అలిపిరి కేసులో ఈరోజే తుది తీర్పు
Publish Date:Sep 25, 2014
Advertisement
2003 సంవత్సరంలో తిరుపతిలోని అలిపిరిలో అప్పటి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడి మీద మందుపాతరతో దాడి చేసిన కేసుకు సంబంధించి హైకోర్టు విచారణ పూర్తయింది. నిందితులు చంద్రబాబును హత్యచేసే ఉద్దేశంతో శక్తివంతమైన క్లైమోర్ మైన్ని పేల్చారు. అదృష్టవశాత్తూ చంద్రబాబు ఆ దాడి నుంచి స్వల్ప గాయాలతో తప్పించుకున్నారు. ఆ సంఘటనలో అప్పటి ఎమ్మెల్యే బొజ్జల గోపాలకృష్ణారెడ్డి కూడా గాయపడ్డారు. ఈ కేసులో 33 మంది నిందితులు ఉండగా, ఇప్పటికి ఐదుగురు ప్రధాన నిందితులుగా వున్నారు. వీరిలో ఇద్దరిని నిర్దోషులుగా హైకోర్టు ప్రకటించింది. ముగ్గురిని దోషులుగా ఖరారు చేసింది. దోషులకు శిక్షలను హైకోర్టు ఈరోజే ప్రకటించే అవకాశం వుంది.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/alipiri-case-chandra-babu-high-court-judgement-39-38714.html
http://www.teluguone.com/news/content/alipiri-case-chandra-babu-high-court-judgement-39-38714.html
Publish Date:Oct 17, 2026
Publish Date:Oct 16, 2026
Publish Date:Oct 16, 2026
Publish Date:Oct 16, 2026
Publish Date:Oct 14, 2026
Publish Date:Oct 14, 2026
Publish Date:Oct 14, 2026
Publish Date:Oct 14, 2026
Publish Date:Oct 13, 2026
Publish Date:Oct 13, 2026
Publish Date:Oct 13, 2026
Publish Date:Oct 13, 2026
Publish Date:Oct 12, 2026





