Publish Date:May 10, 2025
లడ్డూ ప్రసాదం కల్తీ కేసు దర్యాప్తులో సిట్ దూకుడు పెంచింది. సుప్రీం కోర్టు ఆదేశాల మేరకు ఈ కేసు దర్యాప్తును సీబీఐ ఆధ్వర్యంలో ప్రత్యేక సిట్ ఏర్పాటు చేసి మరీ దర్యాప్తు చేస్తున్న సంగతి తెలిసిందే. సిట్ దర్యాప్తులో భాగంగా నెయ్యి సరఫరాకు తిరుమల తిరుపతి దేవస్థానం టెండర్ దక్కించుకున్న తమిళనాడు రాష్ట్రం దిండుగల్ కు చెందిన ఏఆర్ డైరీ నెయ్యి సరఫరా చేయలేదని తేలింది. మరి ఏం జరిగింది అంటే.. నెయ్యి ని ఉత్తరాఖండ్ రూర్కీలోని బోలేబాబ డైరీ నుంచి కొనుగోలు చేసి తిరుపతి జిల్లా లోని వైష్ణవి డైరీకి తరలించారు. అక్కడ ఏఆర్ డైరీ సీల్ వేసి టీటీడీకి సరఫరా చేశారు. ఈ విషయం దర్యాప్తులో తేలడంతో సిట్ అధికారులు నెల్లూరులోని ఏసీబీ కోర్టులో చార్జిషీట్ దాఖలు చేశారు.
అసలు శ్రీవారి లడ్డూ ప్రసాదం తయారీలో కల్తీ నెయ్యి వినియోగం గురించి ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు తొలుత ప్రకటించారు. ఒక సభలో ఆయన జగన్ ప్రభుత్వ హయాంలో తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదం తయారీలో కల్తీ నెయ్యి వినియోగం జరిగిందని ప్రకటించారు. హిందువులు ఆరాధ్యదైవం అయిన తిరుమల వేంకటేశ్వరస్వామి. ఈ శ్రీవారి దర్శన భాగ్యం అదృష్టంగా భక్తులు భావిస్తారు. అంతే అదృష్టంగా తిరుమల శ్రీవారి ప్రసాదాన్ని స్వీకరిస్తారు. అందుకే స్వామి వారి లడ్డూ ప్రసాదం భక్తులకు అత్యంత ప్రీతిపాత్రం అయ్యింది. స్వామి వారి దర్శనం లేకపోయినా లడ్డూ ప్రసాదం లభిస్తే స్వామి వారి దయ ఉన్నట్లేనని భావిస్తారు. అలాంటి ప్రసాదం అపవిత్రం చేస్తూ జగన్ హయాంలో లడ్డూ ప్రసాదానికి వినియోగించే నెయ్యి కల్తీ అయిందనిృ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు సభా ముఖంగా ప్రకటించారు. చంద్రబాబు ప్రకటన అప్పట్లో సంచలనం సృష్టించింది. తెలుగుదశం కూటమి పార్టీలూ, వైసీపీల మధ్య మాటల యుద్ధమే జరిగింది. ఈ నేపథ్యంలోనే రాష్ట్ర ప్రభుత్వం లడ్డూ ప్రసాదంలో కల్తీ నెయ్యి అంశంపై దర్యాప్తునకు సిట్ ఏర్పాటు చేసింది.
అయితే ఈ కేసులో సిట్ దర్యాప్తుపై సందేహాలు వ్యక్తమౌతూ దాఖలైన పిటిషన్ ను విచారణకు స్వీకరించి.. ప్రత్యేక దర్యాప్తు బృందం సీబీఐ ఆధ్వర్యంలో జరగాల్సిందేనని ఆదేశించిన సుప్రీం కోర్టు కొత్త సిట్ ను ఏర్పాటు చేసింది. ఇప్పుడా ప్రత్యేక సిట్ ఏసీబీ కోర్టులో చార్జిషీట్ దాఖలు చేసింది. సిట్ దాఖలు చేసిన ఛార్జ్ షీట్ లో 12 మంది పేర్లు ఉన్నాయని చెబుతున్నారు. ఏ1 గా ఏఆర్ డైరీ, ఏ2 గా ఆ సంస్థ ఎండీ రాజు రాజశేఖరన్, ఏ3గా పొమిల్ జైన్, ఏ4గా విపిన్ జైన్, ఏ5 అపూర్వ చవాడాలను చేర్చింది. ఈ ఆరుగురినీ సిట్ పలుమార్లు విచారించింది. సిట్ అరెస్ చేసి పలు దఫాలు విచారణ చేశారు. ఏ6 బోలేబాబ డైరీ, ఏ7 వైష్ణవి డైరీని చేర్చారు. ఏ8 వైష్ణవి డైరీ ప్లాంట్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ షబిల్ కలీముల్లాఖాన్ తో పాటు టీటీడీ ప్రొక్యూర్ మెంట్ ఉద్యోగి, బోలేబాబ సీజీఎం, నెయ్యి ముడిపదార్ధాలు సరఫరా చేసే వారిని ఛార్జ్ షీట్ లో పొందుపరిచారు. త్వరలో మరింత మందిని విచారణ చేసే అవకాశం ఉంది.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/adultration-in-laddu-prasadam-case-25-197825.html
ఆంధ్రప్రదేశ్ ప్రజలందరికీ చారిత్రాత్మక విజయం సిద్ధించిన రోజిదని పేర్కొన్నారు. అమరావతి రైతుల త్యాగాలకు దక్కిన న్యాయమన్నారు. అమరావతి ఇప్పుడు కేవలం నగరం కాదు, మన ఆత్మగౌరవానికి ప్రతీక అని బాలకృష్ణ పేర్కొన్నారు.
జములమడుగులో ఊహించిన దానికంటే అత్యధికంగా అభివృద్ధి పనులు కొనసాగిస్తున్నామని వివరించారు. వైసిపి అధ్యక్షుడు పులివెందుల ఎమ్మెల్యే జగన్ రెడ్డి వైఖరిని తూర్పారబట్టారు.. ప్రజలను కన్ఫ్యూజ్ చేసి మేలు పొందాలని ప్రయత్నిస్తున్నారంటూ జగన్ పై విమర్శలు కురిపించారు. పకృతిలో పంచభూతాల కూడా తన అధీనంలోనే ఉన్నాయని చెప్పుకునే పెను భూతంగా ఆయన జగన్ రెడ్డిని అబివర్ణించారు.
ఈ కీలక పరిణామం నేపథ్యంలో సోషల్ మీడియా వేదికగా ముఖ్యమంత్రి స్పందిస్తూ.. ఐదు కోట్ల ఆంధ్రుల చిరకాల కోరిక నేడు నెరవేరిందని పేర్కొన్నారు. అమరావతి చట్టానికి ఆమోదం తెలిపి రాష్ట్ర భవిష్యత్తుకు భరోసానిచ్చిన రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు ఏపీ ప్రజల తరఫున ఆయన ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేశారు.
రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈ చట్ట సవరణకు ఆమోదముద్ర వేయడంతో, కేంద్ర న్యాయశాఖ తుది నోటిఫికేషన్‌ను జారీ చేసింది. ఈ పరిణామంతో అమరావతికి పూర్తిస్థాయిలో చట్టబద్ధత లభించినట్లయింది.
అధికారంలో ఉన్న తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) ప్రతిపక్ష భారతీయ జనతా పార్టీ మధ్య పోరు హోరాహోరీగా సాగే అవకాశం ఉంది, దీని ఫలితాన్ని అనేక నిర్మాణాత్మక మరియు రాజకీయ అంశాలు ప్రభావితం చేస్తున్నాయి.
కాపు రిజర్వేషన్ ఉద్యమ నేతగా ముద్రగడ పద్మనాభం తన చోటుకు ఎసరు వస్తున్నదా అన్న అనుమానంతో.. ఆ కాపు నేత తానేనని చాటుకోవడానికి తన వంతు ప్రయత్నాలు మొదలెట్టేశారంటున్నారు. నేను సైతం అంటూ ఆయన రంగంలోకి దిగినట్లు వైసీపీ వర్గీయులే అంతర్గత సంభాషణల్లో చెప్పుకుంటున్నారు. ఇందుకు తార్కానాలు కూడా చూపుతున్నారు.
ఉభయ సభలలో ఆమోదం పొందిన ఆ బిల్లు ఇప్పుడు దేశ ప్రథమ పౌరురాలు, రాష్ట్రపతి ద్రౌపది ముర్ము వద్దకు చేరింది. ఇక ఆమె సంతకం పెట్టడానూ ఈ బిల్లు చట్టంగా మారుతుంది. ఆమె నేడో, రేపో ఈ బిల్లుపై సంతకం చేయడం ఖాయమని అంటున్నారు.
తమిళనాడులో 2026 ఎన్నికలు హోరాహోరీగా సాగే పోరుగా రూపుదిద్దుకుంటున్నాయి, ఇందులో స్పష్టమైన విజేత ఎవరూ లేరు. స్వల్ప ఓట్ల మార్పులు సీట్ల ఫలితాలపై నిర్ణయాత్మక ప్రభావాన్ని చూపవచ్చు.
రాజకీయం అంటే కేవలం అధికారంలో ఉండటం మాత్రమే కాదని, ప్రజాభిప్రాయాన్ని గౌరవిస్తూ ముందుకు సాగాలని వైసీపీకి హితవు పలుకుతున్నట్లుగా మాట్లాడుతూనే.. ఆ పార్టీకి కర్తవ్యబోధ చేశారు.
బిజెపికి 1951లో శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ స్థాపించిన భారతీయ జనసంఘ్‌తో పునాదులు పడ్డాయి. అక్కడి నుంచి ఈ పార్టీ అంచలంచలుగా ఎదిగి నేడీ స్థితికి చేరుకుంది. గతంలో వాజ్ పేయి ఈ పార్టీకి అధికార వాసన రుచి చూపడంతో.. ఇప్పుడు వరుసగా మూడు పర్యాయాల పాటు అధికారం చేజిక్కించుకుని.. ప్రస్తుతం అప్రతిహాత జైత్ర యాత్ర చేస్తోంది.
చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఇక పోలవరం జిల్లా చింతూరు, ఎన్టీఆర్ జిల్లా జి.కొండూరు, ఇబ్రహీంపట్నం మండలాల్లో ఎండలు మండిపోతాయి. వడగాలుల ప్రభావం కూడా తీవ్రంగా ఉంటుంది.
రాఘవ్ చద్దా, ఆమ్ ఆద్మీ పార్టీ మధ్య తలెత్తిన అంతర్గత విభేదాలు ఇప్పుడు బహిరంగ యుద్ధంగా మారాయి.
న్ని ఎన్నికలలో విచిత్రాలు జరగవు. ప్రతిసారీ ఒకటే జరిగితే, దాన్ని విచిత్రం అనరు కదా? ఎన్నికలు జరిగి నిండా రెండేళ్లు కాకముందే నెల్లూరు జిల్లాలో తెలుగుదేశం పార్టీకి ఓటి పలుకు వినపడుతున్నది. కొందరు ప్రముఖులు పక్కదారులు చూస్తున్నారని, పక్క పార్టీతో బేరసారాలు జరుపుతున్నారని కూడా వినపడుతున్నది.