పవన్ కల్యాణ్ హోంమంత్రి అయ్యాకే.. రఘురామకృష్ణం రాజు

Publish Date:Jun 30, 2026

Advertisement

 ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణం రాజు తనపై అనుచిత వ్యాఖ్యలు చేసిన జై భీమ్ భారత్ పార్టీ అధ్యక్షుడు జాడ శ్రవణ్ కుమార్‌పై ఫిర్యాదు చేస్తానన్నారు. అయితే.. ఇప్పడు కాదు.. ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ రాష్ట్ర హోంమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తరువాత ఫిర్యాదు చేస్తానని పేర్కొన్నారు.  సోమవారం (జూన్ 29) భీమవరంలోని తన కార్యాలయంలో  మీడియతో మాట్లాడిన ఆయన..  జడ శ్రవణ్ కుమార్ తనపై చేసిన వ్యాఖ్యలను  ఖండించారు. తన నాలుక కోసి సమాధి కడతానని బెదిరించడం హత్యను ప్రేరేపించే క్రిమినల్ చర్య కిందకే వస్తుందన్న ఆయన,  రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉన్న వ్యక్తిపై ఇటువంటి అనుచిత వ్యాఖ్యలు చేస్తే కూటమి ప్రభుత్వం చూస్తూ ఊరుకోదన్నారు.

ఒకవేళ ప్రభుత్వం సుమోటోగా చర్యలు తీసుకోకపోయినా, తనపై ఉన్న అభిమానంతో ఎవరో ఒకరు తప్పకుండా ఫిర్యాదు చేస్తారని రఘురామకృష్ణంరాజు పేర్కొన్నారు. ఇక తాను ఫిర్యాదు చేయాల్సి వస్తే.. ఇప్పుడు చేయబోనని స్పష్టం చేశారు. ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ రాష్ట్ర హోంమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తరువాత ఫిర్యాదు చేస్తానని రఘురామకృష్ణం రాజు చెప్పారు. రాష్ట్ర హోంమంత్రిగా పవన్ కల్యాణ్ బాధ్యతలు చేపడతారని ఆయనీ విధంగా హింట్ ఇచ్చారని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ఇటీవల రాష్ట్ర హోంమంత్రిగా తాను ఉంటే.. రాష్ట్రంలో...

By
en-us Political News

  
సుస్మిత పటేల్ కంటే ముందు పార్టీ సీనియర్ నాయకులు చిన్నారెడ్డి, మాజీ ముఖ్యమంత్రి పోచారం శ్రీనివాస్ రెడ్డి వంటి నేతలు కూడా రేవంత్  ప్రభుత్వ పనితీరు, హామీల అమలుపై బహిరంగంగానే తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసిన విషయాన్నిగుర్తు చేశారు.
దేవినేని ఉమాకు కూటమి సర్దుబాట్లలో భాగంగ 2024 ఎన్నికలలో పార్టీ టికెట్ దక్కలేదు. పార్టీ క్లిష్ట సమయాల్లో ముందుండి పోరాడిన దేవినేని ఉమాకు ఈ సారి ఎమ్మెల్సీ ఖాయమన్న భావన ఆయన అనుచరుల్లో బలంగా వ్యక్తమౌతోంది. మరోవైపు వంగవీటి రాధా పరిస్థితి కూడా దాదాపు ఇలాగే ఉంది. ఇటీవలి ఎన్నికల రాజకీయంలో ప్రత్యక్షంగా పోటీ చేసే అవకాశం రాని ఆయనకు, ఈసారి ఎమ్మెల్సీ స్థానం దక్కుతుందని ఆయన అనుచరులు ఆశిస్తున్నారు.
విద్యాహక్కు చట్టం  నిబంధనల ప్రకారం ప్రైవేట్ పాఠశాలల్లో బలహీన వర్గాలు, పేద కుటుంబాలకు చెందిన విద్యార్థులకు పాతిక శాతం సీట్లను తప్పనిసరిగా కేటాయించే ప్రక్రియను రాష్ట్రంలో   సమర్థవంతంగా అమలు చేస్తున్నామన్నారు.
బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తర్వాత మమతా బెనర్జీ రాజకీయ భవిష్యత్తు మరియు టీఎంసీ   బలంపై  అనుమానాలు వ్యక్తమైన నేపథ్యంలో.. తాజాగా జరిగిన  బార్ కౌన్సిల్ ఎన్నికల టీఎంసీ విజయం మమతా బెనర్జీ, తృణమూల్ కాంగ్రెస్ శ్రేణుల్లోనూ ఆత్మవిశ్వాసాన్ని నింపిందనడంలో సందేహం లేదు.  
రాష్ట్ర రాజకీయాల్లో ఇప్పటికే పలు  కుటుంబాలు రాజకీయ ప్రాతినిధ్యం వహిస్తుండగా, ఆ జాబితాలోకి ఇప్పుడు  వర్ల కుటుంబం  చేరింది.వర్ల రామయ్య కుమారుడు వర్ల కుమార్ రాజా  పామర్రు ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తున్న సంగతి తెలిసిందే.  
జక్కిడి ప్రభాకర్ రెడ్డి పార్టీ క్రమశిక్షణను ఉల్లంఘించారన్న ఆరోపణలపై ఆయనను  పార్టీ  నుంచి  సస్పెండ్ చేస్తూ టీపీసీసీ క్రమశిక్షణ కమిటీ   ఆదేశాలు జారీ చేసింది. ఎల్బీ నగర్ లో  కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటూ, క్షేత్రస్థాయిలో బలమైన అనుచరవర్గం ఉన్న   సీనియర్ నేతపై సస్పెన్షన్ వేటు కాంగ్రెస్ లో కలకలం సృష్టించింది. 
ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్, రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడిని ఉద్దేశించి తీవ్ర అనుచిత వ్యాఖ్యలు చేశారు. మంత్రిని "ఆంబోతు" అని సంబోధిస్తూ ఆయన చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం రాజకీయ వర్గాల్లో పెద్ద దుమారాన్ని రేపుతున్నాయి.
వైసీపీ హయాంలో  గ్రంథాలయ రంగానికి చెందాల్సిన సెస్ నిధులను ఖజానాకు మళ్లించారని, తమ ప్రభుత్వం రాగానే ఆ నిధులను తిరిగి గ్రంథాలయ బోర్డుకు జమ అయ్యేలా చర్యలు చేపట్టామన్న ఆయన..
రాష్ట్ర బీజేపీలో  అంతర్గత విభేదాలు, గ్రూపు రాజకీయాలే ఈ పరిస్థితికి  కారణమన్నారు.  గతంలో జాతీయ స్థాయిలో తెలంగాణ నేతలకు ప్రాధాన్యత లభించేదని, కానీ ఈసారి ఒక్కరంటే ఒక్క తెలంగాణ నేతకు కూడా జాతీయ కార్యవర్గంలో చోటు లభించకపోవడం పార్టీ రాష్ట్ర నాయకత్వం స్వయంకృతాపరాధమేనని రాజాసింగ్ పేర్కొన్నారు. 
చెన్నైలోని తిరువికా నగర్ అసెంబ్లీ నియోజకవర్గం టీవీకే తరఫున విజయం సాధించిన పల్లవి తల్లిగా తన బాధ్యతలను నిర్వర్తిస్తూనే.. ప్రజాప్రతినిధిగా    సభకు  బిడ్డతో హాజరుకావడం పట్ల నెటిజనులు ప్రశంసలు కురిపిస్తున్నారు.
గత ప్రభుత్వం జీవోల ద్వారా స్థానిక సంస్థల్లో బీసీల రిజర్వేషన్లను 34 శాతం నుంచి 24.15 శాతానికి  తగ్గించిందని, ఇందు వల్ల దాదాపు 16 వేల 800 మంది బీసీ నాయకులు తమ రాజకీయ అవకాశాలను, ప్రాతినిధ్యాన్ని కోల్పోయారని చంద్రబాబు వివరించారు.
 ప్రజా సమస్యలపై పోరాడేందుకు కొత్త వేదికను సిద్ధం చేస్తున్నట్లు చెప్పిన విజయసాయి..   ప్రజల తరఫున నిలబడి వారి హక్కుల కోసం ప్రశ్నించే బలమైన గొంతుకగా తాను నూతన పార్టీ ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.