పవన్ కళ్యాణ్‌పై ముప్పేట దాడి.. కూటమిలో చిచ్చు రేపేందుకేనా?

Publish Date:Jun 1, 2026

Advertisement

తెలుగువన్ ఎక్స్ క్లూజివ్

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌ను లక్ష్యంగా చేసుకుని అటు సొంత సామాజికవర్గం, ఇటు రాజకీయ ప్రత్యర్థుల నుంచి ముప్పేట దాడి మొదలైంది. ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పవన్ కళ్యాణ్ చుట్టూ ఇప్పుడు సరికొత్త వివాదాలు చుట్టుముడుతున్నాయి. అటు తెలంగాణలో భూముల వ్యవహారాలు, ఇటు ఆంధ్రాలో కాపు సామాజికవర్గ నేతల నుంచి వస్తున్న తీవ్ర విమర్శలు జనసేనానిని రాజకీయంగా ఇరకాటంలోకి నెడుతున్నాయి.

ప్రస్తుతం పవన్ కళ్యాణ్ ఎదుర్కొంటున్న ఈ రాజకీయ ఒత్తిడి, ప్రత్యర్థుల వ్యూహాలపై  సీనియర్ రాజకీయ విశ్లేషకుడు  భరద్వాజ తో  తెలుగువ్ న్యూస్ చానల్ ప్రత్యేక ఇంటర్వూలో పలు ఆసక్తికర విషయాలు వెల్లడించారు.   పవన్ కళ్యాణ్‌ను మానసికంగా, రాజకీయంగా దెబ్బతీసి కూటమి స్పిరిట్‌ను దెబ్బతీయడమే లక్ష్యంగా ఈ వ్యూహాత్మక దాడులు జరుగుతున్నాయని ఆయన అన్నారు. 

ముఖ్యంగా కాపు సామాజికవర్గానికి పవన్ కళ్యాణ్ ఏం చేశారంటూ దాసరి రాము వంటి నేతలు టోన్ పెంచి విమర్శలు గుప్పిస్తున్నారు. గతంలో భీమవరం, గాజువాక నియోజకవర్గాల్లో కాపు ఓటర్లు ఎక్కువగా ఉన్నప్పటికీ పవన్ ఓడిపోవడానికి ఆ సామాజికవర్గమే బాధ్యత వహించాలంటూ గతంలో ఆయన చేసిన వ్యాఖ్యలను ఇప్పుడు ప్రత్యర్థులు ఆయుధంగా మలుచుకుంటున్నారు. జనసేన కేవలం ఒక కులానికి పరిమితమైన పార్టీ కాదని పవన్ స్పష్టం చేస్తున్నప్పటికీ, ఆయనను టార్గెట్ చేయడం ఆపడం లేదు.

మరోవైపు మాజీ మంత్రులు అంబటి రాంబాబు, పేర్ని నాని వంటి  కాంగ్రెస్ పార్టీ కాపు నేతలు కూడా పవన్‌పై విమర్శల దాడిని ముమ్మరం చేశారు. వంగవీటి మోహన రంగా హత్యోదంతాన్ని మళ్లీ తెరపైకి తెస్తూ, ఆనాటి రాజకీయ పరిస్థితులను ప్రస్తుత కూటమితో ముడిపెట్టే ప్రయత్నం చేస్తున్నారు. రంగా అభిమానులు, కాపు సామాజికవర్గం విస్తృతంగా ఉన్న ఉమ్మడి గోదావరి, కృష్ణా, గుంటూరు జిల్లాల్లో పవన్ కళ్యాణ్ బలాన్ని తగ్గించడమే ఈ విమర్శల వెనుక ఉన్న ప్రధాన ఉద్దేశ్యంగా కనిపిస్తోంది. అందుకే రంగా హత్యను తెరపైకి తీసుకువచ్చి.. ఆ హత్యకు కారకులతో పవన్ కల్యాణ్ ఇప్పుడు ఉన్నారంటూ విమర్శిస్తున్నారు.

ఈ వ్యూహాత్మక ఒత్తిడి ద్వారా పవన్ కళ్యాణ్ చేత ఏదైనా భావోద్వేగ ప్రకటన చేయించాలని ప్రత్యర్థులు భావిస్తున్నారు. ఆ ప్రకటన గనుక కూటమి ప్రభుత్వ ఐక్యతకు భంగం కలిగించేలా ఉంటే..  దాని ద్వారా రాజకీయ లబ్ధి పొందాలనేది శత్రు పక్షాల ప్లాన్. ఈ ముప్పేట దాడిని తిప్పికొట్టేందుకు పవన్ కళ్యాణ్ ఇప్పటికే క్యాడర్ మద్దతును కూడగడుతున్నారు. ఇందులో భాగంగానే రాజమండ్రి, విజయవాడ, మంగళగిరి పార్టీ కార్యాలయాల్లో వరుసగా కీలక సమావేశాలు నిర్వహించారు.

రాబోయే రోజుల్లో ఈ పొలిటికల్ ప్రెజర్‌ను పవన్ కళ్యాణ్ ఎంత నిగ్రహంతో, శాంతియుతంగా హ్యాండిల్ చేస్తారనేది అత్యంత కీలకంగా మారింది. ఆయన భావోద్వేగానికి లోనై కూటమికి ఇబ్బంది కలిగిస్తారా? లేక చాకచక్యంగా ఈ వ్యూహాల నుంచి బయటపడి తన రాజకీయ చిత్తశుద్ధిని నిరూపించుకుంటారా? అనేది వేచి చూడాలి.

By
en-us Political News

  
తెలంగాణ రాజకీయాల్లో ఒక్కసారిగా తీవ్ర కలకలం రేగింది
దివంగత సీఎం  వైఎస్ రాజశేఖర్ రెడ్డి వర్ధంతి సందర్భంగా బుధవారం (సెప్టెంబర్ 2) నిర్వహించిన ఒక  ర్యక్రమంలో పాల్గొన్న కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి..   తాము ఏనాడు కూడా పదవుల కోసం సిద్ధాంతాలను తాకట్టు పెట్టలేదంటూ..  వైఎస్ రాజశేఖరరెడ్డి ఆశయాల బాటలో నడిచేందుకు రాజకీయాల్లోకి ప్రవేశించామన్నారు.  
 ఆమె మాటలను బట్టి పరిశీలకులు కొండా సురేఖ పార్టీకీ, ఎమ్మెల్యే పదవికీ కూడా రాజీనామే చేసే అవకాశాలు కనిపిస్తున్నాయని విశ్లేషిస్తున్నారు. అదే జరిగితే.. ఆమె ప్రాతినిథ్యం వహిస్తున్న వరంగల్ తూర్పు నియోజకవర్గానికి ఉప ఎన్నిక అనివార్యమౌతుంది.
నా కూతురికి పెళ్లైంది.. తనకు తాను స్వతంత్రంగా మాట్లాడింది..!
ఉన్నది మాట్లాడితే చర్యలా.. సురేఖ సంచలన వ్యాఖ్యలు..!
 బీఆర్ఎస్ కేంద్ర కార్యాలయం తెలంగాణ భవన్‌లో బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆధ్వర్యంలో సీనియర్ నాయకులు, మాజీ మంత్రులు హరీష్ రావు, సబితా ఇంద్రారెడ్డి, తలసాని శ్రీనివాస యాదవ్ కలసి కాంగ్రెస్ 1000 రోజుల విఫల పాలనపై  చార్జ్‌షీట్‌  విడుదల చేశారు.
మ్మెల్యేగా కేసీఆర్ వ్యవహరిస్తున్న తీరు, అసెంబ్లీకి ఆయన గైర్హాజరుపై రేవంత్ ఓ రేంజ్ లో విమర్శలు గుప్పించారు. అసెంబ్లీకి హాజరుకాకుంటే కేసీఆర్  ఎమ్మెల్యే పదవికి కేసీఆర్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ ఒక ప్రజా ఉద్యమాన్ని చేపట్టాలని రేవంత్ రెడ్డి ప్రజలకు పిలుపు నిచ్చారు.  తనను ఎన్నుకున్న నియోజకవర్గ సమస్యలను కేసీఆర్ పట్టించుకోవడం లేదని దుయ్యబట్టారు.
ఆయన పులివెందులపైనే ఎక్కువగా కాన్సట్రేట్ చేయడంతో ఆయనకు పులివెందులలో పట్టు జారుతోందన్న భయం పట్టుకున్నట్లు కనిపిస్తోందని అంటున్నారు. అలాంటి భయమే లేకపోతే..  మాజీ సీఎంగా రాష్ట్రం మొత్తం తిరగాల్సిన ఆయన అది మానేసి  సొంత నియోజకవర్గానికే  ఎక్కువగా పరిమితం అవ్వరని అంటున్నారు.  
ప్రకాశం జిల్లాలో మరీ ముఖ్యంగా ఒంగోలులో  గట్టి పట్టు, రాజకీయ పలుకుబడి ఉన్న సీనియర్ నేత అయిన  బాలినేనికి, జనసేనలో ఏ మాత్రం ప్రాధాన్యత లభించడంలేదన్న ప్రచారం జోరుగా సాగుతోంది.  పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ తీసుకుంటున్న  నిర్ణయాలు, స్థానిక పరిస్థితులు కూడా ఆ ప్రచారానికి బలం చేకూర్చేవిగానే ఉంటున్నాయి. 
భారత రాజకీయాల్లో ఇప్పుడు పార్లమెంట్ సీట్ల పునర్విభజన (డీలిమిటేషన్), మహిళా రిజర్వేషన్ బిల్లుల చుట్టూ తీవ్రమైన ఉత్కంఠ నెలకొంది.
తెలంగాణ రాజకీయాల్లో మరోసారి కాంగ్రెస్ అంతర్గత వ్యవహారాలు తీవ్ర చర్చనీయాంశంగా మారాయి.
వైసిపి సీనియర్ నాయకుడు సజ్జల రామకృష్ణారెడ్డి.. రాజ్యసభ మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి చొక్కా పట్టుకుని దాడి చేసి కొట్టారని.. ఇదే విషయాన్ని ఇటీవల విజయసాయి ఓ బహిరంగ లేఖ ద్వారా వెల్లడించిన విషయాన్ని కన్ ఫర్మ్ చేశారు.
ఇండియా కూటమి తరఫున రాహుల్ గాంధీనే ప్రధానమంత్రి అభ్యర్థి అని కుండబద్దలు కొట్టారు. ఆ విషయాన్నే తమిళనాడు కాంగ్రెస్ శాసనసభాపక్ష  నాయకురాలు తారాహై కత్‌బర్ట్  మరింత క్లారిటీ ఇస్తూ.. విజయ్ ప్రధాని అవుతారంటూ కొందరు ప్రచారం చేయడం కేవలం టీవీకే శ్రేణుల ఉత్సాహం వల్ల జరుగుతున్న ప్రచారమే తప్ప, అది ఆ పార్టీ అధికారిక వైఖరి కాదన్నారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.