మోడీకి డిగ్రీ సర్టిఫికెట్ వర్సెస్.. అభిజీత్ దీప్కే స్కాలర్ షిప్ పేపర్స్.!

Publish Date:Aug 4, 2026

Advertisement

కాక్రోచ్ జనతా పార్టీ  వ్యవస్థాపకుడు అభిజీత్ దిప్కే నీట్ పరీక్షాపత్రాల లీకేజీ, విద్యావ్యవస్థలోని అక్రమాలపై దేశవ్యాప్త ఉద్యమానికి నాయకత్వం వహించి, కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాకు కారణమైన సంగతి తెలిసిందే. ఇప్పుడు ఈ యువ నాయకుడి విదేశీ విద్యానిధులపై  బీజేపీ, దాని మద్దతు దారులు ప్రశ్నలు కురిపిస్తూ, విమర్శలు గుప్పిస్తున్నారు.  అమెరికాలోని బోస్టన్ విశ్వవిద్యాలయంలో అభిజీత్ విద్య  ఎలా అభ్యసించాడనే అంశంపై విచారణ జరిపించాలని డిమాండ్ చేస్తూ సూరత్‌కు చెందిన ఆర్‌టీఐ కార్యకర్త అమిత్ తివారీ కేంద్ర ఎన్నికల సంఘం, పన్నుల శాఖతో పాటు మహారాష్ట్ర ప్రభుత్వానికి ఫిర్యాదు చేశారు. అలాగే..  సీనియర్ న్యాయవాది కపిల్ సిబల్ సమకూర్చిన  1 కోటి రూపాయ నిధులపై అనుమానాలు వ్యక్తం చేశారు.  సామాజిక మాధ్యమాల వేదికగా అభిజీత్ దిప్కేను  పాకిస్తానీ ఏజెంట్ అని ఆరోపిస్తూ పోలీసులు కేసు నమోదు చేయాలనే డిమాండ్లు కూడా వెలువడ్డాయి.

కాగా తనపై వస్తున్న   ఆరోపణలు, విచారణ డిమాండ్లపై అభిజీత్ దిప్కే స్పందించారు. ఈ విషయంలో ఆయన  నేరుగా ప్రధాని నరేంద్ర మోదీకి సవాల్ విసిరారు. సామాజిక మాధ్యమ వేదిక ఎక్స్ లో షేర్ చేసిన వీడియో ద్వారా అభిజీత్ దీప్కే.. ఒక సాధారణ మధ్యతరగతి కుటుంబానికి చెందిన యువకుడు బోస్టన్ లాంటి ప్రతిష్టాత్మక విశ్వవిద్యాలయంలో చదువుకుంటే ఈ ప్రభుత్వానికి అంత కడుపుమంట ఎందుకని నిలదీశారు. తన విద్యార్హతలూ, ఆర్థిక లావాదేవీలలో ఎటువంటి దాపరికంలేనన్న అభిజీత్ దిప్కే.. తాను పొందిన   స్కాలర్‌షిప్ పత్రాలు, విద్యారుణం మంజూరు లేఖలను బహిరంగంగా ప్రజల ముందు ఉంచడానికి సిద్ధంగా ఉన్నానన్నారు. అదే సమయంలో   ప్రధాని నరేంద్ర మోదీ తన   డిగ్రీ సర్టిఫికేట్‌ను దేశ ప్రజలకు చూపిస్తారా? అంటూ సవాల్ చేశారు. 

ఈ వివాదంలో అభిజీత్ దిప్కే తన విద్యాభ్యాసం,  దానికి అయిన ఖర్చులకు సంబంధించిన  గణాంకాలను  వెల్లడించారు. బోస్టన్ యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ కమ్యూనికేషన్ నుండి మాస్టర్ ఆఫ్ సైన్స్ ఇన్ పబ్లిక్ రిలేషన్స్  పూర్తి చేసిన ఆయన, జూన్ నెలలో భారత్‌కు తిరిగి వచ్చారు. తన చదువు కోసం బోస్టన్ విశ్వవిద్యాలయం ప్రతీ సెమిస్టర్‌కు 12,వేల 500 డాలర్ల చొప్పున మొత్తం 3 సెమిస్టర్లకు  37 వేల500 డాలర్లు అంటే భారత కరెన్సీలో   రూ. 31 లక్షలకు పైగా)  డీన్స్ స్కాలర్‌షిప్ మంజూరు చేసిందని దీప్కే వివరించారు.  ఇక మిగిలిన విద్యా వ్యయం కోసం బ్యాంకు నుండి ఎడ్యుకేషన్ లోన్ తీసుకున్నానని, ఆ అప్పును తాను ఇప్పటికీ వాయిదాల పద్ధతిలో తీరుస్తున్నానని వెల్లడించారు.తప  అర్హత,  ప్రతిభ ఆధారంగానే ఈ స్కాలర్‌షిప్ లభించిందన్న ఆయన  ఈ విషయంలో కావాలంటే దర్యాప్తు చేసుకోవచ్చన్నారు. 

 ఈ ప్రభుత్వ విధానాలను ప్రశ్నించే వారిపై వెంటనే ఈడీ (ఈడీ), సీబీఐవంటి దర్యాప్తు సంస్థలను ప్రయోగించడం పరిపాటిగా మారిందన్న అభిజీత్ దిప్కే..    ప్రధాని నరేంద్ర మోదీ తన ఇంటికి  ఈడీని పంపినా తనకు అభ్యంతరం లేదనీ, దర్యాప్తు కోసం వచ్చే అధికారుల చేతికి మోడీ..  తన డిగ్రీ సర్టిఫికేట్ కాపీని   ఇచ్చి పంపాన్నారు. అప్పుడే నేను నా లోన్ పేపర్లు, స్కాలర్‌షిప్ లెటర్లు, డిగ్రీ కాపీలను అధికారులకు అందిస్తానని చెప్పారు.   

Abhijeet Dipke, Narendra Modi Degree, Cockroach Janta Party, Boston University Scholarship, CJP Youth Movement, Education Loan Row

By
en-us Political News

  
జగన్ పర్యటనలలో జరిగిన పలు సంఘటనలకు సంబంధించిన వీడియో ఆధారాలను వంగలపూడి అనిత ఈ సందర్భంగా ప్రదర్శించారు. సాధారణంగా ఎవరైనా పరామర్శకు వెళ్తే బాధితులను ఓదార్చడం, వారికి అండగా నిలవడం ఆనవాయితీ అనీ, కానీ జగన్ మాత్రం నిజమైన బాధితులను వదిలేసి నిందితులను పరామర్శించడానికి వెడుతున్నారనీ మండిపడ్డారు.
యూపీలో భారీ వర్షాలు, శాంతిభద్రతల పరిస్థితి, కోర్టు ఆదేశాలు కారణంగా చూపుతూ కాయస్థ పాఠశాల ట్రస్ట్ అనుమతిని ఉపసంహరించుకుంది. అయితే ఈ వివరణ సంతృప్తికరంగా లేదని కాంగ్రెస్ చెబుతోంది. అధికార యంత్రాంగం, బీజేపీ ప్రభుత్వ ఒత్తిడి కారణంగానే రాహుల్ సభకు అనుమతి ఇవ్వడం లేదని ఆరోపిస్తోంది.
కనీసం తనతో సంప్రదించకుండా ఏకపక్షంగా అంబటి రాంబాబు పాదయాత్ర ప్రకటన చేయడంపై జగన్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేయడంతో గత్యంతరం లేక అంబటి పాదయాత్ర విరమించుకున్నారని పార్టీ వర్గాల సమాచారం.
వైసీపీకి కోర్టులు, న్యాయమూర్తులు, చట్టం, న్యాయం వంటి విషయాలలో పెద్దగా పట్టింపు లేదని గతంలో పలుమార్లు రుజువైంది. అలాగే ఇప్పుడు కూడా కోర్టు తీర్పులు కోర్టువే, మా దారి మాదే అన్న చందంగా విజయవాడ వేదికగా వైసీపీ విద్యార్థి, యువజన విభాగాలు రాష్ట్రవ్యాప్తంగా నిరసనలకు దిగాయి. 
ఇప్పటి వరకూ  గ్రామ పంచాయతీ స్థాయిలో సర్పంచులను మాత్రమే ప్రజలు నేరుగా ప్రత్యక్ష ఓటింగ్ ద్వారా ఎన్నుకుంటున్నారు. అయితే, మండల స్థాయిలో ఎంపీపీలు, జిల్లా స్థాయిలో జడ్పీ ఛైర్మన్లతో పాటు మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో ఛైర్మన్లు, మేయర్ల ఎంపిక పరోక్ష పద్ధతిలోనే జరుగుతోంది.
నరేంద్ర మోదీ నేతృత్వంలోని ఎన్‌డీఏ ప్రభుత్వం త్వరలోనే విమానాల్లో ఉపయోగించే ఏవియేషన్ టర్బైన్ ఇంధనం (ఏటీఎఫ్)లో కూడా ఇథనాల్‌ను మిశ్రమం చేయడానికి సన్నాహాలు చేస్తోందంటూ ఆయన బాంబు పేల్చారు.
రాహుల్ గాంధీ నీట్ లీకేజీ వ్యవహారం కేవలం కేంద్ర విద్యాశాఖ వైఫల్యం మాత్రమే కాదంటున్నారు. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా విద్యార్థుల పోరాటానికి లభించిన తొలి విజయమేనంటూ, ఢిల్లీలో గత నెల 20న శాంతియుతంగా నిరసన తెలుపుతున్న విద్యార్థులపై జరిగిన పోలీసుల లాఠీఛార్జ్, పెల్లెట్ తుపాకుల వినియోగానికి నేరుగా కేంద్ర హోంమంత్రి అమిత్ షా బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు.
గత కొన్ని నెలలుగా ఇరాన్, ఒమన్ మధ్య ఉన్నత స్థాయి సంప్రదింపుల ఫలితంగా కొత్త రూట్ ప్రతిపాదనపై ఓ ఒప్పందం కుదిరింది. సాంకేతిక, చట్ట, భద్రతా కోణాల్లో సమగ్ర సమీక్షలు జరిపిన అనంతరం, ఈ కొత్త రూట్ కు సంబంధించి ఇరు దేశాలు ఓ అవగాహనకు వచ్చాయి.
వచ్చినది పోగాకు రైతుల కష్టాలు విని, వారికి అండగా ఉన్నానని సంఘీభావం తెలపడం. అయితే ఈ పర్యటనలో జనగ్   రైతులను కలవడం, వారి కనీస హామీ ధర డిమాండ్ల కోసం పోరాడటం కంటే, బల ప్రదర్శనకే ప్రాధాన్యత ఇచ్చారు. ఇక తన ప్రసంగం కూడా పరమ రొట్టకొట్టుడు పద్ధతిలో సాగింది.
2024 అసెంబ్లీ ఎన్నికలలో ఆముదాలవలస నియోజకవర్గం నుంచి ఓటమి పాలైనప్పటి నుంచీ తమ్మినేని రాజకీయంగా ఒకింత ఇన్ యాక్టివ్ గానే ఉంటూ వస్తున్నారు. వైసీపీ అధినేత జగన్ కూడా తమ్మినేనిని ఆముదాలవలస నియోజకవర్గ బాధ్యతల నుంచి తప్పించి శ్రీకాకుళం పార్లమెంట్ పరిశీలక బాధ్యతలను అప్పగించారు. ఈ నిర్ణయం తమ్మినేనిలో తీవ్ర అసంతృప్తికి కారణమైందని ఆయన అనుచరులు చెబుతున్నారు.
వైఎస్ జగన్ ఆదేశిస్తే ఏమైనా చేస్తానంటూ సంచలన ప్రకటనలు చేస్తూ నిత్యం వార్తల్లో నిలిచారు. అలాగే బోరుగడ్డ అనిల్ తన నోటి దురుసు, అనుచిత వ్యాఖ్యల కారణంగా తొమ్మిది నెలలపాటు జైలు జీవితం కూడా గడపాల్సి వచ్చింది.
తంజావూరు వేదికగా కావేరీ జలాల వివాదంపై మాట్లాడుతున్న సమయంలో ఉదయనిధి స్టాలిన్ సీఎం విజయ్, నటి త్రిషను ఉద్దేశించి పరోక్షంగా చేసిన వ్యాఖ్యలు రాజకీయ దుమారం రేపిన సంగతి తెలిసిందే. తమ అధినేత విజయ్‌ను అవమానించారంటూ టీవీకే శ్రేణులు తంజావూరు పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయడమే కాకుండా, జాతీయ మహిళా కమిషన్‌కు కూడా ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు అందిన వెంటనే చెన్నైలోని ఉదయనిధి నివాసానికి వెళ్లిన పోలీసులు ఆయనను అరెస్ట్ చేశారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.