Publish Date:Jan 30, 2025
తెలంగణలో సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితులు ఒకరి తరువాత ఒకరు బెయిలుపై బయటకు వచ్చేస్తున్నారు. ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తిని అమెరికా నుంచి వెనక్కు రప్పించేందుకు కాంగ్రెస్ సర్కార్ చేస్తున్న ప్రయత్నాలు ఒక్కటంటే ఒక్క అడుగు కూడా ముందుకు పడటం లేదు. ఈ నేపథ్యంలో ఇంక ఈ కేసు నీరుగారిపోయినట్లేనా అన్నఅనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.
ఒక విషయం మాత్రం రూఢీ అయ్యింది. రాష్ట్ర వ్యాప్తంగానే కాదు, దేశ వ్యాప్తంగా కూడా సంచలనం సృష్టించిన ఈ ఫోన్ ట్యాపింగ్ కేసులో పెద్ద పెద్ద తలకాయల ప్రమేయం ఉంది. ఫోన్ ట్యాపింగ్ జరిగింది. ఎంత మంది ఫోన్లు ట్యాప్ చేశారన్నది తేలియరాలేదు కానీ, అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ప్రభుత్వాన్ని వ్యతిరేకించేవారే కాదు, న్యాయమూర్తులు, సినీ తారలు ఇలా ఒకరనేమిటి చాలా చాలా మంది ఫోన్లు ట్యాప్ అయ్యాయని తేలింది. ఇతర రాష్ట్రాలలో గవర్నర్లుగా ఉన్న వారి ఫోన్లు కూడా ట్యాప్ అయ్యాయన్న ఆరోపణలు ఉన్నారు.
ఈ కేసు దర్యాప్తు ఆరంభంలో చాలా చాలా వేగంగా సాగింది. పలువురు పోలీసు అధికారులను అరెస్టు చేసి రిమాండ్ కు పంపడం కూడా జరిగింది. అయితే ఆ తరువాత కేసు దర్యాప్తులో పురోగతి మందగించింది. అందుకు ప్రధాన కారణం ఈ కేసులో అత్యంత కీలకమైన తెలంగాణ స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్రాంచ్ మాజీ చీఫ్ ప్రభాకర్ రావు. ఆయన చల్లగా అమెరికా జారుకున్నారు. ఆయనను అక్కడ నుంచి వెనక్కు రప్పించడానికి చేస్తున్న ప్రయత్నాలు ముందుకు సాగడం లేదు. అలాగే ఇదే కేసులో కీలకమైన మరో నిందితుడు ప్రవీణ్ రావు కూడా పరారీలో ఉన్నారు. ఆయన ఆచూకీ కనిపెట్టడంలోనూ పోలీసులు విఫలమయ్యారు. ఈ నేపథ్యంలోనే ఈ కేసులో చార్జిషీట్ అయితే దాఖలైంది కానీ దర్యాప్తు పురోగతి లేకుండా పోయింది. దీంతో అరెస్టైన నిందితులు ఒక్కరొక్కరుగా బయటకు వచ్చేస్తున్నారు. తిరపతన్నకు కండీషన్ బెయిలు లభించిన తరువాత ఈ కేసులో మరో ఇద్దరు అధికారులకు కూడా తెలంగాణ హైకోర్టు బెయిలు ఇచ్చింది. మాజీ అదనపు ఎస్పీ భుజంగరావు, మాజీ డీసీపీ రాధాకిషన్‌రావులకు ఒక్కొక్కరికి రూ.లక్ష పూచికత్తుతో పాటు పాస్‌పోర్ట్‌లు అధికారులకు హ్యాండోవర్ చేయాలని, సు దర్యాప్తుకు పూర్తి సహకారం అందించాలని, సాక్షులను ప్రభావితం చేయకూడదని షరతులు విధిస్తూ తెలంగాణ హైకోర్టు బెయిలు మంజూరు చేసింది.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/accused-persons-in-phone-taping-case-25-192095.html
Publish Date:Mar 11, 2026
పార్టీ ఫిరాయింపుల కేసులో ఎమ్మెల్యేలు దానం నాగేందర్, కడియం శ్రీహరికి ఊరట
రాష్ట్రంలో బీఆర్ఎస్ రెండుసార్లు, కాంగ్రెస్ ఒకసారి అధికారంలోకి వచ్చాయనీ, ఆ రెండు ప్రభుత్వాల వైఫల్యాలనూ గమనించిన తెలంగాణ ప్రజలు వచ్చే ఎన్నికల్లో బీజేపీకి అధికారం కట్టబెట్టాలని ఇప్పటికే ఒక నిర్ణయానికి వచ్చేశారన్నారు.
జాతీయ పార్టీలకే ప్రయోజనం చేకూరుతుందనీ, రాష్ట్రాల సమస్యలపై పట్టింపే లేని పరిస్థితి ఉత్పన్నమౌతుందని ఆందోళన వ్యక్తం చేశారు. కేవలం ఖర్చు తగ్గుతుందన్న నెపంతో కేంద్రం జమిలి ఎన్నికల నిర్వహణకు మొగ్గు చూపడమంటే.. ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేయడమే ఔతుందని పేర్కొన్నారు.
జగన్ హయాంలో లిక్కర్ మాఫియా రాజ్యమేలిందన్న షర్మిల, నాసిరకం మద్యంతో ప్రజల ఆరోగ్యాన్ని గుల్ల చేయడంతో పాటు రాష్ట్ర ఆదాయాన్ని కూడా కొల్లగొట్టారన్నారు. జగన్ హయాంలో కంటైనర్ల కొద్దీ మాదకద్రవ్యాలు రాష్ట్రంలోకి వచ్చాయని ఆరోపించారు.
రాజంపేటలో కూటమి నాయకుల రాజకీయం రాజుకుంది.
వ్యవస్థను కాపాడాల్సిన వారే విద్రోహానికి పాల్పడుతున్నారా? అనే అంశాలపై ప్రముఖ విశ్లేషకుడు అప్పసాని రాజేష్ తెలుగువన్ కు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో కూలంకషంగా వివరించారు.
గ్లోబల్ ప్రపంచంలో ఒక చోట రేగే చిచ్చు, ఖండాలు దాటి మన వంటింటి గ్యాస్ ధరను, మన పిల్లల సాఫ్ట్‌వేర్ ఉద్యోగాలను కూడా ప్రభావితం చేస్తుంది.
టీవల బొత్సకు బ్రెయిన్ స్ట్రోక్ తగిలి తీవ్రంగా ఇబ్బంది పడ్డారు. కోలుకుని ఆయన మండలికి వచ్చారు. అప్పుడు ఆయనకు లోకేష్ సాదరంగా ఆహ్వానించిన తీరు పట్ల లోకేష్ పై సర్వత్రా హర్షం వ్యక్తం అవుతోంది. అదే గతంలో చంద్రబాబు పై జగన్ చేసిన వ్యాఖ్యలపై పార్టీలకు అతీతంగా అందరూ ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఓడలు బండ్లు అవుతాయి. బండ్లే ఓడలవుతాయి అన్న సామెతకు నేటి జగన్ పరిస్థితి అచ్చుగుద్దినట్లు సరిపోతుందంటున్నారు పరిశీలకులు. ఒక్కోసారి అవసరం తీరిపోయిన తర్వాత విసిరేసిన తెడ్డే.. చివరికి పడవ బోల్తా పడ్డప్పుడు దిక్కవుతుంది. అన్నదానికి జగన్ అపరిపక్వంతో కూడుకున్న రాజకీయ విధానాలే ఉదాహరణంటున్నారు.
కూటమి ఐక్యత ప్రాధాన్యతను జనసేనాని, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ అసెంబ్లీ వేదికగా వివరించడం కిరణ్ రాయల్ వంటి నేతలకు చెంపపెట్టుగానే పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. కూటమి ఐక్యత వల్ల ఎంత మేలు జరుగుతుందో పవన్ కల్యాణ్ విడమరచి చెప్పారు.
రెండు స్థానాలు ఖాళీ అయి.. కేంద్ర ఎన్నికల సంఘం నోటిఫకేషన్ జారీ చేయగానే.. బీఆర్ ఎస్ మైనారిటీ నాయకుడు, మాజీ హోం మంత్రి మహమూద్ అలీని రంగంలోకి దింపుతామన్న సంకేతాలు ఇచ్చింది. అలాగే రేవంత్ రెడ్డి వేంనరేందర్ రెడ్డి అభ్యర్థిత్వం కోసం పట్టుబడుతుండటంతో.. బీఆర్ఎస్ బీసీ నాయకుడిని రంగంలోకి దింపడం ద్వారా, రేవంత్ బీసీలకు ప్రాధాన్యం ఇస్తున్నామని చెప్పుకోవడాన్ని నిలదీసి ఇరుకున పెట్టాలని కూడా భావించినట్లు చెబుతున్నారు.
ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఆదేశాల మేరకు ఆయన గురువారం విచారణకు హాజరయ్యారు. ఈ నెల 9 వరకూ ప్రతిరోజూ విచారణకు హాజరవ్వాల్సిందే. ఈ నేపథ్యంలోనే సీనియర్ జర్నలిస్టు డీవీ శ్రీనివాసరావు తెలుగువన్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ కేసు పూర్వాపరాలు, పర్యవశానాలపై విశ్లేషించారు.
రేవంత్ ని అంచెలంచెలుగా ఎదిగేలా చేసి ఎంపీగా, ఆ తర్వాత సీఎంగా అవ్వడానికి దారి తీసింది. ఎవరిని ఎమ్మెల్సీ చేయాలని ఆనాడు రేవంత్ భావించారో, అదే వేం నరేందర్ రెడ్డి.. నేడు ఆయన రాజకీయ సలహాదారుగా క్యాబినేట్ ర్యాంకులో ఉంటూనే.. ఇప్పుడు పెద్దల సభలోకి సగర్వంగా అడుగు పెడుతున్నారు.