సర్ ఉందంటూ 11 ఏళ్ల పాటు కీమోథెరపీ ఇచ్చారు. కానీ చివరికి అసలు క్యాన్సరే లేదని తెలిసిన షాకింగ్ వివరాలు ఈ వెబ్ స్టోరీలో చదవండి.
పట్టభద్రుల ఎన్నికలకు ఓటర్ల జాబితా ప్రక్రియ షెడ్యూల్ విడుదల.. !
చాలా మంది 1973 నాటి భూమి పరిమితి చట్టం రద్దయిందని అనుకుంటున్నారు. కానీ అది అమలులోనే వుంది. ఉమ్మడి కుటుంబానికి మెట్ట భూమి 52 ఎకరాలు, కొన్ని ప్రత్యేక సందర్భాల్లో 54 ఎకరాలు ఉండవచ్చు. తరి భూమి (ఏడాదికి రెండు పంటలు పండేది) 27 ఎకరాలు వుండవచ్చు. అంతకంటే ఎక్కువగా ఉంటే దాన్ని ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాల్సి వుంటుంది.
వారణాసి వేదికగా నెల రోజుల పాటు జరగనున్న  సేవా సంకల్ప అభియాన్ లో  తొలి రోజు గురువారం ఆంధ్రప్రదేశ్ సీఎం నారా చంద్రబాబు పాల్గొన్నారు. అలాగే ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్, రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ సహా  పాటు పలువురు అగ్రనేతలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.  
మోడీకి  జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన వారిలో లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్‌ గాంధీ, కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే, తెలుగుదేశం అధినేత, ఏపీ సీఎం చంద్రబాబునాయుడు, మంత్రి నారా లోకేష్ తదితరులు  ఉన్నారు.  ప్రధాని నరేంద్ర మోదీజీకి పుట్టినరోజు శుభాకాంక్షలు. ఆయన మంచి ఆరోగ్యంతో, దీర్ఘాయుష్షుతో ఉండాలని కోరుకుంటున్నానంటూ రాహుల్ గాంధీ తన సందేశంలో పేర్కొన్నారు.
రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి అభ్యర్థులకు వన్‌సైడ్ విక్టరీ వచ్చేలా పార్టీ శ్రేణులు పనిచేయాలని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మంత్రి నారా లోకేష్ పిలుపునిచ్చారు.
వైసీపీ నుంచి బయటకు వచ్చి, ఆ పార్టీ ద్వారా వచ్చిన రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేసి రాజకీయ సన్యాసం ప్రకటించిన విజయసాయి, ఇటీవల సొంత పార్టీ అంటూ మళ్లీ క్రియాశీల రాజకీయాలలోకి ప్రవేశించారు. 
బినెట్ నుంచి ఉద్వాసనకు గురైన కొండా సురేఖకు కేబినెట్ హోదాతో కీలక పదవిని అప్పగించే అవకాశాలున్నాయన్న ప్రచారం జరుగుతోంది.  ఈ విషయమై కొండా సురేఖకు పార్టీ హైకమాండ్ నుంచి స్పష్టమైన హామీ లభించినట్లు చెబుతున్నారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.