టీవీకే ప్రచారంలో ఏఐ!
Publish Date:Apr 13, 2026
Advertisement
భారత ఎన్నికల ప్రచారంలో గతంలో ఎన్నడూ చూడని విధంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) రంగ ప్రవేశం చేసింది. రాజకీయ ప్రచారాల్లో సాధారణంగా నాయకులు ప్రత్యక్షంగా ర్యాలీలు నిర్వహిస్తారు. అలాగే సామాజిక మాధ్యమ వేదిక ద్వారా సందేశాలు పంపిస్తారు. అయితే ఈ సారి తమిళనాట సాంకేతిక విప్లవాన్ని కూడా ప్రచారంలో జోడించారు. తమిళరాజకీయాలలోకొ కొత్తగా ప్రవేశించిన నటుడు విజయన్.. తన ప్రచార సరళిని కొత్త పుంతలు తొక్కిస్తున్నారు. ప్రముఖ నటుడు, తమిళగ వెట్రి కళగం (టీవీకే) అధినేత దళపతి విజయ్ తన పార్టీ అభ్యర్థుల కోసం ప్రచారం చేయడానికి ఏఐని వినియోగించుకుంటున్నారు. తమిళనాడులో ఆదివారం (ఏప్రిల్ 12) జరిగిన ఒక రోడ్‌షోలో హలోగ్రాఫిక్ ఏఐ టెక్నాలజీని ఉపయోగించారు. విజయ్ స్వయంగా అక్కడ ప్రచారంలో పాల్గొన లేదు. కానీ ఏఐ ద్వారా విజయ్ రూపం, గొంతుఓటర్ల ముందుకు తీసుకువచ్చారు. దీనికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నాయి. ప్రజలు తమ అభిమాన నాయకుడు సాక్షాత్తు తమ మధ్యే నిలబడి మాట్లాడుతున్నట్లు భావించేలా ఆ ప్రచారం సాగింది. ఈ ప్రచారంలో దృశ్య రూపంతో పాటు విజయ్ గొంతును కూడా ఏఐ ద్వారా రీ-క్రియేట్ చేసి ప్రసంగాలను వినిపించారు. క్షేత్రస్థాయిలో నేత అందుబాటులో లేని సమయంలో ఏఐ ఆడియో, వీడియో అద్భుతంగా పనిచేస్తోందని అంటున్నారు. భారతదేశంలో ఎన్నికల ప్రచారంలో ఏఐని ఉపయోగించడం ఇదే మొదటి సారి. గత కొద్ది రోజులుగా టీవీకే తన ప్రచార జోరును పెంచిన సంగతి తెలిసిందే. రాష్ట్ర వ్యాప్తంగా టీవీకే అధినేత విజయ్ కటౌట్లు, పోస్టర్లతో పార్టీ శ్రేణులు హోరెత్తిస్తున్నారు. ఇప్పుడు ఏఐ ప్రచారం మొదలు కావడం ఆ పార్టీలో జోష్ ను పెంచింది. వినూత్న ఆలోచన కేవలం తమిళనాడులోనే కాకుండా, రాబోయే రోజుల్లో దేశవ్యాప్తంగా ఇతర రాజకీయ పార్టీలకు కూడా మార్గదర్శకం కానుందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. విజయ్ పార్టీ ఈ సృజనాత్మకత డిజిటల్ యుగంలో రాజకీయ ప్రచారం ఎలా ఉండబోతోందో కళ్లకు కట్టిందంటున్నారు.
http://www.teluguone.com/news/content/ai-in-tvk-campaign-25-217230.html





