Publish Date:Aug 19, 2022
ఫలానా ఆయన కాశ్మీరు వెళ్లారు, ఫలానా ఆయన మౌంట్ అబూ వెళ్లారని చెప్పుకుంటూ వారి యాత్రా కథనాలు వినడానికి స్నేహితులు, బంధువులు ఎదురుచూస్తుంటారు. కానీ, బీహార్ మాజీ ఎమ్మెల్యే రంజన్ తివారీ కోసం ఎవరు ఎదురు చూడలేదు.. పోలీసులు తప్ప! అవును. చాలాకాలం క్రితం ఏకంగా పోలీసులు మీదనే కాల్పులు జరిపి పారిపోయాడీ ఘనుడు. అలా వెళ్లినవాడు నిన్ననే భారత్-నేపాల్ సరిహద్దు వద్ద పట్టుబడ్డాడు.
పోలీసులు తివారీ కోసం 1988 నుంచి వేటాడుతూనే ఉన్నారు. అడిగో, ఇడిగో అంటున్నారే గాని ఎక్కడా దొర క్కుండా తప్పించుకుని తన యాత్ర మాత్రం కొనసాగించేడు తివారి. బీహార్ తూర్పు చంపారన్ జిల్లా గోవింద్గంజ్ మాజీ ఎమ్మెల్యే రంజన్ తివారీ గోరక్‌పూర్‌లో పోలీసులపై కాల్పులు జరిపారు. పట్టు బడకుండా తప్పించుకు పారిపోయాడు. కానీ వెంబడించేవారు ఆయన స్నేహితులు కారు.. పోలీసులు. ఏ మాత్రం విసిగెత్తకుండా రెండు దశాబ్దాలుగా వేటాడేరు. ఎవరికి కనిపించినా పట్టివ్వండి అని ఏకంగా రూ.25 వేలు బహుమానంగానూ ప్రకటించారు. ఉత్తరప్రదేశ్, బీహార్ పోలీసులు కలిసి రంజన్ వేట కొన సాగించారు.
మొత్తానికి ఇరవయ్యేళ్ల ప్రయత్నాలు ఫలించాయి. ఉత్తరప్రదేశ్ పోలీసులపై కాల్పులు జరిపిన కేసులో రంజన్ తివారీ తాజాగా భారత్-నేపాల్ సరిహద్దులో పట్టుబడినట్టు చెప్పారు. ప్రాథమిక లాంఛనాలు పూర్తి చేసిన అనంతరం ఆయనను యూపీ పోలీసులకు అప్పగించినట్టు చెప్పారు. రంజన్ తివారీ రక్సౌల్ మీదుగా ఖట్మండ్ పారిపోవాలని ప్లాన్ చేశారని రక్సౌల్ ఎస్పీ చంద్ర ప్రకాశ్ తెలిపారు.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/after-20-yrs-25-142276.html
ఖమ్మం జిల్లాలో భారీ వర్షాలు, వరద ఉద్ధృతి తీవ్ర రూపం దాల్చడంతో తీవ్ర ఉత్కంఠ నెలకొంది.
ఇంట్లో మొదలైన చిన్నపాటి కుటుంబ కలహాలు.. చివరకు రెండు నిండు ప్రాణాలను బలిగొన్నాయి.
అంబులెన్స్‌లో మృతదేహం.. న్యాయం కోసం రోడ్డెక్కిన బంధువులు.!
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ శాసనమండలి ఛైర్మన్ ఏ. చక్రపాణి తుదిశ్వాస విడిచారు.
గ్రేటర్ హైదరాబాద్ నగరంలో తీవ్ర రూపం దాల్చుతున్న తాగునీటి ఎద్దడి విద్యాసంస్థలపై తీవ్ర ప్రభావం చూపుతోంది.
పాడిందే పాటరా అన్న సామెత చందంగా ఉంది జగన్ తీరు. ఆంధ్రప్రదేశ్‌లో మున్సిపల్ ఎన్నికల ఫలితాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో తీవ్ర నిరాశను మిగిల్చాయి. గతంలో 2024 సార్వత్రిక ఎన్నికల ఓటమి తర్వాత ఏ విధంగానైతే ఈవీఎంలు, ఎన్నికల సంఘాన్ని వైఎస్ జగన్మోహన్ రెడ్డి తప్పుపట్టారో, ఇప్పుడు మున్సిపల్ ఎన్నికల ఫలితాల విషయంలోనూ అదే పాతరాగాన్ని అందుకున్నారు.
2024 ఎన్నికలలో విశాఖ జనం జగన్ విశాఖ రాజధాని ప్రతిపాదనను తిరస్కరించారు. ఇప్పుడు జగన్ మావిగన్ ప్రతిపాదనను మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు జనం ఓటుతో తోసి రాజన్నారు.
కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీకి సవాల్ విసిరారు. సోషల్ మీడియాలో సవాళ్లు విసరడం మానేసి, EVMలు మరియు SIR అంశాలపై పార్లమెంట్లో చర్చకు రావాలని ఆమె డిమాండ్ చేశారు.
2021 లో జగన్ మోహన్ రెడ్డి కుప్పంలో నాటిన విత్తనం మహావృక్షమై దాని వేర్లు పులివెందుల వరకు పాకుతాయని జగన్ ఊహించి ఉండరు. 2021 జగన్ కుప్పం మునిసిపాలిటీ ని తెలుగుదేశంకు దక్కకుండా చేసి, చంద్రబాబు ముఖం ఇప్పుడు చూడాలి అన్న పరుష వ్యాఖ్యలే పులివెందులతో పులివెందులపై తెలుగుదేశం గట్టిగా నిర్ణయం తీసుకోవడానికి కారణమైంది.
ఆంధ్రప్రదేశ్ పురపాలక ఎన్నికల ఫలితాల్లో కడప జిల్లాలో ఆసక్తికర పరిణామాలు చోటుచేసుకున్నాయి
విశాఖపట్నం మేయర్ పీఠాన్ని తెలుగుదేశం పార్టీ దక్కించుకుంది
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో అత్యంత ప్రాధాన్యత సంతరించుకున్న గుంటూరు మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ తన సత్తా చాటింది.