మహిళా బిల్లుకు లోకసభలో మద్దత్తు ఇవ్వని మజ్లిస్ పార్టీ పట్ల ప్రజల్లో తప్పుడు సంకేతాలు వెళ్లకుండా పార్టీ నష్ట నివారణ చర్యలు తీసుకుంటుందా? అంటే అవుననే సమాధానం వస్తుంది. ఎందుకంటే మజ్లిస్ పార్టీ మహిళలకు రిజర్వేషన్ అమలు చేయాలని ప్రయత్నాలు చేస్తుందని పరిశీలకులు అంటున్నారు.
పురుషాధిక్య పార్టీగా ముద్రపడిన ఎంఐఎంలోకి త్వరలో ఓ మహిళా నేత ఎంట్రీ ఇవ్వనున్నారట.. ప్రజాసేవలో భాగమయ్యేందుకు లండన్ నుంచి వచ్చేస్తున్నారట. ఆ మహిళ మరెవరో కాదు పార్టీ శాసనసభాపక్ష నేత అక్బరుద్దీన్ ఓవైసీ కూతురు ఫాతిమా ఓవైసీ.. ప్రస్తుతం బారిష్టర్ చదువు కోసం లండన్ లో ఉన్న ఫాతిమా త్వరలోనే హైదరాబాద్ తిరిగి వస్తుందని అక్బరుద్దీన్ చెప్పారు. వచ్చాక ప్రజాసేవలో పార్టీ తరఫున పాల్గొంటుందని వివరించారు. ఈమేరకు సోమవారం నగరంలో జరిగిన ఓ కార్యక్రమానికి అక్బరుద్దీన్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. లండన్ నుంచి తన కూతురు ఫాతిమా తిరిగి వచ్చి ప్రజాసేవలో పాల్గొంటుందని తెలిపారు.
పార్టీపై పడిన పురుషాధిక్య ముద్రను చెరిపేసుకునే ప్రయత్నంలో భాగంగానే ఎంఐఎం పార్టీ మహిళా నాయకురాలిని రంగంలోకి దించేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. హైదరాబాద్‌లో ఎంఐఎం పార్టీకి ప్రజల్లో మంచి ఆదరణ ఉంది. ముఖ్యంగా పాతబస్తీలో ఎంఐఎంకు మంచి ఓటు బ్యాంకు ఉంది. ఈ క్రమంలో రాష్ట్రంలోని అన్నిచోట్లా ప్రభావం చూపాలని ఆ పార్టీ నేతలు భావిస్తున్నట్లు సమాచారం. ఇటీవల పార్లమెంట్ లో ప్రవేశ పెట్టిన మహిళా బిల్లును ఎంఐఎం వ్యతిరేకించింది. ఈ నిర్ణయం ప్రజల్లోకి తప్పుడు సంకేతాలను పంపినట్లు ఎంఐఎం నేతలు భావిస్తున్నారు. దీంతో జరిగిన పొరపాటును సరిదిద్దుకునే ప్రయత్నంలో భాగంగానే ఫాతిమా ఓవైసీని రాజకీయాల్లో తీసుకురావాలని నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. తద్వారా ఎంఐఎంలో మహిళలకు ప్రాధాన్యం కల్పిస్తామనే సందేశాన్ని జనంలోకి పంపించాలన్నది పార్టీ లక్ష్యమని చెబుతున్నారు. కాగా, పార్టీలోకి ఫాతిమా ఎంట్రీ ఇవ్వగానే ఎమ్మెల్యేగా నిలబెడతారా లేక ఏదైనా నామినేటెడ్ పదవి అప్పగిస్తారా అనే విషయంపై ఎంఐఎం వర్గాల్లో స్పష్టత లేదు.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/akbaruddin-owaisi-daughter-entry-in-politics-25-162780.html
బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ అఖండ విజయం సాధించడంలో సువేందు కీ రోల్ పోషించారు. ఆ పార్టీ 206 స్థానాల్లో గెలిచి బెంగాల్‌లో తొలిసారిగా అధికారం చేపట్టబోతోంది. బీజేపీ తరఫున రెండు స్ధానాల నుంచి బరిలోకి దిగిన సువేందు అధికారి.. మరోసారి మమతా బెనర్జీని ఓడించారు. భవానిపూర్‌లో దీదీపై గెలిచిన ఆయన.. తన సొంత నియోజకవర్గమైన నందిగ్రామ్‌లోనూ గెలిచి పట్టు నిలుపుకున్నారు.
ముఖ్యంగా అస్సాం, పశ్చిమబెంగాల్ లో బీజేపీ ఎన్నికల సంఘం సహకారంతో ఫలితాలను చోరీ చేసిందన్నారు.
పశ్చిమబెంగాల్‌లో మూడున్నర దశాబ్దాల ఏళ్ల సీపీఎం పాలనకు బ్రేక్ వేసి 2011లో అధికార పగ్గాలు చేపట్టిన తృణముల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్టీ.. 2026 వరకు వరుస విజయాలతో ముఖ్యమంత్రిగా కొనసాగారు. ఆమె 15 ఏళ్ల ఆధిపత్యానికి ఎన్డీఏ తెర దించింది. మమతా సైతం కాంగ్రెస్‌లో కేంద్రమంత్రిగా, పలు కీలక పదవులు నిర్వహించి, తర్వాత సొంత కుంపటి పెట్టుకున్న నాయకురాలే కావడం గమనార్హం.
ప్రజా సమస్యలపై స్పష్టమైన అజెండాతో ఎన్నికల బరిలోకి దిగిన విజయ్‌ను తమిళ ప్రజలు ఆదరించడం శుభపరిణామమన్నారు.
తన పార్టీ స్థాపించిన నాటి నుండి నేటి వరకు ఆయన సాగించిన ప్రయాణం ఒక అద్భుతమైన రాజకీయ థ్రిల్లర్‌ను తలపిస్తుంది. ఎన్నికల ప్రచార సమయంలో విజయ్ అనేక ఆటంకాలను ఎదుర్కొన్నారు. ప్రత్యర్థి పార్టీల నుండి వచ్చిన తీవ్ర విమర్శలు, అధికార యంత్రాంగం విధించిన ఆంక్షలు ఆయనను ఉక్కిరిబిక్కిరి చేశాయి. వ్యక్తిగత జీవితంపై జరిగిన దుష్ప్రచారం విజయ్ ఇమేజ్‌ను దెబ్బతీస్తుందని అందరూ భావించారు.
తమిళనాడులో టీవీకే పార్టీ విజయాన్నిస్వాగతిస్తూ.. వైసీపీ సోషల్ మీడియా వేదికగా సంబరాలు మొదలు పెట్టింది. విజయ్ సాధించిన ఈ అద్భుత విజయం వెనుక వైసీపీ అధినేత జగన్ సహకారం ఉందంటూ వైసీపీ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున పోస్టులు వెల్లువెత్తుతున్నాయి. ముఖ్యంగా గతంలో ఒక వివాహ వేడుకలో వైఎస్ జగన్, విజయ్ ఇద్దరూ కలిసి దిగిన ఒక ఫోటోను ఇప్పుడు వైసీపీ నెట్టింట వైరల్ చేస్తోంది.
ఈ ఎన్నికల ఫలితాల్లో విజయ్ టవీకే పార్టీ స్పష్టమైన ఆధిక్యత కనబరిచింది. ప్రభుత్వ వ్యతిరేకతతో పాటు, కూటమి పక్షాల మధ్య సరైన సమన్వయం లేకపోవడం కూడా ఈ ఓటమికి ప్రధాన కారణాలుగా కనిపిస్తున్నాయి.
1982లో తెలుగువారి ఆత్మగౌరవం నినాదంతో తెలుగుదేశం పార్టీని స్థాపించిన ఎన్టీఆర్, కేవలం 9 నెలల కాలంలోనే రాష్ట్రమంతటా పర్యటించి ప్రభంజనం సృష్టించారు. 1983 ఎన్నికల్లో కాంగ్రెస్ వంటి బలమైన పార్టీని మట్టికరిపించి, తొలి ప్రయత్నంలోనే ముఖ్యమంత్రి పీఠాన్ని అధిష్టించి రికార్డ్ సృష్టించారు.
భారత రాజకీయ యవనికపై భారతీయ జనతా పార్టీ తన ఉనికిని మరింత శక్తివంతం చేస్తోంది.
చారిత్రాత్మక విజయం ఖాయమని తేలడంతో.. విజయం అభిమానుల సంబరాలు మిన్నంటాయి. అయితే.. ఈ నేపథ్యంలో సినీ నటి త్రిష పేరు సోషల్ మీడియాలో విపరీతంగా ట్రెండ్ అవుతోంది.
ఈ నియోజకవర్గం నుంచిఎన్డీయూ కూటమి అభ్యర్థి మల్లాడి కృష్ణారావు విజయం సాధించారు. తన సమీప ప్రత్యర్థి, కాంగ్రెస్ అభ్యర్థి గొల్లపల్లి అశోక్ పై నాలుగువేల ఐదు వందల ఓట్ల పైచిలుకు మెజారిటీతో గెలుపొందారు.
ఎన్నికల ఫలితాల్లో ఎన్డీయే కూటమి సాధించిన ఘన విజయంపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు హర్షం వ్యక్తం చేశారు.
తట్టంచావడి నియోజకవర్గం నుంచి ఆయన భారీ మెజారిటీతో విజయం సాధించారు. ఆయన పోటీ చేసిన మరో స్థానమైన మంగళంలోనూ భారీ ఆధిక్యంలో కొనసాగుతున్నారు.