హెచ్ఎండిఏ చీఫ్ ఇంజనీర్ నివాసంలో ఏసీబీ సోదాలు.!
Publish Date:Jul 14, 2026
Advertisement
హెచ్ఎండిఏ చీఫ్ ఇంజనీర్ బచ్చు రవీందర్‌పై ఆదాయానికి మించి ఆస్తులు కూడబెట్టినట్లు వచ్చిన ఆరోపణల నేపథ్యంలో అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులు మంగళవారం(జులై 14) విస్తృత సోదాలు చేపట్టారు. ఏసీబీ డీఎస్పీ మజీద్ అలీ ఖాన్ ఆధ్వర్యంలో హైదరా బాద్‌తో పాటు మొత్తం 12 ప్రాంతాల్లో ఏకకాలంలో సోదాలు నిర్వహించారు. నానక్‌రామ్‌గూడ లోని సుమధుర అక్రోపోలిస్ అపార్ట్మెంట్లో నివాసం ఉన్న రవీందర్ ఇంటితో పాటు ఆయన కుటుంబ సభ్యులు, బంధువులకు సంబంధించిన పలు ప్రదేశా ల్లో అధికారులు ఆకస్మికంగా తనిఖీలు చేపట్టారు. బచ్చు రవీందర్ ప్రస్తుతం హెచ్ఎం డిఏలో చీఫ్ ఇంజనీర్‌గా విధులు నిర్వర్తిస్తున్నారు. ఆయన ఆదాయానికి మించి ఆస్తులు కూడబెట్టినట్లు వచ్చిన ఫిర్యాదుల ఆధారం గా ఏసీబీ అధికారులు డిస్ప్రోపోర్షనేట్ అసెట్స్ కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. సోదాల సందర్భంగా నగదు, బంగారం, స్థిరాస్తులకు సంబంధించిన పత్రాలు, బ్యాంకు ఖాతాలు, లాకర్ల వివరాలను అధికారులు క్షుణ్ణంగా పరిశీలించారు. స్వాధీనం చేసు కున్న నగదు, బంగారం, ఇతర ఆస్తులకుకు సంబంధించిన వివరాలను ఏసీబీ అధికారులు అధికారికంగా వెల్లడించాల్సి ఉంది. Dispraportionate, Assets, Case, Telangana News, Telugu One
http://www.teluguone.com/news/content/acb-raids-hmda-chief-engineers-residence-36-225963.html





