ఎన్ని సార్లు అభ్యంతరం తెలిపినా విమానయాన శాఖ ఖాతరు చేయడం లేదు. ఆగమశాస్త్ర విరుద్ధంగా తిరుమల గిరులపై నుంచి, అందులోనూ శ్రీవారి ఆలయంపై నుంచి అతి తక్కువ ఎత్తులో విమానాలు వెడుతూనే ఉన్నాయి. తాజాగా ఆదివారం (జూన్ 1) ఉదయం ఒక విమానం శ్రీవారి ఆలయం మీదుగా తక్కువ ఎత్తులో ప్రయాణించింది. ఇందుకు సంబంధించి తిరుమలలో భక్తులు తీసిన వీడియోలు వైరల్ అయ్యాయి. తిరుమల భద్రతపై భక్తులలో ఆందోళన వ్యక్తమౌతోంది. పదేపదే విజ్ణప్తి చేసినా ఆగమశాస్త్ర నిబంధనలకు వ్యతిరేకంగా విమానాలు తిరుమలేశుని ఆలయం మీదుగా వెళ్లడాన్ని విమానయాన సంస్థ నిషేధించడం లేదని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తిరుమలను నో ఫ్లై జోన్ గా ప్రకటించాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ మేరకు ఎన్నిమార్లు విజ్ణప్తులు చేసినా కేంద్రం పట్టించుకోవడం లేదని ఆరోపిస్తున్నారు. ఈ విషయంలో కేంద్ర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు చొరవ తీసుకోవాలని కోరుతున్నారు.
గతంలోనూ పలుమార్లు ఇలాంటి ఘటనలు జరిగిన సంగతి తెలిసిందే. తిరుమల పుణ్యక్షేత్రంలో మరోసారి ఆగమశాస్త్ర విరుద్ధంగా శ్రీవారి ఆలయం మీదుగా విమానం వెళ్లడం పట్ల భక్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ ఘటనపై భక్తులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కొందరు వెంటనే ఈ విషయాన్ని తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) విజిలెన్స్ అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. సమాచారం అందుకున్న టీటీడీ అధికారులు అప్రమత్తమయ్యారు. ఆలయం మీదుగా ప్రయాణించిన విమానం ఎక్కడి నుంచి వచ్చింది, ఎక్కడికి వెళుతోంది అనే వివరాలను సేకరించే పనిలో నిమగ్నమయ్యారు.
ఆగమశాస్త్ర నియమాల ప్రకారం, తిరుమల శ్రీవారి ఆలయం మీదుగా విమానాలు గానీ, హెలికాప్టర్లు గానీ ప్రయాణించడం పూర్తిగా నిషిద్ధం. ఇలాంటి ప్రయాణాలను అపచారంగా పరిగణిస్తారు. ఈ నేపథ్యంలోనే తిరుమలను 'నో ఫ్లై జోన్'గా ప్రకటించాలని టీటీడీ చాలాకాలంగా కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతోంది. అయితే కేంద్రం మాత్రం ఇది ఆచరణ సాధ్యం కాదని తెలుపుతూ వస్తోంది. దీంతో ఈ విషయంలో టీటీడీ కూడా ఏమీ చేయలేని నిస్సహాయ స్థితిలో ఉండిపోయింది. ఇప్పటికైనా ముఖ్యమంత్రి చంద్రబాబు, కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు ప్రత్యేక చొరవ తీసుకుని తిరుమలను ' నో ఫ్లై జోన్ గా ప్రకటించేలా కేంద్రంపై ఒత్తిడి తీసుకురావాలని భక్తులు కోరుతున్నారు.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/aeroplane-in-tirumala-again-25-199114.html
బీఆర్‌ఎస్ అధినేత మాజీ సీఎం కేసీఆర్‌కు అస్వస్థతకు గురియ్యారు. ఆయన సీజనల్ ఫీవర్‌తో బాధపడుతున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఆయన సోమాజిగూడ యశోద ఆస్పత్రిలో చేరారు.
కలియుగ దైవమైన శ్రీ వేంకటేశ్వరుని తోమాల సేవ, అభిషేక సేవలలో కూర్చుని తనివి తీరా చూడాలని భావించిన వారి కోరిక ఫలించలేదు
అన్నమయ్య జిల్లా రాయచోటిలో ఉగ్రవాదుల స్థావరాల ఏర్పాటుపై ముమ్మరంగా దర్యాప్తు కొనసాగిస్తున్నామని కర్నూలు డీఐజీ కోయ ప్రవీణ్ వెల్లడించారు. ఎస్పీ కార్యాలయంలో డీఐజీ సమావేశం నిర్వహించారు.
హైదరాబాద్, ఏస్ఆర్‌నగర్ ప్రాంతంలో అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. క్రిష్ హొటల్ భవనంలో ఉన్న కాఫీడేలో మంటలు చేలరేగాయి. దీంతో స్థానికులు భయాందోళకు గురయ్యారు.
ప్రముఖ యోగా గురువు బాబా రాందేవ్ పతంజలి ఆయుర్వేద్ కంపెనీకి ఢిల్లీ హైకోర్టు షాకిచ్చింది. డాబర్ చ్యవన్‌ప్రాష్ లక్ష్యంగా చేసుకుని తప్పుదోవ పట్టించే ప్రకటనలను తక్షణమే నిలిపివేయాలని ఆదేశించింది.
అంగన్వాడీ హెల్పర్లకు తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. అంగన్వాడీ టీచర్లుగా పదోన్నతి పొందేందుకు ఉన్న గరిష్ఠ వయోపరిమితిని 45 నుంచి 50 ఏళ్లకు పెంచుతూ కీలక నిర్ణయం తీసుకుంది.
ప్రఖ్యాత ఫుట్‌బాల్ క్లబ్ లివర్‌పూల్ స్టార్ ఆటగాడు డియోగో జోటా రోడ్డు ప్రమాదంలో దుర్మరణం పాలయ్యాడు.
పవన్ కళ్యాణ్ అయితే పూర్తిగా హిందుత్వ భావజాలాన్ని నెత్తికి ఎత్తుకున్నట్టు కనిపిస్తోంది ఈ ట్రైలర్ ద్వారా మనకు అదే తెలుస్తోందంటారు కొందరు.. 2. 30 నిమిషాల ట్రైలర్ లోనే హిందూ శబ్ధం.. దాని ఛాయలు లెక్కలేనన్ని సార్లు కనిపించాయి.
ఐటీ రంగంలో అగ్రగామిగా కొనసాగుతున్నమైక్రోసాఫ్ట్ సంస్థ మరోసారి ఉద్యోగుల తొలగింపునకు సిద్ధమైంది. వేలాది మంది ఉద్యోగులకు లేఆఫ్ నోటీసులు జారీ చేయనున్నట్లు ప్రకటించడంతో టెక్ పరిశ్రమలో ఆందోళన నెలకొంది.
మాజీ సీఎం జగన్ పాదయాత్ర జపం వినిపిస్తున్నారు. ఎన్నికల ముందు పాదయాత్ర ఉంటుందని జగన్ ప్రకటించారు. ముందుగా జిల్లాల పర్యటనలు ఉంటాయని.. చివర్లో పాదయాత్ర ఉంటుందని ఆయన వెల్లడించారు.
తెలంగాణలో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లపై స్పష్టత ఇవ్వాలని బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కవిత ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. బీసీ రిజర్వేషన్ల సాధన కోసం జులై 17న రైల్ రోకోకు ఆమె పిలుపునిచ్చారు.
మాజీ మంత్రి శిద్దారాఘవరావు ఒకప్పుడు తెలుగుదేశంలో కీలక నేత. చంద్రబాబుకి సన్నిహితుడిగా పార్టీలో పలు కీలక పదవులు కూడా అనుభవించారు. కానీ తెలుగుదేశం 2019 ఎన్నికలలో అధికారం కోల్పోయిన తరువాత వైసీపీ గూటికి చేరారు. అయితే వైసీపీ ప్రభుత్వం ఆ మాజీ మంత్రిని పెద్దగా పట్టించుకున్న దాఖలులు లేవు.
గన్నవరం మాజీ ఎమ్మెల్యే, వైసీపీ సీనియర్ నాయకుడు వల్లభనేని వంశీ ఆ పార్టీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్‌ను గురువారం (జులై 3) భేటీ అయ్యారు.