ఏపీలో పొత్తు ఖాయం..బీజేపీ పరిస్థితి అయోమయం!

Publish Date:May 10, 2022

Advertisement

ఆంధ్రప్రదేశ్ లో పొత్తు పొడుపుతు ఖాయమని తేలిపోయింది. తెలుగుదేశం, జనసేన పార్టీల మధ్య వచ్చే ఎన్నికలలో అవగాహన తథ్యమని దాదాపు ఖరారైపోయింది. ఇరు పార్టీల అధినేతలూ ఈ విషయంలో ఎలాంటి కన్ఫ్యూజన్ కూ తావు లేకుండా ఒక క్లారిటీ ఇచ్చేశారు. రాష్ట్రంలో వైకాపాను ఓడించేందుకు అందరూ కలిసి రావాలన్న చంద్రబాబు పిలుపుకు జనసేనాని పవన్ కల్యాణ్ సానుకూలంగా స్పందించారు. దీంతో ఈ రెండు పార్టీల మధ్య పొత్తు ఉంటుందని దాదాపుగా ఖరారైంది. అయితే వీరితో పాటు బీజేపీ కలుస్తుందా లేదా అన్న విషయంలో మాత్రం ఇప్పటికీ క్లారిటీ రాలేదు.

అయితే చంద్రబాబు కలిసిరావాలన్న పిలుపుపై ఒకింత చర్చ మాత్రం బీజేపీలో ప్రారంభమైనట్లే కనిపిస్తున్నది. చంద్రబాబు పిలుపుపై సోము వీర్రాజు స్పందన ఒకలా..ఇతర నేతల స్పందన ఒకలా ఉంది. సోము వీర్రాజు చంద్రబాబు కలిసి రావాలని ఇచ్చిన పిలుపై స్పందించిన తీరుపై తెలుగుదేశం నాయకులు ఘాటు వ్యాఖ్యలు చేశారు. పొత్తులపై నిర్ణయం తీసుకునేది సోము వీర్రాజు కాదని చెబుతూ ఆయన స్థాయి ఏమిటన్నది తేల్చేసి చిన్నబుచ్చారు.

అయితే రాష్ట్రంలో రాజకీయ పరిస్థితులను గమనిస్తున్న వారు మాత్రం వచ్చే ఎన్నికలలో 2014 నాటి సీన్ రిపీట్ అయ్యే అవకాశాలే ఎక్కువ ఉన్నాయని భావిస్తున్నారు. అంటే తెలుగుదేశం, జనసేనలతో పాటు బీజేపీ కూడా కలిసి ఉంటుందని వారి ఉద్దేశం. పైగా ప్రస్తుతం జనసేన, బీజేపీల మధ్య పొత్తు ఉంది. అయితే జనసైనికులు మాత్రం బీజేపీతో పొత్తు పట్ల ఒకింత విముఖంగానే ఉన్నారు. ఆ పార్టీకి రాష్ట్రంలో ఉన్న బలం, పట్టును బట్టి బీజేపీతో పొత్తు వల్ల జనసేనకు ఒరిగేదేమీ లేకపోగా... ఆ పార్టీ భారాన్ని కూడా పవన్ కల్యాణే మోయాల్సి ఉంటుందని జనసైనికులు అంటున్నారు. దీనికి తోడు బీజేపీతో పొత్త వల్ల మైనారిటీలు పార్టీకి దూరమయ్యే పరిస్థితి కూడా ఉందని అంటున్నారు. దీనికి తోడు జనసేన ఊసెత్తకుండా, వచ్చే ఎన్నికలలో విజయం సాధించి రాష్ట్రంలో అధికారం చేపడతామంటూ బీజేపీ ఏపీ అధ్యక్షుడు సోము వీర్రాజు ప్రకటలను జనసైనికులు తప్పుపడుతున్నారు. పొత్తు జనసేనతోనూ.. కానీ చర్యలు మాత్రం రాష్ట్రంలో అధికారంలో ఉన్న వైసీపీకి అనుకూలంగాను సోము వీర్రాజు వ్యాఖ్యలు ఉన్నాయని వారు విమర్శిస్తున్నారు. అయితే సోము వీర్రాజు వ్యాఖ్యలపై జనసేనాని మాత్రం స్పందించలేదు.

మొత్తం మీద రాష్ట్రంలో ప్రభుత్వ వ్యతిరేక ఓట్లు చీలకుండా ఉండేందుకు సమైక్యంగా ఉండటం అవసరమన్న విషయంలో తెలుగుదేవం, జనసేప పార్టీలలో క్లారిటీ ఉంది. అయితే అటువంటి క్లారిటీ జాతీయ పార్టీ అయిన బీజేపీలో మాత్రం కానరావడం లేదు. రాష్ట్రంలో కనీసం ఒక్క శాతం ఓటు బ్యాంకు అయినా లేని బీజేపీ ఏ ధైర్యంతో, ఎవరి అండతో ఒంటరిగా అధికారం అన్న విశ్వాసాన్ని ప్రదర్శిస్తున్నదో అర్ధం కాదు.  అందుకే 2014 సీన్ రిపీట్ అయ్యే అంశంలో అంటే తెలుగుదేశం, జనసేన, బీజేపీల మధ్య పొత్తు విషయంలో స్పష్టత లేకపోయినా, కమలం పార్టీ కలిసినా కలవకున్నా జనసేన, తెలుగుదేశం పార్టీల మధ్య స్పష్టమైన ఎన్నికల అవగాహన కుదరడం మాత్రం ఖాయమని పరిశీలకులు అంటున్నారు.

By
en-us Political News

  
తాజా ఇంటర్వ్యూలో ఆయన చేసిన ఈ వ్యాఖ్యలు జగన్ మోహన్ రెడ్డి వ్యక్తిత్వానికి, పార్టీ ఇమేజ్‌కు నష్టం కలిగించేలా ఉన్నాయని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.
తెలంగాణ రాజకీయాల్లో మరోసారి వందేమాతరం అంశం చర్చనీయాంశంగా మారింది.
2024 ఎన్నికల సమయానికి ఆయన ప్రాతినిథ్యం వహిస్తున్న జనసేన పార్టీ తెలుగుదేశం, బీజేపీలతో పొత్తు పెట్టుకుని ఎన్నికల రంగంలోకి దిగింది. ఆ ఎన్నికలలో నాగబాబు అనకాపల్లి లోక్ సభ స్థానం నుంచి రంగంలోకి దిగుతారని పెద్ద ఎత్తున ప్రచారం అయ్యింది. అయితే పొత్తు ధర్మంలో భాగంగా నాగబాబుకు ఆ ఎన్నికలలో పోటీ చేసే అవకాశమే దక్కలేదు.
తమిళనాడులో బీజేపీ, హీరో విజయ్ సారథ్యంలోని టీవీకేల పొత్తు విషయంలో మరోసారి వార్తలు చక్కర్లు కొడుతున్నాయి.
ఈసీ తీరుపై నమ్మకం లేదని చెబుతున్న పార్టీ, ఇప్పుడు సీఈసీపై అభిసంశన తీర్మానానికి మద్దతుగా నిలబడకుంటే.. ఆ పార్టీ నైతికతే ప్రశ్నార్థకంగా మారుతుంది. ఒక వేళ వైసీపీ ఈ తీర్మానాన్ని వ్యతిరేకిస్తే ఇక ముందు, ఎన్నికల అక్రమాలపై మాట్లాడేందుకు వైసీపీకి అర్హతే ఉండదు. ఇంత వరకూ తెలుగుదేశం కూటమి విజయంపై వారు చేసిన విమర్శలన్నీ దూదిపింజెల్లా ఎగిరిపోతాయి.
బీఆర్ఎస్ హయాంలో ఇదే ఫామ్‌హౌస్ వేదికగా జరిగిన ఎమ్మెల్యేల కొనుగోలు ఉదంతం అప్పట్లో పెను సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. అప్పట్లో రోహిత్ రెడ్డి ఫిర్యాదుతోనే పోలీసులు అక్కడ సోదాలు నిర్వహించి, ముగ్గురిని అదుపులోకి తీసుకున్నారు. అప్పట్లో ఈ కేసు జాతీయ రాజకీయాల్లో పెను సంచలనం సృష్టించింది.
దేవ్ జీ అరెస్ట్ ఎలా జరిగింది? అరెస్టు తరువాత ఆయన లొంగుబాటు ప్రకటన చేసి జనజీవన స్రవంతిలో కలుస్తున్నట్లు ఎందుకు ప్రకటించాల్సి వచ్చింది? లొంగిపోలేదు అంటూనే.. ప్రస్తుత పరిస్థితుల్లో అజ్ణాతంగా ఉండి ఉద్యమాన్ని కొనసాగించడం కష్టసాధ్యమని ఎందుకు చెబుతున్నారు?
త్రిష త్వరలోనే సినిమాలకు గుడ్‌బై చెప్పి రాజకీయాల్లోకి రావడం కన్ఫర్మ్ అన్న వాదన బలంగా వినిపిస్తోంది. అయితే ఇందుకు సంబంధించి త్రిష నుంచి ఎటువంటి క్లారిటీ అయితే ఇప్పటి వరకూ రాలేదు. ప్రస్తుతం త్రిష పలు సినిమాలలో నటిస్తున్నారు. వాటిలో మెగా స్టార్ చిరంజీవి నటిస్తున్న విశ్వంభర సినిమా కూడా ఉంది.
మంత్రిగా పదవీ బాధ్యతలు నిర్వర్తిస్తూ కూడా పవన్ కల్యాణ్ సినిమాలకే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారనీ, షూటింగ్ లంటూ అధిక సమయం హైదరాబాద్ లోనే ఉంటున్నారని రోజా అన్నారు. ప్రజా సమస్యలను గాలికొదిలేసి సినిమాలలో యాక్టింగ్ కి పరిమితమైనట్లుగా పవన్ కల్యాణ్ తీరు ఉందని రోజా అన్నారు. కీలకమైన మంత్రివర్గ సమావేశానికి డుమ్మా కొట్టడం సరికాదన్న రోజా దీనిపై ప్రభుత్వం సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.
ముఖ్యమంత్రి సిద్ధరామయ్య విధానసౌధలో కేబినెట్ సమావేశం నిర్వహిస్తున్న సమయంలోనే.. పాతిక మంది ఎమ్మెల్యేలు ఓ ప్రైవేట్ హోటల్‌లో ఈ భేటీ జరగడం సంచలనం సృష్టించింది.
తెలుగువన్ వాస్తవ వేదిక 16వ సంచికలో ప్రస్తుత రాజకీయ పరిస్థితులపై విస్తృత చర్చ జరిగింది.
పార్టీ ఫిరాయింపుల కేసులో ఎమ్మెల్యేలు దానం నాగేందర్, కడియం శ్రీహరికి ఊరట
రాష్ట్రంలో బీఆర్ఎస్‌ రెండుసార్లు, కాంగ్రెస్‌ ఒకసారి అధికారంలోకి వచ్చాయనీ, ఆ రెండు ప్రభుత్వాల వైఫల్యాలనూ గమనించిన తెలంగాణ ప్రజలు వచ్చే ఎన్నికల్లో బీజేపీకి అధికారం కట్టబెట్టాలని ఇప్పటికే ఒక నిర్ణయానికి వచ్చేశారన్నారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.