కళ కోసం ఓ సినిమా !!

Publish Date:Dec 14, 2021

Advertisement

భర్తృహరి అద్భుత పద్యం కళాతపస్వి అద్భుత దృశ్యకావ్యం!!

【శ్లోకం:- జయంతి తే సుకృతినో |

రససిద్ధాః కవీశ్వరాః ||

నాస్తి తేషాం యశః కాయే |

జరామరణజం భయమ్ ||

సిద్ధౌషధ సేవవల్ల ముసలితనాన్ని – మరణాన్ని సైతం అతిక్రమించవచ్చు ! అయితే – అది ఇట్టి ఔషధం యోగులకు మాత్రమే అందుబాటులో ఉండి, వారే సేవించగలుగుతారు. విద్వాంసులైన వారికి ‘ కీర్తి ‘ రూపంలో మరణానంతరం కూడ జీవం ఉండి, సిద్ధౌషధంలా వారిని జీవింపచేస్తుంది. ఇటువంటి ధన్య జీవులు ఎవరు ? కవులు – పండితులు వీరు సద్ధౌషధం సేవించిన యోగులవంటివారు.】

పై పద్యం భర్తృహరి రచించిన నీతి శతకంలోనిది. ఆ పద్యాన్ని, దాని భావాన్ని వివరంగా పరిశీలిస్తే, దాన్ని అర్థం చేసుకుంటే కళ ఎంత గొప్పదో అర్థమవుతుంది. కవులు, పండితులు సిద్దౌషధం సేవించినటువంటి వారని ఆయన అంటాడు. ఇంతకు సిద్ధ ఔషధం ఏమిటి అంటే ప్రాచీన ఆయుర్వేద వైద్య విధానంలాంటిది శక్తివంతమైన వైద్యం సిద్దవైద్యం కూడా. సిద్ధులు శైవ భక్తులు, వీరు పద్దెనిమిది మంది ఋషులు. ఆయుర్వేదాన్ని ఎలాగైతే ధన్వంతరీ మహర్షి అభివృద్ధి చేశారో అలాగే సిద్ధులు కూడా సిద్దవైద్యాన్ని అభివృద్ధి చేశారు. ఈ సిద్ధులలో అగస్త్య మహర్షి ముఖ్యమైనవాడు. ఇక విషయంలోకి వెళ్తే ఆ సిద్ధ ఔషధం అమృతంతో సమనమైనది. దాన్ని తీసుకున్నవాడు మరణాన్ని జయిస్తాడు. అయితే అది సాధారణ మనుషులకు అందుబాటులో ఉండదు. యోగులు, ఋషులకు అందుబాటులో ఉండి వాళ్ళు మాత్రమే దాన్ని సేవించగలుగుతారు.

కానీ….. విద్వాంసులు అంటే కవులు, పండితులు, కళలలో నైపుణ్యం సంపాదించినవారు. వీళ్ళందరూ సాధారణ మనుషుల్లోనే ఉన్నా, వీళ్ళు మరణించినా వారిలో ఉండే కళ, దాని నైపుణ్యం కారణంగా వాళ్ళు అందరి మనసులలో జీవించే ఉంటారు. అంటే భౌతికంగా మరణించినా, మానసికంగా అందరి మనసులలో బతికే ఉండటం. ఇలాంటి వాళ్ళు సిద్ధ ఔషధం స్వీకరించిన యోగులు, ఋషుల వంటి వారు. మనుషుల్లో ఉన్న గొప్పవాళ్ళు వీళ్ళు.  దీని వల్ల కళ గొప్పదనం ఏమిటో అర్థమవుతుంది. సంగీతం, సాహిత్యం, నృత్యం, బొమ్మలు గీయడం, పాటలు పాడటం, విశిష్ట ప్రతిభ కలిగిన ప్రతి ఒక్కరు కూడా పైన భర్తృహరి చెప్పినట్టు అమృతంతో సమానమైన ఔషదాన్ని సేవించినవాళ్ళ లాంటి వారే.

ఇక ఈ పద్యం ముఖ్యంగా భర్తృహరి నీతి పద్యంగానే కాకుండా కళాతపస్వి కె. విశ్వనాథ్ గారు సృష్టించిన అద్భుత దృశ్యకావ్యం సాగరసంగమంలో ఈ పద్యాన్ని ప్రస్తావిస్తారు. అంటే ఆ సినిమాలో కూడా కళ గురించి తపించిన వారు కళను ప్రేమించి, ప్రతిభ ఉన్నవారికి భౌతికంగా మనరణం సంభవించినా మానసికంగా మరణం అనేది ఉండదనే విషయాన్ని అందులో చెప్పారు.

కాబట్టి కళను గౌరవించి, ప్రేమించాలి. ముఖ్యంగా నేటితరం సంప్రదాయ కళలను ప్రోత్సహించాలి.

◆ వెంకటేష్ పువ్వాడ
 

By
en-us Political News

  
ప్రేమ ఒక అందమైన భావన, కానీ చాలా మందికి ఇది పదే పదే బాధ కలిగిస్తూ ఉంటుంది. ప్రేమ మొదట్లో అద్బుతంగా ఉంటుంది..
వేసవి కాలం వచ్చిందంటే చాలు..  ప్రతి ఇంట్లో చల్లదనం కోసం ఫ్యాన్లతో పాటు కూలర్ల వాడకం  పెరుగుతుంది. ఉష్ణోగ్రతలు పెరిగేకొద్దీ, కూలర్లు  తప్పనిసరి అవుతాయి.  రోజంతా కూలర్లు పనిచేస్తూనే ఉంటాయి...
వేసవి కాలం వచ్చిందంచే సాధారణ టేబుల్ ఫ్యాన్ లు,  సీలింగ్ ఫ్యాన్ లు సరిపోవు.  వీటి నుండి వచ్చే గాలి వేసవి వేడిని కంట్రోల్ చేయలేవు. పైగా వేసవి వేడి గాలిని తిప్పి, తిప్పి గది మొత్తం వేడిగా మార్చేస్తాయి...
పెళ్లి... ఎన్నో రొమాంటిక్ ఆలోచనలను గుర్తుకు తెచ్చే ఒక అందమైన పదం. బయటకు వెళ్లడం, లాంగ్ డ్రైవ్‌లకు వెళ్లడం..
ఈ కాలంలో మందు బిళ్లలు మింగకుండా ఒక్కరు కూడా ఉండటం లేదు.  పాపం చిన్న పిల్లలు సైతం  టాబ్లెట్లు మింగాల్సిన పరిస్థితి వస్తోంది.  చాలా మాత్రల మధ్యలో ఒక సన్నని గీత ఉంటుంది. కొన్ని మాత్రలకు ఇది ఉండదు..
వేసవిలో దాదాపు ప్రతి ఇంట్లోనూ పెరుగు తినడం సర్వసాధారణం. ఇది శరీరాన్ని చల్లబరచడమే కాకుండా, జీర్ణక్రియకు కూడా...
ఈ రోజుల్లో ప్రతి తల్లిదండ్రులు తమ పిల్లలు చదువులో బాగా రాణించాలని, ఆత్మవిశ్వాసంతో ఉండాలని, జీవితంలో ఉన్నత స్థాయికి చేరుకోవాలని కలలు కంటారు. తల్లిదండ్రులు పిల్లల కోసం ఎంత ఖర్చు పెడితే....
మానవ శరీరానికి సంక్రమించే జబ్బులలో చాలా రకాలు ఉంటాయి. వాటిలో హీమోఫిలియా జబ్బు కూడా ఒకటి. చాలా మందికి హీమోఫిలియా అనే జబ్బు..
పెళ్లి అనేది ప్రతి అమ్మాయి జీవితాన్ని మరొక దశలోకి తీసుకుని వెళుతుంది. ఎన్నో ఆశలతో ఒక వ్యక్తిని పెళ్లి చేసుకుని కొత్త ఇంట్లో అడుగుపెడతారు అమ్మాయిలు. కానీ చాలామంది అమ్మాయిలు చెప్పే మాట.. అత్తగారు సరిగా చూసుకోవడం లేదని, అత్తగారు సరిగా మాట్లాడటం లేదని. ప్రతి ఇంట్లో అత్తాకోడళ్ల సంబంధం ఎప్పుడూ...
జీవితంలో ప్రతి ఒక్కరూ విజయం కోసం తహతహలాడుతూ ఉంటారు.  అందుకోసం చాలా ప్రయత్నాలు కూడా చేస్తుంటారు...
ప్రతి వ్యక్తికి విభిన్నమైన వ్యక్తిత్వం ఉంటుంది; కొందరు చాలా కలివిడిగా ఉంటారు, మరికొందరు నిశ్శబ్దంగా, అంతర్ముఖంగా ఉంటారు. ఈ వ్యత్యాసం ఆధారంగా ఇంట్రోవర్ట్,  ఎక్స్ట్రోవర్ట్ అంటూ రెండు విభాగాలుగా విభజిస్తూ ఉంటారు...
భారతదేశంలో ప్రతి సంవత్సరం ఏప్రిల్ 14న అంబేద్కర్ జయంతిని జరుపుకుంటారు. ఈ రోజు భారత రాజ్యాంగ నిర్మాత, సంఘ సంస్కర్త , గొప్ప ఆర్థికవేత్త అయిన డాక్టర్ భీమరావు రామ్జీ అంబేద్కర్ గారి జయంతి...
ఆశా భోస్లే.. భారతీయ సంగీత ప్రపంచంలో ఒక చెరగని ముద్ర.  ఆమె గాత్రం కేవలం భారతదేశాన్నే కాకుండా ప్రపంచం మొత్తాన్ని ఉర్రూతలూగించింది. ప్రముఖ గాయని లతా మంగేష్కర్ కు సోదరి అయినా.. పాటల ప్రపంచంలో..
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.