ఏఐ విప్లవం.. ప్రభుత్వాలపై భారం!

Publish Date:Apr 17, 2026

Advertisement

పని ఉండదు.. ప్రజలకు ప్రభుత్వమే డబ్బులివ్వాల్సిన రోజులు వస్తాయి.. ఎలాన్ మస్క్

 సాంకేతిక ప్రపంచంలో నిత్యం సంచలనాలకు కేంద్రబిందువుగా ఉండే టెస్లా అధినేత ఎలాన్ మస్క్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) ప్రభావంపై   ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కృత్రిమ మేధ కారణంగా రానున్న కాలంలో  మానవ జీవనశైలిని పూర్తిగా మారిపోతుందన్నారు.  ముందు ముందు మనిషి తన ఉనికి కోసం, కనీస అవసరాల కోసం పని చేయాల్సిన అవసరం లేని రోజులు రాబోతున్నాయన్నారు.  


సాఫ్ట్‌వేర్ ఇంజనీర్లు, డ్రైవర్లు మాత్రమే కాకుండా, భవిష్యత్ లో అత్యంత నైపుణ్యం కలిగిన వైద్యులు, సర్జన్ల అవసరం కూడా తగ్గిపోయే ప్రమాదం ఉందన్న ఆయన.. ప్రస్తుతం టెస్లా అభివృద్ధి చేస్తున్న  ఆప్టిమస్ వంటి హ్యూమనాయిడ్ రోబోలు మనుషుల కంటే అత్యంత వేగంగా, కచ్చితత్వంతో పనులను పూర్తి చేయగలవన్నారు.  

ఏఐ రంగం పదిరెట్లు వేగంగా వృద్ధి చెందుతోందని, ఈ క్రమంలో ఉద్యోగ అవకాశాలు కోల్పోయే సగటు మనిషికి ఆర్థిక భరోసా కల్పించడం ప్రభుత్వాల బాధ్యతగా మారుతుందన్నారు.   ఎలాన్ మస్క్ వ్యాఖ్యలు   సామాజిక మాధ్యమాల్లో  వైరల్ అవుతున్నాయి.  

By
en-us Political News

  
ప్రపంచవ్యాప్తంగా కేంద్ర బ్యాంకులు, ఇన్వెస్టర్లు ఫియాట్ కరెన్సీలను అమ్మి, వాటి స్థానంలో బంగారం వంటి హార్డ్ అసెట్స్ కొనుగోలు చేసే ధోరణినే డీబేస్మెంట్ ట్రేడ్ అంటారు.
ముఖ్యంగా రెండో విడతలో భూములిచ్చిన రైతులకు ఏడాదికి ఎకరానికి రూ. 40,000 చొప్పున పదేళ్ల పాటు కౌలు చెల్లిస్తామని ప్రకటించారు.  ఇది గతంలో కంటే మెరుగైన ప్యాకేజీ కావడంతో రైతులు హర్షం వ్యక్తం చేశారు.
జేఎన్టీయూ నుంచి కూకట్‌పల్లి వైపు వెళ్తున్న సమయంలో బస్సులో ఒక్కసారిగా పొగలు రావడంతో ప్రయాణికులు భయాందో ళనకు గురయ్యారు. ఘటన జరిగిన సమయంలో బస్సులో 40 మందికి పైగా ప్రయాణికులు ఉన్నట్లు సమాచారం.
హర్మూజ్ ను ఓపెన్ చేస్తున్నట్లు ప్రకటించిన గంటల వ్యవధిలోనే.. అమెరికా, ఇరాన్ మధ్య మాటల యుద్ధం మరోసారి పీక్స్ కు చేరింది. హ‌ర్మూజ్‌పై అమెరికా నౌకా దిగ్బంధనం పూర్తి స్థాయిలో కొనసాగుతుందని అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించడంతో ఇరాన్ తీవ్రంగా స్పందించింది.
డీలిమిటేషన్ బిల్లులో ఉన్న పాకిస్థాన్ ఆక్రమిత కశ్మీర్ (పీవోకే) లోని నియోజకవర్గాల పునర్విభజన చేసే అధికారాన్ని కేంద్ర ఎన్నికల సంఘానికి కట్టబెడుతూ డీ లిమిటేషన్ బిల్లులోని ప్రతిపాదనలపై పాకిస్థాన్ విదేశాంగ శాఖ అసహనం వ్యక్తం చేస్తూ, ఈ ప్రక్రియను తాము వ్యతిరేకిస్తున్నట్లు ప్రకటించింది.
టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ ఎంచుకున్న కోల్‌కతా నైట్ రైడర్స్‌కు ఆరంభంలోనే ఎదురుదెబ్బ తగిలింది. కెప్టెన్ అజింక్యా రహానే డకౌట్‌గా వెనుదిరిడాడు. అయితే, స్టార్ బ్యాటర్ కామెరూన్ గ్రీన్ 55 బంతుల్లో 7 ఫోర్లు, 4 సిక్సర్లతో 79 పరుగులు పరుగులు చేసి జట్టును ఆదుకున్నాడు. కామెరూన్ గ్రీన్ కు రోవ్‌మన్ పావెల్, రమణ్‌దీప్ సింగ్ సహకారాన్ని అందించారు.
లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ చేసిన ప్రసంగంపై బీజేపీ ఎంపీ, నటి కంగనా రనౌత్ అత్యంత ఘాటుగా స్పందించారు.
డీలిమిటేషన్ బిల్లు లోక్‌సభలో వీగిపోవడంపై తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి హర్షం వ్యక్తం చేశారు.
అంతర్జాతీయ చమురు రవాణాలో ఈ మార్గం అత్యంత ప్రాధాన్యత కలిగినదని, దీని ద్వారానే ప్రపంచంలోని మూడో వంతు ముడి చమురు సరఫరా జరుగుతుందని తెలిసిందే. తాజాగా లెబనాన్, ఇజ్రాయెల్ మధ్య కుదిరిన కాల్పుల విరమణ ఒప్పందం నేపథ్యంలో ఇరాన్ ఈ నిర్ణయం తీసుకుంది.
వైసీపీ సోషల్ మీడియా మాజీ ఇన్‌చార్జ్ సజ్జల బార్గవ్ రెడ్డి, ఇతర నిందితులపై ఆంధ్రప్రదేశ్ హైకోర్టు తీవ్ర పదజాలంతో ఆగ్రహం వ్యక్తం చేసింది.
లోక్‌సభలో మహిళా రిజర్వేషన్ బిల్లు వీగిపోవడంపై తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత తీవ్రంగా స్పందించారు.
లైంగిక వేధింపులే కాకుండా, బలవంతపు మత మార్పిడిలు, గూమింగ్, అంతర్జాతీయ హ్యూమన్ ట్రాఫికింగ్ నెట్‌వర్క్, టెర్రర్ ఫండింగ్ లాంటి తీవ్రమైన అంశాలు ఈ కేసులో ముడిపడి ఉన్నట్లు ప్రాథమిక ఆధారాలు లభించాయి.
ఇది కేవలం బిల్లు ఓటమి కాదని, భారత ప్రజాస్వామ్యం సాధించిన గొప్ప విజయమని రాహుల్ గాంధీ అభివర్ణించారు
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.