ఏపీ సీఐడీ మాజీ చీఫ్ చుట్టూ బిగుస్తున్న ఉచ్చు.. కర్మఫలం అనుభవించక తప్పదుగా?

Publish Date:Nov 6, 2024

Advertisement

జగన్ హయాంలో కొందరు ఐపీఎస్ అధికారులు రాజును మించిన రాజభక్తి ప్రదర్శించారు. స్వార్థ ప్రయోజనాల కోసం తమ విధులను విస్మరించి ఏలిన వారి సేవలో తరించడమే పరమార్ధంగా భావించారు. జగన్ అధికారం శాశ్వతమన్న భ్రమల్లో ఆయన మెప్పు కోసం నానా గడ్డీ కరిచారు. పనిలో పనిగా సొంత లబ్ధి కోసం అడ్డదారులు తొక్కి అక్రమ సంపాదనకు తెరతీశారు. 

ఇప్పుడు జగన్ సర్కార్ పతనమై తెలుగుదేశం కూటమి కొలువుదీరింది. దీంతో వైసీపీ కార్యర్తల్లా వ్యవహరించిన అధికారులు జగన్ అండ చూసుకుని చేసిన అరాచకాలకు మూల్యం చెల్లించుకోవలసిన పరిస్థతి ఏర్పడింది. ఇప్పటికే పలువురు అధికారులకు పోస్టింగులు ఇవ్వలేదు. వారి పాపాలు, అకృత్యాలకు చట్టం ముందు దోషిగా నిలబడక తప్పని పరిస్థితి ఎదురైంది. అలాంటి వారిలో ఏపీ సీఐడీ మాజీ చీఫ్ సంజయ్ ఒకరు. ఇప్పటికే లూప్ లైన్ లో ఉన్న సంజయ్ ఇప్పుడు కేసులు, విచారణలు ఎదుర్కొని కటకటాలు లెక్కించక తప్పని పరిస్థితిలో ఉన్నారు.  

తాము అఖిల భారత సర్వీసు అధికారులమని మరిచి.. అప్పటి ప్రభుత్వ పెద్దలు చెప్పినట్లల్లా నడుచుకుని, వాళ్లు చూసి రమ్మంటే కాల్చి వచ్చిన చందంగా రెచ్చిపోయిన అధికారులంతా ఇప్పుడు ఎప్పుడు ఏ కేసులో అరెస్టు అవుతామా అన్న భయంతో వణికి పోతున్నారు. అలాంటి వారిలో ఏపీ సీఐడీ మాజీ చీఫ్ సంజయ్ ఒకరు.   కూటమి సర్కారు అధికార పగ్గాలు చేపట్టిన తరువాత సంజయ్‌కి పోస్టింగ్ ఇవ్వలేదు.  అంతే కాదు.. పలు అక్రమాల్లో అడ్డంగా దొరికిన ఆయనపై చర్యలకు ఇప్పుడు రంగం సిద్ధం అయ్యింది.  సంజయ్‌ అక్రమాల చిట్టా మామూలుగా లేదు. వివిధ శాఖల అధిపతిగా ఉన్నప్పుడు ఆయన వ్యవహరించిన తీరు..చేసిన అవినీతి, అక్రమాలు అన్నీ ఒక్కటొక్కటిగా బయటికి వస్తున్నాయి. 

సంజయ్‌ ఫైర్ సేఫ్టీ డిపార్ట్‌మెంట్‌ డైరెక్టర్‌ జనరల్‌గా పని చేసినప్పుడు..అధికార హోదాను అడ్డుపెట్టుకొని కోటి రూపాయలు దుర్వినియోగం చేశారు. ఆ విషయాన్ని  విజిలెన్స్‌ అండ్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ విభాగం తేల్చింది. సౌత్రిక టెక్నాలజీస్‌ అండ్‌ ఇన్‌ఫ్రా ప్రైవేట్‌ లిమిటెడ్‌ అనే సంస్థతో కుమ్మకై ఆ సంస్థకు అప్పనంగా చెల్లింపులు చేసినట్లు తేలింది.  బిడ్డింగ్‌లో రిగ్గింగ్‌ చేయడంతో పాటు టెండర్లు కట్టబెట్టడంలో  నిబంధనలను బేఖాతరు చేసినట్లు  గుర్తించిన విజిలెన్స్‌ అండ్‌ ఎన్‌ఫో ర్స్‌మెంట్‌ విభాగం ఆ మేరకు రాష్ట్ర ప్రభుత్వానికి నివేదిక ఇచ్చింది. సంజయ్‌పై కేంద్ర సివిల్‌ సర్వీస్‌ రూల్స్‌ ప్రకారం చర్యలు తీసుకోవాలని  సిఫార్సు చేసింది. 

 ఫైర్ సేఫ్టీ డైరెక్టర్ జనరల్ గా ఉన్న సమయంలో సంజయ్ ఆ శాఖలో ఐపాడ్‌లు, ల్యాప్‌టాప్‌ల కొనుగోళ్లలోనూ అక్రమాలకు పాల్పడ్డారు. టెండర్లు, కాంపిటీటివ్‌ బిడ్లు లేకుండానే  తన ఇష్టారీతిగా ఆర్డర్లు ఇచ్చేశారు.  బిల్లులూ సబ్‌మిట్‌ చేయలేదు.  వెబ్‌సైట్, మొబైల్‌ యాప్‌ డెవలప్‌మెంట్, ట్యాబ్‌ల సరఫరా కోసం భారీగా బిల్లులు చెల్లించేశారు. అంతే కాదు ఎస్సీ, ఎస్టీలకు చట్టాలపై అవగాహన కల్పిస్తానంటూ తనకు తానుగా ఓ భారీ బాధ్యతను తీసుకున్న సంజయ్ అప్పటి జగన్ సర్కార్ నుంచి ఏకంగా కోటి రూపాయలు దండుకున్నారు.  ఆ సొమ్ములో ఆయన ఎస్సీఎస్టీలకు చట్టాలపై అవగాహనా కార్యక్రమాలంటూ ఖర్చు చేసింది కేవలం మూడు లక్షల ర ూపాయలు మాత్రమే.  ఈ విషయాలన్నీ విజిలెన్స్ ఎన్ ఫోర్స్ మెంట్ నివేదిక తేల్చిన విషయాలే.  

ఇక తనను ఏరి కోరి సంజయ్ ను సీఐడీ చీఫ్‌ పిలిచి పీఠం ఎక్కించిన జగన్ మెప్పు కోసం ఆయన స్కిల్ కేసులో చంద్రబాబు అరెస్టు విషయంలో అత్యుత్సాహం చూపిన సంగతి విదితమే.  సరే అడ్డగోలుగా, కనీసం నోటీసు ఇవ్వకుండా, కారణం కూడా చెప్పకుండా చంద్రబాబును అరెస్టు చేసిన తరువాత సంజయ్ వ్యవహరించిన తీరు మరింత దారుణంగా ఉంది. చంద్రబాబు అక్రమ అరెస్టు సక్రమమే అని చెప్పేందుకు నానా రకాలుగా ప్రయత్నించారు. అప్పటి అడిషనల్ అడ్వకేట్ జనరల్ పొన్నవోలుతో కలిసి హస్తినలో ఏకంగా మీడియా సమావేశం పెట్టి మరీ చంద్రబాబు అరెస్టును సమర్థించుకునేందుకు ప్రయత్నించారు. ఈ విషయంలో ప్రభుత్వోద్యోగిగా తన పరిమితులను కూడా ఆయన అధిగమించేశారు.  ఇప్పుడు నాటి పాపాలకు శిక్ష అనుభవించడానికి ఎదురు చూస్తున్నారు. విజిలెన్స్ ఎన్ ఫోర్స్ మెంట్ నివేదిక ప్రకారం ఐపీఎస్ సంజయ్ పై చర్యలకు రంగం సిద్ధమైందంటున్నారు. 

By
en-us Political News

  
బిహార్ రాజకీయ ముఖచిత్రం మరోసారి అనూహ్య మలుపు తిరిగింది.
2024 ఎన్నికలలో తెలుగుదేశం కూటమి ఘన విజయం సాధించి అధికారపగ్గాలు చేపట్టడం వెనుక నిస్సందేహంగా లోకేష్ యువగళం పాత్రదే ప్రధాన, కీలక భూమిక. తెలుగుదేశం కూటమి అధికారంలోకి వచ్చిన నాటి నుంచి అటు పార్టీలో, ఇటు ప్రభుత్వంలో లోకేష్ అత్యంత క్రీయాశీల పాత్ర పోషిస్తున్నారడానికి ఇసుమంతైనా సందేహం అవసరం లేదు.
నారా లోకేష్ గత కొంతకాలంగా పార్టీ కార్యక్రమాల్లో క్రియాశీలకంగా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే. తెలుగుదేశం పార్టీ ప్రతిపక్షంలో ఉన్న సమయంలో యువగళం పాదయాత్ర ద్వారా రాష్ట్రవ్యాప్తంగా ప్రజలకు చేరువయ్యారు. క్షేత్రస్థాయిలో పార్టీ కార్యకర్తల్లో ఉత్సాహం నింపడమే కాకుండా, పార్టీ ఎన్నికల ప్రచారంలోనూ కీలక పాత్ర పోషించారు. మంగళగిరి నియోజకవర్గం నుంచి భారీ మెజారిటీతో విజయం సాధించిన తర్వాత పార్టీలో ఆయన ప్రాధాన్యత ఒక్కసారిగా పెరిగింది.
వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నెల్లూరు జిల్లా జువ్వలదిన్నె పర్యటనకు హాజరుకాకూడదని స్థానిక మత్స్యకారులు ఏకగ్రీవ తీర్మానం చేశారు. ఈ నిబంధనను అతిక్రమించి ఎవరైనా జగన్ పర్యటనకు వెడితే.. వారికి ఏకంగా ఒక లక్ష రూపాయల భారీ జరిమానా విధిస్తామని మత్స్యకార సంఘాల ప్రతినిధులు హెచ్చరించారు.
పార్టీ సిద్ధాంతాలను బలంగా ప్రజల్లోకి తీసుకెళ్ళాలని, పార్టీ సిద్ధాంతాలే నాయకత్వానికి బలం అని విద్య, ఐటి శాఖ మంత్రివర్యులు నారా లోకేష్ పిలుపునిచ్చారు.
పశ్చిమ బెంగాల్ రాజకీయాలు మరోసారి వేడెక్కాయి
జగన్ ప్రతిపాదిత మావిగన్ ప్రాంతం నుంచే అంటే మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు ప్రాంతాల ప్రజలలో అయితే మావిగన్ పట్ల తీవ్ర స్థాయిలో వ్యతిరేకత వ్యక్తం అవుతోంది. అమరావతికి చట్టబద్ధత వచ్చిందని అంతా పండుగ వాతావరణం నెలకొన్న ఈ పరిస్థితుల్లో మావిగన్ ఏమిటి అంటూ ఓ రేంజ్ లో జగన్ ప్రతిపాదనపై విమర్శలు గుప్పిస్తున్నారు.
ఇటీవల రాజ్యసభ సభ్యుడిగా ఎన్నికైన నితీశ్‌కుమార్ బీహార్ ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేశారు.
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు, వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కు లేఖ రాశారు. అలాగే ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిలకు వేర్వేరుగా లేఖలు రాశారు. ఆ లేఖల్లో ఆయన వారి మద్దతు కోరారు. ఆశ్చర్యపోవద్దు చంద్రబాబు వారి మద్దతు కోరతూ లేఖ రాశారు. అయితే ఆ మద్దతు ఏ విషయంలో అంటే మహిళల రాజకీయ సాధికారతకు కీలక మైలురాయిగా నిలిచే మహిళా రిజర్వేషన్ బిల్లుకు. ఆ బిల్లుకు మద్దతు పలకాల్సిందిగా కోరుతూ చంద్రబాబు ఈ లేఖలు రాశారు.
మాజీ మంత్రి, సీనియర్ పొలిటీషియన్ జీవన్ రెడ్డి అధికారికంగా బీఆర్ఎస్ తీర్ధం పుచ్చుకునే వేదికగా ఆ సభ జరగబోతున్నది. ఈ భారీ బహిరంగ సభలో కేసీఆర్ అఫీషియల్ గా జీవన్ రెడ్డిని బీఆర్ఎస్ లో చేర్చుకుంటారు. ఈ సభను అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న బీఆర్ఎస్ భారీగా ఏర్పాట్లు చేస్తోంది.
బెంగాల్ అభివృద్ధి కేవలం రాజధాని కోల్‌కతా, దాని చుట్టుపక్కల ప్రాంతాలకే పరిమితమైందన్నారు. ముఖ్యంగా ముస్లిం జనాభా అధికంగా ఉన్న జిల్లాలను ప్రభుత్వం పూర్తిగా విస్మరిస్తోందని దుయ్యబట్టారు.
ఈ పర్యటనలో భాగంగా రేవంత్ రెడ్డి దక్షిణాది రాష్ట్రాల ప్రయోజనాలకు డీలిమిటేషన్ ఏ విధంగా అవరోధంగా మారుతుందన్నది ఇండియా కూటమి పార్టీలకు వివరించే అవకాశం ఉందని అంటున్నారు. ఈ నేపథ్యంలోనే రేవంత్ హస్తిన పర్యటన అత్యంత ప్రాధాన్యత సంతరించుకుంది.
రాజకీయంగా ఎదుర్కొనలేకే.. దర్యాప్తు సంస్థల ద్వారా తమ విజయాన్ని అడ్డుకోవాలని కేంద్రంలోని మోడీ సర్కార్ ప్రయత్నిస్తున్నదని తృణమూల్ అధినేత్రి మమతా బెనర్జీ ఆగ్రహం వ్యక్తం చేశారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.