ఢిల్లీ అసెంబ్లీలో కేజ్రీవాల్ విశ్వాస తీర్మానం

Publish Date:Aug 29, 2022

Advertisement

ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవల్ సోమవారం (ఆగస్టు 29) అసెంబ్లీలో విశ్వాస తీర్మానం ప్రవేశ పెట్టనున్నారు. ఢిల్లీలో అధికారంలో ఉన్న అమ్ ఆద్మీ ప్రభుత్వాన్ని కూల్చేందుకు బీజేపీ ప్రయత్నాలు చేస్తోందన్న ఆరోపణల మధ్య కేజ్రీవాల్ ఈ నిర్ణయం తీసుకవడం రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది. ఆప్ ఎమ్మెల్యేలను కొనుగోలు చేయడానికి ఒక్కొక్కరికీ బీజేపీ రూ. 20 కోట్లు ఇవ్వజూపిందని కేజ్రీవాల్ ఆరోపించిన సంగతి తెలిసిందే. సంతలో పశువుల్లో కొనుగోలుకు బీజేపీ సిద్ధపడినా.. తమ పార్టీ వారెవరూ అందుకు సిద్ధంగా లేరన్న కేజ్రీవాల్.. ఆ విషయాన్ని రుజువు చేసేందుకే విశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెడుతున్న్ట్లట్లు పేర్కొన్నారు.

అంతకు ముందు అరవింద్ కేజ్రీవాల్ తన పార్టీ ఎమ్మెల్యేలతో కలిసి మహాత్మా గాంధీ స్మారక రాజ్‌ఘాట్‌లో ప్రార్థనలకు నాయకత్వం వహించారు, ఆ తర్వాత ఢిల్లీలోని ఆప్‌కి చెందిన 62 మంది ఎమ్మెల్యేలలో 53 మంది ఆయన నివాసంలో సమావేశానికి హాజరైన సంగతి విదితమే.  రాజ్‌ఘాట్‌ను సందర్శించిన అనంతరం కేజ్రీవాల్ ఆప్ కు చెందిన 40 మంది ఎమ్మెల్యేలకు  బీజేపీవారు లంచం ఇచ్చి తమ పార్టీలో చేరాల్సిందిగా ఒత్తిడి తెస్తున్నరనీ, అయితే ఒక్క ఎమ్మెల్యే కూడా బీజేపీ దుష్టపన్నాగాలకు లొంగకుండా నిలిచినందుకు  గర్వపడుతున్నాననీ పేర్కొన్నారు.  

బీజేపీ ఆపరేషన్ కమలం అట్టర్ ప్లాప్ అయ్యిందన్నారు.  మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, కర్ణాటక తరహాలో తమ ప్రభుత్వాన్ని పడగొట్టేందుకు బీజేపీ ‘ఆపరేషన్ కమలం కుట్ర పన్నిందని కేజీవాల్ ఆరోపించారు. తాను ఆప్‌ని వదిలేసి కమలం గూటికి చేరితే తనపై ఉన్న అన్ని కేసులను మూసివేస్తామని బీజేపీ ఆఫర్ చేసిందని ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా పేర్కొన్నారు. ఈ ఏడాది ప్రారంభంలో ప్రవేశపెట్టిన ఢిల్లీ మద్యం పాలసీలో అవకతవకలు, అవినీతికి సంబంధించిన కేసులో సిసోడియాపై సీబీఐ కేసు నమోదు చేసిన సంగతి విదితమే. మద్యం పాలసీ ఉల్లంఘనలపై సీబీఐ ఎఫ్‌ఐఆర్‌లో పేర్కొన్న 15 మంది నిందితుల జాబితాలో సిసోడియా ప్రథమ స్థానంలో ఉన్నారు. ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ ఆయనపై మనీలాండరింగ్ కేసు కూడా నమోదు చేసింది.   

2024 సార్వత్రిక ఎన్నికలు మిస్టర్ కేజ్రీవాల్, ప్రధాని నరేంద్ర మోడీ మధ్య పోటీ అని ఆప్ పేర్కొంది. విద్యారంగంలో చేసిన సేవలకు గానూప్రజాదరణ పొందుతున్న ఆప్ నాయకుడిని ఆపడానికి బీజేపీ కేంద్ర ఏజెన్సీలను దుర్వినియోగం చేస్తోందని ఆమ్‌ ఆద్వీ పార్టీ ఆరోపించింది.   

By
en-us Political News

  
ఆంధ్రప్రదేశ్‌లో మెగా డీఎస్సీ (DSC) నియామకాల చుట్టూ ప్రస్తుతం నడుస్తున్న రాజకీయ వివాదం కూటమి ప్రభుత్వానికి సరికొత్త సవాలుగా మారింది.
భారతదేశ రాజకీయ చరిత్రలో ప్రాంతీయ పార్టీల పాత్ర అత్యంత కీలకమైనది
ఆంధ్రప్రదేశ్ రాజకీయ ముఖచిత్రం ప్రస్తుతం ఆసక్తికరమైన మలుపు తిరుగుతోంది.
దేశ సమగ్రత, జాతీయ సమైక్యతే జనసేన పార్టీ మూల సిద్ధాంతమని జనసేన అధ్యక్షుడు, ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు.
తెలంగాణ రాజకీయాల్లో అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీల మధ్య మాటల యుద్ధం రోజురోజుకూ మరింత ముదురుతోంది.
ఐటీ సలహాదారుగా పనిచేసిన రాజ్ కేసిరెడ్డిని, అలాగే ఏపీబీసీఎల్ మాజీ చైర్మన్ వాసుదేవరెడ్డిని ఈడీ అధికారులు మనీ లాండరింగ్ ఆరోపణలపై అరెస్ట్ చేయడం హాట్ టాపిక్‌గా మారింది. ఈ ఇద్దరి అరెస్టుతో ఈ కుంభకోణం తాలూకు మూలాలు ఎక్కడికి దారితీస్తున్నాయి, అంతిమంగా దీని ప్రభావం మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై పడబోతోందా అనే విషయంపై మాజీ న్యాయమూర్తి రామకృష్ణ తెలుగువన్ కు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో విశ్లేషించారు.
ఈ మొత్తం స్థలం విలువ బహిరంగ మార్కెట్లో వెయ్యి కోట్ల రూపాయలకు పైగానే ఉంటుందని అంటున్నారు. ఇందులో సింహభాగం అంతా ప్రభుత్వానికి చెందిన భూమి కావడం గమనార్హం. కాగా ఈ వ్యవహారంపై తెలుగువన్ కు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో ప్రముఖ అనలిస్ట్ భరద్వాజ మాట్లాడారు.
సహజంగా దేశ చరిత్రలో జవహర్‌లాల్ నెహ్రూ 17 సంవత్సరాల పాటు, ఇందిరా గాంధీ 16 సంవత్సరాల పాటు ప్రధానమంత్రులుగా సేవలందించారు. అయినప్పటికీ ప్రధాని నరేంద్ర మోడీ 12 ఏళ్ల పాలన రికార్డు ఎలా ? అన్న విషయాన్నితెలుగువన్ కు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో సీనియర్ జర్నలిస్టు, ప్రముఖ ఎనలిస్టు వివరించారు.
గత సార్వత్రిక ఎన్నికల ముందే వీరిద్దరి మధ్య విభేదాలు తీవ్రమై కేశినేని నాని తెలుగుదేశం పార్టీని వీడి వైసీపీలో చేరారు. ఆ ఎన్నికల్లో తెలుగుదేశం అభ్యర్థిగా పోటీ చేసిన సోదరుడు కేశినేని చిన్ని చేతిలో వైసీపీ అభ్యర్థిగా పోటీ చేసిన కేశినేని నాని ఓటమి పాలయ్యారు. ఎన్నికల ముగిసిన తర్వాత నాని వైసీపీకి దూరంగా జరుగుతూ మళ్లీ టీడీపీ వైపు మొగ్గు చూపుతున్నట్లు ప్రచారం జరుగుతున్నప్పటికీ.. తమ్ముడు కేశినేని చిన్నితో వైరం మాత్రం పెరుగుతూనే ఉంది.
ఆంధ్రప్రదేశ్‌లో తెలుగుదేశం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండు సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా, వైసిపి శ్రేణులు రాష్ట్రవ్యాప్తంగా నిరసన కార్యక్రమాలకు పిలుపునిచ్చాయి. ఈ నిరసనల్లో భాగంగా ఒక ధర్నాలో పాల్గొన్న అంబటి రాంబాబు అనుచిత వ్యాఖ్యలు చేశారు. వైసీపీ నిరసనల సందర్భంగా శాంతిభద్రతలకు విఘాతం కలగకుండా చూసేందుకు పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాట్లు చేశారు.
రాష్ట్రంలో తెలుగుదేశం కూటమి ప్రభుత్వం రెండేళ్ల పాలన పూర్తి చేసుకున్న సందర్భంగా ఆయన సమాజిక మాధ్యవ వేదిక ఎక్స్ లో పెట్టిన పోస్టులో.. ప్రజల ఆకాంక్షలు నెరవేరుస్తూ… రాష్ట్ర భవిష్యత్తుకు బాటలు వేస్తున్నామన్నారు.
ఆమె నామినేషన్ తిరస్కరణను బీజేపీ పక్కా ప్రణాళికతో చేసిన రాజకీయ కుట్రగా అభివర్ణించారు. జాతీయ మీడియాతో మాట్లాడిన జగ్గారెడ్డి.. మధ్యప్రదేశ్ లోని బీజేపీ ప్రభుత్వం ఎన్నికల కమిషన్‌ను పావుగా వాడుకుని, ఉద్దేశపూర్వకంగానే మీనాక్షి నటరాజన్ నామినేషన్‌ను అడ్డుకుందని ఆరోపించారు.
ఈ ఆందోళన చట్టబద్ధంగా, రాజ్యాంగబద్ధమైన పద్ధతుల్లో, ఎలాంటి హింసకు తావులేకుండా ప్రశాంత వాతావరణంలో జరుగుతుందని నిర్వాహకులు స్పష్టం చేశారు. డిజిటల్ స్క్రీన్‌ల నుండి నేరుగా రోడ్లపైకి వస్తున్న ఈ జెన్-జీ ఉద్యమం తీవ్ర చర్చనీయాంశంగా మారింది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.