అదానీ, అంబానీల దృష్టి ఏపీ పైనే.. జగన్

Publish Date:Aug 16, 2022

Advertisement

అన‌కాప‌ల్లి జిల్లాలోని అచ్యుతాపురంలో ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి  మంగళవారం పర్యటించారు. ఈ సందర్భం గా ఏటీసీ టైర్ల పరిశ్రమను ప్రారంభించారు. ఎనిమిది పరిశ్రమల నిర్మాణానికి సీఎం భూమి పూజ చేశారు. పరిశ్రమల ఏర్పాటుకు పూర్తి సహకారం అందిస్తున్నామన్నారు. అదానీ, అంబానీ లాంటి పెద్ద పారిశ్రామిక వేత్తలు ఏపీ వైపు చూస్తున్నారు. విశాఖలో రెండు నెలల్లో అదానీ డేటా సెంటర్‌ ఏర్పాటు చేయ‌నున్న‌ట్టు తెలిపారు.

ఈజ్ ఆఫ్‌ డూయింగ్ బిజినెస్‌లో మూడేళ్లుగా అవార్డు తీసుకుంటున్నామని తెలిపారు. రాష్ట్రంలో దాదాపు లక్షకు పైగా చిన్న పారిశ్రామిక సంస్థలున్నాయన్నారు. కేంద్రంతో పోలిస్తే రాష్ట్ర జీడీపీ వేగంగా అభివృద్ధి చెందుతోందని చెప్పారు. ఆదిత్య బిర్లా, శ్రీ సిమెంట్స్ పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తి చూపుతున్నార న్నా రు. 15 నెలల్లోనే టైర్ల పరిశ్రమలో ఉత్పత్తి ప్రారంభమైందని అన్నారు. 

ప్రభుత్వ సహకారంతో రెండో ఫేజ్‌కు ముందుకొచ్చారని...  2023 ఆగస్ట్ నాటికి రెండో ఫేజ్ పనులు  పూర్తి చేస్తామని తెలిపారు. మూతబడిన ఎంఎస్ఎంఈలకు చేయూతనిస్తామని ముఖ్యమంత్రి జగన్ అన్నారు. పేర్కొన్నారు.  రూ. 1.54లక్షల కోట్ల పెట్టుబడి ద్వారా 1,00,155 మందికి ఉద్యోగాలు ల‌భిస్తాయ‌న్నారు.

అలాగే, మూతపడ్డ ఎంఎస్‌ఎమ్‌ఈ పరిశ్రమలకు చేయూతినిస్తున్నామ‌ని జ‌గ‌న్ అన్నారు. ఎంఎస్‌ ఎమ్‌ఈల పున రుద్ధరణకు రూ.1463 కోట్ల ప్రోత్సాహకాలు ఇచ్చామ‌న్నారు.  రాష్ట్రంలో దాదాపు లక్ష వరకూ చిన్న, మధ్య తరహా పరిశ్రమలు ఉన్నాయని, రాష్ట్రంలో తొమ్మిది ఫిషింగ్‌ హార్బర్‌లు నిర్మాణంలో ఉన్నాయన్నారు.

ఆగస్టు 2023 నాటికి రెండో ఫేజ్‌ పనులు పూర్తి చేసే అవకాశం ఉంద‌న్నారు, ఒక ప్రాంత అభివృద్ధికి మెరుగై న ఉపాధి అవకాశాలు కావాలన్నారు.  ఈజ్‌ ఆఫ్‌ డూయింగ్‌ బిజినెస్‌లో మూడేళ్లుగా అవార్డు తీసుకుంటు న్నా మ‌ని,  వచ్చే రెండేళ్లలో మరో 56 పెద్ద కంపెనీలు రాబోతున్నాయి

ఈజ్‌ ఆఫ్‌ డూయింగ్‌ బిజినెస్‌లో ఏపీ నంబర్‌ వన్‌గా ఉందని సీఈవో నితిన్‌ పేర్కొన్నారు. పరిశ్రమల ఏర్పాటుకు ప్రభుత్వం పూర్తి సహకారం అందిస్తుందని, ప్రపంచంలోనే బెస్ట్‌ ప్లాంట్‌గా యూనిట్‌ను తయా రు చేస్తామని సీఈవో నితిన్‌ అన్నారు. రూ. 2,200 కోట్ల పెట్టుబడితో ప్లాంట్‌ను ఏర్పాటు చేస్తున్నట్లు తెలి పారు. 

By
en-us Political News

  
తమిళనాడు రాజకీయాల్లో సరికొత్త వాతావరణం నెలకొంది.
మహారాష్ట్రలోని ప్రఖ్యాత హిందూ హృదయసమ్రాట్ బాలాసాహెబ్ థాకరే మహారాష్ట్ర సమృద్ధి మహామార్గ్‌పై జరిగిన ఒక ఘోర రోడ్డు ప్రమాదం తీవ్ర విషాదాన్ని నింపింది.
దుబాయ్ నుంచి టెల్ అవీవ్‌కు బయలుదేరిన ఫ్లైదుబాయ్ విమానంలో భారత సంతతి కెప్టెన్‌‌పై జరిగిన కత్తిదాడి అంతర్జాతీయంగా తీవ్ర కలకలం రేపుతోంది.
మాజీ మంత్రి వైఎస్‌ వివేకానందరెడ్డి హత్య కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది.
జాతిపిత మహాత్మా గాంధీ 157వ జయంతి వేడుకలను దేశవ్యాప్తంగా అత్యంత భక్తిశ్రద్ధలతో, ఘనంగా నిర్వహిస్తున్నారు.
ఆంధ్రప్రదేశ్‌లో డీఎస్సీ 2.0 నోటిఫికేషన్ విడుదలకు కసరత్తు వేగవంతమైంది.
హైదరాబాద్‌ నగరంలో శాంతిభద్రతల నిర్వహణను మరింత సమర్థంగా చేపట్టేందుకు పోలీస్‌ శాఖలో భారీ పునర్వ్యవస్థీకరణ చేపట్టారు.
దసరా పండుగ వేళ తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది.
ఆంధ్రప్రదేశ్ రాజకీయ రంగంలో ప్రతి క్షణం ఒక కొత్త మలుపు తిరుగుతోంది.
ఖైరతాబాద్‌ అసెంబ్లీ ఉపఎన్నికపై ఉత్కంఠ కొనసాగుతోంది.
ఫ్లైదుబాయ్ విమానంలో కో-పైలట్ దాడిలో తీవ్రంగా గాయపడినా.. అసాధారణ ధైర్యసాహసాలతో 174 మంది ప్రయాణికుల ప్రాణాలను కాపాడిన
కృత్రిమ మేధ (AI) ప్రపంచాన్ని వేగంగా మార్చేస్తున్న వేళ.. దాని భవిష్యత్తుపై భిన్నమైన అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు మండలం వెంగన్నపాలెం గ్రామంలో సెప్టెంబర్ 22న జరిగిన 18 ఏళ్ల నర్సింగ్ విద్యార్థిని ఇంద్రపల్లి హరిణి హత్య ఉదంతం
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.