అక్బరుద్దీన్ ఫై ఎంఎల్ఏ గా అనర్హత వేటు ?
Publish Date:Jan 7, 2013
Advertisement
ఇటీవల నిర్మల్ లో మత విద్వేషాలను రెచ్చగొట్టేలా ప్రసంగించిన ఎంఐఎం నేత అక్బరుద్దీన్ ఓవైసిఫై ఎంఎల్ఏ గా కొనసాగే అర్హత లేకుండా వేటు వేసే అవకాశం కనిపిస్తోంది. తాను చేసిన ప్రసంగాల ద్వారా ఆయన రాజ్యాంగ స్ఫూర్తికి విఘాతం కలిగించేలా వ్యవహరించారని శాసన సభ నైతిక విలువలు, ప్రవర్తన నియమావళి సంఘం ప్రాధమికంగా అభిప్రాయపడింది. బందరు సత్యానంద రావు అధ్యక్షతన నిన్న ఈ కమిటీ అసెంబ్లీ ప్రాంగణంలో సమావేశం అయింది. అక్బర్ చేసిన ప్రసంగాలను స్పీకర్ నాదెండ్ల మనోహర్ దృష్టికి తీసుకు వెళ్లి ఆయనఫై చర్య తీసుకోవాలని సిఫార్సు ఆ సంఘం భావిస్తోంది. ఈ కమిటీ తన నిర్ణయాన్ని స్పీకర్ దృష్టికి తీసుకు వెళ్ళిన సమయంలో తనకు కూడా ఈ విషయంలో ఫిర్యాదులు అందాయని మనోహర్ అన్నట్లు తెలిసింది. అయితే, ఇతర రాష్ట్రాల్లో ఉన్న నియమావళిని కూడా పరిశీలించాలని ఈ కమిటీ నిర్ణయించినట్లు సమాచారం. ఏదేని సభ్యుని ప్రవర్తన ఆధారంగా చర్య తీసుకోవాలని సిఫారసు చేసే అధికారం తమ కమిటీకి ఉందని బండారు అన్నారు. అయితే, అక్బర్ పేరును నేరుగా ప్రస్తావించకుండా ఓ సభ్యుడు చేసిన మత విద్వేషాల ప్రసంగాలు చర్చకు వచ్చాయని బండారు అన్నారు. ఏ సభ్యుడు అయినా, రాజ్యాంగ స్ఫూర్తికి విఘాతం కలిగేలా వ్యవహరిస్తే, ఆ సభ్యుని శాసనసభ్యత్వం రద్దు చేయాలని సిఫారసు చేసే అధికారం తమ కమిటీకి ఉందని బండారు అన్నారు.
http://www.teluguone.com/news/content/akbaruddin-owaisi-mla-disqualification-24-20284.html
సుబ్రతో రాయ్ అరెస్ట్ ...
ఖరారైన రాష్ట్రపతి పాలన ...
రాష్ట్రపతి పాలనకే మొగ్గు ...
విఫలమైన 'టి' కాంగ్రెస్
చంద్రబాబు పాదయాత్ర ఈ నెల 31న పునఃప్రారంభ౦ కానుంది. ఫిబ్రవరి నాల్గోతేదీ వరకు విజయవాడలో కోనసాగనుంది. ఆరోగ్య కారణాల రీత్యా చంద్రబాబు 29, 30లలో కూడా విశ్రాంతి తీసుకోనున్నారని తెలుగుదేశం నాయకులు ప్రకటించారు.
తెలంగాణ కాంగ్రెస్ ఎంపీలు కేకే నివాసంలో భేటి అయ్యారు. తెలంగాణపై పార్టీ అధిష్టానం వైఖరిని వ్యతిరేకిస్తూ పార్టీ సభ్యత్వానికి, పదవులకు కూడా రాజీనామా చేసి అధిష్టానం పై ఒత్తిడి పెంచేందుకు రంగం సిద్దం చేస్తున్నారు. రాజీనామా లేఖలను పార్టీ అధ్యక్షురాలు శ్రీమతి సోనియా గాంధి పంపించనున్నారు. భేటి అనంతరం లేఖలను మీడియాకు విడుదల చేయనున్నారు.
తెలుగు సినీ ప్రియులను తన అందచందాలతో, అసమానమయిన నటనతో ఒక ఊపుఊపిన అందాల తార జయప్రద, ఆ తరువాత బాలీవుడ్ లోను ఒక వెలుగు వెలిగింది. తెలుగుదేశంపార్టీలో జేరి రాష్ట్ర రాజకీయాలలో పాల్గొన్నపటికీ, చంద్రబాబుతో పొసగక ఏకంగా డిల్లీ రైలెక్కి ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలో వాలిపోయింది.
జానారెడ్డికి బుద్ది ,జ్ఞానం ఉందా? తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు మీద కాంగ్రెస్ ప్రకటన కోసం ఇంకా వేచిచూద్దాం అంటాడా. కాంగ్రెస్ ప్రకటనలో ఇంకా నిజాయితీ ఉందన్న జానారెడ్డి మాటలను తెలంగాణ ప్రజలు విశ్వసించరు. ముఖ్యమంత్రి పదవికోసం జానారెడ్డి గోతికాడ నక్కలా ఎదురు చూస్తున్నాడు.
వైయస్సార్ కాంగ్రెస్ చేపట్టిన కోటి సంతకాల సేకరణపై తెలుగుదేశం పార్టీ తీవ్ర విమర్శలు గుప్పించిన ఆరు నెలలకి ఇప్పుడు తాపీగా ఆ పార్టీ నేతలు స్పందించడం చూస్తుంటే ఆ పార్టీ నాయకత్వలోపం మరోసారి బయట పడుతోంది.
చంద్రబాబు తెలంగాణా జిల్లలో పాదయాత్ర చేస్తునంత కాలం తన వైయస్సార్ కాంగ్రెస్ పార్టీని, తన నాయకుడు జగన్ మోహన్ రెడ్డిని అయన ఎంత తీవ్రంగా విమర్శించినా స్పందించని కొడాలి నాని, చంద్రబాబు ఇప్పుడు తన కృష్ణా జిల్లాలో పాదయాత్ర చేస్తూ అదే విధంగా విమర్శలు చేసినప్పుడు మాత్రం వెంటనే స్పందించారు.
రాష్ట్ర రాజధానిలోఇందిరా పార్క్ వద్ద నేటి నుండి 36గంటల సమరదీక్షను నిర్వహించాలన్న పట్టుదలతో ఉన్న తెలంగాణా జేయేసీ నేతలు, పోలీసు ఆదేశాలను
నిర్విరామంగా సాగుతూ 117వ రోజుకు జేరుకొన్నచంద్రబాబు పాదయాత్ర ఈరోజు కృష్ణా జిల్లాలో పరిటాలకు చేరుకొంది. ముందు అనుకొన్న ప్రకారం అయితే ఈ రోజుతో ఆయన పాదయాత్ర ముగించాల్సి ఉంది. అయన కుటుంబ సభ్యులు, పార్టీ నేతలు మరియు వైద్యులు కూడా పాదయాత్ర ముగించమని కోరినప్పటికీ చంద్రబాబు తన పాదయాత్రను కొనసాగించడానికే నిశ్చయించుకొన్నారు.
తెలంగాణా జేయేసీ అద్వర్యంలో సికిందరాబాద్ లో ఇందిరా పార్క్ వద్ద 36గంటల సమరదీక్షకు అనుమతి కోరుతూ జేయేసీ నేతలు హోంమంత్రి సబితా ఇంద్రరెడ్డికి వినతిపత్రం సమర్పించగా, కొద్దిసేపటిలోనే వారికి అనుమతి నిరాకరిస్తున్నట్లు పోలీసుల నుండి వెంటనే లేఖ అందడంతో తెలంగాణావాదులు కిరణ్ కుమార్ రెడ్డి మీద, పోలీసుల మీద మండిపడ్డారు.





