ప్ర‌కాష్ రాజ్ కి ఏపీలో ఏం ప‌ని?

Publish Date:Aug 12, 2025

Advertisement

నటుడు ప్ర‌కాష్ రాజ్ కి ఏపీ.. సామాజిక- ఆర్ధిక- రాజ‌కీయ ప‌రిస్థితుల‌పై అవ‌గాహ‌న అంతంత మాత్రం. ఆంధ్రప్రదేశ్ ఇన్నేళ్లుగా   రాజ‌ధాని లేని రాష్ట్రంగా అవ‌స్థ‌లు ప‌డుతోంది. స‌రే ఎట్ట‌కేల‌కు ఈ రాష్ట్రానికంటూ ఒక అవ‌కాశ‌మొచ్చింద‌ని.. అమ‌రావ‌తే ఆ రాష్ట్ర రాజ‌ధాని అని సంబ‌ర ప‌డేలోపు.. ఏ దుష్ట‌క‌న్ను ప‌డిందో.. వైసీపీ అధికారంలోకి వ‌చ్చింది. దీంతో కథ మ‌ళ్లీ మొద‌టికే వ‌చ్చింది. జ‌నం సొమ్ము ప‌ప్పుబెల్లాల్లా ఖ‌ర్చు చేసిన జ‌గ‌న్ త‌ర్వాత అదే జ‌నం చేత దారుణ‌మైన ప‌రాభ‌వానికి లోనై ఘోర‌మైన ఓట‌మి పాల‌య్యారు. ఒక‌ప్పుడు మీకొచ్చిన ఆ 23 సీట్ల‌లో కొంద‌ర్ని లాక్కుంటే ఆ ప్ర‌తిప‌క్ష హోదా కూడా లేకుండా  పోతుంద‌ని బాబును భ‌య‌పెట్టిన జ‌గ‌న్ చివ‌రికి ప్ర‌తిప‌క్ష హోదాకి కూడా నోచుకో లేక పోయారు. క‌ర్మ రిట‌ర్న్స్ థియ‌రీకి నిలువెత్తు నిద‌ర్శ‌నంగా మిగిలిపోయారు. 

ఇదంతా అలా ఉంచితే.. ప్ర‌స్తుత కూట‌మి ప్ర‌భుత్వం రాజ‌ధానిని  పున‌ర్నించుకోవ‌డంలో భాగంగా.. పెద్ద ఎత్తున నిధులు స‌మ‌కూర్చుకుంటూ.. వ‌చ్చే రోజుల్లో ఎవ‌రెన్ని చేసినా స‌రే.. ఇక్క‌డి నుంచి రాజ‌ధాని మార్చ‌డానికి వీల్లేని విధంగా ఒక చ‌ట్టం తేవాల‌ని నిర్ణయించింది. ఐదేళ్ల పాటు ప‌నులు ప‌డ‌కేసిన పోల‌వ‌రంతో పాటు, బ‌న‌క‌ర‌చ‌ర్ల‌ను సైతం నిర్మించే ఆలోచ‌న చేస్తోంది  చంద్ర‌బాబు నాయ‌క‌త్వంలోని కూట‌మి ప్ర‌భుత్వం. ఆపై విశాఖ ఉక్కును కాపాడుకోడానికి మొన్న‌టికి మొన్న 11500 కోట్ల రూపాయ‌ల‌ను కేంద్రం నుంచి పొందింది. ఇంకా ఎన్నో ప్రాజెక్టులు. మ‌రెన్నో కంపెనీల‌ను ఆంధ్ర‌ప్ర‌దేశ్ బాట‌ప‌డ్డానికి ముమ్మ‌ర‌ య‌త్నాలు కొన‌సాగిస్తోంది బాబు నాయ‌క‌త్వంలోని ప్రభుత్వం.

ఒక ప‌క్క రాష్ట్ర ఆర్ధిక ప‌రిస్థితిని మెరుగు ప‌ర‌చ‌డానికి.. మ‌రో ప‌క్క‌ సుద‌ర్ఘ తీర ప్రాంత‌మైన ఏపీని అందుకు అనువుగా మార్చుకోడానికి.. చేయగలిగినంతా, చేయాల్సినంతా చేస్తున్నది. ఒక వేళ జ‌గ‌న్ తిరిగి వ‌స్తే ప‌రిస్తితేంట‌ని స్వ‌యంగా  పెట్టుబడి దారులు అడ‌గ‌టంతో ఆ భ‌యాన్ని తొల‌గించ‌డానికి తీవ్ర ప్ర‌య‌త్నాలు చేస్తున్నది తెలుగుదేశం కూటమి ప్రభుత్వం. ఇక్క‌డిన్ని స‌మ‌స్య‌లుంటే ఎలాంటి మంత్రిత్వం చేసిన అనుభ‌వం లేకుండా ఏకంగా ముఖ్య‌మంత్రి అయ్యి.. ఆపై త‌న ఓట్ల కోసం.. స్వార్ధంతో కొంద‌రికి ఎడా పెడా డ‌బ్బులు పంచేసి.. ఆపై వారి ద్వారా కూడా స‌రైన ఆద‌ర‌ణ‌కు నోచుకోక ఘోరంగా ఓడారు జ‌గ‌న్. ఇదంతా ప‌క్క‌న పెట్టి రాహుల్ గాంధీ ఏదో ప్రెజంటేష‌న‌న్ ఇచ్చారని చెప్పి.. ప‌వ‌న్ క‌ళ్యాణ్ ని అడ్డు పెట్టుకుని ప్ర‌కాష్ రాజ్ అవాకులు చ‌వాకులు పేలుతున్నారు. నిజానికి ఆయ‌న‌కున్న అభ్యంత‌రం స‌నాత‌న ధ‌ర్మం. బేసిగ్గానే ప్ర‌కాష్ రాజ్ ఒక సెక్యుల‌రిస్ట్. ఆయ‌న బ్యాగ్రౌండ్ అలాంటిది. నేడు మోడీ అన్నా, బీజేపీ అన్నా, హిందుత్వం అన్నా గిట్ట‌క జ‌స్ట్ ఆస్కింగ్ పేరిట పిచ్చి పిచ్చి ప్ర‌శ్న‌లు వేస్తూ కాల‌యాప‌న చేస్తుంటారు ప్ర‌కాష్ రాజ్.

ఇవాళ ప‌వ‌న్ క‌ళ్యాణ్ రాజ‌కీయంగా అన్ ఫిట్ అంటోన్న ప్ర‌కాష్ రాజ్ తాను పుట్టిన బెంగ‌ళూరు సెంట్ర‌ల్ నియోజ‌క‌వ‌ర్గం నుంచి పోటీ చేసి దారుణంగా ఓడిపోయారు. అలాగ‌ని త‌న రాజ‌కీయాల‌ను ఆప‌క తెలుగు సినిమా ఇండ‌స్ట్రీలోనూ టాలెంట్ చూపించాల‌ని ట్రై చేశారు. మా ఎన్నిక‌ల్లో అధ్య‌క్షుడిగా పోటీ చేసి అక్క‌డా దారుణ ప‌రాభ‌వాన్ని మూట‌గ‌ట్టుకున్నారు. ప్ర‌స్తుతం ప్ర‌కాష్ రాజ్ టార్గెట్ చేసిన ప‌వ‌న్ అన్న నాగ‌బాబు ప్రకాశ్ రాజ్ కోసం ఎంత పోరాడినా  ప్రకాశ్ రాజ్ మాత్రం మా ఎలెక్ష‌న్లో నెగ్గ‌లేక పోయారు. ఇప్పుడ‌దే ప‌వ‌న్ క‌ళ్యాణ్ ని ల‌క్ష్యంగా చేస్కుని విమర్శలు గుప్పిస్తున్నారు ఈ  క‌న్న‌డ న‌టుడు. ఇలాంటి వారిని ఎంక‌రేజ్ చేయొద్ద‌ని మొన్న దివంగ‌తులైన కోట శ్రీనివాస్ ప‌దే ప‌దే చెప్పిన సంగతి ఇప్పుడు అందరూ గుర్తు చేసుకుంటున్నారు. 

ప‌వ‌న్ ఇటీవ‌ల స‌నాత‌న ధ‌ర్మ‌సార‌ధిగా ప్ర‌చారం మొద‌లు పెట్ట‌డంతో.. ప్ర‌కాష్ రాజ్ ఇంత వ్య‌తిరేక‌త వ్య‌క్తం చేస్తున్న‌ట్టు తెలుస్తోంది. ఇదంతా ఇలాగుంటే.. రాహుల్ గాంధీ ప్రెజంటేష‌న్ అడ్డు పెట్టుకున్న ప్ర‌కాష్ రాజ్ ఏపీలో కూట‌మి గెలిచిందంటే అందుకు కార‌ణం ఈవీఎంగా చెప్పుకొస్తున్నారు. ఒక వేళ అదే నిజ‌మైతే.. రాహుల్ గాంధీ డైరెక్ట్ గా ఏపీనే ఉద‌హ‌రించేవారు క‌దా? మ‌ర‌లా ఎందుకు చేయ‌లేదు? ఆయ‌న మాట‌ల్లో చేత‌ల్లో ఎక్క‌డా ఏపీ ప్ర‌స్తావ‌న ఎందుకు లేదు? ఇదొక ప్ర‌శ్న కాగా.. రాహుల్ గాంధీ క‌ర్ణాట‌క‌లోని మ‌హ‌దేవ్ పుర అనే నియోజ‌క‌వ‌ర్గం గురించి, ఆపై మ‌హారాష్ట్ర‌, హ‌ర్యానా అసెంబ్లీ ఎన్నిక‌ల గురించి ప్ర‌స్తావించారు. త‌ప్పితే ఎక్క‌డా ఏపీ వివ‌ర‌ణ‌ చేయ‌లేదు. అంటే దీన‌ర్ధ‌మేంటి? ఇంత రీసెర్చ్ చేశాన‌ని చెబుతున్న  రాహుల్ కి ఏపీలో ఈవీఎం ట్యాంపరింగ్ ద్వారా కూట‌మి గెలిచిన‌ట్టు ఆధారాలు ఎక్క‌డా క‌నిపించ‌లేద‌నేగా? క‌నీసం ఆయ‌న ఏపీ విష‌యంలో  ఫీల‌ర్ కూడా ఇవ్వ‌డం లేదు. దీన‌ర్ధ‌మేంటి? ఇక్క‌డ ఈవీఎంలు ట్యాంప‌రింగ్ జ‌రిగిన‌ట్టు ఆయ‌న‌కు కూడా ఆధారాలు ల‌భించ‌డం లేద‌నేగా?

ఇదిలా ఉంటే.. ప్ర‌కాష్ రాజ్ కి ప‌వ‌న్ క‌ళ్యాణ్ అంటే అస‌లు క‌డుపు మంట. ఇందాకే అనుకున్న‌ట్టు.. ఆయ‌న భుజానికెత్తుకున్న స‌నాత‌న ధ‌ర్మ ప‌రిర‌క్ష‌ణ‌. ఈ విష‌యంలో నేరుగా టార్గెట్ చేయ‌వ‌చ్చు ప్ర‌కాష్ రాజ్.. కానీ ఆయ‌న‌లా చేయ‌డం లేదు. ఇదే క‌మ‌ల్ హాస‌న్ సనాత‌న ధ‌ర్మానికి విరుగుడు విద్య అంటూ తాను క‌నీసం టెన్త్ కూడా పాస్ కాకుండానే స్టేట్ మెంట్ ఇచ్చారు. ఇందుకు త‌మిళ సీరియ‌ల్ నటుడు ర‌విచంద్ర‌న్ వైల్డ్ గా రియాక్ట‌య్యాడు. క‌మ‌ల్ త‌ల న‌రికేస్తామంటూ సీరియ‌స్ వార్నింగ్ ఇచ్చాడు. ఈ క్ర‌మంలో నేరుగా స‌నాత‌న ధ‌ర్మాన్ని అటాక్ చేయ‌లేని ప్ర‌కాష్ రాజ్.. ప‌వ‌న్ కళ్యాణ్ గెలుపుపై ప‌దే ప‌దే కామెంట్ చేస్తూ రెచ్చ‌గొడుతున్నారు.

By
en-us Political News

  
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో అధికార కూటమి భాగస్వామ్య పక్షాలైన తెలుగుదేశం, జనసేన మధ్య సంబంధాలు పైకి కనిపించేంత సజావుగా లేవనే సంకేతాలు స్పష్టమవుతున్నాయి.
తెలంగాణ రాజకీయాల్లో ఒక్కసారిగా తీవ్ర కలకలం రేగింది
దివంగత సీఎం  వైఎస్ రాజశేఖర్ రెడ్డి వర్ధంతి సందర్భంగా బుధవారం (సెప్టెంబర్ 2) నిర్వహించిన ఒక  ర్యక్రమంలో పాల్గొన్న కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి..   తాము ఏనాడు కూడా పదవుల కోసం సిద్ధాంతాలను తాకట్టు పెట్టలేదంటూ..  వైఎస్ రాజశేఖరరెడ్డి ఆశయాల బాటలో నడిచేందుకు రాజకీయాల్లోకి ప్రవేశించామన్నారు.  
 ఆమె మాటలను బట్టి పరిశీలకులు కొండా సురేఖ పార్టీకీ, ఎమ్మెల్యే పదవికీ కూడా రాజీనామే చేసే అవకాశాలు కనిపిస్తున్నాయని విశ్లేషిస్తున్నారు. అదే జరిగితే.. ఆమె ప్రాతినిథ్యం వహిస్తున్న వరంగల్ తూర్పు నియోజకవర్గానికి ఉప ఎన్నిక అనివార్యమౌతుంది.
నా కూతురికి పెళ్లైంది.. తనకు తాను స్వతంత్రంగా మాట్లాడింది..!
ఉన్నది మాట్లాడితే చర్యలా.. సురేఖ సంచలన వ్యాఖ్యలు..!
 బీఆర్ఎస్ కేంద్ర కార్యాలయం తెలంగాణ భవన్‌లో బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆధ్వర్యంలో సీనియర్ నాయకులు, మాజీ మంత్రులు హరీష్ రావు, సబితా ఇంద్రారెడ్డి, తలసాని శ్రీనివాస యాదవ్ కలసి కాంగ్రెస్ 1000 రోజుల విఫల పాలనపై  చార్జ్‌షీట్‌  విడుదల చేశారు.
మ్మెల్యేగా కేసీఆర్ వ్యవహరిస్తున్న తీరు, అసెంబ్లీకి ఆయన గైర్హాజరుపై రేవంత్ ఓ రేంజ్ లో విమర్శలు గుప్పించారు. అసెంబ్లీకి హాజరుకాకుంటే కేసీఆర్  ఎమ్మెల్యే పదవికి కేసీఆర్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ ఒక ప్రజా ఉద్యమాన్ని చేపట్టాలని రేవంత్ రెడ్డి ప్రజలకు పిలుపు నిచ్చారు.  తనను ఎన్నుకున్న నియోజకవర్గ సమస్యలను కేసీఆర్ పట్టించుకోవడం లేదని దుయ్యబట్టారు.
ఆయన పులివెందులపైనే ఎక్కువగా కాన్సట్రేట్ చేయడంతో ఆయనకు పులివెందులలో పట్టు జారుతోందన్న భయం పట్టుకున్నట్లు కనిపిస్తోందని అంటున్నారు. అలాంటి భయమే లేకపోతే..  మాజీ సీఎంగా రాష్ట్రం మొత్తం తిరగాల్సిన ఆయన అది మానేసి  సొంత నియోజకవర్గానికే  ఎక్కువగా పరిమితం అవ్వరని అంటున్నారు.  
ప్రకాశం జిల్లాలో మరీ ముఖ్యంగా ఒంగోలులో  గట్టి పట్టు, రాజకీయ పలుకుబడి ఉన్న సీనియర్ నేత అయిన  బాలినేనికి, జనసేనలో ఏ మాత్రం ప్రాధాన్యత లభించడంలేదన్న ప్రచారం జోరుగా సాగుతోంది.  పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ తీసుకుంటున్న  నిర్ణయాలు, స్థానిక పరిస్థితులు కూడా ఆ ప్రచారానికి బలం చేకూర్చేవిగానే ఉంటున్నాయి. 
భారత రాజకీయాల్లో ఇప్పుడు పార్లమెంట్ సీట్ల పునర్విభజన (డీలిమిటేషన్), మహిళా రిజర్వేషన్ బిల్లుల చుట్టూ తీవ్రమైన ఉత్కంఠ నెలకొంది.
తెలంగాణ రాజకీయాల్లో మరోసారి కాంగ్రెస్ అంతర్గత వ్యవహారాలు తీవ్ర చర్చనీయాంశంగా మారాయి.
వైసిపి సీనియర్ నాయకుడు సజ్జల రామకృష్ణారెడ్డి.. రాజ్యసభ మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి చొక్కా పట్టుకుని దాడి చేసి కొట్టారని.. ఇదే విషయాన్ని ఇటీవల విజయసాయి ఓ బహిరంగ లేఖ ద్వారా వెల్లడించిన విషయాన్ని కన్ ఫర్మ్ చేశారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.