Publish Date:Feb 27, 2025
ఎస్సెల్బీసీ సోరంగంలో చిక్కుకున్న ఎనమండుగురు కార్మికుల వ్యవహారం విషాదాంతమైంది. వారెవరూ బతికి లేరని ఆ టన్నల్ కాంట్రాక్టర్ పనులు చేస్తున్న జేసీ అసోసియేట్స్ ఓటర్ ప్రకాష్ చెప్పారు. గురువారం (ఫిబ్రవరి 27) మీడియాతో మాట్లాడిన ఆయన ఈ ప్రమాదం జరిగిన సమయంలో టన్నెల్లో 50 మందికి పైగా పని చేస్తున్నారు. వారిలో ఎనిమిది మంది వినా మిగిలిన అందరూ సురక్షితంగా బయటపడ్డారన్నారు. టన్నెల్ లో చిక్కుకున్న వారిని రక్షించేందుకు గత ఆరురోజులుగా చేసిన ప్రయత్నాలు విఫలమయ్యాయనీ, వారు బతికి ఉండే అవకాశాలు లేవనీ చెప్పారు.
టన్నల్ లో చిక్కుకున్న వారిని రక్షించేందుకు గత ఆరు రోజులుగా చేసిన, చేస్తున్న ప్రయత్నాలన్నీ విఫలమయ్యాయి. గురువారం రెస్క్యూ బృందాలు టన్నెల్ చివరి వరకు వెళ్లగలిగారు. అయినా వారి ఆచూకీ లభించకపోవడంతో వారెవరూ ప్రాణాలతో లేరని నిర్ధారణ అయ్యిందని కాంట్రాక్టర్ చెప్పాడు. వారంతా బురదలో కూరుకుపోయి మరణించి ఉంటారని అన్నారు. ఇక ఇప్పుడు వారి మృతదేహాలను వెలికితీయడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయని కాంట్రాక్టర్ అన్నారు. ప్రమాదం జరిగిన తరువాత రోజులు గడుస్తున్న కొద్దీ వారు ప్రాణాలతో ఉండే అవకాశం లేదన్న అభిప్రాయమే వ్యక్తం అవుతూ వస్తోంది.
అయినా ఎక్కడో ఏదో చిన్న ఆశ. అదృష్టం కలిసి వచ్చి వారు ప్రాణాలతో ఉంటారన్నఅంతా భావించారు. రెండు రోజుల కిందటే రెస్క్యూటీమ్ వారు ప్రాణాలతో ఉండే అవకాశాలు మృగ్యమని చెప్పేశారు. ఇప్పుడు అదే విషయాన్ని టన్నెల్ కాంట్రాక్టర్ ప్రకాష్ మీడియా ముఖంగా చెప్పారు.
సొరంగంలో చిక్కుకుపోయిన ఎనమండుగురు కార్మికులను రక్షించేందుకు గత ఆరు రోజులుగా ఆర్మీ,ఎస్టీఆర్ఎఫ్,ఎన్డీఆర్ఎఫ్ శతథా ప్రయత్నించాయి. ర్యాట్ హోల్ మైనర్లు రంగంలోకి దిగారు. బండరాళ్లు,బురద నీరు,శిథిలాల కారణంగా రెస్క్యూ ఆపరేషన్ కు అడుగడుగునా అడ్డంకులు ఏర్పడటంతో వారి ప్రయత్నాలు విఫలమయ్యాయి.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/all-eight-workers-died-39-193526.html
నిన్నటి వరకూ జగన్ కు పెట్టని కోటలా నిలిచిన పులివెందులలో ఇప్పుడు తెలుగుదేశం జెండా ఘనంగా ఎగురుతోంది. సుదీర్ఘకాలంగా వైసీపీకి తిరుగులేని కంచుకోటగా ఉన్ పులివెందుల పరిధిలో తెలుగుదేశం పార్టీ తన ఉనికిని బలంగా చాటుకుంటోంది.
వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి తీరుపై ఆ పార్టీ నుంచి బయటకు వచ్చిన మాజీ ఎంపీ విజయసాయి రెడ్డి తీవ్రస్థాయిలో మండిపడ్డారు.
తుఫాను కారణంగా చీరాల మన్సిపాల్టీలో ఓట్ల లెక్కింపు శుక్రవారం (నవంబర్ 5) జరుగుతోంది. ఇప్పటి వరకు ఎక్కడా కనీసం డిపాజిట్ కూడా దక్కని కాంగ్రెస్ ఖాతాలో తొలి విజయం నమోదైంది. కాంగ్రెస్ పార్టీ చీరాల మునిసిపోల్స్ లో గట్టి పోటీ ఇచ్చింది. 25వ వార్డులో విజయం సాధించింది. 25వ వార్డు నుంచి బరిలోకి దిగిన కాంగ్రెస్ అభ్యర్థి వెంకట్రావు విజయం సాధించారు.
పోలింగ్ సరళి, వెలువడిన ఫలితాలు వైసీపీ శిబిరంలో ఆందోళన కలిగిస్తుంటే వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్ మాత్రం మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తూ, అధికార తెలుగుదేశం కూటమి అరాచకాలు, అధికార దుర్వినియోగం తమ ఓటమికి కారణాలుగా చూపడానికి ప్రయత్నిస్తున్నారు. ఎన్నికల ఫలితాల వెల్లడి తర్వాత వైఎస్ జగన్ నిర్వహించిన ఈ మీడియా సమావేశంలో జగన్ చెప్పిందే చెప్పారు.
కాంగ్రెస్, కమ్మూనిస్టుల మద్దతుతో ఎన్నికల బరిలోకి దిగిన ఏబీవీకి ఘోర పరాజయం ఎదురైన సంగతి తెలిసిందే. కమ్యూనిస్టులకు అంతో ఇంతో పట్టున్న ప్రాంతాలలో కూడా ఆయనకు ఓట్లు రాలలేదు. ఇక కాంగ్రెస్ మద్దతు ఆయనకు ఎందుకూ కొరగాకుండా పోయింది.
ఈ వేడుకలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి, కేటీఆర్, విజయ్ ఒకే దగ్గర చేరి సరదాగా ముచ్చటించుకోవడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.
నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగిసే నాటికి రాష్ట్ర వ్యాప్తంగా 77 జడ్పీటీసీలు, 2051 ఎంపీటీసీలు ఏకగ్రీవమైనట్లు ఎన్నికల అధికారులు వెల్లడించారు. ఇక మిగిలిన స్థానాలకు పోటీ పడుతున్న 21 వేల 012 మంది అభ్యర్థుల భవితవ్యం తేల్చేందుకు ఓటర్లు పోలింగ్ కేంద్రాల వద్ద బారులు తీరారు.
వైసీపీపై అధికార కూటమి ఒత్తిడి, అక్రమాలు ఉన్నప్పటికీ క్షేత్రస్థాయిలో ప్రజలు వైసీపీకి వ్యతిరేకంగా ఉన్నారని పరోక్షంగా వ్యాఖ్యానించి, ప్రజా క్షేత్రంలో వైసీపీ బలహీనంగా ఉందని చెప్పకనే చెప్పారు. గతంలో తాము అధికారంలో ఉన్నప్పుడు వ్యవహరించిన తీరు కారణంగానే నేడు వైసీపీకి ఈ గతి పట్టిందంటూ అంబటి చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకున్నాయి.
పాడిందే పాటరా అన్న సామెత చందంగా ఉంది జగన్ తీరు. ఆంధ్రప్రదేశ్లో మున్సిపల్ ఎన్నికల ఫలితాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో తీవ్ర నిరాశను మిగిల్చాయి. గతంలో 2024 సార్వత్రిక ఎన్నికల ఓటమి తర్వాత ఏ విధంగానైతే ఈవీఎంలు, ఎన్నికల సంఘాన్ని వైఎస్ జగన్మోహన్ రెడ్డి తప్పుపట్టారో, ఇప్పుడు మున్సిపల్ ఎన్నికల ఫలితాల విషయంలోనూ అదే పాతరాగాన్ని అందుకున్నారు.
2024 ఎన్నికలలో విశాఖ జనం జగన్ విశాఖ రాజధాని ప్రతిపాదనను తిరస్కరించారు. ఇప్పుడు జగన్ మావిగన్ ప్రతిపాదనను మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు జనం ఓటుతో తోసి రాజన్నారు.