నటుడు ఫిష్ వెంకట్ కన్నుమూత
Publish Date:Jul 19, 2025
Advertisement
టాలీవుడ్ లో మరో విషాదం సంభవించింది. గత కొంత కాలంగా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న నటుడు ఫిష్ వెంకట్ కన్నుమూశారు. అనారోగ్యం కారణంగా సినిమాలకు దూరమై, తీవ్ర ఆర్థిక సమస్యలతో చికిత్సకు కూడా డబ్బులు లేక ఇబ్బందులు పడుతున్న ఫిష్ వెంకట్ చికిత్సకు అవసరమైన మొత్తాన్ని అందించేందుకు ఇటీవలే తెలంగాణ ప్రభుత్వం ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. ఇది జరిగిన రోజుల వ్యవధిలోనే ఫిష్ వెంకట్ ఆనారోగ్యంతో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించారు. ఫిష్ వెంకట్ వయస్సు 53ఏళ్లు. గత మూడేళ్లుగా ఫిష్ వెంకట్ కిడ్నీ సంబంధిత వ్యాధితో బాధ పడుతున్నారు. చికిత్స తీసుకుంటున్నప్పటికీ వ్యాధి ముదిరిపోవడంతో కోలుకునే అవకాశం లేకుండా పోయింది. పేరుకి చిన్న ఆర్టిస్ట్ అయినప్పటికీ ఫిష్ వెంకట్ కి ప్రేక్షకుల్లో గుర్తింపు ఉంది. ఫిష్ వెంకట్ అసలు పేరు ముంగిలంపల్లి వెంకటేష్. ముషీరాబాద్ మార్కెట్ లో చేపలు అమ్ముకునే వెంకటేష్ కి ఆ వ్యాపారమే ఇంటి పేరుగా మారిపోయి ఫిష్ వెంకట్ గా పాపులరయ్యారు.
http://www.teluguone.com/news/content/actor-fish-venkat-no-more-25-202252.html





