ఏ వయసులో ఎలాంటి మానసిక సమస్యలు వస్తాయో తెలుసా?

Publish Date:Aug 26, 2023

Advertisement

ప్రపంచవ్యాప్తంగా, మానసిక ఆరోగ్య సమస్యల కేసులు వేగంగా పెరుగుతున్నాయి. ముఖ్యంగా కరోనా  తర్వాత దాని ప్రమాదం మరింత పెరిగింది. అన్ని వయసుల వారిలోనూ మానసిక ఆరోగ్య రుగ్మతల కేసులు నమోదవుతున్నాయని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. భారతదేశంలో మానసిక ఆరోగ్యానికి సంబంధించిన సమస్యలు తొందరగా బయటపడవు. ఈ కారణంగా మానసిక సంబంధ వ్యాధుల బాధితులు ఎక్కువ మంది ఉన్నారు.  ఆరోగ్య నిపుణుల అభిప్రాయం ప్రకారం, దేశంలో ప్రతి ఐదుగురిలో ఒకరికి భావోద్వేగ,  ప్రవర్తనా సమస్యలు ఉన్నాయి. దేశంలో 60 నుండి 70 మిలియన్ల మంది ప్రజలు తేలికపాటి,  తీవ్రమైన మానసిక రుగ్మతలతో బాధపడుతున్నారు. ఒక్క ఏడాదిలోనే ఆత్మహత్యల కేసులు కూడా పెరిగాయి. WHO డేటా ప్రకారం భారతదేశంలో ప్రతి లక్ష మందిలో సగటు ఆత్మహత్యల రేటు 10.9గా ఉంది. కాబట్టి  మానసిక ఆరోగ్య సమస్యల గురించి అవగాహన పెంచుకోవడం ఎంతో అవసరం.

పిల్లలు,  యువతలో పెరుగుతున్న సమస్య..

 విచారించాల్సిన విషయం ఏమిటంటే భారతదేశంలోని పిల్లలు, యువత కూడా మానసిక ఆరోగ్య సమస్యలను ఎదుర్కొంటున్నారు. చాలామంది కనీసం తమది మానసిక సమస్య అనే విషయం గ్రహించలేని పరిస్థితులలో ఉన్నారని  మానసిక ఆరోగ్య నిపుణులు అంటున్నారు. సామాజంలో జరిగే తప్పుడు పనులు, పిల్లల మీద జరిగే చర్యలు, మానసిక ఆరోగ్యం పట్ల ప్రతికూల దృక్పథాలు, యువత సహాయం కోరకుండా అడ్డుపడుతున్నాయి. ఇంకా దేశంలో మానసిక ఆరోగ్య సంరక్షణ సులభంగా అందుబాటులో లేకపోవడం కూడా ఈ విషయంలో ప్రమాదాలను పెంచుతోంది. నేషనల్ మెంటల్ హెల్త్ సర్వే (NMHS) 2015-16 ప్రకారం, 18 ఏళ్లు పైబడిన వారిలో ఈ  ప్రమాదం పెరుగుతోంది.

గణాంకాలు ఎలా ఉన్నాయంటే..

మానసిక ఆరోగ్య సంరక్షణ కోసం ఆన్‌లైన్ సహాయ కేంద్రముంది. ఇదే  TeleManas. ఇది వెల్లడించిన  గణాంకాలు ఆందోళన కలిగిస్తున్నాయి. Tele Manas Cell  షేర్ చేసిన సమాచారం ప్రకారం, సహాయం కోసం కాల్ చేసేవారిలో 80 శాతం కంటే ఎక్కువ మంది 18-45 ఏళ్ల మధ్య వయస్కులే, అంటే ఈ వయస్సులో ఆరోగ్య సమస్యలు ఎక్కువగా నమోదవుతున్నాయి. టెలి మనస్ అనేది నిపుణుల నుండి మానసిక ఆరోగ్య సంబంధిత సహాయాన్ని పొందడానికి దేశంలోని ఏ మూల నుండి అయినా కాల్ చేయగల టోల్-ఫ్రీ హెల్ప్‌లైన్. దీని కోసం 14416 లేదా 18008914416 నంబర్లకు కూడా కాల్ చేయవచ్చు.

యువతలో సమస్యలు..

టెలి మనస్  పంచుకున్న డేటా ప్రకారం, యువత జనాభాలో మానసిక ఆరోగ్య సమస్యలు ఎక్కువగా ఉన్నాయి. 12 ఏళ్లలోపు పిల్లల్లో మేధో వైకల్యం, దృష్టి లోపం సమస్య ఎక్కువగా కనిపిస్తోంది. పరీక్ష సంబంధిత ఒత్తిడి, కోపం సమస్యలు, ప్రవర్తన లోపాలు  డిప్రెషన్ కేసులు 13-18 సంవత్సరాల వయస్సులో కనిపిస్తున్నాయి. అదే సమయంలో, 18-45 సంవత్సరాల వయస్సు గల వారిలో డిప్రెషన్, ఆందోళన,  కుటుంబ సమస్యల కారణంగా మానసిక ఆరోగ్యం దెబ్బతినడం వంటి కారణాలు ఉంటాయి.

వృద్ధులలో  సమస్యలు..

46-60 సంవత్సరాల వయస్సు గల వ్యక్తులలో మానసిక ఆరోగ్య రుగ్మతల కేసులు నమోదవుతున్నాయి.  కానీ ఈ కేసుల సంఖ్య తక్కువగానే ఉంది. ఈ వయస్సులో చాలా మంది డిమెన్షియాతో పాటు డిప్రెషన్,  కుటుంబ సమస్యలతో బాధపడుతున్నారు. అదే సమయంలో 60 ఏళ్లు దాటిన వారిలో డిమెన్షియా, జ్ఞాపకశక్తి సంబంధిత సమస్యలు, కుటుంబ సమస్యలు ఎక్కువగా కనిపిస్తున్నాయి.

 ఏ వయసు వారికి ఎలాంటి సమస్య వచ్చే అవకాశం ఉందో తెలుసుకుని వాటిని పరిష్కరించడం వల్ల మన కుటుంబంలోని వారే డిప్రెషన్ బారిన పడకుండా జాగ్రత్తలు తీసుకోవచ్చు.

                                                           *నిశ్శబ్ద.

By
en-us Political News

  
చాలా మందిని వేధించే ప్రధాన ఆరోగ్య సమస్యల్లో ‘తల తిరగడం’ (Vertigo/Dizziness) ఒకటి. హఠాత్తుగా కళ్ళు తిరగడం వల్ల భయం, అసౌకర్యం కలగడమే కాకుండా రోజువారీ పనులు చేసుకోవడం కష్టమవుతుంది.
చాలా మందికి రాత్రిపూట వేడివేడి అన్నం తింటే గాని నిద్ర పట్టదు. కానీ, బరువు తగ్గాలని లేదా ఫిట్‌గా ఉండాలని ప్రయత్నించే వారికి..
మనలో చాలా మందికి అద్దంలో చూసుకున్నప్పుడు కొన్ని శరీర భాగాలు నచ్చవు. ముఖ్యంగా ఎంత వ్యాయామం చేసినా, ఎంత కఠినమైన డైట్ పాటించినా తగ్గని మొండి కొవ్వు మన ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీస్తుంది...
ప్రస్తుత రోజుల్లో వయసుతో సంబంధం లేకుండా చాలా మంది మహిళలను వేధిస్తున్న అతిపెద్ద సమస్య పి.సి.ఓ.డి (PCOD). అసలు ఈ సమస్య ఎందుకు వస్తుంది..
ఈనాటి వేగవంతమైన జీవనశైలిలో మనకు తెలియకుండానే మనం అనేక ఆరోగ్య సమస్యలను కొనితెచ్చుకుంటున్నాము. ముఖ్యంగా, నేటి యువతలో సెక్స్ పట్ల ఆసక్తి తగ్గడం అనేది ఒక ప్రధాన సమస్యగా మారుతోంది. ..
మధుమేహం (Diabetes) ఉన్నవారు చేసే మొదటి పని అన్నం మానేసి చపాతీలు తినడం. మరి నిజంగా చపాతీ తింటే షుగర్ తగ్గుతుందా? అన్నం తింటే పెరిగిపోతుందా? ఈ విషయంలో చాలా మందిలో..
నేటి వేగవంతమైన ఒత్తిడితో కూడిన జీవితంలో ఆందోళన ఒక సాధారణ సమస్యగా మారింది. కొన్నిసార్లు చిన్న చిన్న విషయాలు కూడా మనసును అశాంతపరిచి, నిద్ర, ఆహరం, రోజువారీ జీవనశైలిపై  ప్రభావం చూపుతాయి...
కాలం మారినా మనిషి జీవన పోరాటం మాత్రం మారదు.  కొందరు కాలంతో పోటీ పడి ఎండ, వాన, చలి వంటి వాటిని లెక్క చేయకుండా సాగుతూ ఉండాలి. లేకపోతే వారితో పాటు వారిని నమ్ముకున్న కుటుంబాలు కూడా ఇబ్బందులు పడాల్సి వస్తుంది.....
వేసవి అంటే మండే ఎండలు, వేడి గాలులు,  చెమటలు పట్టించే వాతావరణం.. ఇవన్నీ ఉంటాయి.  ఇలాంటి రోజుల్లో  రోడ్డు పక్కన అమ్మే చెరకు రసం తాగితే ఎంతో హాయిగా ఉంటుంది. నిమ్మరసం, నల్ల ఉప్పు, పుదీనా కలపడం వల్ల చెరకు రసం  రుచి మరింత ఇనుమడిస్తుంది...
సాధారణంగా తాంబూలం వేసుకోవడం అనేది మన సంప్రదాయంలో ఒక భాగం. కానీ, ఆ తాంబూలానికి కొన్ని ప్రత్యేకమైన ఆయుర్వేద మూలికలను జత చేస్తే, అది గుండెను రక్షించే ఒక అద్భుతమైన ఔషధంగా మారుతుందని..
వేసవి వాతావరణం శరీరాన్ని అలసటకు గురి చేయడమే కాకుండా, జీర్ణక్రియ , శక్తి పై కూడా ప్రభావం చూపుతుంది. ఆయుర్వేదం ప్రకారం, ఆరోగ్యకరమైన శరీరం , మనస్సును కాపాడుకోవడానికి వేసవి కాలంలో ఆహారంపై..
నేటి కాలంలో మారుతున్న ఆహారపు అలవాట్లు, పని ఒత్తిడి మరియు జీవనశైలి కారణంగా చాలా మందిని వేధిస్తున్న ప్రధాన సమస్య మలబద్ధకం..
నేటి ఉరుకుల పరుగుల జీవితంలో మనల్ని నిరంతరం వేధించే ప్రధాన శత్రువులు ఒత్తిడి మరియు ఆందోళన. వీటితో పాటు థైరాయిడ్..
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.