జ‌స్ట్ ఆస్కింగ్ ..  బీజేపీని నిల‌దీస్తున్న న‌టుడు ప్ర‌కాష్‌రాజ్‌

Publish Date:Sep 1, 2022

Advertisement

ప్ర‌భుత్వాలు స‌రిగా ప‌నిచేయ‌న‌పుడు ప్ర‌జాహితం ప‌ట్ట‌కుండా ఉన్న‌పుడు, సామాన్య ప్ర‌జ‌లు ప్ర‌భుత్వాన్ని నిల‌దీస్తుంటాయి. ప్ర‌భుత్వాన్ని ప్ర‌శ్నించ‌డానికి విప‌క్షాల నాయ‌కులు, రాజ‌కీయ నాయ‌కులే కాన‌క్క‌ర్లేదు రాజ‌కీయ ప‌రిజ్ఞానం ఉన్న కాలేజీ విద్యార్ధి కూడా కావ‌చ్చు, సినీ న‌టుల‌యినా కావ‌చ్చు. ఇప్పుడే కాదు చాలాకాలం నుంచి దేశ రాజ‌కీయాల మీద త‌న అభిప్రాయాలతో, న‌చ్చ‌ని అంశాల‌ను లేవ‌నెత్తి ఘాటు విమ‌ర్శ‌ల‌తో కేంద్ర‌, రాష్ట్ర ప్ర‌భుత్వాల‌ను ప్ర‌శ్నిస్తున్నారు సినీ న‌టుడు ప్ర‌కాష్  రాజ్‌. తాజాగా ఆయ‌న బీజేపీ స‌ర్కార్ విధానాల‌ను ఎండ‌గ‌డుతున్నారు. 

జ‌స్ట్ ఆస్కింగ్ అంటూ, ఆయ‌న ట్విట‌ర్ ద్వారా సంధించే ప్ర‌శ్న‌లు, చేస్తున్న విమ‌ర్శ‌లు చాలామంది రాజ‌కీయ‌నాయ‌కుల‌కు మిం గుడు ప‌డ‌టం లేదు. కొంద‌రికి ప్ర‌స్తుత రాజ‌కీయ ప‌రిస్థితుల‌ను తెలియ‌జేస్తున్నాయ‌ని ప‌రిశీల‌కులు అంటున్నారు. తాను హిందూత్వానికి వ్య‌తిరేకిని కాన‌ని కేవ‌లం మోదీ, షా ద్వ‌యానికే వ్య‌తిరేకిన‌ని ప్ర‌కాష్ రాజ్ ప్ర‌క‌టించారు.  

వినాయక చవితి సందర్భంగా ఆయన మరొక ట్వీట్ చేశారు. ఆ ట్వీట్‌లో, ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ధ్యానం చేసుకుంటూం డగా, వినాయకులు ఆయనకు ఇరువైపులా నిల్చున్నట్లు, వినాయకుడు ఆరెస్సెస్ యూనిఫాం ధరించినట్లు, కేజీఎఫ్, అల్లు అర్జున్ లను గుర్తు చేస్తూ వినాయకుడి విగ్రహాలను రూపొందించడాన్ని గట్టిగా ప్రశ్నించారు.  ఇలాంటివాటి వల్ల మనోభావాలు దెబ్బతినవా? అని నిలదీశారు. 

ప్రకాశ్ రాజ్ సందర్భం వచ్చిన ప్రతిసారీ కేంద్ర, రాష్ట్రాల్లోని బీజేపీ ప్రభుత్వాల పనితీరును ప్రశ్నిస్తూనే ఉంటారు. గత నెలలో కర్ణాటకలోని మైసూరులో మైసూరు జిల్లా పాత్రికేయుల సంఘం నిర్వహించిన కార్యక్రమంలో ఆయన చాలా ఘాటుగా మాట్లా డారు. విలేకర్ల ప్రశ్నలకు స్పందిస్తూ, అవకాశం ఉంటే కేంద్ర, రాష్ట్రాల్లోని బీజేపీ ప్రభుత్వాలకు తాను మైనస్ మార్కులు ఇస్తాన న్నారు. మైనస్ మార్కులివ్వడానికి వీల్లేదు కాబట్టి, తాను ఆ ప్రభుత్వాలకు సున్నా మార్కులు ఇస్తున్నానని చెప్పారు. 30 కన్నా తక్కువ మార్కులు వస్తే ఫెయిలయినట్లే కదా! అన్నారు. సాగు భూముల కొనుగోళ్ళపై ఆంక్షలన్నీ తొలగించారని, ఉద్యోగ కల్పనకు ఏమాత్రం కృషి చేయడం లేదని, పెట్రోలు, డీజిల్ ధరలు పెరిగిపోతుండటంతో దాని ప్రభావం నిత్యావసరాల ధరలపై పడుతోందని మండిపడ్డారు. దార్శనికత లేకుండా ప్రభుత్వాలను ఎలా నడుపుతారని నిలదీశారు. 

ఇంటింటా త్రివర్ణ పతాకంపై మాట్లాడుతూ, స్వాతంత్ర్య వజ్రోత్సవాల సందర్భంగా ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ పిలుపుతో ఇంటిం టా త్రివర్ణ పతాకం కార్యక్రమం గురించి విలేకర్ల ప్ర‌శ్న‌కు ప్రకాశ్రాజ్ స్పందిస్తూ, నిత్యావసరాల ధరలను తగ్గించడం, ఉద్యోగా లను కల్పించడం ద్వారా  దేశ భక్తిని ప్రోత్సహించాలన్నారు. చేనేత పరిశ్రమలోని కార్మికులు ఉపాధి లేక ఇబ్బందులు పడుతూ ఉంటే జాతీయ జెండాలను పాలిస్టర్‌తో తయారు చేయడానికి అనుమతించడంపై మండిపడ్డారు. పాలపై సైతం జీఎస్‌ టీని విధిస్తున్నారని, ఇటువంటి సమయంలో తాను ఆ ప్రభుత్వాలు అద్భుతంగా ప‌నిచేస్తున్నాయ‌ని ఎలా చెప్ప‌గ‌ల‌ను అని ప్రశ్నించారు. 

నటుడు ప్రకాశ్ రాజ్ 2019 లోక్‌సభ ఎన్నికల్లో బెంగళూరు సెంట్రల్ నియోజకవర్గం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి, ఓడి పోయారు. దీనిపై అప్పట్లో ఆయన స్పందిస్తూ, తాను రాజకీయాల్లోకి వచ్చినప్పటి నుంచి ప్రజా గళంగానే ఉన్నానని, అదే శక్తి మంతమైనదని తాను భావిస్తానని తెలిపారు. తాను గళమెత్తే నటుడిగానే కొనసాగుతానని తెలిపారు.  దేశంలో పరిస్థితులపై ఆయన తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తూంటారు. వ్యవస్థను తీవ్రంగా దెబ్బతీశారని, దీనిని చక్కదిద్దడం ఏ నాయకుడికీ సాధ్యం కాదని, కేవలం ప్రజలు మాత్రమే దీనిని సరిదిద్దాలని అన్నారు.  

ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ కేవలం కొద్ది గంటలపాటు పర్యటిం చేందుకు వచ్చినపుడు కోట్లాది రూపాయలు వెచ్చించి రోడ్లు వేస్తున్నారని, వీథి దీపాలను మరమ్మతు చేస్తున్నారని, హోర్డింగులను తొలగిస్తున్నారని దుయ్యబట్టారు. పన్ను చెల్లించే ప్రజల కోసం రోడ్లు వేయాలన్నారు. నా కోసం రోడ్లు వేయండి, నేను పన్ను చెల్లిస్తున్నానని అన్నారు. 

By
en-us Political News

  
వందలాది మంది కొత్త వ్యక్తులు వస్తే తనకు  ప్రాణహాని ఉందని, కెమెరాలు, ఫోటోలతో ఇంటి భద్రత బయటపడుతుందని జగన్  షర్మిల కుమార్తె వివాహం ఎలహంక ప్యాలెస్ లో వద్దనడానికి కారణంగా తన లేఖలో పేర్కొన్నారు. అయితే దీనికి వైఎస్ కుటుంబ సభ్యులు, షర్మిల కుటుంబం తప్పుపడుతోంది. ఈ నేపథ్యంలో   షర్మిల కుటుంబ సభ్యులు జగన్ కు సంధించిన లేఖాస్త్రంలో  వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో జరిగిన కుటుంబ వేడుకలను ప్రస్తావిస్తూ.. జగన్ ను వైఎస్సార్ కంటే గొప్పవాడివా అంటూ నిలదీశారు.
అధికారిక భేటీ ముసుగులో జరిగిన ఈ గోప్యతా ఉల్లంఘన ఉదంతం ఒక్కసారిగా రాష్ట్రంలో పొలిటికల్ హీట్ ను పెంచేసింది. ఒక వార్తా ఛానెల్‌కు ఇచ్చిన  ఇంటర్వ్యూలో డీకే శివకుమార్ ఈ అంశానికి సంబంధించిన వివరాలను వెల్లడించారు.
దేశ రాజధాని ప్రాంతంలో జరిగిన ఒక అత్యంత విషాదకరమైన ఘటన ప్రస్తుతం దేశవ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశమైంది.
7.75 లక్షల విలువైన 1,035 కిలోల ఆహార పదార్థాలు సీజ్.!
తెలంగాణలో ఎల్‌నినో ప్రభావంతో రాబోయే రోజుల్లో కరువు పరిస్థితులు తీవ్రరూపం దాల్చే అవకాశం ఉందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హెచ్చరించారు.
అమెరికా గడ్డపై మరో తెలుగు కుటుంబంలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది.
ప్రకృతి మారుతున్న తీరు ఒకవైపు ఆందోళన కలిగిస్తుంటే, మరోవైపు ప్రభుత్వాల నిర్లక్ష్యం సామాన్యుడి బతుకును మరింత ఛిన్నాభిన్నం చేస్తోంది.
దేవీ నవరాత్రుల సందర్భంగా గ్రామంలో నిర్వహించిన దుర్గామాత నిమజ్జన వేడుకల్లో భాగంగా ఏర్పాటు చేసిన భారీ డీజే సౌండ్ హోరుకు ఓ పాత ఇందిరమ్మ బిల్డింగ్ స్లాబ్ పెచ్చులు కూలిపడ్డాయి.
జడ్పీ చైర్మన్ కావాలంటే ముందుగా జెడ్పీటీసీగా విజయం సాధించాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలోనే కదిరి నియోజకవర్గంలోని నల్ల చెరువు జెడ్పీటీసీ స్థానంలో పరిటాల రవి నామినేషన్ వేయనున్నారు.  పరిటాల శ్రీరామ్  విజయం కోసం క్షేత్రస్థాయిలో పార్టీ శ్రేణులను సమాయత్తం చేస్తూ భారీ విజయంపై తెలుగుదేశం కన్నేసింది.  
ఉత్తరాఖండ్‌లో నెలకొన్న దుర్భర రవాణా పరిస్థితులను అధికారుల దృష్టికి తీసుకువెళ్లేందుకు ఓ నవవధువు ఎంచుకున్న మార్గం అందరినీ విస్మయానికి గురిచేసింది.
కంటికి రెప్పలా కాపాడుకోవాల్సిన పసిపాప.. క్షణాల వ్యవధిలోనే కన్నుమూసింది.
అధినేత జగన్ ప్రెస్ మీట్ పెట్టి మరీ గతంలోనే ఏపీలో స్థానిక ఎన్నికల ప్రక్రియ సజావుగా సాగదని జోస్యం చెప్పారు.  అల్లర్లు జరుగుతాయని హెచ్చరికలు జారీ చేశారు. చివరకు ఆయన అన్నట్లుగానే జరిగింది. అల్లర్లకు కారణం ఎవరన్నది పక్కన పెడితే.. వైసీపీ సుప్రీం కోర్టుకు వెళ్లి మరీ మునిసిపోల్స్ కు రీ షెడ్యూల్ సాధించింది.
అధికారికంగా ఇటు షర్మిల కానీ, అటు జగన్ కానీ వివాహ వేడుక బెంగళూరు ప్యాలెస్ విషయంపై మాట్లాడలేదు. అయితే మీడియా కథనాల ఆధారంగా వైసీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి పేర్ని నాని మాత్రం తగుదునమ్మా అంటూ మీడియా ముందుకు వచ్చి.. జగన్ నివాసం ఉంటున్న బెంగళూరు ప్యాలెస్ ఫంక్షన్ హాలేమీ కాదు.. పెళ్లిళ్లకు వేదికగా ఇవ్వడానికి అంటూ వ్యాఖ్యలు చేశారు. 
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.