Publish Date:Jun 17, 2022
చేతిలో స్మార్ట్ ఫోన్ వుండాలే గాని సెల్పీలు తీసుకోవడానికి ఎవరూ వెనుకాడరు. సెల్ఫీల పిచ్చి ఈ రోజుల్లో అంతు లేకుండా పోతోంది. అదో సరదా, అదో ఆనందం! సెల్ఫీ గురించి అందరికీ తెలిసిందే గదా, ప్రత్యేకించి ఎందుకు చెబుతున్నారని అనుకోవద్దు. ఇది చాలా స్పెషల్ సెల్ఫీ!
తండ్రీ కొడుకుల సెల్ఫీ. తండ్రి ఒక రైల్లో వెళుతూంటే, పక్కనే మరో ట్రాక్ మీద మరో రైల్లో అతని కొడుకు వెడుతూ పలకరించు కున్నారు. ఇద్దరూ రైల్వే ఉద్యోగులే! ఇద్దరూ తెల్ల దుస్తుల్లోనే, యూనిఫామ్ లోనే వున్నారు. కాకుంటే వుద్యోగాలే వేరు వేరు. తండ్రి గార్డ్‌గా చేస్తున్నారు. కొడుకు జూనియర్ టికెట్ ఎగ్జామినర్ అంటే జూనియర్ టి.టి.ఇ!
చిత్రంగా ఇద్దరూ ఎదురెదురు రైళ్లలో ఒకరినొకరు చూసుకుని హలో అనుకున్నారు. అయితే అప్పటికి రైళ్లు ఇంకా కదలలేదు. అదేదో స్టేషన్ లో బయలుదేరడానికి సిద్ధంగా వున్నాయి. ఇద్దరూ అనుకోకుండా వేరు వేరు ప్రాంతాలకు ఎదురెదురు మార్గాల్లో వెళుతోన్న రైళ్లలో వుద్యోగ ధర్మంగా ప్రయాణానికి సిద్ధమయ్యారు. ఇలాంటి సంఘటనలు చాలా అరుదుగా జరుగుతూంటాయి. తన కొడుకు తనలాగే రైల్వేలో వుద్యోగం చేన్నాడని ఆయన తన స్నేహితులకు, బంధువులకు చెబుతూ ఎంతో మురిసిపోయి వుండవచ్చు.
కానీ ఈ సెల్పీ ఆయన ఆనందాన్ని మూడింతలు చేసినా పెద్దగా ఆశ్చర్యపోనక్కర్లేదు. అంతే మన కుర్ర టిటిఇ వెంటనే ఫోన్ తీసి సెల్ఫీ తీసేడు! ఇపుడు అది వైరల్ అయింది! ఈ సెల్పీని సురేష్ కుమార్ అనే వ్యక్తి ట్విటర్‌లో పోస్ట్ చేశాడు. అయితే తండ్రీ కొడుకులు అలా వూహించని విధంగా ఎదురయి పలకరించుకున్నది సరిగ్గా ఎక్కడ అన్నది, వారు వున్న రైళ్లు ఎటు వెళ్లేవీ ట్వీట్లో చెప్పలేదు. కానీ నెటిజన్లు మాత్రం ఎంతో మెచ్చుకున్నారు. నిజంగా తండ్రి కొడుకుల ప్రేమకు పెద్ద వుదాహరణ అని మనస్పూర్తిగా అభినందనలు తెలిపారు.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/a-great-selfie-of-son-and-father-in-trains-travelling-opposite-direction-39-137891.html
తమిళనాడు రాజకీయాల్లో పెను మార్పులు చోటుచేసుకుంటున్న వేళ
బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ అఖండ విజయం సాధించడంలో సువేందు కీ రోల్ పోషించారు. ఆ పార్టీ 206 స్థానాల్లో గెలిచి బెంగాల్‌లో తొలిసారిగా అధికారం చేపట్టబోతోంది. బీజేపీ తరఫున రెండు స్ధానాల నుంచి బరిలోకి దిగిన సువేందు అధికారి.. మరోసారి మమతా బెనర్జీని ఓడించారు. భవానిపూర్‌లో దీదీపై గెలిచిన ఆయన.. తన సొంత నియోజకవర్గమైన నందిగ్రామ్‌లోనూ గెలిచి పట్టు నిలుపుకున్నారు.
ముఖ్యంగా అస్సాం, పశ్చిమబెంగాల్ లో బీజేపీ ఎన్నికల సంఘం సహకారంతో ఫలితాలను చోరీ చేసిందన్నారు.
పశ్చిమబెంగాల్‌లో మూడున్నర దశాబ్దాల ఏళ్ల సీపీఎం పాలనకు బ్రేక్ వేసి 2011లో అధికార పగ్గాలు చేపట్టిన తృణముల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్టీ.. 2026 వరకు వరుస విజయాలతో ముఖ్యమంత్రిగా కొనసాగారు. ఆమె 15 ఏళ్ల ఆధిపత్యానికి ఎన్డీఏ తెర దించింది. మమతా సైతం కాంగ్రెస్‌లో కేంద్రమంత్రిగా, పలు కీలక పదవులు నిర్వహించి, తర్వాత సొంత కుంపటి పెట్టుకున్న నాయకురాలే కావడం గమనార్హం.
ప్రజా సమస్యలపై స్పష్టమైన అజెండాతో ఎన్నికల బరిలోకి దిగిన విజయ్‌ను తమిళ ప్రజలు ఆదరించడం శుభపరిణామమన్నారు.
తన పార్టీ స్థాపించిన నాటి నుండి నేటి వరకు ఆయన సాగించిన ప్రయాణం ఒక అద్భుతమైన రాజకీయ థ్రిల్లర్‌ను తలపిస్తుంది. ఎన్నికల ప్రచార సమయంలో విజయ్ అనేక ఆటంకాలను ఎదుర్కొన్నారు. ప్రత్యర్థి పార్టీల నుండి వచ్చిన తీవ్ర విమర్శలు, అధికార యంత్రాంగం విధించిన ఆంక్షలు ఆయనను ఉక్కిరిబిక్కిరి చేశాయి. వ్యక్తిగత జీవితంపై జరిగిన దుష్ప్రచారం విజయ్ ఇమేజ్‌ను దెబ్బతీస్తుందని అందరూ భావించారు.
తమిళనాడులో టీవీకే పార్టీ విజయాన్నిస్వాగతిస్తూ.. వైసీపీ సోషల్ మీడియా వేదికగా సంబరాలు మొదలు పెట్టింది. విజయ్ సాధించిన ఈ అద్భుత విజయం వెనుక వైసీపీ అధినేత జగన్ సహకారం ఉందంటూ వైసీపీ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున పోస్టులు వెల్లువెత్తుతున్నాయి. ముఖ్యంగా గతంలో ఒక వివాహ వేడుకలో వైఎస్ జగన్, విజయ్ ఇద్దరూ కలిసి దిగిన ఒక ఫోటోను ఇప్పుడు వైసీపీ నెట్టింట వైరల్ చేస్తోంది.
ఈ ఎన్నికల ఫలితాల్లో విజయ్ టవీకే పార్టీ స్పష్టమైన ఆధిక్యత కనబరిచింది. ప్రభుత్వ వ్యతిరేకతతో పాటు, కూటమి పక్షాల మధ్య సరైన సమన్వయం లేకపోవడం కూడా ఈ ఓటమికి ప్రధాన కారణాలుగా కనిపిస్తున్నాయి.
1982లో తెలుగువారి ఆత్మగౌరవం నినాదంతో తెలుగుదేశం పార్టీని స్థాపించిన ఎన్టీఆర్, కేవలం 9 నెలల కాలంలోనే రాష్ట్రమంతటా పర్యటించి ప్రభంజనం సృష్టించారు. 1983 ఎన్నికల్లో కాంగ్రెస్ వంటి బలమైన పార్టీని మట్టికరిపించి, తొలి ప్రయత్నంలోనే ముఖ్యమంత్రి పీఠాన్ని అధిష్టించి రికార్డ్ సృష్టించారు.
భారత రాజకీయ యవనికపై భారతీయ జనతా పార్టీ తన ఉనికిని మరింత శక్తివంతం చేస్తోంది.
చారిత్రాత్మక విజయం ఖాయమని తేలడంతో.. విజయం అభిమానుల సంబరాలు మిన్నంటాయి. అయితే.. ఈ నేపథ్యంలో సినీ నటి త్రిష పేరు సోషల్ మీడియాలో విపరీతంగా ట్రెండ్ అవుతోంది.
ఈ నియోజకవర్గం నుంచిఎన్డీయూ కూటమి అభ్యర్థి మల్లాడి కృష్ణారావు విజయం సాధించారు. తన సమీప ప్రత్యర్థి, కాంగ్రెస్ అభ్యర్థి గొల్లపల్లి అశోక్ పై నాలుగువేల ఐదు వందల ఓట్ల పైచిలుకు మెజారిటీతో గెలుపొందారు.
ఎన్నికల ఫలితాల్లో ఎన్డీయే కూటమి సాధించిన ఘన విజయంపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు హర్షం వ్యక్తం చేశారు.