ఇండియా కూటమి నుంచి వైదొలగిన ఆప్.. బీహార్ ఎన్నికలలో ఒంటరిగా పోటీ చేస్తామని వెల్లడి

Publish Date:Jul 19, 2025

Advertisement

కాంగ్రెస్ నేతృత్వంలోని ప్రతిపక్ష కూటమి ఇండియాకు భారీ షాక్ తగిలింది. ఇండియా కూటమి నుంచి వైదొలగుతున్నట్లు ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్)  ప్రకటించింది. సరిగ్గా పార్లమెంటు వర్షాకాల సమావేశాల ముంగిట కూటమి నుంచి వైదొలగుతూ ఆప్ తీసుకున్న నిర్ణయం ఇండియా కూటమికి ఇబ్బందికరమేననడంలో సందేహం లేదు. పార్లమెంటులో అధికార ఎన్డీయే కూటమిని ఇరుకున పెట్టాలని భావిస్తున్న ఇండియా కూటమికి ఇప్పుడు ఒక భాగస్వామ్యపక్షం వైదొలగడం మింగుడుపడని అంశమే.

 పార్లమెంటు వర్షాకాల సమావేశాల్లో ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టేందుకు లేవనెత్తాల్సిన అంశాలపై శనివారం (జులై 19) ఇండియా కూటమి సమావేశం కానున్న సమయంలో  ఆమ్ ఆద్మీ పార్టీ కూటమి నుంచి వైదొలగుతున్నట్లు ప్రకటించడమే కాకుండా, కూటమి సమావేశానికి కూడా హాజరు కావడం లేదని స్ఫష్టం చేసింది. ఇప్పటికే తృణమూల్ కాంగ్రెస్ కూటమి నుంచి వైదొలగిన సంగతి తెలిసిందే. అయితే తృణమూల్ కాంగ్రెస్ తరఫున ఆ పార్టీ జాతీయ కార్యదర్శి అభిషేక్ బెనర్జీ ఇండియా కూటమి సమావేశానికి హాజరు కానున్నారు.  

ఐక్యత విషయంలో ఇండియా కూటమి వైఫల్యాన్ని కారణంగా చూపుతూ ఆప్ కూటమి నుంచి వైదొలగుతున్నట్లు శుక్రవారం (జులై 18) ప్రకటించిన సంగతి విదితమే.  అయినా ఇండియా కూటమితో పొత్తు కేవలం లోక్‌సభ ఎన్నికల వరకేననీ, ఆ తరువాత జరిగిన  ఢిల్లీ, హర్యానా అసెంబ్లీ ఎన్నికలలో తాము ఒంటరిగానే బరిలోకి దిగామనీ ఆప్ గుర్తు చేసింది. రానున్న బీహార్ అసెంబ్లీ ఎన్నికలలోనూ ఆప్ ఒంటరిగానే బరిలోకి దిగుతుందని స్పష్టం చేసింది.  

By
en-us Political News

  
1978 నుంచి అంటే గత 48 ఏళ్లుగా కాంగ్రెస్ పార్టీ జాతీయ కార్యకలాపాలకు కేంద్ర బిందువుగా ఉన్న నంబర్ 24, అక్బర్ రోడ్ భవనాన్ని ఈ నెల 28 లోగా అంటే శనివారం లోగా ఖాళీ చేయాలంటూ కేంద్రం నోటీసులు జారీ చేసింది.
జ‌గ‌న్ లెవ‌న్ పై మీమ్స్ గురించి చెప్ప‌న‌క్క‌ర్లేదు. పంజాబ్ కింగ్స్ లెవ‌న్ లాగా.. జ‌గ‌న్స్ లెవ‌న్ అనే పేరు మీద మీమ్స్ వెల్లువెత్తాయి. ఇక తాజాగా కొత్త పార్లమెంట్ భవనంలో వైసీపీ ఎంపీలకు లోక్ సభ స్పీకర్ కేటాయించినది కూడా 11వ నెంబర్ రూమే.
ఇక 2026 త‌మిళ‌నాడు అసెంబ్లీ ఎన్నిక‌ల్లో ప్ర‌ధాన పార్టీలైన డీఎంకే, అన్నాడీఎంకే, టీవీకే ఓట‌ర్ల‌ను ఆక‌ర్షించేందుకు ప‌లుర‌కాల ఉచితాల వ‌ల ప‌న్నాయంటే ప‌రిస్థితి ఏమిటో ఊహించుకోవ‌చ్చు.
ఇక టికెట్ ధరల పెంపు అనేది కేవలం పవన్ కల్యాణ్ కోసం తీసుకున్న నిర్ణయం కాదని, నిర్మాతల నుంచి వచ్చే అభ్యర్థనల మేరకు ప్రభుత్వం నిబంధనల ప్రకారం తీసుకునే నిర్ణయమని స్పష్టం చేశారు. ఈ పిటిషన్ వెనుక కేవలం రాజకీయ దురుద్దేశాలు తప్ప, ప్రజా ప్రయోజనం లేదన్నారు.
నియోజకవర్గాల పెంపు కారణంగా రాష్ట్రంలో ఇప్పటికే అంతంత మాత్రంగా ఉన్న వైసీపీ బలం మరింత దిగజారే అవకాశం ఉందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.
భారీగా ఆర్వోల తొలగింపు వెనుక రాజకీయ ఒత్తిడులు ఉన్నాయని పశ్చిమబెంగాల్ లో అధికార తృణమూల్ కాంగ్రెస్ తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పిస్తోంది. అయితే ఒకే సారి 72 మంది ఆర్వోలను తొలగిస్తూ కేంద్ర ఎన్నికల సంఘం నిర్ణయం వెలువరించిదే తప్ప అదుకు కారణాలను వెల్లడించలేదు.
వాస్తవానికి ఈ కూటమి సీట్ల సర్దుబాటు ఇంత వరకూ ఓ కొలిక్కి రాకపోవడానికి ప్రధాన కారణం నటుడు విజయ్ నేతృత్వంలోని టీవీకే పార్టీ అని చెప్పాల్సి ఉంటుంది. ఆ పార్టీతో పొత్తు కుదుర్చుకునేందుకు బీజేపీ చివరి నిముషం వరకూ ప్రయత్నించింది. ఒక దశలో టీవీకే, బీజేపీ మధ్య పొత్తుపొడిచిందన్న వార్తలు కూడా గట్టిగా వినిపించాయి.
చంద్రబాబు వంటి దార్శనికుడు ముఖ్యమంత్రిగా ఉండటం ఆంధ్రప్రదేశ్ ప్రజల అదృష్టమని కేంద్ర ఉక్కు, భారీ పరిశ్రమల శాఖ మంత్రి హెడీ కుమారస్వామి అన్నారు. అనకాపల్లి జిల్లా నక్కపల్లిలో భారీ ఉక్కుకర్మాగారం శంకుస్థాపన ఈ కార్యక్రమంలో పాల్గొన్న హెచ్ డీ కుమారస్వామి అంతకు ముందు విశాఖలో మీడియాతో మాట్లాడారు.
రేంద్రమోడీ గుజరాత్ సీఎంగా 2001 అక్టోబర్ 7న పదవీ బాధ్యతలు చేపట్టారు. అంతకు ముందు ఆయన గుజరాత్ సీఎంగా ఆ రాష్ట్రాన్ని పాలించారు. దీంతో సోమవారం (మార్చి 23) నాటికి ఆయన పాలనా పగ్గాలు చేపట్టి 8932 రోజులైంది. అంటే అత్యధిక రోజుల పాటు రోజుల పాటు ప్రభుత్వాధినేతగా బాధ్యతలు నిర్వహించి, దేశంలోనే సుదీర్ఘకాలం పనిచేసిన నేతగా మోడీ కొత్త రికార్డు సృష్టించారు.
దేశ చరిత్రలో ప్రధానిగా ఎన్నికైన ఏకైక మహిళ ఇందిరాగాంధీ. దాదాపు 16 ఏళ్ల సుదీర్ఘకాలం భారతదేశ ప్రధానిగా కొనసాగిన ఏకైక వనిత ఇందిరాగాంధీ. ఉక్కుమహిళగా పేరు తెచ్చుకున్న ఇందిరాగాంధీ తన హయాంలో తీసుకుని అమలు చేసిన నిర్ణయాలు ఓ సంచలనం.
వచ్చే ఎన్నికల్లో నాగబాబు శ్రీకాకుళం జిల్లాలోని ఎచ్చెర్ల అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తారని కూడా పొలిటికల్ సర్కిల్స్ లో పుకార్లు షికారు చేస్తున్నాయి.
బుజ్జగింపు ప్రయత్నాలు ఫలించలేదు. ఇంత వరకూ వచ్చిన తరువాత పార్టీలో కొనసాగితే.. తన గౌరవానికి భంగం అని జీవన్ రెడ్డి తనను బుజ్జగించడానికి వచ్చిన నేతలతో అన్నట్లు సమాచారం. వాస్తవానికి గత కొంతకాలంగా పార్టీ అంతర్గత పరిణామాలపై తీవ్ర అసంతృప్తిగా ఉన్నజీవన్ రెడ్డి.. బీఆర్ఎస్ గూటికి చేరనున్నారని రాజకీయ వర్గాల్లో బలంగా వినిపిస్తోంది.
రిజర్వుడు నియోజకవర్గాల నుంచి పార్టీ టికెట్ ఆశిస్తున్న అభ్యర్థులు 15వేల రూపాయలు, జనరల్ స్థానం నుంచి టికెట్ ఆశిస్తున్న వారు పాతిక వేల రూపాయలు ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. ఇది నాన్ రిఫండబుల్. ఇలా ఫీజు చెల్లించి దరఖాస్తు చేసుకున్న వారికి నిర్దిష్ట తేదీ, నిర్దిష్ట సమయం కేటాయించి ఇంటర్వ్యూలకు పిలుస్తారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.