ఆలోచన దారి తప్పదు ... అంచనా గురి తప్పదు!
Publish Date:Feb 8, 2025
Advertisement
నీటిలో మత్స్యయంత్రం ప్రతిరూపాన్ని చూస్తూ గురి కొట్టి బాణం వదిలిన అర్జునుడి ఫోకస్. కళ్లకు గంతలు కట్టుకుని గదా యుద్ధం చేసిన భీముడి బలం. దుర్యోధనుడి ఎత్తుగడలను ముందే పసిగట్టిన శ్రీ కృష్ణుడి తెలివి తేటలు. భవిష్యత్ చెప్పేసిన వీరబ్రహ్మేంద్రస్వామి ముందు చూపు. చూపులతో చదివేసి మాటలు ఫిల్టర్ చేసి జనం బ్రెయిన్ లో ఏముందో స్కాన్ చేసే నైపుణ్యం. కోట్లాది ఓటర్లు, లక్షలాది రాజకీయ నేతలు, వందలాది పార్టీలు ఇవన్నీ ఒకే బుర్రలో పెట్టుకుని మరీ .. అపర చాణక్యుడిలా అంచనాలు వేసే ప్రతిభ సెఫాలజిస్టుల సొంతం. అలాంటి సెఫాలజిస్టుల్లో సక్సెస్ రేట్ ఉన్న రేరెస్ట్ పర్సనాలిటీ చాణక్య ముఖేష్. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడ్డాయి. ఎగ్జిట్ పోల్స్ అంచనాలను నిజం చేస్తూ బీజేపీ విజయం సాధించింది. అయితే బిజెపికి భారీ విజయం ఖాయమని ఎక్కువ మంది సెఫాలజిస్టులు చెప్పారు. అతి తక్కువ మంది మాత్రమే ఢిల్లీ ఎన్నికలలో టఫ్ ఫైట్ ఉంటుందనీ.. ఆ టఫ్ ఫైట్ లో విజయం సాధించేది బీజేపీయే అని చెప్పారు. ఆ కొందరిలో కూడా చాణక్య స్ట్రటజీస్ మరింత యాక్యురేట్ గా ఢిల్లీ ఎన్నికల ఫలితాన్ని అంచనా వేసింది. అవునుచాణక్య స్ట్రాటజీస్ వారు చెప్పింది చెప్పినట్లు జరిగింది. ఢిల్లీ ఎన్నికల్లో ఆప్, బిజెపి మధ్య వార్ నువ్వా నేనా అన్నట్లే సాగింది. నెంబర్ చూస్తే బిజెపికి ఎక్కువ ఉన్నా.. చాలా చోట్ల బీజేపీ విజయం మార్జిన్ చాలా చాలా తక్కువ. స్వల్ప తేడాతోనే పలు నియోజకవర్గాలలో ఆప్ అభ్యర్థులు పరాజయం పాలయ్యారు. ఆప్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ మూడు వేల ఓట్ల తేడాతో ఓడిపోయారు. మొన్నీ మధ్యే జరిగిన మహారాష్ట్ర ఎన్నికల్లో కూడా చాణక్య స్ట్రాటజీస్ బీజేపీ విజయాన్ని ముందుగానే చెప్పింది. హర్యానా అసెంబ్లీ ఎన్నికల ఫలితాన్ని కూడా కచ్చితంగా అంచనా వేసింది. అంత కంటే ముందు కర్నాటక, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ఇలా రాష్ట్రం ఏదైనా ఎన్నికల ఫలితాలను ముందుగానే అంచనా వేసి కచ్చితంగా చెప్పింది. కర్నాటకలో బిజెపి ఓటమిని దాదాపు ఎవరూ అంచనా వేయలేదు. కాని చాణక్య ముందే పసిగట్టింది. తెలంగాణలో ఇలా కచ్చితమైన అంచనాలు వేయడమంటే మామూలు విషయం కాదు. సమాచారం ప్రజల నుంచే సేకరించినా,వారు మనసులోతుల్లో ఏమనుకుంటున్నారు, అలా అనుకుంటున్నదే చెబుతున్నారా? లేక అబద్ధం చెబుతున్నారా అన్నది పసిగట్టడమంటే అంత తేలిక కాదు. మెదడుకు పని చెప్పాలి. ఎదుటి వారి బ్రెయిన్ రీడింగ్ చేయడం తెలియాలి.అదిచెప్పినంత ఈజీ కాదు. అందులోనూ జనం ఇప్పుడు ఓవర్ స్మార్ట్ అయిపోయారు. కెమేరా ముందు ఒకలా, వెనుక మరోలా చెబుతారు. అలా చెప్పినట్లే పోలింగ్ బూత్ కు వెళ్లి ఓటేస్తారన్న నమ్మకమూ లేదు. ఇటువంటి పరిస్థితుల్లో ఎగ్జిట్ పోల్స్ లో కచ్చితత్వం అన్నది ఇప్పుడు చాలా చాలా అరుదైపోయింది. పైగా ఎగ్జిట్ పోల్ అనగానే చాలా మంది నోరు తెరవరు. మరి కొందరు మనసులో ఉన్న మాట చెప్పరు. అయినా వారితో మాట్లాడే రెండు మూడు నిముషాలలోనే వారి మనసు లోతుల్లో ఏముందో పసిగట్టగలగాలి. ఆ విద్యలో నిష్ణాతులైతేనే ఆ సెఫాలజిస్టుల అంచనాలు వాస్తవానికి అద్దం పడతాయి. అలాంటి నిష్ణాతులైన సెఫాలజిస్టుల్లో ముందు వరుసలో నిలుస్తారు చాణక్య స్ట్రాటజీస్ ముఖేష్. అలాంటి ఫైన్ అండ్ స్మార్ట్ సెఫాలజిస్టుల్లో చాణక్య స్ట్రాటజీస్ ముఖేష్ మన తెలుగువారు, తెలంగాణ వాసి. తెలుగువాడు. అలాంటి చాణక్య స్ట్రాటజీన్ ముఖేఫ్ పేరు ఇప్పుడు దేశవ్యాప్తంగా మారుమోగుతోంది. ఎగ్జిట్ పోల్స్ ప్రకటించిన రోజు మనం చూస్తే ప్రతి నేషనల్ చానెల్ లో ముందు కనిపించినది మన చాణక్య స్ట్రాటజీస్ ఎగ్జిట్ పోలే. చాణక్య స్ట్రేటజీస్ ముఖేష్ పేరే జాతీయ చానెల్స్లో ఢిల్లీ ఎన్నికల ఎగ్జిట్ పోల్స్ లో అత్యంత కచ్చితంగా ఇచ్చిన సెఫాలజిస్ట్ గా మొదటి వరుసలో నిలిచింది. అలాగే ఏ పార్టీ, ఏ నాయకుడు ఎలాంటి వ్యూహాలు పన్నుతున్నారనేది చూస్తాం. అది వారి ప్రసంగాలు, మాటలలో తెలుస్తూనే ఉంటుంది. మామూలు వాళ్లకు అది అర్ధం కాకపోవచ్చు కానీ మాకు తెలిసిపోతుంది. దానిని బట్టే ఆ నాయకుడు, ఆ పార్టీ నెక్స్ట్ స్టెప్ ఏమిటన్నది అంచనా వేస్తాం. అలా కంప్లీట్ అబ్జర్వేషన్, ఎన్నికల సమయంలో చేసే పని కలిసి అంచనాలు వేస్తాం. అందుకే మా అంచనాలు వాస్తవానికి ప్రతిబింబాలుగా ఉంటున్నాయి ఉంటాయి. ప్రతి రాష్ట్రంలో అలాగే చేశాం. చేస్తాం కూడా. ఇప్పుడు ఢిల్లీలో, అంతకు ముందు కర్నాటకలో మా అంచనాలలో కచ్చితత్వానికి అదే కారణం. ఈ రోజుల్లో సోషల్ మీడియా, మీడియా మేనేజ్ మెంట్ ఎక్కువైపోయాయి. ప్రతి పార్టీ వీటి ద్వారా జనం మూడ్ ను మార్చేయాలని చూస్తున్నాయి. అయితే ఆ ప్రయత్నాలు కొన్నిసార్లు సక్సెస్ అవుతాయి.. కొన్నిసార్లు ఫెయిల్ అవుతాయి. ఒకటి మాత్రం స్పష్టం.. ప్రజలు ఎన్నికలకు ముందే డిసైడ్ అయిపోతారు. ఈ జిమ్మిక్కులన్నీ రెండు పార్టీల మధ్య గ్యాప్ చాలా తక్కువగా ఉండి, టైట్ ఫైట్ పరిస్థితి ఉంటేనే ఏదో కొంచం వర్కౌట్ అవుతాయి. అంతే.. లేదంటే వర్కౌట్ అయ్యే అవకాశం ఇసుమంతైనా ఉండదని చాణక్య ముఖేష్ చెప్పారు. ప్రతి నాయకుడు ఒక యాంగిల్ లో ఆలోచిస్తారు. అలాగే చాలా మంది ఎంత పెద్దవారైనా కూడా వారి ఆకాంక్షలకు, అంచనాలకు అనుగుణంగా పరిస్ధితులను అన్వయించుకోవాలని ప్రయత్నిస్తారు. దాని కనుగుణంగా లాజిక్ తయారు చేసుకుని మాట్లాడుతుంటారు. కానీ వాస్తవాలు భిన్నంగా ఉంటాయి. అవి మేం చెప్పినా ఆ నాయకులు వినరు. విన్నా అంగీకరించరు. ప్రస్తుతం ఎంపీగా ఉన్న ఒకాయన అంతకు ముందు అసెంబ్లీ ఎన్నికల్లో మేం చెప్పింది ఫాలో అయ్యారు.. విజయం సాధించారు. కాని అలా వినేవారు తక్కువ అంటూ ముఖేష్ తన అనుభవాన్ని విరరించారు. ఒకవైపు రాజకీయ నాయకులు గేమ్ ఆడుతుంటారు.. మరోవైపు ప్రజలు కూడా తెలివిగా మరో గేమ్ ఆడుతుంటారు. ఈ రెండు గేమ్స్ అర్ధం చేసుకుని.. అసలు గేమ్ ఏంటి.. ఎవరు విన్నర్ అనేది తేల్చడమే సెఫాలజిస్టుల పని. అంతే కాదు.. గేమ్ మార్చాలంటే గేమ్ ఛేంజర్ ఏంటనేది కూడా చెప్పగలిగేది సెఫాలజిస్టులే. మైండ్ రీడింగ్ అనేది ఎంత పవర్ ఫుల్ గా చేయగలిగితే సెఫాలజిస్టులు అంతగా సక్సెస్ అవుతారని ముఖేష్ చెప్పారు. భారతదేశంలో సక్సెస్ ఫుల్ సెఫాలజిస్టులు చాలా అరుదు. అలాంటి అరుదైన వారిలో ఒకరిగా మన తెలుగువాడు, తెలంగాణ వాసి చాణక్య ముఖేష్ నిజంగా తెలుగువారందరికీ గర్వకారణం. ఈ సక్సెస్ ఫుల్ జర్నీ కొనసాగాలని.. జనానికి మేలు జరిగేలా రాజకీయ పార్టీలను, నాయకులను ప్రభావితం చేసేలా వారి సర్వేలు ఉండాలని ఆశిద్దాం.
బీఆర్ఎస్ ఓటమిని కూడా చాలా మంది ఎక్స్ పెక్ట్ చేయలేదు. కాంగ్రెస్ అధికారానికి వస్తుందని ఊహించనే లేదు. కాని చాణక్య చెప్పగలిగింది. ఏపీలో కూడా కూటమి విజయం తథ్యమని ముందే చెప్పింది.
ఈ సక్సెస్ వెనక సీక్రెట్ ఏమిటని అడిగితే.. చాణక్య ముఖేష్ చిరునవ్వుతో, వినయంగా, బిడియంగా టీమ్ వర్క్ అని ముక్తసరిగా చెబుతారు. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలను కచ్చితంగా అంచనా వేయడానికి మా టీమ్ ఢిల్లీలో నెల రోజుల నుంచీ పని చేస్తోందన్నారు. పోలింగ్ రోజో.. లేదా పోలింగ్ కు ముందు వారం రోజుల ముందు పరిస్ధితులు చూసి మేం అంచనా వేయం. మొదటి నుంచి ఢిల్లీ రాజకీయాలపై మా అబ్జర్వేషన్ ఉంది. మా అంచనాలు కరెక్ట్ గా రావాలి, అంచనాలు వాస్తవాలకు అద్దం పాట్టాలంటే.. ఐదేళ్లూ ప్రభుత్వ పని తీరును పరిశీలిస్తూనే ఉండాలి. ప్రభుత్వం తీసుకున్న ఏ నిర్ణయానికి జనం ఎలా రెస్పాండ్ అవుతున్నారు. ఎ నిర్ణయాన్ని వ్యతిరేకించారు? ఏ నిర్ణయాన్ని స్వాగతించారు. సానుకూలత ఎంత, ప్రతికూలత ఎమిటి? అనేది పరిశీలిస్తూ ఉండాలి. మేం అదే చేస్తాం.
http://www.teluguone.com/news/content/ace-sefalogist-chanikya-mukesh-25-192603.html





