కష్టాల్లో ఎయిర్ ఇండియా.. మూకుమ్మడి రాజీనామాకు సిద్దమైన పైలెట్లు
Publish Date:Oct 16, 2019
Advertisement
ఎయిరిండియా పీకల్లోతు సంక్షోభంలో మునిగింది. ఓ పక్క ఇంధన కస్టాలు వెంటాడుతుంటే మరోపక్క పైలెట్లు సహాయ నిరాకరణ మొదలుపెట్టారు. మూకుమ్మడి రాజీనామాలకు దిగారు, మొన్నటి జట్టు సంక్షోభం మరిచిపోకముందే ఎయిరిండియా క్రైసిస్ దేశీయ విమానయాన రంగంలో సంక్షోభానికి కారణం అవుతోంది.కష్టాల్లో ఎయిరిండియా ఉంది. మూకుమ్మడి రాజీనామాకు రెడీ అయిన పైలెట్లు, ఆర్ధిక సంక్షోభంలో ఎయిరిండియా.ఎయిర్ ఇండియా భారంగా ఎగురుతోంది. ఇప్పటికే ఓ పక్క ఇంధన కష్టాలు వెంటాడుతున్నాయి. మరోపక్క పైలెట్లు మూకుమ్మడి రాజీనామాకు సిద్ధమయ్యారు.వేతనాల పెంపు ప్రమోషన్లపై ప్రభుత్వ వైఖరే ఇందుకు కారణమంటున్నారు. ఇప్పటికే జెట్ ఎయిర్ వేస్ మూతతో కష్టాల్లో ఉన్న విమానయాన రంగానికి ఇప్పుడు ఎయిరిండియా సంక్షోభం తలనొప్పిగా మారింది .తమ డిమాండ్ల సాధన కోసం ఎయిర్ బస్ ఎ త్రీ ట్వంటీ పైలెట్లు నూట ఇరవై మంది ఇప్పటికే రాజీనామా చేశారు. అయితే పైలెట్ల మూకుమ్మడి రాజీనామా వల్ల విమాన సర్వీసులకు ఎలాంటి అంతరాయం కలగదంటోంది ప్రభుత్వం. పైలెట్లు సరిపడా ఉన్నారంటోంది. మొన్నటికి మొన్న జెట్ ఎయిర్ వేస్ మూతపడగా తాజాగా ఎయిరిండియాను నష్టాలతో ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయింది .అయితే అరవై వేల కోట్ల అప్పుల ఊబిలో కూరుకుపోయిన ఎయిరిండియాను విక్రయించాలని ప్రభుత్వం నిర్ణయించుకుంది. ఎయిరిండియా విక్రయాన్ని కచ్చితంగా పూర్తి చేయాలని భావిస్తోంది కేంద్రం.ఇందులో భాగంగా ఇన్వెస్టర్లకు అభ్యంతరకరంగా ఉన్న నిబంధనలను సవరించడం పై కసరత్తు చేస్తోంది. దీని ప్రకారం ఎయిర్ ఇండియా నుంచి కేంద్రం పూర్తిగా నిష్క్రమించే అవకాశముండగా దాదాపు తొంభై ఐదు శాతాన్ని విక్రయించాలని కేంద్రం భావిస్తోంది. కొనుగోలుదారులపై భారీ రుణభారం పడకుండా చూడటం ప్రైవేటీకరణ ప్రక్రియ నిబంధనల సడలింపు గట్టి చర్యలు తీసుకుంటోంది ప్రభుత్వం. ఎయిరిండియా ప్రైవేటీకరణ తర్వాత కూడా ప్రభుత్వం ఇరవై నాలుగు శాతం వాటాలను తనదగ్గరే ఉంచుకుంటుందన్న నిబంధన కారణంగా ఇన్వెస్టర్లు ముందుకు రావడం లేదు. వాటాలు కొనుగోలు చేసిన ఇన్వెస్టర్లు కంపెనీ నిర్వహణకు అవసరమైన నిధులను సమీకరించుకునేందుకు లాకిన్ వ్యవధిలేకుండా కొన్ని వాటాలను తక్షణం విక్రయించుకునే వెసులుబాటు కూడా కల్పించనుంది.అసలే నష్టాలతో కుదేలైన ఎయిరిండియాను నడిపించడానికి అవసరమైన నిధులను సమీకరించడానికి ఈ నిబంధన సమస్యగా మారుతుందని పరిశ్రమ వర్గాలు భావించాయి. ఎయిరిండియాకు రుణాలివ్వడానికి బ్యాంకులు ముందుకు రావు కాబట్టి కొత్త యజమాని తాను కోరుకున్న వాటాలను విక్రయించుకుంటే గానీ నిధులు సమకూర్చుకోవడం కుదరదు.అందుకోసం లాకింగ్ నిబంధనను పక్కన పెట్టి ఆలోచనలో ఉన్నారు. నిజానికి ఎయిరిండియాను విక్రయించేందుకు గతంలో రెండు సార్లు ప్రయత్నాలూ జరిగాయి ,రెండు వేల ఒకటిలో ఒకసారి మళ్లీ రెండు వేల పధ్ధెనిమిదిలో మరోసారి కేంద్రం ప్రయత్నించింది. కానీ ఈ రెండూ విఫలం కావడంతో ముచ్చటగా మూడో సారి ప్రయత్నిస్తూ ఆర్ధిక సంక్షోభంలో ఉన్న ఎయిరిండియాను గట్టెక్కించేందుకు కేంద్రం రెండు వేల పదహారు, పదిహెడు ఆర్థిక సంవత్సరంలో రెండు వేల నాలుగు వందల అరవై ఐదు కోట్లు, రెండు వేల పదిహెడు ,పధ్ధెనిమిదిలో పధ్ధెనిమిది వందల కోట్లు, రెండు వేల పధ్ధెనిమిది, పంతొమ్మిదిలో మూడు వేల తొమ్మిది వందల డెబ్బై ఐదు కోట్ల మేర నిధులు సమకూర్చింది.
http://www.teluguone.com/news/content/air-india-faces-mass-resignation-ahead-of-divestment-25-90156.html





