విజయసాయిరెడ్డికి మద్దతుగా తారకరత్న భార్య అలేఖ్య సంచలన పోస్టు

Publish Date:May 23, 2025

Advertisement

ఆంధ్రప్రదేశ్ రాజకీయాలలో ఇప్పుడు ఫేస్ బుక్ పోస్టు ఒక తీవ్ర సంచలనం సృష్టిస్తోంది. ఇటీవల మాజీ ముఖ్యమంత్రి జగన్ మీడియా సమావేశంలో మాట్లాడుతూ విజయసాయిరెడ్డిపై తీవ్ర విమర్శలు, ఆరోపణలు గుప్పించిన సంగతి తెలిసిందే. ఆ ఆరోపణలు, విమర్శలపై విజయసాయి రెడ్డి స్ట్రాంగ్ కౌంటర్ ఇస్తారనీ, జగన్ ను ఉక్కిరిబిక్కిరి చేసేలా ఆ కౌంటర్ ఉంటుందనీ అంతా భావించారు. అయితే జగన్ విమర్శలకు విజయసాయి రెడ్డి కంటే ముందు.. ఎవరూ ఊహించని విధంగా, దివంగత తారకరత్న సతీమణి అలేఖ్య నుంచి స్పందన వచ్చింది. 

మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి కొంత కాలం కిందట జకీయాలకు గుడ్ బై చెప్పి.. వ్యవసాయమే తన వ్యాపకం అంటూ ప్రకటించిన సంగతి తెలిసిందే.  ఆయన రాజకీయ విరమణ ప్రకటించినా.. జగన్ హయాంలో జరిగిన అక్రమాలు, కుంభకోణాలకు సంబంధించిన కేసులు ఆయనను విడిచి పెట్టడం లేదు. వాటి విచారణ నిమిత్తం దర్యాప్తు సంస్థల ముందు హాజరైన సందర్భాలలో విజయసాయి రెడ్డి కొన్ని సంచలన వ్యాఖ్యలు చేశారు. కాకినాడ పోర్టు భూముల కేసులో కర్త, కర్మ, క్రియా మొత్తం వైవీ సుబ్బారెడ్డి పుత్రరత్నమే అనీ, అలాగే మద్యం కుంభకోణంలో రాజ్ కేశిరెడ్డే సర్వం అని విజయసాయి రెడ్డి ఆయా కేసుల దర్యాప్తులో భాగంగా దర్యాప్తు సంస్థల ముందు హాజరైన సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ సంచలన వ్యాఖ్యలు చేశారు. 

ఆ తరువాత జగన్ విజయసాయి రెడ్డి విశ్వసనీయత లేని వ్యక్తిగా పేర్కొంటూ విమర్శలు గుప్పించారు. వాటికి విజయసాయి కూడా కౌంటర్ ఇచ్చారు. ఆ తరువాత తాజాగా గురువారం  జగన్ మీడియా సమావేశంలో విజయసాయిరెడ్డిపై తీవ్ర విమర్శలు, ఆరోపణలు గుప్పించారు. కూటమి ప్రభుత్వానికి మేలు చేయడానికి విజయసాయి తన రాజ్యసభ సభ్యత్వాన్ని అమ్మేసుకున్నారంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలు రాజకీయ దుమారాన్ని రేపాయని చెప్పవచ్చు. వాటికి విజయసాయి నుంచి ఏ స్థాయిలో రిటార్డ్ ఉంటుందా అని అంతా ఎదురు చూస్తున్న సమయంలో విజయసాయి కంటే ముందుగా.. దివంగత తారకరత్న భార్య అలేఖ్య రెడ్డి తన ఫేస్ బుక్ లో పెట్టిన పోస్టు సంచలనం సృష్టిస్తోంది. అలేఖ్యకు విజయసాయి వరుసకు బాబాయ్ అవుతారు.   నారా లోకేష్ యువగళం పాదయాత్ర సమయంలో నందమూరి తారకరత్న తీవ్ర అస్వస్థతకు గురై బెంగళూరులో చికిత్సపొందుతూ ప్రాణాలు కోల్పోయిన  కష్ట సమయంలో నందమూరి, నారా కుటుంబాలు, విజయసాయిరెడ్డి కుటుంబం అలేఖ్యకు అండగా నిలిచాయి. అది పక్కన పెడితే.. జగన్ విజయసాయిరెడ్డిపై తీవ్ర స్థాయిలో విమర్శలు, ఆరోపణలు గుప్పించిన గంటల వ్యవధిలోనే అలేఖ్య తన పేస్ బుక్ లో పెట్టిన పోస్టు సంచలనంగా మారింది. ఆ పోస్టులో ఆమె నేరుగా జగన్ పేరు ప్రస్తావించకపోయినా విజయసాయికి మద్దతుగా జగన్ కు ప్రశ్నలు సంధించారు. ఆమె ఫేస్ బుక్ పోస్టు యథాతధంగా...ప్రజలు ఏమి చెప్పాలనుకుంటున్నారో చెప్పడానికి స్వేచ్ఛగా ఉంటారు.. కానీ నిజం లోపల నిశ్శబ్దంగా బలంగా ఉంటుంది.. కొన్ని తప్పుడు ప్రచారాలు, కథనాలు ఉన్నప్పటికీ.. అర్హత లేని వారి పట్ల గౌరవం కారణంగా మీరు ప్రశాంతంగా ఉంటారు.. నమ్మకం, విధేయత, నీతి మీరు చెప్పినవి మాత్రమే కాదు.. అవి ఇప్పటికీ కొనసాగుతున్నాయి. చాలామంది ఊహాగానాలు ప్రచారం చేస్తున్నా. మీరు కూడా మాట్లాడటం ఎంచుకుంటే ఏమవుతుందో అని నేను తరచుగా ఆలోచిస్తుంటాను.. ఎన్నో ఊహగానాలు, ఎందుకు మౌనంగా ఉన్నారు.. ఇది నిజం. అలేఖ్య చేసిన ఈ పోస్ట్ రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చకు దారితీసింది. జగన్, సాయిరెడ్డి మధ్య విభేదాలు తారాస్థాయికి చేరిన నేపథ్యంలో అలేఖ్య విజయసాయికి  మద్దతుగా నిలవడం ఆయనకు  పెరుగుతున్న మద్దతుకు తార్కానంగా పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  

By
en-us Political News

  
ర్నాబ్ తుపానుతో అతలాకుతలమైన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తుపాను ప్రభావిత ప్రాంతాలలో విద్యుత్ సరఫరాను సత్వరమే పునరుద్ధరించడానికి తమిళనాడు సహాయాన్ని కోరింది. ఈ మేరకు మంత్రి గొట్టిపాటి రవికుమార్ తమిళనాడు ప్రభుత్వాన్ని  రాష్ట్రంలో తుపాను ప్రభావిత ప్రాంతాలలో విద్యుత్ పునరుద్ధరణ  వేగవంతం చేయడానికి  అదనపు విద్యుత్ శాఖ సిబ్బందిని, పరికరాలను కోరారు.
సాధారణంగా వైసీపీ ఎకో సిస్టమ్ ఎలా ఉంటుందంటే.. ఎవరైనా సరే  ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడిని , ఆయన పాలనా విధానాలను పొగిడితే వెంటనే ఆ పొగిడిన వారిపై విమర్శలు గుప్పించేస్తుంది. ఇందుకు గతంలో చాలా చాలా ఉదాహరణలు ఉన్నాయి.
పులివెందుల మునిసిపోల్ రణరంగంగా మారే అవకాశం ఉందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. గత అనుభవాలను దృష్టిలో ఉంచుకుని పోలీసులూ అప్రమత్తమయ్యారు. ఎలాంటి హింసాత్మక ఘటనలకూ తావులేకుండా భారీ బందోబస్తు ఏర్పాట్లు చేశారు. అవసరమైతే  ఇటు తెలుగుదేశం కూటమి, అటు వైసీపీకి చెందిన ముఖ్య నేతలను హౌస్ అరెస్టు చేసేందుకైనా వెనుకాడబోమని పోలీసులు విస్పష్ట హెచ్చరికలు జారీ చేశారు.
గతంలో రాష్ట్ర రాజకీయాలలో  కొండా సురేఖ కేటీఆర్ పై చేసిన వ్యక్తిగత విమర్శలు  దుమారం రేపిన సంగతి తెలిసిందే. ఇప్పుడు ఆ వ్యాఖ్యలకు బేషరతుగా క్షమాపణ చెప్పిన కొండా సురేఖ వాటిని ఉపసంహరించుకున్నారు.   గతంలో కేటీఆర్ పై తాను చేసిన అనుచిత వ్యాఖ్యలను  పూర్తిగా వెనక్కి తీసుకుంటున్నట్లు సోషల్ మీడియా వేదికగా  పేర్కొన్నారు. 
తెలంగాణ రాజకీయాలలో ఏ పార్టీతోనూ పొత్తు లేదు లేదంటూనే జనసేనతో పొత్తుకు తహతహలాడుతోంది. తెలంగాణలో స్వంతంగానే బరిలోకి దిగుతామని కుండబద్దలు కొట్టిన బీజేపీ ఇప్పుడు జనసేనతో అంతర్గత పొత్తు కుదుర్చుకుందన్న ప్రచారం జోరుగా సాగుతోంది. 
నియోజకవర్గంలో రాబోయే మున్సిపల్ చైర్మన్ ఎన్నికలను తెలుగుదేశం కూటమి గెలుచుకుంటుందన్న ధీమా వ్యక్తం చేశారు. వైసీపీకి పులివెందుల ఇంకెంత మాత్రం కంచుకోట కాదని విస్పష్టంగా పేర్కొన్నారు.  దశాబ్దాలుగా తిరుగులేని ఆధిపత్యం చెలాయిస్తున్న పులివెందులలో కూటమి నేతలు నేరుగా సవాళ్లు విసురుతుండటం పులివెందులలో మసకబారిన వైసీపీ ప్రతిష్ఠకు, పలుకుబడికి నిదర్శనంగా పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. 
అయితే, ప్రస్తుతం సిద్ధమవుతున్న చార్జ్‌షీట్‌ను మరింత పటిష్టంగా రూపొందించేందుకు ఉన్నతాధికారులు ఢిల్లీలోని ప్రముఖ సుప్రీంకోర్టు న్యాయవాదులతో సంప్రదింపులు జరిపినట్లు తెలుస్తోంది. సాంకేతిక సాక్ష్యాలు, బాధితుల వాంగ్మూలాల ఆధారంగా ఈ అదనపు చార్జిషీట్ ను సిద్ధం చేస్తున్నట్లు సమాచారం.
స్థానిక  సన్నాహాలపై తెలుగుదేశం కూటమికి చెందిన దాదాపు 45 వేల మంది ముఖ్య నేతలు, ప్రజాప్రతినిధులు,  కార్యకర్తలతో  సీఎం చంద్రబాబు ఈ టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన వైసీపీపై చంద్ర నిప్పులు చెరిగారు.
కర్ణాటక ఎమ్మెల్సీ ఎన్నికల్లో 4-0తో ఎన్డీఏ క్లీన్ స్వీప్.!
జగన్‌ తాను మళ్లీ  అధికారంలోకి వస్తానంటూ జగన్ 2.o అంటూ చేసిన వ్యాఖ్యలకు పవన్ కల్యాణ్ మేం 10x చూపిస్తామంటూ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు.  తెలుగుదేశం కూటమి ప్రభుత్వ విధానాలను విమర్శిస్తూ జగన్ చేసిన హెచ్చరికలకు పవన్ కల్యాణ్  దీటుగా ఇచ్చిన స్ట్రాంగ్ కౌంటర్ పొలిటికల్ సర్కిల్స్ లోనూ, సోషల్ మీడియాలోనూ కూడా పెద్ద ఎత్తున చర్చకు తెరలేపింది.  
పులివెందుల నియోజకవర్గ పరిధిలో కూటమి అభ్యర్థులు స్పష్టమైన ఆధిపత్యాన్ని ప్రదర్శించారు. దశాబ్దాల కాలంగా ఎలాంటి ప్రతిఘటన లేకుండా ఏకపక్షంగా జగన్ కు పట్టుఉన్న నియోజకవర్గం పులివెందుల. అటువంటి పులివెందులలో ఎంపీటీసి జడ్పీటీసి స్థానాలను టీడీపీ  ఏకగ్రీవంగా కైవసం చేసుకుంది.
2019 ఎన్నికల్లో ఘనవిజయం సాధించిన తర్వాత   శైలిని ఒకింత మార్చుకున్నారు. 2024 ఎన్నికల ముందు వరకూ ఆయన పార్టీ నేతలు నోటి దురుసు ప్రదర్శించడాన్ని ప్రోత్సహించారు కానీ, స్వయంగా తాను ఒకింత సహనం చూపారు. అంత మాత్రాన రాజకీయ విలువలతో మృదు విమర్శలు చేశారని కాదు కానీ, అధికారంలోకి రావడానికి ముందున్నంత దూకుడు లేదని చెప్పాల్సి ఉంటుంది.
వైయస్ జగన్ ఇలాకాలో టీడీపీ 40 ఏళ్ళ చరిత్రను తిరగాసింది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.