అన్ని వేళ్లూ సజ్జల వైపే..!

Publish Date:Jun 12, 2022

Advertisement

ఒక్కో సారి తెరవెనుక ఉండాల్సిన వ్యక్తులు తెర ముందుకు వచ్చి నాటకాన్ని రక్తి కట్టిస్తుంటారు. కొండకొచో ఆ వ్యక్తులే నాటకం రసాభాస కావడానికి కారకులౌతారు. మంచి  జరిగినా, చెడు జరిగినా అటువంటి వ్యక్తులకు వచ్చేదీ ఉండదు, పోయేదీ ఉండదు. కానీ అన్నిటిలో వారి వేలో కాలో పెట్టకు తప్పదు. అటువంటి వారినే ప్రభుత్వంలో అయితే రాజ్యాంగేతర శక్తులు అంటారు. సరిగ్గా జగన్ సర్కార్ లో సజ్జల రామకృష్ణారెడ్డి అటువంటి పాత్రే పోషిస్తున్నారు. ఆయనే ప్రభుత్వ నాటకాన్నిరక్తీ కట్టిస్తారు, రసాభాస చేస్తారు. అందుకే ఆయనను విపక్షాలే కాదు, పార్టీ శ్రేణులు కూడా రాజ్యాంగేతర శక్తిగానే అభివర్ణిస్తున్నాయి.

సకల శాఖల మంత్రి అంటూ భుజకీర్తులు తగిలిస్తున్నారు.    ఏపీలో సజ్జల ఇప్పుడొక  బ్రాండ్  అయిపోయారు. ఇదేదో గొప్ప బిరుదో, భుజకీర్తో అనుకోవద్దు. జగన్ ప్రభుత్వంలో వైఫల్యాలన్నిటికీ మంత్రులూ, ఎమ్మెల్యేలే కారణమని నేత జగన్ చెబుతున్నారు. ప్రభుత్వం అన్ని ఫ్రంట్ లలోనూ బ్రహ్మాండంగా ఉందనీ, ప్రస్తుతం ప్రజా వ్యతిరేకత అంతా ఎమ్మెల్యేలూ, మంత్రులపైనేననీ ముఖ్యమంత్రి చెబుతున్నారు. ఇదేదో అధికారుల సమావేశాల్లోనో, సమీక్షల్లోనో కాదు.. సదరు ఎమ్మెల్యేలూ, మంత్రుల సమక్షంలోనే వారు చెబుతున్నవేవీ వినకుండా.. అంతా మీరు చేశారు అంటున్నారు.  అయితే మంత్రులూ, ఎమ్మెల్యేల వెర్షన్ మాత్రం మరోలా ఉంది.

జగన్ కు నోరూ, చెవులూ, కళ్లూ అన్నీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డేననీ, మంత్రులను, ఎమ్మెల్యేలనూ డమ్మీలను చేసిన ఘనత ఆయనదేననీ అంటున్నారు. జగన్ సజ్జల నోటితో మాట్లాడతారనీ, సజ్జల కళ్లతో చూస్తారనీ, సజ్జల చెవులతో వింటారనీ అంటున్నారు. ఇప్పుడు ప్రభుత్వంలో శక్తి మంతుడు ఎవరంటే మాత్రం వైసీపీలో లీడర్ నుంచి కేడర్ వరకు అందరూ తమ చూపుడు వేలును సజ్జల రామకృష్ణారెడ్డి వైపే చూపిస్తున్నారు.  జగన్ అధికారంలోకి వచ్చింది మొదలు.. ఇప్పటి వరకూ జగన్ తీసుకున్న నిర్ణయాలన్నిటి వెనుకా ఉన్న బ్రెయిన్  సజ్జల వారిదేనని అంటున్నారు. అలా అనడమంటే జగన్ నిమిత్త మాత్రుడు.. అమాయకుడు, ఆయనకు ఏమీ తెలియదు అని కాదు. తాను చేయాల్సింది, చెప్పాల్సింది అంతా సజ్జనతో చెప్పిస్తారు, చేయిస్తారు.

అందుకే తాజా మాజీలంతా తమ పదవులు పోవడానికి కారణం సజ్జలేనంటూ ఆరోపణలు గుప్పించిన సంగతి తెలిసిందే.  అంటే వైఫల్యాలను ఎమ్మెల్యేలు మంత్రులకు అంటగట్టడానికీ, ఘనతను తన సొంతం చేసుకోవడానికి జగన్ కు అన్ని విధాలుగా దోహదం చేస్తున్నది సజ్జల అన్న మాట. ఆ క్రమంలోనే హోం మంత్రి పదవి హుళక్కి అయిన తర్వాత.. మేకతోటి సుచరిత అనుచరులు.. ఈ సజ్జల వారిపై ఓ రేంజ్‌లో తిట్ల దండకం అందుకున్న సంగతి  తెలిసిందే. ఇక జగన్ ప్రభుత్వంలో సజ్జల రామకృష్ణ రెడ్డి పనితనం చూసే.. ఆయనకు సకల శాఖల మంత్రి గారంటూ ప్రతిపక్ష నేతలు  కితాబు ఇచ్చేసిన విషయం కూడా తెలిసిందే. అయితే అధికార పార్టీలో తీవ్ర విమర్శలు ఎదుర్కొంటున్న వారిలో ఈ సజ్జల రామకృష్ణారెడ్డి అగ్రస్థానాన్ని ఆక్రమించారనే ఓ చర్చ   వెలగపూడి సచివాలయం సాక్షిగా చాలా రసవత్తరంగా సాగుతోంది. 

జగన్ ప్రభుత్వంలో సలహాదారుడి పేరుతో సజ్జల రామకృష్ణారెడ్డి బ్రోకరిజం చేస్తున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. జగన్ పార్టీలోని ఓ ఎమ్మెల్యేకి జగన్ కెబినెట్‌లో చోటు కల్పిస్తానని మాట ఇచ్చి.. ఆ తర్వాత ఆయనకు   సజ్జల హ్యాండ్ ఇచ్చారనే ఆరోపణలు సైతం   వినిపిస్తున్నాయి. అంతేకాదు.. జగన్ మలి కేబినెట్‌లో పలువురు తాజా ఎమ్మెల్యేలకు చోటు దక్కిందంటే అదీ  సజ్జల వారి చలవేననే ఓ టాక్ కూడా నేటికీ గట్టిగానే నడుస్తోంది.   

ఇక జగన్ ప్రభుత్వంలో ఇసుక, లిక్కర్.. వగైరా వగైరాలో కమిషన్లు దండుకొంటూ సజ్జల ఓ పెద్ద కమీషన్ ఏజెంట్ అవతారం ఎత్తారనే ఆరోపణలు కూడా అధికార పార్టీలోనే ఓ రేంజ్ లో వెల్లువెత్తుతున్నాయి.  గుడివాడ క్యాసినో వ్యవహారంలో అప్పటి మంత్రి కొడాలి నాని నుంచి సజ్జలకు కమిషన్ ముట్టిందని.. అలాగే పోలవరం కాంట్రాక్ట్ అవినీతిలో కూడా ఈ సజ్జలకు పాత్ర ఉందనే ఆరోపణలు   వినిపిస్తున్నాయి. 

 జగన్ ప్రభుత్వం తీసుకున్న ఏదైనా నిర్ణయంపై మాట్లాడాలంటే.. అటు మంత్రులు కానీ.. ఇటు ఉన్నతాధికారులు కానీ ప్రెస్ మీట్ పెట్టి వివరించే ప్రయత్నం చేయరు. అలాగే జగన్ ప్రభుత్వంపై ప్రతిపక్షాలు విమర్శలకు పార్టీ నేతలు, ఎమ్మెల్యేలు, మంత్రులు ఎవరూ స్పందించరు. ప్రభుత్వం నిర్ణయంపై వివరణ ఇవ్వాలన్నా, విపక్షాల విమర్శలకు కౌంటర్ ఇవ్వాలన్నా  సజ్జల రామకృష్ణారెడ్డే.  సకల రోగాలకూ ఒకటే మందు జిందా తిలిస్మాత్ అన్నట్లు.. వైసీపీ పార్టీలో కానీ వైసీపీ ప్రభుత్వంలో కానీ ఏ అంశంపైనైనా స్పందించాలన్నా మాట్లాడాలన్నా తెరమీదకు వచ్చేది సజ్జల మాత్రమే. అయితే వైసీపీపై ఈగవాలినా వెంటనే స్పందించి కౌంటర్లిచ్చే సజ్జల తనపై వచ్చిన ఆవినీతి ఆరోపణలపై నోరెందుకు ఎత్తడం లేదని అధికార పార్టీలోనే కేడర్ నుంచి లీడర్ల వరకూ ఓ రేంజ్ లో చర్చించుకుంటున్నారు.  

By
en-us Political News

  
విజయసాయి ఈ వీడియో చేయడం వెనుక పొలిటకల్ స్ట్రాటజీ ఉందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. తారకరత్న కుమార్తెతో వీడియో చేయడం ద్వారా తెలుగుదేశం శ్రేణుల మద్దతు పొంది తన పొలిటికల్ రూట్ లో ఇబ్బందులు లేకుండా చూసుకుంటున్నారని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.
ర్నాబ్ తుపానుతో అతలాకుతలమైన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తుపాను ప్రభావిత ప్రాంతాలలో విద్యుత్ సరఫరాను సత్వరమే పునరుద్ధరించడానికి తమిళనాడు సహాయాన్ని కోరింది. ఈ మేరకు మంత్రి గొట్టిపాటి రవికుమార్ తమిళనాడు ప్రభుత్వాన్ని  రాష్ట్రంలో తుపాను ప్రభావిత ప్రాంతాలలో విద్యుత్ పునరుద్ధరణ  వేగవంతం చేయడానికి  అదనపు విద్యుత్ శాఖ సిబ్బందిని, పరికరాలను కోరారు.
సాధారణంగా వైసీపీ ఎకో సిస్టమ్ ఎలా ఉంటుందంటే.. ఎవరైనా సరే  ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడిని , ఆయన పాలనా విధానాలను పొగిడితే వెంటనే ఆ పొగిడిన వారిపై విమర్శలు గుప్పించేస్తుంది. ఇందుకు గతంలో చాలా చాలా ఉదాహరణలు ఉన్నాయి.
పులివెందుల మునిసిపోల్ రణరంగంగా మారే అవకాశం ఉందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. గత అనుభవాలను దృష్టిలో ఉంచుకుని పోలీసులూ అప్రమత్తమయ్యారు. ఎలాంటి హింసాత్మక ఘటనలకూ తావులేకుండా భారీ బందోబస్తు ఏర్పాట్లు చేశారు. అవసరమైతే  ఇటు తెలుగుదేశం కూటమి, అటు వైసీపీకి చెందిన ముఖ్య నేతలను హౌస్ అరెస్టు చేసేందుకైనా వెనుకాడబోమని పోలీసులు విస్పష్ట హెచ్చరికలు జారీ చేశారు.
గతంలో రాష్ట్ర రాజకీయాలలో  కొండా సురేఖ కేటీఆర్ పై చేసిన వ్యక్తిగత విమర్శలు  దుమారం రేపిన సంగతి తెలిసిందే. ఇప్పుడు ఆ వ్యాఖ్యలకు బేషరతుగా క్షమాపణ చెప్పిన కొండా సురేఖ వాటిని ఉపసంహరించుకున్నారు.   గతంలో కేటీఆర్ పై తాను చేసిన అనుచిత వ్యాఖ్యలను  పూర్తిగా వెనక్కి తీసుకుంటున్నట్లు సోషల్ మీడియా వేదికగా  పేర్కొన్నారు. 
తెలంగాణ రాజకీయాలలో ఏ పార్టీతోనూ పొత్తు లేదు లేదంటూనే జనసేనతో పొత్తుకు తహతహలాడుతోంది. తెలంగాణలో స్వంతంగానే బరిలోకి దిగుతామని కుండబద్దలు కొట్టిన బీజేపీ ఇప్పుడు జనసేనతో అంతర్గత పొత్తు కుదుర్చుకుందన్న ప్రచారం జోరుగా సాగుతోంది. 
నియోజకవర్గంలో రాబోయే మున్సిపల్ చైర్మన్ ఎన్నికలను తెలుగుదేశం కూటమి గెలుచుకుంటుందన్న ధీమా వ్యక్తం చేశారు. వైసీపీకి పులివెందుల ఇంకెంత మాత్రం కంచుకోట కాదని విస్పష్టంగా పేర్కొన్నారు.  దశాబ్దాలుగా తిరుగులేని ఆధిపత్యం చెలాయిస్తున్న పులివెందులలో కూటమి నేతలు నేరుగా సవాళ్లు విసురుతుండటం పులివెందులలో మసకబారిన వైసీపీ ప్రతిష్ఠకు, పలుకుబడికి నిదర్శనంగా పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. 
అయితే, ప్రస్తుతం సిద్ధమవుతున్న చార్జ్‌షీట్‌ను మరింత పటిష్టంగా రూపొందించేందుకు ఉన్నతాధికారులు ఢిల్లీలోని ప్రముఖ సుప్రీంకోర్టు న్యాయవాదులతో సంప్రదింపులు జరిపినట్లు తెలుస్తోంది. సాంకేతిక సాక్ష్యాలు, బాధితుల వాంగ్మూలాల ఆధారంగా ఈ అదనపు చార్జిషీట్ ను సిద్ధం చేస్తున్నట్లు సమాచారం.
విపత్కర సమయంలో తెలుగు రాష్ట్రాల ఐక్యత.. ఏపీకి సాయం.!
హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్ నివాసంలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిని శ్రీ కృష్ణ సదర్ సమ్మేళనం ఉత్సవ కమిటీ ప్రతినిధులు మర్యాదపూర్వకంగా కలిశారు.
ఒక్కోసారి చిన్న ప్రయత్నం కూడా ఊహించని విధంగా జీవితాన్ని మార్చేస్తుందనడానికి నిదర్శనంగా నిలిచింది ఒక ఉదంతం.
ఆంధ్రప్రదేశ్‌ను వణికించిన అర్నబ్ తుఫాను ప్రభావంతో పంటలు, ఇళ్లు, రహదారులు, విద్యుత్ వ్యవస్థలకు నష్టం వాటిల్లింది.
ప్రకృతి వైపరీత్యాలు సంభవించిన క్లిష్ట పరిస్థితుల్లోనూ ఏ మాత్రం వెనకడుగు వేయకుండా, ప్రాణాలను సైతం లెక్కచేయకుండా విద్యుత్ శాఖ సిబ్బంది సేవలందిస్తున్న తీరు ఎంతో స్ఫూర్తిదాయకమని
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.