Publish Date:May 11, 2026
ప్రధాని మోడీ తమ నివాసానికి వచ్చిన సందర్భంగా ఆయనతో కుటుంబం దిగిన ఫొటోలను సోషల్ మీడియాలో పోస్టు చేసిన పవన్ కల్యాణ్ సతీమణి అన్నా లెజినోవా.. దానికి ఒక భావోద్వేగ వ్యాఖ్యను జోడించారు. మా ఆయన్ని చాలా జాగ్రత్తగా చూసుకుంటానని ప్రధానికి ప్రామిస్ చేశానని పేర్కొన్నారు.
Publish Date:May 11, 2026
తెలంగాణ సీఎం తనతో చేతులు కలపితే.. పూర్తి స్థాయిలో సాయం చేయడానికి తాను సిద్ధంగా ఉన్నానంటూ ప్రధాని రేవంత్ కు ఇచ్చిన ఆఫర్ సంచలనం రేపింది. రేవంత్ ను బీజేపీలో చేరమని ప్రధాని కోరుతున్నారా? అంటూ నెటిజనులు ప్రశ్నిస్తున్నారు.
Publish Date:May 11, 2026
తన ప్రభుత్వ అప్పులపై విజయ్ విమర్శలు గుప్పించి, హామీల అమలు నుంచి తప్పించుకోడానికి ప్రయత్నిస్తున్నారని విమర్శించారు. ఈ మేరకు విజయ్ ఆరోపణలపై స్టాలిన్ విడుదల చేసిన ఓ ప్రకటనలో.. మోసపూరిత ప్రకటనలతో ప్రజల్ని తప్పుదారి పట్టించొద్దని హితవు చెబుతూనే.. ఉచిత విద్యుత్, మహిళల భద్రత, మాదక ద్రవ్యాల రవాణా అడ్డుకునేందుకు మొదటి సంతకం చేసిన విజయ్‌ని స్టాలిన్ అభినందించారు.
Publish Date:May 11, 2026
విరుద్‌నగర్ జిల్లాలోని చత్రరెడ్డియపట్టి గ్రామానికి చెందిన కీర్తన సాధారణ మధ్యతరగతి కుటుంబంలో జన్మించారు. తండ్రులు, తాతలు రాయలసీమ ప్రాంతానికి చెందిన వారు. ఎలాంటి రాజకీయ నేపథ్యం లేదు. చదువులో ప్రతిభ కనబరిచిన ఆమె స్థానికంగా డిగ్రీ పూర్తి చేసి, తరువాత పాండిచ్చేరి యూనివర్సిటీలో ఎమ్మెస్సీ స్టాటిస్టిక్స్ చేశారు.
Publish Date:May 10, 2026
ప్రధాని నరేంద్ర మోదీ చేతుల మీదుగా సరిగ్గా ఏడాది క్రితం యువగళం కాఫీ టేబుల్ బుక్ ఆవిష్కరణ ఢిల్లీలో చేయించారు మంత్రి నారా లోకేష్. అప్పటి ఫోటోను ఫ్రేమ్ చేయించి.. అందులో యువగళం కాఫీ టేబుల్ బుక్ కూడా భద్రపరిచారు. ఇది సీఎం చంద్రబాబు ఇంట్లోకి వెళ్లే ముందు కనిపిస్తుంది. ప్రధాని మోదీ ఆ ఫొటోను చూసి నాటి సంగతులను గుర్తు చేసుకున్నారు.
Publish Date:May 10, 2026
సాధారణంగా శుభకార్యాలకు నవమిని రిక్త తిథిగా పరిగణిస్తారు. రాముడు పుట్టింది నవమి రోజే కదా? అని కొందరు సమర్థించినా, రాజ్యాధికారానికి నవమి అంత మంచి తిథి కాదు. నవమి రోజు ప్రారంభించే పనుల్లో తరచూ ఆటంకాలు లేదా మధ్యలో విరామాలు వచ్చే అవకాశం ఉంటుందంటారు. ఇది సంకీర్ణ ప్రభుత్వం కాబట్టి, భాగస్వామ్య పక్షాల నుంచి ఎప్పుడూ ఏదో ఒక అసంతృప్తి వెలువడే ప్రమాదం ఉంది.
గత కొద్ది రోజులుగా తమిళ రాజకీయాల్లో నెలకొన్న సందిగ్ధతకు తెరపడింది. కాంగ్రెస్, వామపక్షాలు, వీసీకే, ఐయూఎంఎల్ వంటి పార్టీలు విజయ్‌కు మద్దతు ప్రకటించడంతో ప్రభుత్వం ఏర్పాటుకు మార్గం సుగమమైంది. ఆరు రోజుల పాటు ఎడతెగకుండా సాగిన రాజకీయ ఉత్కంఠకు ముగింపు పలుకుతూ, మెజారిటీ పార్టీల అండతో విజయ్ పీఠాన్ని అధిష్టించబోతున్నారు.
హైదరాబాద్ లోని పెట్రోలియం శాఖకు చెందిన మల్కాపూర్ టెర్మినల్ ప్రాజెక్టును ప్రధాని మోడీ ఆదివారం ( మే 10) జాతికి అంకితం చేయనున్నారు. ఈ టూర్ కు గవర్నర్ శివప్రతాప్ శుక్లా, సీఎం రేవంత్ రెడ్డి, కేంద్రమంత్రులు కిషన్ రెడ్డి, సురేష్ గోపి, కాంగ్రెస్ ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి, కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి వంటి వారికి ఆహ్వానం అందింది. అయితే ఈ ఆహ్వాన పత్రికలో బండి సంజయ్ పేరు మాత్రం లేదు.
ప్రధాని మోదీ ఆదివారం మధ్యాహ్నం హైదరాబాద్ చేరుకుని పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేస్తారు. అనంతరం సాయంత్రం 4:40 గంటల సమయంలో జూబ్లీహిల్స్‌లోని చంద్రబాబు నాయుడు నివాసానికి వెళ్తారు. అక్కడ ఇరువురు నేతలు ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి, రాష్ట్రంలో రాజకీయ పరిణామాలపై చర్చించే అవకాశం ఉంది. అన్నిటికీ మించి ప్రధాని చంద్రబాబు నివాసానికి వెళ్లి ఆయనతో భేటీ కావడం ఎన్డీయే కూటమి ఐక్యతను చాటడంగా పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.
తెలుగువన్ కు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో ఏబీ వెంకటేశ్వరరావు తమిళనాడులో ఇటీవల జరిగిన రాజకీయ పరిణామాలను.. ముఖ్యంగా విజయ్ నేతృత్వంలోని టీవీకే పార్టీ సాధించిన విజయాలను ఏబీ వెంకటేశ్వరరావు ఆసక్తికరంగా విశ్లేషించారు. ఎవరూ ఊహించని మార్పులు రాజకీయాల్లో సంభవిస్తాయని, ప్రజలు మార్పును కోరుకున్నప్పుడు అసాధ్యం సుసాధ్యం అవుతుందని అన్నారు.
టీవీకే నేత ఆదవ అర్జునకు, వీసీకే అధినేత తిరుమావళవన్ స్వయంగా మద్దతు లేఖను అందజేశారు. ఈ కీలక పరిణామంతో అసెంబ్లీలో టీవీకే కూటమి సంఖ్యా బలం ఇప్పుడు 118కి చేరింది.
అధికారులు సచివాలయంలోని ఏసీ గదులలో కూర్చుని పని చేసే విధానానికి స్వస్థి చెప్పారు. అమరావతిలో జరిగిన కలెక్టర్ల సదస్సులో ప్రసంగిస్తూ.. పౌరుల ఫిర్యాదులను నేరుగా క్షేత్రస్థాయిలో పరిష్కరించడానికి అధికారులు తమ కార్యాలయాలను విడిచిపెట్టి ప్రజల వద్దకు వెళ్లాలని ఆదేశించారు.
సువేందు అధికారి రాజకీయ నేపథ్యాన్ని పరిశీలిస్తే.. కాంగ్రెస్ సంప్రదాయ కుటుంబం నుంచి వచ్చిన సువేందు, రాజకీయ ఓనమాలు అక్కడే నేర్చుకున్నారు. ఆయన తాత కెనరామ్ అధికారి స్వాతంత్ర్య సమరయోధుడు కాగా, తండ్రి శిశిర్ అధికారి కాంగ్రెస్ పార్టీలో సీనియర్ నేతగా రాణించారు. సువేందు అధికారి మమతా బెనర్జీ స్థాపించిన తృణమూల్ కాంగ్రెస్‌లో చేరి ఆ పార్టీలో కీలక నేతగా ఎదిగారు.