Publish Date:Apr 21, 2022
మావోయిస్టులు. దట్టమైన అడవులే వారి అడ్డా. రాళ్లు, రప్పలు, చెట్ల మాటున మనుగడ సాగిస్తుంటారు. ఉనికి కోసం అప్పుడప్పుడు దాడులకు తెగబడుతుంటారు. నిత్యం పోలీసులు, స్పెషల్ ఫోర్సెస్తో బతుకు పోరాటం చేస్తుంటారు. ఎంతకా ఉక్కుపాదం మొపుతున్నా.. ఎంతమంది మావోయిస్టులను ఎన్కౌంటర్ చేస్తున్నా.. ఇప్పటికీ అడవిబిడ్డలు, ఎర్రజెండాలు పోలీసులకు కఠిన సవాళ్లే విసురుతున్నారు. ఇటీవల మావోల దాడులు మరింత పెరగడంతో.. భద్రతా బలగాలు స్పెషల్ ఆపరేషన్ చేపట్టాయి. తొలిసారి వైమానిక దాడులతో సంచలనం రేపాయి.
ఛత్తీస్గఢ్ రాష్ట్రం జీజాపూర్ జిల్లా బస్తర్లో తమపై వైమానిక దాడులు జరిగినట్టు మావోయిస్టుల కమిటీ ఓ ప్రకటన రిలీజ్ చేసింది. ఈ నెల 14, 15 తేదీల్లో జరిగిన ఈ దాడుల నుంచి తృటిలో తప్పించుకున్నట్టు తెలిపింది. కొట్టాం, రసం, ఈరం, సకిలేర్, మడప, దూలెడ్, కన్నెమార్క, పోతేమంగుం, బోతం ప్రాంతాల్లో ఈ వైమానిక దాడులు జరిగినట్టు వెల్లడించింది. అయితే అవి పక్కాగా వైమానిక దాడులా.. లేక డ్రోన్ అటాక్స్ చేశారా అనే విషయంలో స్పష్టత లేదు.
అదేదో బోర్డర్లో.. శత్రుదేశంలో ఎయిర్ అటాక్ చేసినట్టు.. దేశంలోనే.. మన భూభాగంలోనే.. మన భద్రతా దళాలే.. ఇలా వైమానిక దాడులు చేయడం ఒకింత ఆశ్చర్యకరమే. ఇన్నాళ్లూ.. గన్ టు గన్ జరిగిన పోరు.. ఇప్పుడిలా ఎయిర్ అటాక్స్ స్థాయికి చేరుకోవడం సంచలనమే..అంటున్నారు.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/air-attack-on-maoists-25-134745.html
రాజకీయ నాయకులపై ప్రజలకు ఉండే అభిమానం ఒక్కోసారి అసాధారణ రీతిలో వ్యక్తమవుతుంది.
టాలీవుడ్ సినీ పరిశ్రమలో వరుస వెడ్డింగ్ బెల్స్ మోగుతున్నాయి. ఇప్పటికే పలువురు యంగ్ హీరోలు వైవాహిక జీవితంలోకి అడుగుపెడుతుండగా
దీపావళి పండగ అనగానే ప్రతి ఇంటా సంబరాలు, బాణసంచా చప్పుళ్లు సర్వసాధారణం.
వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి తీరుపై ఆ పార్టీ నుంచి బయటకు వచ్చిన మాజీ ఎంపీ విజయసాయి రెడ్డి తీవ్రస్థాయిలో మండిపడ్డారు.
చెన్నై వేదికగా ఇటీవల వైఎస్ అనిల్ కుమార్ రెడ్డి కుమార్తె వివాహం ఎంతో వైభవంగా జరిగింది.
అప్పుడప్పుడే లోకాన్ని చూడటం మొదలుపెట్టింది. అమ్మా నాన్నల ఒడిలో గోరుముద్దలు తింటూ.. బుడిబుడి అడుగులు వేస్తూ ఆడుకోవాల్సిన వయసు.
తుఫాను కారణంగా చీరాల మన్సిపాల్టీలో ఓట్ల లెక్కింపు శుక్రవారం (నవంబర్ 5) జరుగుతోంది. ఇప్పటి వరకు ఎక్కడా కనీసం డిపాజిట్ కూడా దక్కని కాంగ్రెస్ ఖాతాలో తొలి విజయం నమోదైంది. కాంగ్రెస్ పార్టీ చీరాల మునిసిపోల్స్ లో గట్టి పోటీ ఇచ్చింది. 25వ వార్డులో విజయం సాధించింది. 25వ వార్డు నుంచి బరిలోకి దిగిన కాంగ్రెస్ అభ్యర్థి వెంకట్రావు విజయం సాధించారు.
పోలింగ్ సరళి, వెలువడిన ఫలితాలు వైసీపీ శిబిరంలో ఆందోళన కలిగిస్తుంటే వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్ మాత్రం మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తూ, అధికార తెలుగుదేశం కూటమి అరాచకాలు, అధికార దుర్వినియోగం తమ ఓటమికి కారణాలుగా చూపడానికి ప్రయత్నిస్తున్నారు. ఎన్నికల ఫలితాల వెల్లడి తర్వాత వైఎస్ జగన్ నిర్వహించిన ఈ మీడియా సమావేశంలో జగన్ చెప్పిందే చెప్పారు.
ప్రతిరోజూ ఉదయం మనం ఎంతో ఆరోగ్యకరమని భావించి తాగే పాలు అసలు సిసలైనవేనా? లేక ప్రాణాల మీదకు తెచ్చే విషపూరిత కల్తీ పాలా? అనే ప్రశ్న ఇప్పుడు హైదరాబాద్ ప్రజలను తీవ్ర ఆందోళనకు గురిచేస్తోంది
హైదరాబాద్ నగరంలో నిత్యం రాకపోకలు సాగించే లక్షలాది మంది ప్రయాణికులకు రాష్ట్ర ప్రభుత్వం తీపి కబురు అందించింది
కాంగ్రెస్, కమ్మూనిస్టుల మద్దతుతో ఎన్నికల బరిలోకి దిగిన ఏబీవీకి ఘోర పరాజయం ఎదురైన సంగతి తెలిసిందే. కమ్యూనిస్టులకు అంతో ఇంతో పట్టున్న ప్రాంతాలలో కూడా ఆయనకు ఓట్లు రాలలేదు. ఇక కాంగ్రెస్ మద్దతు ఆయనకు ఎందుకూ కొరగాకుండా పోయింది.
ఈ వేడుకలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి, కేటీఆర్, విజయ్ ఒకే దగ్గర చేరి సరదాగా ముచ్చటించుకోవడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.