అసాధ్యాలను సుసాధ్యం చేసే దార్శనికుడు.. అనితర సాధ్యుడు.. నారా చంద్రబాబునాయుడు

Publish Date:Apr 19, 2026

Advertisement

భూమ్మీదకు ఎంతోమంది వస్తూ  ఉంటారు. జన్మభూమి కోసం వచ్చేవారు కొందరుంటారు.  వారిలో చంద్రబాబు ఉంటారు. ఒక మనిషి వయస్సును కొలవటానికి సంవత్సరాలే కొలమానం అయితే..  చంద్రబాబు డెబ్బై అయిదు వసంతాలను దాటి డెబ్బై ఆరవ వసంతంలోకి అడుగుపెడుతున్నారు. గత యాభై సంవత్సరాలుగా ఆయన వార్తల్లో వ్యక్తి. ఆయన గురించి ఇప్పటికీ అర్థం కాని విషయం.. ఒక ఎగువ మధ్య తరగతి కుటుంబం నుండి వచ్చిన వ్యక్తి అంతటి సాహసోపేతమైన కలలు ఎలా కన్నారు?   ఆయన కుటుంబ నేపథ్యం ఆయనను చదివించటానికి సరిపోతుంది కానీ, ఆయన రాజకీయాలలో ఎదగడానికి ఖర్చు పెట్టగలిగే శక్తివంతమైనది కాదు.​ ఈ రోజుల్లో మాదిరి శాసనసభ్యుడు కావాలంటే కోట్లు అవసరం ఉండి ఉండకపోవచ్చు, కానీ అస్సలు డబ్బులు ఖర్చు పెట్టకుండా శాసనసభ్యుడు అవటం ఆ రోజుల్లో కూడా అసాధ్యమే. కానీ తన రాజకీయ భవిష్యత్ గురించి చంద్రబాబు కలకనటమే కాకుండా.. సాకారం చేసుకోవటానికి కృషి చేశారు. ఇప్పుడు అమరావతి రాజధానిని  సెల్ఫ్ సస్టైనబుల్ సిటీ గా రూపొందించినట్లే, ఆయన రాజకీయ రంగప్రవేశంలో కూడా కుటుంబాన్ని ఇబ్బంది పెట్టకుండా  సెల్ఫ్ ఫైనాన్సింగ్ స్కీం  ఏదో ఆలోచించి అమలులో పెట్టి ఉంటారు. అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా, తన ప్రసంగాలను  మనం చేయలేమా? చేయగలం  (యస్ వికెన్) అనే మాటతో ముగించేవారు. కానీ చంద్రబాబు నాయుడు నలభై సంవత్సరాల క్రితమే తన జీవితానికి  నేను చేయగలను  (ఐ కేన్ డూ) అనే టాగ్ లైన్ నిర్దేశించుకున్నారు.
​బహుశా అందుకేనేమో..  ఆయన జీవితమంతా అసాధ్యాలను సుసాధ్యం చేయటమే పనిగా పెట్టుకున్నారు. సవాళ్లను స్వీకరించటం ఆయన నైజం. అందుకే అప్పటికే మహామహులు నాయకులుగా ఉన్న కాంగ్రెస్ పార్టీలో..  చిత్తూరు జిల్లాలో పెద్దగా ప్రాధాన్యత లేని సామాజికవర్గం నుండి వచ్చిన ఆయన..  ఎటువంటి రాజకీయ నేపథ్యం లేని కుటుంబానికి చెందిన ఒక సామాన్యుడు శాసనసభకు ఎందుకు వెళ్ళలేడు?  అనే సవాలును అతి పిన్నవయస్సులో స్వీకరించాడు. సామాన్యుడిగా వచ్చిన ఆయన ఈరోజు అసామాన్యతనే సామాన్యతగా రూపాంతరం చెందేలా చేయగలిగాడు. దానికి తార్కాణం చంద్రబాబు రాజకీయ ప్రస్థానమే కాదు, ఆయన నాయకత్వంలో ఎదిగిన తెలంగాణ. 

​పార్టీ నిర్మాణంలో, అంచలంచెల నాయకత్వ విధానంలో కమ్యూనిష్టులను అనుకరించే చంద్రబాబు, అనుసరించేది పెట్టుబడిదారీ వ్యవస్థను. ఆయన ఐడియాలను పెట్టుబడిగా పెట్టి పెట్టుబడిదారులను ఆకర్షిస్తారు. పెట్టుబడిదారీ వ్యవస్థ రూపురేఖలు ఎలా అల్లుకుపోతాయి అనే మాట పక్కన పెడితే.. రాష్ట్రంలో యువతకు ఉపాధి కల్పనే ఆయన లక్ష్యం. దార్శనికుడు అంటారు,  అది నిజమే.. అలాగే అన్వేషణ ఆయన సహజగుణం. రేపు రాబోయే సమాజం ఎలా ఉంటుందో దర్శించగలగటం ఒకెత్తు.. ఆ సమాజానికి అవసరమైన పునాదులను అన్వేషించటం మరో ఎత్తూ.. ఈ రెండూ ఏకకాలంలో చేయగలగడమే చంద్రబాబు  ప్రత్యేకత. ఇప్పటి ప్రపంచం తీరుతెన్నులకు తనను తాను మలచుకుంటాడు. ఆయన మీద ఉండే ప్రధానమైన విమర్శ కూడా అదేనేమో! అవసరాలకు అనుగుణంగా తన పార్టీ విధివిధానాలను, తన పాలనా తీరును మార్చుకోవటం అవకాశవాదం అయితే..  ఆయన ఖచ్చితంగా అవకాశవాదే. కానీ ఆయన నమ్మేది  అవసరమే ఆవిష్కరణకు తల్లి. ప్రజల అవసరాలను తీర్చటమే తన విధానాల అన్వేషణకు మూలం అనుకుంటారు  చంద్రబాబు.​ తన పార్టీ బతికి ఉండాలి, తన పాలనలో ప్రజలు సుభిక్షంగా ఉండాలి అనే   ఆశయానికి అనుగుణంగా ఆయన అవకాశాలను అందిపుచ్చుకునే ప్రయత్నం చేస్తాడు. సమకాలీన రాజకీయాలలో ఆయన ఎప్పుడూ ఒక ప్రశ్నగానే మిగిలిపోయారు. రేపు రాబోయే ఎన్నికలలో ఆయన ఎటువంటి స్టాండ్ తీసుకుంటాడో ఎవరికీ తెలియదు. అప్పటి అవసరాలు ఎలా ఉంటాయో ఊహించే ప్రయత్నంలో ఇప్పటి సమయాన్ని వృధా చేసుకోవటం ఆయనకు ఇష్టం ఉండదు.  దానికి ఎవరు ఏ పేరు పెట్టినా ఆయన లెక్క చేయరు. అయితే ఆయన ఆలోచనలు రాష్ట్ర అవసరాల మేరకే పరిమితమైపోయాయి. విదేశీ పెట్టుబడులను ఆకర్షించే ప్రయత్నం చేస్తారే కానీ, దేశ విదేశీ విధానం గురించి ఆలోచించే ప్రయత్నం చేయరు. బహుశా సుదీర్ఘకాలం తన పార్టీని కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీలతో జత కట్టించి ఉంచటం వలనేమో..  రాష్ట్రానికి ఆవల ఏమీ జరిగినా ఆయన పెద్దగా పట్టించుకోరు.
​ప్రపంచంలోని అతి పెద్ద సంస్థలు ఆయనలోని దార్శనికుని చూస్తున్నాయి. కానీ..  దేశ రాజకీయాలలో ఆయన పాత్ర  పరిమితం అయిపోయింది. ఇదే ఎన్డీయే  వాజ్ పేయి నాయకత్వంలో పరిపాలన కొనసాగిగుతున్నప్పుడు..  దేశంలో మౌలిక వసతుల రూపకల్పన లాంటి విషయాలలో చంద్రబాబు తనదైన ముద్ర వేశారు.  ఈరోజు కేంద్ర ప్రభుత్వానికి ఒక పిల్లర్ అయినా జాతీయ విధానాల రూపకల్పనలో ఆయన పాలుపంచుకోవటం లేదు. బహుశా మారిన రాజకీయ ముఖచిత్రంలో ఆయన తన పాత్రను రాష్ట్రం వరకే పరిమితం చేసుకున్నారేమో అనిపిస్తుంది.  ఇది   దేశానికి నష్టం.
​అయితే ఆంధ్రరాష్ట్రానికి ఆయన అవసరం ఎంత ఉన్నదంటే, ఆయన మరో డెబ్బై అయిదు వసంతాలు జరుపుకోవాలన్నంతగా! ఒకనాడు ఆయన ఐటీ వైపు మొగ్గు చూపినప్పటి పరిస్థితులకు, ఇప్పటి పరిస్థితులకు అంతులేని భేదం ఉన్నది. ఐటీ సెక్టార్ నిరాటంకంగా పాతిక సంవత్సరాలు ఏకఛత్రాధిపత్యంగా రాజ్యమేలింది. ఇప్పుడు వచ్చే టెక్నాలజీ ఉద్యోగాలను తగ్గించటమే కాక, ఉన్న ఉద్యోగులనే తీసివెయ్యవలసిన పరిస్థితిని తీసుకువస్తున్నది. కొత్తగా వచ్చిన సాంకేతికత ఎంతకాలం మనుగడ సాగిస్తుందో ఎవరూ ఊహించను కూడా ఊహించలేకపోతున్నారు.
ఇప్పుడు టెక్నాలజీని అందిపుచ్చుకోవాలి, సాంకేతిక రంగానికి ఆవల కూడా ఉద్యోగ ఉపాధి కల్పన జరిగేలా రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలి. వీటన్నిటికంటే మిన్నగా కుదేలయిపోయిన వ్యవసాయరంగాన్ని గాడిలో పెట్టాలి. వ్యవసాయాధారిత రాష్ట్రంలో టెక్నాలజీ ఎంత ముఖ్యమో, వ్యవసాయం అంతకంటే ముఖ్యం. ఇక చంద్రబాబు మానస పుత్రిక, ప్రజా రాజధాని అమరావతి ఉండనే ఉన్నది. చంద్రబాబు డెబ్బై ఏడవ జన్మదిన వేడుకల నాటికి అమరావతికి ఒక రూపం తీసుకువస్తేనే ప్రజలకు విశ్వాసం కలుగుతుంది.​ భిన్న కోణాల దిశగా రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలంటే అది ఒక్క చంద్రబాబు నాయుడు వలనే సాధ్యం అనే విషయంతో ఎవరూ విభేదించలేరు. అందరికీ వయస్సు పెరిగే కొద్దీ బాధ్యతలు తగ్గుతాయి, కానీ సమస్యను సవాలుగా స్వీకరించేవారిపై బాధ్యతలు పెరుగుతాయి. అందుకని చంద్రబాబుకు జన్మదిన శుభాకాంక్షలు చెబుతూ, ఆయన బాధ్యతల భారాన్ని గుర్తుచేస్తూ ఉంటారు. బహుశా ఆయన కోరుకునేది కూడా ఇటువంటి శుభాకాంక్షలనే ఏమో. తెలుగుజాతి అస్తిత్వానికే చిహ్నంగా ఉన్న  నారా చంద్రబాబు నాయుడు గారికి తెలుగువన్ హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. 

చంద్రబాబు జన్మదినం సందర్భంగా..

By
en-us Political News

  
ప్రముఖ నటుడు జూనియర్ ఎన్టీఆర్ సోషల్ మీడియా వేదికగా చంద్రబాబుకు బర్త్ డే విషెస్ చెబుతూ చేసిన ట్వీట్ ఇప్పుడు తెగ వైరల్ అవుతోంది. తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్‌గా మారింది.
ప్రధాని నరేంద్ర మోడీ.. సామాజిక మాధ్యమ వేదిక ఎక్స్ లో మైగుడ్ ఫ్రెండ్ అని చంద్రబాబును సంబోధిస్తూ జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ప్రగతి పథంలో నడిపించడంలో ఆయన చూపుతున్న చొరవ, భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా టెక్నాలజీని వాడుకోవడంలో ఆయనకున్న విజన్ అద్భుతమని ఈ సందర్భంగా ప్రధాని ప్రస్తుతించారు.
భారత రాజ్యాంగం ప్రకారం.. జనాభా లెక్కల తర్వాత నియోజకవర్గాల పునర్విభజన తప్పనిసరి. ఇది ఏ పార్టీ ఇష్టానుసారం చేసే పని కాదు. ఇది రాజ్యాంగబద్ధమైన, ఆటోమేటిక్ ప్రక్రియ. ఎందుకు 50 సంవత్సరాలుగా డిలే అయింది? 1976 ఇందిరా గాంధీ ఎమర్జెన్సీ.. డీలిమిటేషన్ను 2001 వరకు ఫ్రీజ్ చేశారు.2001 – వాజ్పేయి ప్రభుత్వం: ఫ్రీజ్ను 2026 వరకు పొడిగించింది. అంటే.. 2026లో డీలిమిటేషన్ జరుగుతుందని అన్ని పార్టీలకూ గత 20 సంవత్సరాలుగా తెలుసు.
ఆయన మంత్రి పదవి ఇప్పుడు ఒక రాజ్యాంగపరమైన గడువుపై ఆధారపడి ఉంది. ప్రస్తుత పరిస్థితిని చూస్తే.. నెల రోజుల్లో ఆయన మంత్రి ఉద్యోగం పోతుందా? అని ప‌రిశీలిస్తే ఆయ‌న‌కా గండం ఉందనే చెప్పాలి.
వెస్ట్ బెంగాల్ లో మొత్తం 91 లక్షల ఓటు తొలగించారు. అంటే సగటున చూస్తే నియోజకవర్గానికి 31 వేల ఓట్లు తొలగించారు. ఈ తొలగింపు రెండు కారణాల వల్ల చాలా సెన్సిటివ్. మార్జిన్‌లతో పోలిస్తే ..2021లో టీఎంసీ గెలిచిన చాలా సీట్లలో మెజారిటీ 50,000 కంటే తక్కువ. 13 సీట్లలో ఇది మూడు వేల కంటే కూడా తక్కువ. ఇటువంటి పరిస్తితుల్లో నియోజకవర్గానికి 31 వేల ఓట్లు డిలిషన్ లో పోతే.. ఈ ప్రభావం ఎవరిపై ఎక్కువగా పడుతుంది?
మహిళా రిజర్వేషన్ల పేరుతో కేంద్ర ప్రభుత్వం మరోసారి ప్రజలను వంచించే ప్రయత్నం చేసిందన్నారు. విపక్షాలు సమష్టిగా ఆ ప్రయత్నాన్ని అడ్డుకోవడంతో మోడీ ఫ్రస్ట్రేషన్ లోకి వెళ్లిపోయారన్నారు. అందుకే ఆయన తన ప్రసంగంలో అబద్ధాలు వల్లెవేశారన్నారు.
ఈ నిర్ణయం వెలువడిన వెంటనే అంతర్జాతీయ మార్కెట్లో సానుకూల పరిణామాలు కనిపించాయి. ప్రపంచ చమురు వాణిజ్యంలో ఐదో వంతు వాటా కలిగిన ఈ మార్గం గుండా నౌకల రాకపోకలు సాఫీగా సాగడంతో, ముడి చమురు ధరలు 10 శాతం కంటే ఎక్కువగా పడిపోయాయి. అటు అమెరికా స్టాక్ మార్కెట్లు సైతం భారీ లాభాల్లో ముగిశాయి. ఆసియా మరియు యూరోప్ దేశాలకు, ముఖ్యంగా చమురు దిగుమతులపై ఆధారపడే భారత్, చైనా వంటి దేశాలకు ఇది తక్షణ ఆర్థిక ఊపిరిని అందించింది.
బిల్లు ఆమోదం పొందాలంటే కనీసం 352 ఓట్లు అవసరం. ఈ పరిణామంపై స్పందించిన కేంద్ర హోంమంత్రి అమిత్ షా, విపక్షాల తీరును తీవ్రంగా తప్పుబట్టారు. మహిళలకు చట్టసభల్లో 33 శాతం రిజర్వేషన్లు కల్పించాలనే ప్రభుత్వ సంకల్పాన్ని కాంగ్రెస్, తృణమూల్ కాంగ్రెస్, సమాజ్ వాదీ పార్టీ వంటి పార్టీలు అడ్డుకున్నాయన్నారు. నారీ శక్తిని గౌరవించని విపక్షాలకు ప్రజలు తగిన బుద్ధి చెబుతారని హెచ్చరించారు.
సమానహక్కులు, సముచిత ప్రాతినిథ్యం కోరుతున్న కోట్లాది మంది మహిళలకు కాంగ్రెస్ ద్రోహం చేసిందంటూ చంద్రబాబు ఎక్స్ వేదికగా పేర్కొన్నారు.
భారత పార్లమెంటరీ చరిత్రలో ఒక కీలక పరిణామం చోటుచేసుకుంది.
కానీ కూటమి మధ్య అవగాహన రోజు రోజుకూ బలపడుతోందని తెలుగుదేశం జాతీయ కార్యనిర్వాహక అధ్యక్షుడు నారా లోకేష్ చెప్పారు. ఆ విషయం చెబుతూ.. ఇటీవల తాను చేసిన ఒక వ్యాఖ్యను పవన్ కల్యాణ్ ఫోన్ చేసి మరీ సరిదిద్దిన విషయాన్ని వెల్లడించారు.
దాదాపు మూడు దశాబ్దాల నిరీక్షణ తర్వాత ఇది చట్టంగా మారింది. ఎప్పటి నుంచి ఇది చట్టసభల్లో నలుగుతోందని చూస్తే.. మహిళా బిల్లు ప్రస్థానం నేటిది కాదు, దీని వెనుక ఏళ్ల పోరాటం ఉంది. ఈ దిశగా తొలి అడుగులు 1996లో పడ్డాయి. హెచ్.డి. దేవెగౌడ ప్రభుత్వం మొదటిసారిగా 81వ రాజ్యాంగ సవరణ బిల్లు రూపంలో దీనిని ప్రవేశపెట్టింది. కానీ లోక్‌సభ రద్దు కావడంతో అది వీగిపోయింది.
పేద అమ్మాయిల వివాహాలకు ఎనిమిది గ్రాముల బంగారం, ఓ పట్టుచీర కానుకగా ఇస్తామన్నారు. ఐదు ఎకరాల కంటే తక్కువ భూమి ఉన్న రైతుల వ్యవసాయ రుణాలను మాఫీ చేస్తామన్నారు. స్వయం సహాయక బృందాలకు రూ.5 లక్షలు వడ్డీ లేని రుణాలు, ప్రభుత్వ, ఎయిడెడ్ పాఠశాలల్లో డ్రాపవుట్‌ లేకుండా చేసేందుకు విద్యార్థుల తల్లులకు ఏడాదికి రూ.15 వేలు ఆర్థిక సహాయం చేస్తామన్నారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.