అంబులెన్స్‌కి యాక్సిడెంట్.. ముగ్గురి మృతి
Publish Date:Sep 11, 2014
Advertisement
ప్రాణాపాయ స్థితిలో వున్నవారిని ఆదుకునే అంబులెన్స్‌కి యాక్సిడెంట్ అయింది. ఈ ప్రమాదంలో ముగ్గురు మరణించారు. తూర్పు గోదావరి జిల్లా పెద్దాపురం సమీపంలో ఈ ప్రమాదం జరిగింది. ఒక పేషెంటును ఆస్పత్రికి తీసుకుని వెళ్తున్న 108 వాహనాన్ని ఎదురుగా వస్తున్న ఆర్టీసీ బస్సు ఢీకొంది. ఈ ప్రమాదంలో 108 వాహనంలో ఉన్న రోగి అక్కడికక్కడే మృతి చెందగా, డ్రైవర్, వైద్య సిబ్బంది తీవ్రంగా గాయపడి ఆ తర్వాత కాకినాడలోని ఆస్పత్రిలో మరణించారు. సంఘటన స్థలానికి ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి నిమ్మకాయల చిన రాజప్ప వచ్చి మృతుల కుటుంబాలను పరామర్శించారు. వారిని ఆదుకుంటామని హామీ ఇచ్చారు.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/accident-for-ambulance-in-andhra-pradesh-108-three-death-39-38197.html
http://www.teluguone.com/news/content/accident-for-ambulance-in-andhra-pradesh-108-three-death-39-38197.html
Publish Date:Oct 3, 2026
Publish Date:Oct 1, 2026
Publish Date:Oct 1, 2026
Publish Date:Oct 1, 2026
Publish Date:Oct 1, 2026
Publish Date:Sep 30, 2026
Publish Date:Sep 30, 2026
Publish Date:Sep 29, 2026
Publish Date:Sep 29, 2026
Publish Date:Sep 29, 2026
Publish Date:Sep 28, 2026
Publish Date:Sep 28, 2026
Publish Date:Sep 28, 2026





