ఖర్గేదే కాంగ్రెస్ అధ్యక్ష పీఠం కానీ...పెత్తనం మాత్రం?

Publish Date:Oct 15, 2022

Advertisement

కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికల క్రతువు ఆఖరి ఘట్టానికి చేరుకుంది. మరో రెండు రోజుల్లో , అక్టోబర్ 17 పోలింగ్ జరుగుతుంది. 19 కౌంటింగ్. అయితే  ఫలితం కోసం అంతవరకూ ఆగవలసిందేనా అంటే  అవసరం లేదు. నిజమే ఇంచుమించుగా పాతికేళ్ళ తర్వాత జరుగతున్న కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికలో పార్టీ సీనియర్ నాయకుడు మల్లికార్జున ఖర్గే, మరో సీనియర్ నేత శశి థరూర్ పోటీ పడుతున్నారు. 

అయితే, ‘కాపురం చేసే కళ కాళ్ళ పారాణి దగ్గరే తెలుస్తుంది’ అన్నట్లు నామినేషన్  వేసిన నాడే, శశి థరూర్ భవిష్యత్ ఏమిటో, తెలిసి పోయింది. ఎంత కాదన్నా, మల్లికార్జున ఖర్గే  సోనియా గాంధీ సెలెక్ట్ చేసిన పార్టీ అధిష్టానం అఫీషియల్ కాండిడేట్. అందులో ఎవరికీ ఎలాంటి అనుమానం అక్కరలేదు. గాంధీలు (సోనియా, రాహుల్, ప్రియాంక) కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికలకు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నారు. అంతే ఎవరు పోటీ చేసినా తటస్థంగా ఉండాలని సంకల్పం చెప్పుకున్నారు. శశి థరూర్, కాంగ్రెస్ పార్టీ సభ్యులు ఎవరైనా ఎవరైనా పోటీ చేయవచ్చని  సోనియా గాంధీ  గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.  చివరకు ఏమి జరగాలో అదే జరిగింది. 

నిజానికి సోనియా గాంధీ ఏరికోరి  కాంగ్రెస్ అధ్యక్ష పదవికి రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గేహ్లోట్ ను ఎంపిక చేశారు. అధిష్టానం అభ్యర్ధిగా ఆయన్ని బరిలో దించాలని ఆశించారు. అందుకు ఆయన అంతగా సుముఖత చూపక పోయినా, ఆయన్ని ఒప్పించారు. అయితే, రాజస్థాన్ ముఖ్యమంత్రి పదవిని వదులుకోలేక గేహ్లోట్ అనూహ్యంగా ‘దమ్కీ’ ఇవ్వడంతో సోనియా గాంధీ  దిగ్విజయ్ వైపు కొద్దిగా మొగ్గుచూపినా చివరకు  మల్లికార్జున ఖర్గేను ఎంపిక చేశారు. రాత్రికి రాత్రి నిద్రలేపి మరీ  ఎనిమిది పదుల ఖర్గేను  నామినేషన్ కు సిద్ధం చేశారు. 

ఇక శశి థరూర్  సంగతి చెప్పనే అక్కరలేదు. గాంధీల నాయకత్వాన్ని సవాలు చేసిన జీ 23 సభ్యుడు. సో, సోనియా గాంధీ ఆశీస్సులు ఎవరికున్నాయో వేరే చెప్పనవసరం లేదు. సో ..సో రేపు గెలిచేది ఎవరో గాంధీల ఆశీస్సులతో కాంగ్రెస్ అధ్యక్ష పదవిని అందుకునేది ఎవరో వేరే చెప్పనక్కరలేదు. కొంచెం ఆలస్యంగానే అయినా, శశి థరూర్ కు విషయం అర్థమైనట్లుంది. అందుకే ఆయన తీరిగ్గా అభ్యర్థులకు సమాన అవకాశాలు లేవని  అభ్యర్థుల మధ్య తారతమ్యాలు చూపుతున్నారని అయిన వారికి ఆకుల్లో కానీ వారికీ కంచాల్లో అన్నట్లుగా పార్టీ నేతలు  కార్యకర్తలు వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. అవును మరి నాడా దొరికిందని గుర్రాన్ని కొంటే ఇలాగే ఉంటుంది. 

అయితే నిజానికి ఇప్పడు కాంగ్రెస్ అధ్యక్షుడు ఎవరు అవుతారు అనేది అసలు ప్రశ్నే కాదు. ‘జరిగినమ్మ జల్లెడతోనైనా నీళ్ళు తెస్తుంది’ అన్నట్లు అధిష్టానం అండదండలున్న మల్లిఖార్జున ఖర్గే సునాయాసంగా అధ్యక్ష పదవిని అందుకుంటారు. అందులో సందేహం లేదు. అయితే  ఇప్పుడు ప్రశ్న అది కాదు. కాంగ్రెస్ పార్టీని ఏ విధంగా ముందుకు తీసుకుపోతారు  అన్నదే అసలు ప్రశ్న. ఆ ప్రశ్నకు సమాధానం ఎప్పటిలానే  అన్నదే సమాధానం. శశి థరూర్, తనకు అవకాశం ఇస్తే  అధిష్టానం సంస్కృతి చేరిపేస్తానని చెప్పారు. కానీ ఖర్గే ఇతర విధేయ నాయకులు  పార్టీ అధ్యక్షుడు ఎవరైనా కావచ్చుని కానీ, సోనియా గాంధీ, రాజమాతగా, రాహుల్ గాంధీ కాంగ్రెస్ రారాజుగా కొనసాగుతారని చెపుతున్నారు. ఖర్గే అధ్యక్షుడిగా ఉంటారు. రాహుల్ గాంధీ నాయకుడిగా కొనసాగుతారు. అంతే కాదు 2024 ఎన్నికలలో రాహుల్ గాంధీనే కాంగ్రెస్ ప్రధాని అభ్యర్ధి అవుతారు. ఇది కాంగ్రెస్ విధేయ నాయకులలోనే కాదు  అందరిలో ఉన్న అభిప్రాయం. 

అయితే  ఇందుకు సంబధించి ఖర్గే  కాసింత ఆసక్తికర సమాధానం ఇచ్చారు. ఆ నిర్ణయం ఏదో పార్టీ అధిష్టానం తీసుకుంటుందని కాకుండా  అధ్యక్షుడిగా ఎన్నికైన తర్వాత ఆ నిర్ణయం ఏదో  తానే తీసుకుంటానని అన్నారు. అంతే కాదు, ‘బక్రీద్ మే బచేంగే తో.. మొహారం మే నాచేంగే’  అంటూ ఉర్దూ సామెతను ఉటంగించారు. అంటే, బక్రీద్ వేటు నుంచి బయటపడితే మొహారంలో నాట్యం చేయచ్చని చెప్పారు.   

అయితే కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఎవరు గెలిచినా నిర్ణయాలు తీసుకునే అధికారం సోనియా కుటుంబానిదే అని పరిశీలకులు చెబుతున్నారు.  2024 లోక్‌సభ ఎన్నికలకు ప్రధాని అభ్యర్ధిగా రాహుల్ గాంధీయే ఉండాలని ఖర్గే సహా కాంగ్రెస్ నాయకత్వమంతా ఉమ్మడిగా కోరుకుంటోంది. వాస్తవానికి కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష పదవి కూడా రాహులే చేపట్టాలని కాంగ్రెస్ పార్టీ నాయకులంతా కోరుకున్నారు. అయితే అధ్యక్ష పదవి చేపట్టేందుకు రాహుల్ ససేమిరా అన్నారు.

సోనియా కుటుంబం బయటవారే ఈసారి కాంగ్రెస్ పార్టీకి నేతృత్వం వహించాలని రాహుల్ పట్టుబట్టారు. అందుకే ఖర్గే,  థరూర్ బరిలో నిలిచారు. ఇద్దరిలో ఎవరు గెలిచినా పార్టీ తరపున రాహుల్ గాంధీనే ప్రధాని అభ్యర్ధిగా ప్రతిపాదిస్తారని రాజకీయ పరిశీలకులు అంచనా వేస్తున్నారు. అయితే  బాధ్యతలు లేని అధికారానికి అలవాటుపడిన రాహుల్ గాంధీ అందుకైనా అంగీకరిస్తారా? మోడీని ఢీ కొంటారా? అంటే అనుమానమే .. అంటున్నారు.

By
en-us Political News

  
శంషాబాద్ వద్ద హైదరాబాద్-బెంగళూరు జాతీయ రహదారిపై ఊహించని ఘటన చోటుచేసుకుంది.
దశాబ్దాలుగా పెండింగ్‌లో ఉన్న అర్బన్ ల్యాండ్ సీలింగ్‌ (ULC) దరఖాస్తుల పరిష్కారానికి తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.
హైదరాబాద్‌లో కుటుంబ కలహాలు విషాదాంతమయ్యాయి
ఉత్తరాంధ్ర రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది.
పంజాబ్‌లోని ప్రసిద్ధ లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీ క్యాంపస్‌లో శనివారం రాత్రి ఊహించని పరిణామాలు చోటుచేసుకున్నాయి.
ఆ సమయంలో తాను కేరళ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా విధులు నిర్వర్తిస్తుండగా, గ్యానేష్ కుమార్ కేంద్ర హోంమంత్రిత్వ శాఖలో ఉన్నతాధికారిగా సేవలందిస్తున్నారని గుర్తుచేశారు. ప్రయాణ సమయంలో తన రిటైర్మెంట్ అనంతర ప్రణాళికల గురించి  ఆరా తీసిన జ్ణానేష్ కుమార్‌.. ఆ సందర్భంలోనే బీజేపీ తరఫున పతనం తిట్ట లోక్‌సభ స్థానం నుంచి పోటీ చేయాలని సూచించారన్నారు. 
ఈ నియోజకవర్గంలో గత ఎన్నికల ఫలితాలు,  ప్రస్తుత రాజకీయ వాతావరణం దృష్ట్యా బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీలు విజయంపై ధీమాతో ఉన్నాయి. ఈ నేపథ్యంలో టీఆర్ఎస్ బరిలోకి దిగడంతో సమీకరణాలు ఏ విధంగా మారతాయన్న దానిపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. 
ప్పటి వరకూ మోడీ సర్కార్ ఘనంగా చెప్పుకుంటూ వచ్చిన పారదర్శకత ప్రశ్నార్థకమైంది.  రాజ్యాంగ వ్యవస్థలు బలహీనపడ్డాయన్న వాదనకు బలం చేకూరింది. అంత వరకూ విపక్షాలు చేసే విమర్శలను సునాయాసంగా తిప్పికొట్టి పై చేయి సాధించిన మోడీ సర్కార్ నీటి విషయంలో సమాధానం చెప్పుకోలేక తడబడింది. వెనకడుగు వేసింది. 
ఎంతటి సంక్షోభాన్నైనా సంయమనం కోల్పోకుండా అధిగమించడం, ఆ సంక్షోభాన్నే అవకాశంగా మలచుకుని ముందుకు సాగడం ఆయన నైజం. ఎంతటి క్షిష్టమైన సమస్యనైనా  పరిష్కరించగలిగే నేర్పు, ఎంతటి సంక్షోభాన్నైనా తట్టుకునిముందుకు సాగే సామర్ధ్యం కారణంగానే ఆయనకు పొలిటికల్ సర్కిల్స్ లొ  క్రైసిస్ మ్యాన్ అన్న గుర్తింపు వచ్చింది. 
వ్యవసాయ రంగానికి పెద్దపీఠ వేసేలా చంద్రబాబు  35 వేలకోట్ల రూపాయల అంచనాతో  సాగునీటి రోడ్‌మ్యాప్‌ను ప్రకటించారు. దీని ద్వారా రాష్ట్రవ్యాప్తంగా పెండింగ్‌లో ఉన్న 36 సాగునీటి ప్రాజెక్టులను వేగంగా పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. అంతేకాకుండా..  దేశంలోనే తొలిసారిగా ఆంధ్రప్రదేశ్‌లో  ఇరిగేషన్ అండ్ వాటర్ క్యాలెండర్ ను అందుబాటులోకి తెచ్చారు.
ఎన్నికలు రిగ్గింగ్ అవుతున్నాయని తెలిసినా, ప్రతిపక్షాలు మళ్లీ అవే ఎన్నికల్లో పాల్గొంటూ ఆ పద్ధతికి చట్టబద్ధత ఎందుకు కల్పిస్తున్నాయని ప్రశ్నించి సంచలనం సృష్టించారు.  ఓట్లు చోరీకి గురవుతున్నా, ఎమ్మెల్యేలు, ఎంపీలు కొనుగోలుకు గురవుతున్నా, పార్టీలు చీలిపోతున్నా కేవలం ఉనికి కోసమే పోరాడుతున్నారా అని నిలదీశారు.
వైసీపీకి చెందిన పలువురు నాయకులు జనసేన పార్టీలో చేరారు.
ఎండిన నదిలో గంగమ్మ పరవళ్లు.. కరువు నేలపై జలకళ.!
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.